
ప్రతి పథకానికి ఇవే ప్రామాణికం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలే ప్రామాణికమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరు మొదలు.. ప్రతి పథకానికి ఈ గణాంకాల ఆధారంగానే లబ్ధి కల్పించే విధంగా ప్రభు త్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియంతా పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే క్షేత్రస్థాయిలో సర్వే గణాంకాలు సేకరించామని వివరించారు.
సర్వేపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందేహాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సమగ్ర సర్వే జరిగినతీరు, నిబంధనలు పాటించిన విధానం వంటి అంశాలను సభ్యులకు వివరించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ సర్వే పూర్తిగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కేంద్రంలో జనగణన విభాగం అనుసరించే విధానంలోనే రాష్ట్రంలో ప్రణాళిక శాఖ సర్వే చేసిందన్నారు.
ఈ సర్వే సారాన్ని వెయ్యి పేజీల్లో పొందుపరిచారని, ఈ సమాచారాన్ని ఒకటి, రెండు రోజుల్లో పబ్లిక్ డొమైన్‌లో కులాలు, ఉపకులాలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment