భేష్!
ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ వ్యాఖ్య
ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన వజుభాయ్
సంక్షేమ పథకాలను విశ్లేషిస్తూ సాగిన ప్రసంగం
బెంగళూరు : అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ సమర్థవంతగా జరుగుతోందని గవర్నర్ వజుభాయ్ రూడాభాయ్ వాలా తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినట్లు పేర్కొన్నారు. బెంగళూరులోని విధానసౌధాలో సోమవారం ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన పేర్కొంటూ.. పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
►కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ముఖ్యంగా బెంగళూరు నగర జిల్లాలోని ప్రభుత్వ భూమి ఎక్కువగా కబ్జాకు గురైయెుంది. ఈ విషయాలన్నింటి పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను నియమించింది.
►మహిళలు, పిల్లలపై లెంగిక, భౌతిక దాడులకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, శాంతిభద్రతలను కాపాడటానికి ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది.
►ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,017 మంది బాల కార్మికులకు ప్రభుత్వం పునరావాసం కల్పించింది.
►బాలాసంజీవిని పథకం ద్వారా రాష్ట్రంలో 28 ఆస్పత్రుల్లో 18 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తోంది. నిరమ్య హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.
►5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఐటీ కంపెనీల స్థాపనకు అనుకూలంగా నూతన ఐటీ పాలసీను ప్రభుత్వం అమలుచేస్తోంది.
► 2014-15 ఏడాదిలో రాష్ట్రంలో నెలకొన్న ృతివష్టి, అౄవష్టి వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ.1,350 కోట్ల నిధులు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
►నిరుపేదలైన వారికి ప్రస్తుత ఏడాది మూడులక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాక 20 వేల నివేశన స్థలాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
► దేశంలో కర్ణాటక మొదటిసారిగా రూ. 2,865 కోట్ల నిధులతో జిల్లాల వారిగా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. దీని వల్ల వివిధ జిల్లాల్లో ప్రజల ఆర్థిక, సామాజిక తదితర విషయాల్లో అభివృద్ధి విషయాలను తెలుసుకోవడం, తదనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది.
► హై-క ప్రాంతాభివృద్ధికి అనుకూలంగా అనేక సంక్షేమ పథకాల అమలు. ఇందుకోసం ఆర్టికల్ 371(జే) కింద రిజర్వేషన్లు అమలు.
► 50 ప్రభుత్వ విభాగాల్లోని 668 సేవలను నిర్థిష్ట సమయంలోపు ‘సకాల’ కింద ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది.
►వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి కోసం కృషిభాగ్య పథకం అమలు.
►సహకార రంగంలో మహిళలకు చేయూత అందించడానికి వీలుగా ప్రియదర్శిని పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
► చిక్కమగళూరు, చిత్రదుర్గా, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో భూములకు సాగునీరు అందించడానికి వీలుగా రూపొందించిన ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.
► మెట్రో-1 ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తి అవుతుంది. నగరోత్తాన పథకం కింద బీబీఎంపీ పరిధిలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్ల నిధులు విడుదల.