
సమాచార కమిషనర్ల నియామకంలో సర్కార్ మీనమేషాలు
సీఐసీ పదవీ కాలం ముగిసి ఐదేళ్లు
ఒక్క కమిషనర్ కూడా లేక రెండేళ్లు
వినతులు పరిష్కరించే వారు లేక ప్రజల అవస్థలు
రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క కమిషనరూ లేరా? మరి అప్పీళ్లను సిబ్బంది విచారిస్తారా?.. ఇలాగైతే సమాచార హక్కు చట్టం తెచ్చి ఏం ప్రయోజనం?.. వెంటనే నియామకాలు చేపట్టండి. – సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
ప్రధాన సమాచార కమిషనర్ పోస్టుకు 40 దర ఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులకు 273 దరఖాస్తులొచ్చాయి. త్వరలో సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాం. దీని కోసం 4 వారాల గడువు ఇవ్వాలి. – 2023, ఆగస్టులో హైకోర్టుకు సర్కార్ నివేదన
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభు త్వాలు మారుతున్నాయి.. కానీ, సమాచార కమిష నర్ల నియమాకం మాత్రం జరగడం లేదు. మాకు సమాచారం ఇవ్వడం లేదని ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. పాలనలో పారదర్శకంగా వ్యవ హరించాల్సిన సర్కార్ సీఐసీ, ఐసీల నియామ కంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రధాన కమిషనర్ (సీఐసీ) పోస్టు దాదాపు ఐదేళ్లుగా ఖాళీ. ఒక్క సమాచార కమిషనరూ (ఐసీ) లేక రెండేళ్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చే వారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలు సరిగా లేవు.
అప్పీలు చేద్దామంటే రాష్ట్రస్థాయిలో కమిషనే లేదు. ఎందుకు నియమించడం లేదంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. పాలన పారదర్శకంగా, జవాబుదారీ తనంతో సాగా లని, ఎలాంటి సమాచారమైనా ప్రజలకు తెలి యాలని కేంద్ర ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) తెచ్చింది. అవినీతిని నిరోధించడంలో ఈ చట్టం కీలక భూమిక పోషించాల్సి ఉంది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చెబుతున్నా అది ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు.
వెంటనే నియామకాలు చేపట్టాలి
కేంద్రం తెచ్చిన సమా చార హక్కు చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం లాంటిది. అధికారులు జవాబుదారీతనంతో పనిచేసేలా చేస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకునే అధికారం సీఐసీకి ఉంటుంది. అలాంటి సీఐసీ, ఐసీలు లేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులతో వెంటనే నియామకాలు చేపట్టాలి.– మహ్మద్ గఫార్, న్యాయవాది
రాష్ట్ర కమిషన్..
సెక్షన్ 15(1) కింద ఈ కమిషన్ ఏర్పాటవుతుంది. ఇందులో ఓ ప్రధాన కమిషనర్‌తోపాటు గరిష్టంగా 10 మంది కమిష నర్ల వరకు నియమించవచ్చు. సీఎం చైర్ పర్సన్‌గా శాసన సభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ వీరిని నియమిస్తారు. కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.
కమిషన్‌కు ఎవరు అప్పీల్ చేయొచ్చు...
» ఏదేనీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు అధికారి నిరాకరించినప్పుడు..
» నిర్దేశించిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోయినా..
» సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని అనిపిస్తే.. ళీ ఒకవేళ అధికారి తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని భావిస్తే.. తగిన కారణాలుంటే కమిషన్ నేరుగా విచారణకూ స్వీకరించవచ్చు.
ఎవరు అర్హులు..
1. ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామా జిక సేవ, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవమున్న వారు ప్రధాన కమిషనర్, కమిషనర్‌గా అర్హులు.
2. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాజకీయ పార్టీలతో సంబంధమున్న వారు అనర్హులు.
3. ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామకమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా వయసు 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరి పునర్నియామకానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. అయితే మొత్తంగా ఐదేళ్లు మించి బాధ్యతల్లో ఉండకూడదు.
4. గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే వీరిని తొలగించవచ్చు.

నోట్: 2023, ఫిబ్రవరి 24తో చివరి సమాచార కమిషనర్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆ తర్వాత ఎలాంటి కేసులు పరిష్కారం కాలేదు.
సంప్రదించండి ఇలా...
తెలంగాణ సమాచార కమిషన్, సమాచార హక్కు భవన్, డోర్ నంబర్ 5–4–399, మొజంజాహి మార్కెట్ పక్కన, హైదరాబాద్–500001 ఫోన్: 040–24720240 (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు)