BRS MP Nama Nageswara Rao Slams Centre at Parliament - Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది: బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా

Published Thu, Aug 10 2023 1:27 PM | Last Updated on Thu, Aug 10 2023 3:20 PM

BRS MP Nama nageswara Rao Slams Centre At Parliament - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర కక్ష సాధిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకరాం దక్కాల్సినవి కూడా దక్కలేదని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలన్నింటిని కేంద్రం సమానంగా చూడట్లేదని విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీగానీ, నవోదయ స్కూల్‌ గానీ ఇవ్వలేదని మండిపడ్డారు.

‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కోటి రూపాయలు ఇచ్చినట్లు చూపితే 9 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి. ఒక్క పైసా ఇచ్చి నట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ. అవిశ్వాసం పై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని చర్చ సందర్భంగా అన్ని వివరాలు చెప్పాము. 

తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదు. 9 ఏళ్లలో కేసీఆర్ తాగు నీటికి సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరద ద్వారా నీరందించారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షతో ఉన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రం పై ఉంది. తెలంగాణకి ఒక్క మెడికల్ కళాశాల,ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో అన్ని అవిశ్వాసం పై చర్చ సందర్భంగా ప్రస్తావించా. 

నా మైక్ కట్ చేసి నిషికాంత్ దుబేకి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అవకాశం ఇచ్చారు. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక ఓర్వ లేక ఆ అభివృద్ధికి మేమే నిధులిచ్చాం అంటున్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబే పై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు, క్లియరెన్స్ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేశారు. ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. సిడబ్ల్యుసి డిపిఆర్ ప్రకారం 80 వేల కోట్లు .కానీ 86 వేల కోట్లు ఇచ్చాం అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది..కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టె వారిని ప్రజలు తెలంగాణ దరిదాపులకు రానియవద్దు. తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నది నచ్చక తప్పుడు మాటలు మాట్లాడారు

చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement