the thieves
-
‘విక్రాంత్’లో దొంగలు
న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ విషయంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నౌకలో దొంగలు పడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 4 కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు, వాటిలోని హార్డ్ డ్రైవ్‌లు, ప్రాసెసర్లు, ర్యామ్‌లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. కాగా, కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలో సీసీటీవీలు లేవనీ, ఇక్కడి భద్రతను ఓ ప్రైవేటు సంస్థ చూస్తోందని కేరళ డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు. 2009లో కొచి్చన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం ప్రారంభమైంది. 2023 నాటికి ఇది భారత నేవీలో చేరనుంది. -
సికింద్రాబాద్‌లో ఆరుగురు దొంగల అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వెయిటింగ్ లిస్ట్‌ను కన్ఫమ్ చేపిస్తామంటూ ప్రయాణికుల దృష్టి మరల్చి లగేజీని దొంగిలిస్తోన్న ఆరుగురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, 1400 రియాళ్లు(విదేశీ కరెన్సీ), 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగల బీభత్సం
అనంతపురం క్రైం : అనంతపురం నగర శివారులోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనున్న మహేంద్ర వాహనాల షోరూంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.14 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు, షోరూం ఉద్యోగులు తెలిపిన మేరకు వివరాలు.. షోరూంలో గురువారం రాత్రి బత్తల పెద్దన్న, పటాన్ శిలార్ ఖాన్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. షోరూం చుట్టూ ఇనుప ముళ్ల కంచెతో ప్రహరీ ఉంది. దీన్ని దాటుకుని లోపలికి ప్రవేశించడం కష్టసాధ్యం. అయితే.. నలుగురు దొంగలు షోరూం వెనుక వైపు ప్రహరీ కింది భాగంలో కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించేందుకని వెనుకవైపునకు వెళ్లారు. అప్పటికే దాక్కుని ఉన్న దొంగలు వారిపై దాడి చేశారు. క్రికెట్ స్టంప్స్, ఐరన్ పైపులతో చితకబాదారు. పెద్దన్న తల, చేతి వేళ్లు, శిలార్ ఖాన్ కుడి చేయి, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా వారిద్దరి నోళ్లకు ప్లాస్టర్లు వేశారు. చేతులు, కాళ్లు కట్టిపడేశారు. వారి వద్ద ఒకరు ఉండి, మిగిలిన ముగ్గురు లోపలికి వెళ్లారు. షోరూం లోపలికి ప్రవేశించగానే సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే డిస్క్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను ధ్వంసం చేశారు. మరో డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. నేరుగా పై అంతస్తులోకి వెళ్లారు. నగదు ఉంచే గది తాళాలు మెండి.. లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో నగదు బాక్సుకు రంధ్రం వేశారు. అందులో ఉన్న రూ. 14 లక్షలు తీసుకుని పారిపోయారు. సెక్యూరిటీ గార్డులు ఇబ్బంది పడుతూ ప్లాస్టర్లు, తాళ్లు విడిపించుకుని నాలుగు గంటల సమయంలో యాజమాన్యానికి ఫోన్లో సమాచారం అందించారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీ నాగరాజ, టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, సీసీఎస్ సీఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ ఘటన స్థలాన్ని పరిశీలించింది. రెక్కీ నిర్వహించి.. ప్రణాళికప్రకారం దోపిడీకి పాల్పడ్డారనేది స్పష్టమవుతోంది. షోరూంపై బాగా అవగాహన ఉన్నవారే దోపిడీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షోరూంలో పని చేసే సిబ్బంది పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నారు. కనీసం సెక్యూరిటీ సిబ్బందితో నగదు బాక్సు ఎక్కడుంటుందని అడగకుండా నేరుగా పై అంతస్తులోని నగదు బాక్సు ఉండే గదికి వెళ్లారంటే కచ్చితంగా రెక్కీ నిర్వహించి చేసిన పనే అని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే ఒక డీవీఆర్‌ను ధ్వంసం చేసి, మరో డీవీఆర్‌ను ఎత్తుకెళ్లినా... లోపలికి ప్రవేశించే సమయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయినట్లు తెలిసింది. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. వీరంతా యువకులుగానే కనిపించినట్లు తెలిసింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. . -
పోలీస్ మాయ !
సాక్షి, గుంటూరు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న రోజులు పోయి... పోలీసులు పోలీసులు రికవరీ సొమ్ములో వాటాలు వేసుకుంటున్న రోజులు ఇవి. దొంగతనం జరిగి సొమ్ము పోయిందని ఫిర్యాదు అందిన మరుక్షణం పారంభమయ్యే పోలీస్ ‘నొక్కుడు' దొంగల నుంచి రికవరీ చేసిన మొత్తంలో సగానికి పైగా జేబులో వేసుకోవడంతో ఆగిపోతోంది. రూరల్ జిల్లాతోపాటు, గుంటూరు నగరంలో నాలుగు నెలలుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయి. సొమ్ము పోగొట్టుకుని బాధితులు గగ్గోలు పెడుతుంటే, రికవరీ చేస్తున్న పోలీసులు వాటాలు వేసుకుని ఖుషీ చేస్తున్నారు దీంతో దొంగతనం లేదా దోపిడీ జరిగిందని ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారు. బాధితులనే వేధిస్తున్నారు.. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళుతున్న బాధితులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు కొల్లలుగా ఉన్నాయి. అంత బంగారం ఇంట్లో ఎందుకు ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ తక్కువ మొత్తం పోయినట్లుగా కేసు నమోదు చేస్తున్నారు. పోయిన సొమ్ము వెతికి ఇవ్వాల్సింది పోలీసులే కావడంతో వారితో వాదనకు దిగలేక వారు ఎంత రాస్తే ఆ మేరకే అంగీకరిస్తూ బాధితులు సంతకం చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులే తీసివుంటారని అనుమానిస్తూ వారినీ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. సొమ్ము పోయిందని వస్తే సొంతోళ్లనే కేసులో ఇరికించాలని చూస్తుండటంతో సొమ్ము పోతే పోయిందిలే అంటూ ఫిర్యాదు సైతం ఇవ్వకుండా వదలివేస్తున్నారు. మేం పిలిచినప్పుడల్లా స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేస్తూ, దొంగలను వెతకడానికి వెళ్తున్నాం దారి ఖర్చులకు ఇవ్వమంటూ కింది స్థాయి సిబ్బంది బాధితుల వద్ద డబ్బు గుంజుతున్నారు. డబ్బు, బంగారం పోగొట్టుకుని తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు పోలీసుల వేధింపులు మరింత బాధ కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి దొంగతానాలు, దోపిడీ కేసుల్లో తమకు న్యాయం చే యాలని బాధితులు కోరుతున్నారు.