Both Houses
-
పార్లమెంట్లో అదే రగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు. ధన్‌ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్‌ను చీర్లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్‌కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు. నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్‌సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్‌సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్‌సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్‌లోని నాగౌర్‌లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్‌సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్‌శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్‌కు పంపాడు. తర్వాత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
Parliament security breach: పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతకులకు విజిటర్ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ అలా... లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ ప్రకటించారు. రాజ్యసభ ఇలా... ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. అది మా బాధ్యత: ఖర్గే దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన 14 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బీ కూడా ఉంది..! పార్లమెంట్లో అలజడికి కుట్ర పన్నిన లలిత్ ఝా బృందం, ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్ మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్ రాలేకపోయారు. బూట్లలో పొగ గొట్టాలు లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు. -
Winter Parliament Sessions 2023: సభలో గందరగోళం..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. టీఎన్ ప్రతాపన్, హిబీ ఎడెన్, జోతీమణి, రమ్య హరిదాస్, దీన్ కురియాకోస్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ప్రహ్లాద్ జోషీ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. 9 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, మొహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్బరాయన్, ఎస్ఆర్ పార్తీబన్, ఎస్.వెంకటేశన్, మాణిక్కం ఠాగూర్‌ను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించే బాధ్యత లోక్‌సభ సెక్రెటేరియట్దేనని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత పలువురు విపక్ష సభ్యులు సభలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారు: కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయ సభల నుంచి గురువారం మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష ఎంపీలను కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరినందుకు ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, భయానక చర్య అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని, పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆగంతకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు కారణమైన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఎగువ సభలో తీవ్ర అలజడి పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేలి్చచెప్పారు. సభకు సహకరించాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తుండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చైర్మన్ వేదిక ముందుకు చేరుకొని, గాల్లోకి చేతులు విసురుతూ గట్టిగా అరిచారు. ఆయన తీరుపై చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను «ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డెరెక్ ఓబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయడానికి రూల్ 256 కింద తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ పక్షనేత పీయూష్ గోయల్‌కు అనుమతి ఇచ్చారు. పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో అమోదం పొందడం, డెరెక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు వేయడం వెంటనే జరిగిపోయాయి. ఆయనను ఈ సెషన్లో మిగిలిన కాలమంతా స్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. సస్పెండ్ అయినప్పటికీ బయటకు వెళ్లకుండా సభలోనే కూర్చున్న డెరెక్ ఓబ్రెయిన్‌పై ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. అయినా ఓబ్రెయిన్ వినిపించుకోలేదు. రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ చెప్పారు. ఇదిలా ఉండగా, సభ నుంచి సస్పెండ్చేసినా బయటకు వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించిన డెరెక్ ఓబ్రెయిన్ తీరుపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీకి జగదీప్ ధన్‌ఖడ్ సిఫార్సు చేశారు. సభలో లేకున్నా సస్పెన్షన్ లోక్‌సభలో రెండో విడతలో సస్పెండైన విపక్ష ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ పార్తీబన్ పేరు కూడా ఉంది. వాస్తవానికి ఆయన గురువారం సభకు రాలేదని, చెన్నైలో ఉన్నారని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. సభలో లేని ఎంపీని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఆయన పేరును తొలగిస్తున్నట్లు చెప్పారు. పార్తీబన్‌పై సస్పెన్షన్ వేటును స్పీకర్ ఉపసంహరించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభ నుంచి మొత్తం 13 మందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం నాటి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
యూపీ ఉభయసభల్లో ఒక్క రోజు మహిళలకే!
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉభయ సభల్లో గురువారం కేవలం మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన అనుపమ జైస్వాల్ సభకు అధ్యక్షత వహించారు. మహిళా ప్రతినిధుల ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో నుంచి మహిళా వైద్యులు, విద్యార్థినులు, బాలికలు ప్రత్యక్షంగా వీక్షించారు. ముందుగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌ల ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మహిళా ఎమ్మెల్యేలు సూచనలు అందజేయాలని సీఎం యోగి కోరారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలని అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి సూచించారు. యూపీ అసెంబ్లీలోని 403 మంది సభ్యులకు గాను 47 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. 100 మందితో కూడిన శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలున్నారు. -
వింటర్ సెషన్ వాష్ ఔట్
-
పార్లమెంటులో మళ్లీ అదే సీను
స్తంభించిన ఉభయసభలు న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారమూ ఆందోళనలతోనే ముగిశారుు. సభ బయట తమను కించపరిచేలా మాట్లాడిన ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ రాజ్యసభలో విపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారుు. ఉభయసభల్లోనూ కోల్‌కతాలో ఆర్మీ మోహరింపుపై టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలు మద్దతు పలికారుు. దీనిపై రక్షణ మంత్రి స్వయంగా వివరణ ఇచ్చినా.. సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నారుు. దీంతో పార్లమెంటు వారుుదా పడింది. రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు మోదీ క్షమాపణకు పట్టుబట్టారుు. వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు సర్కారుకు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చైర్మన్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వారుుదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ గందరగోళంలోనే డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రైవేటు మెంబర్ శాసన వ్యవహారాలను కొనసాగించారు. తర్వాత సభ వారుుదాపడింది. ఐటీ బిల్లుకు సవరణలను చర్చ లేకుండానే ఆమోదించి పంపటంపై విపక్షాలు నిరసన తెలిపారుు. దీంతో సభ వారుుదా పడింది. తిరిగి ప్రారంభమైనా విపక్షాలు వెల్‌లోనే ఉండి నినాదాలు చేశారుు. ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ సభ్యులు బెంచీలపై నిలబడి నిరసన తెలిపారు. -
జైట్లీ రాజీనామాకు విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో అక్రమాల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. సోమవారం ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలునినదించారు. డీడీసీఏపై చర్చించేవీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై దుమారం చెలరేగింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష కాంగ్రెస్ డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చైర్మన్ తీర్మానాన్ని అంగీకరించకపోవడంతో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభ 30 నిమిషాలు వాయిదాపడింది. వరుస వాయిదాల అనంతరం 12:30కు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనపై వచ్చిన ఆరోపణలపై వివరాణ ఇచ్చేందుకు ఉద్యుక్తులుకాగా, విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. ఒక సందర్భంలో ఆగ్రహానికి లోనైన జైట్లీ 'కూర్చొని వినండి' అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. ఏమిటీ కుంభకోణం? ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న 13ఏండ్ల కాలంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. జైట్లీ హయాంలో డీడీసీఏ ఎన్నో అక్రమాలకు పాల్పడిందనీ, అతణ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆప్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను కూడా నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. 2008-12 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ. 24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మొన్నటి భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంలోనూ ఈ విషయం వివాదాస్పదం కావటం, డీడీసీఏ కోర్టుకెళ్లడం, ప్రభుత్వానికి తాత్కాలికంగా రూ. కోటి చెల్లించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయని బీజేపీకే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సోదాలు అరుణ్ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ సందర్భంగా ఆరోపించారు. -
భేష్!
ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ వ్యాఖ్య ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన వజుభాయ్ సంక్షేమ పథకాలను విశ్లేషిస్తూ సాగిన ప్రసంగం బెంగళూరు : అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ సమర్థవంతగా జరుగుతోందని గవర్నర్ వజుభాయ్ రూడాభాయ్ వాలా తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినట్లు పేర్కొన్నారు. బెంగళూరులోని విధానసౌధాలో సోమవారం ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన పేర్కొంటూ.. పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ►కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ముఖ్యంగా బెంగళూరు నగర జిల్లాలోని ప్రభుత్వ భూమి ఎక్కువగా కబ్జాకు గురైయెుంది. ఈ విషయాలన్నింటి పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను నియమించింది. ►మహిళలు, పిల్లలపై లెంగిక, భౌతిక దాడులకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, శాంతిభద్రతలను కాపాడటానికి ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ►ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,017 మంది బాల కార్మికులకు ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ►బాలాసంజీవిని పథకం ద్వారా రాష్ట్రంలో 28 ఆస్పత్రుల్లో 18 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తోంది. నిరమ్య హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ►5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఐటీ కంపెనీల స్థాపనకు అనుకూలంగా నూతన ఐటీ పాలసీను ప్రభుత్వం అమలుచేస్తోంది. ► 2014-15 ఏడాదిలో రాష్ట్రంలో నెలకొన్న ృతివష్టి, అౄవష్టి వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ.1,350 కోట్ల నిధులు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ►నిరుపేదలైన వారికి ప్రస్తుత ఏడాది మూడులక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాక 20 వేల నివేశన స్థలాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ► దేశంలో కర్ణాటక మొదటిసారిగా రూ. 2,865 కోట్ల నిధులతో జిల్లాల వారిగా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ రిపోర్ట్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. దీని వల్ల వివిధ జిల్లాల్లో ప్రజల ఆర్థిక, సామాజిక తదితర విషయాల్లో అభివృద్ధి విషయాలను తెలుసుకోవడం, తదనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది. ► హై-క ప్రాంతాభివృద్ధికి అనుకూలంగా అనేక సంక్షేమ పథకాల అమలు. ఇందుకోసం ఆర్టికల్ 371(జే) కింద రిజర్వేషన్లు అమలు. ► 50 ప్రభుత్వ విభాగాల్లోని 668 సేవలను నిర్థిష్ట సమయంలోపు ‘సకాల’ కింద ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ►వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి కోసం కృషిభాగ్య పథకం అమలు. ►సహకార రంగంలో మహిళలకు చేయూత అందించడానికి వీలుగా ప్రియదర్శిని పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ► చిక్కమగళూరు, చిత్రదుర్గా, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో భూములకు సాగునీరు అందించడానికి వీలుగా రూపొందించిన ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. ► మెట్రో-1 ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తి అవుతుంది. నగరోత్తాన పథకం కింద బీబీఎంపీ పరిధిలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్ల నిధులు విడుదల. -
జయపై.. లంక కథనాన్ని ఖండిస్తున్నాం
ఉభయసభల్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ.. శ్రీలంక రక్షణ శాఖ వెబ్సైట్లో వచ్చిన కథనం సోమవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఏఐఏడీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఇది ఒక్క తమిళనాడు సీఎంకు జరిగిన అవమానం కాదని యావత్ భారత్‌కు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై తక్షణమే స్పందించి లంక అధ్యక్షుడు రాజపక్సేకు నిరసన తెలుపుతూ.. ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి ప్రాంగణాన్ని చుట్టుముట్టి ‘రాజపక్సే డౌన్.. డౌన్’ నినాదాలతో తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో లోక్‌సభ, రాజ్య సభలు వాయిదా పడ్డాయి. ఈ కథనాన్ని కేంద్రం ఖండిస్తుందని, లంక హైకమిషనర్‌కు విషయాన్ని వివరించి.. సమన్లు కూడా జారీ చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాసర్వాజ్ చెప్పారు. ఇదే అంశంపై లోక్‌సభలో మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఈ కథనం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావులేదని పేర్కొన్నారు. సభ్యుల మనోభావాలను విదేశాంగ మంత్రికి విన్నవించనున్నట్టు చెప్పారు. అయితే, వెంకయ్య ప్రకటనతో సంతృప్తి చెందని ఏఐఏడీఎంకే సభ్యులు సభాపతి పోడియంను చుట్టుముట్టి రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించడమే కాకుండా సభను వాయిదా వేయాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను పట్టుబట్టారు. -
ఏపీ ఉభయసభలనుద్దేశించి 21న గవర్నర్ ప్రసంగం
19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అదేరోజు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై 23న చర్చ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 21న ప్రసంగించనున్నారు. రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈనెల 23, 24 తేదీల్లో చర్చ జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ చర్చకు 24న సమాధానమిస్తారు. శాసనసభాపతి, ఉప సభాపతి ఎన్నిక 20వ తేదీన జరుగుతుంది. శాసనసభ సమావేశాలు 19వ తేదీ గురువారం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీని నిర్ణయిస్తూ ప్రభుత్వం పంపిన ఫైలుపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సంతకం చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందురోజు అంటే 18వ తేదీన సీనియర్ శాసనసభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. 19వ తేదీ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. 22వ తేదీ ఆదివారం అసెంబ్లీకి సెలవు. శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు (19)న ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంగా ఎంపికైన రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇకపై అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో సోమవారం పర్యటించనున్నారు. -
అమరుల కుటుంబాలకు వరాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలు బుధవారమిక్కడ ప్రారంభం అయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు వరాల జల్లు కురిపించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. *తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులకు రూ.10లక్షల పరిహారం *కుటుంబసభ్యునికి ప్రభుత్వోద్యోగంతోపాటు... *అమరవీరుల కుటుంబానికి ఉచిత విద్య *తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడిన గవర్నర్ *తండాలను పంచాయతీలుగా మార్చుతాం *విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ *తెలంగాణలో లక్షల కుటుంబాలు...దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి *బీసీ, ఎస్టీ, ఎస్టీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు *కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య *ఒక్కో ఇంటిని రూ.3లక్షల వ్యయంతో...పేదలకు ఇళ్లు *న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు * జర్నలిస్టులకు కార్పస్ ఫండ్ రూ. 10 కోట్లు * వికలాంగులకు రూ.1,500 పింఛన్ *వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ * ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు *హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ రహదారులు *ర్యాపిడ్ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు *హైదరాబాద్ శాంతి భద్రతలు,మహిళలకు భద్రత *కాజీ పేట వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు *తెలంగాణ విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది *వచ్చే మూడేళ్లలో విద్యుత్ కొరతను అధిగమిస్తాం *ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు *గొలుగుకట్టు చెరువులు, ఆనకట్టల పునరుద్ధరణ * ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు లక్ష ఎకరాలకు సాగునీరు * జామాబాద్లో చెరుకు పరిశోధనా కేంద్రం *భారత దేశ విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం -
నేడు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రసంగించనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రాథమ్యాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టి దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడం, ద్రవ్యోల్బణాన్ని, ధరలను అదుపులో పెట్టడం, ద్రవ్యలోటును కట్టడి చేయడం, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడం, విదేశీ నిధులను ఆకర్షించడం.. మొదలైనవి మోడీ సర్కారు ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్రపతి ప్రసంగంలో చోటు చేసుకునే అవకాశముంది. అనంతరం లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళ, బుధవారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరుగుతుంది.