
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 25) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడంతో ఉభయసభలను బుధవారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ కామెంట్స్..
- పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరగాలి
- ఎంపీలు అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలి
- కానీ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి
- ప్రజలు తిరస్కరించిన పార్టీలు, పార్లమెంటులో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయి
- పార్లమెంటును అడ్డుకునే వారికి ప్రజలు సమయం చూసి శిక్ష విధిస్తారు
- గందరగోళం సృషించే పార్టీలు పశ్చాతాపం చెందాలి
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..
తొలి రోజే అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం.
సంభల్‌లో అల్లర్లపై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానం.
ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు.
జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు.
ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.