సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్న ప్రభుత్వం.. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.
రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని, సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువును ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై ససెన్షన్ వేటు
Comments
Please login to add a commentAdd a comment