న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం.
ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు.
ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్
లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్‌సభలోకి పాస్‌లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు.
కాలిన ఫోన్లు స్వా«దీనం
లోక్‌సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్‌లోని నాగౌర్‌లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్‌సభ ఛాంబర్‌లో మనోరంజన్, సాగర్‌శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్‌కు పంపాడు. తర్వాత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment