రాజ్యసభలో నిరసన దృశ్యం
స్తంభించిన ఉభయసభలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారమూ ఆందోళనలతోనే ముగిశారుు. సభ బయట తమను కించపరిచేలా మాట్లాడిన ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ రాజ్యసభలో విపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారుు. ఉభయసభల్లోనూ కోల్‌కతాలో ఆర్మీ మోహరింపుపై టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలు మద్దతు పలికారుు. దీనిపై రక్షణ మంత్రి స్వయంగా వివరణ ఇచ్చినా.. సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నారుు. దీంతో పార్లమెంటు వారుుదా పడింది. రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు మోదీ క్షమాపణకు పట్టుబట్టారుు.
వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు సర్కారుకు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చైర్మన్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వారుుదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ గందరగోళంలోనే డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రైవేటు మెంబర్ శాసన వ్యవహారాలను కొనసాగించారు. తర్వాత సభ వారుుదాపడింది. ఐటీ బిల్లుకు సవరణలను చర్చ లేకుండానే ఆమోదించి పంపటంపై విపక్షాలు నిరసన తెలిపారుు. దీంతో సభ వారుుదా పడింది. తిరిగి ప్రారంభమైనా విపక్షాలు వెల్‌లోనే ఉండి నినాదాలు చేశారుు. ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ సభ్యులు బెంచీలపై నిలబడి నిరసన తెలిపారు.