సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించా రు. నిజామాబాద్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని అంగీకరించారని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, బీజేపీ–బీఆర్‌ఎస్ భాగస్వామ్యం గత పదేళ్లలో తెలంగాణను నాశనం చేసిందని మండిపడ్డారు.
ప్రజలు తెలివైన వారని..వారిద్దరూ కలిసి ఆడుతున్న ఆటను అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈసారి బీఆర్‌ఎస్, బీజేపీను ప్రజలు తిరస్కరిస్తారనీ, 6 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: టీపీసీసీ చీఫ్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం నిజా మాబాద్ సాక్షిగా రుజువైందని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే స్పష్టం చేశారని, మోదీ నోట చీకటి మిత్రుడి మాటలు వినిపించాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారిద్దరూ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతున్నదే నిజమని ఇప్పుడు మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని వెల్లడించారు.
కేసీఆర్ ఎన్డీయే చేరాలనుకున్నది, మోదీ ఆశీస్సులతో కేటీఆర్‌ను సీఎంను చేయాలను కున్నది, ఇప్పటికీ మోదీ–కేసీఆర్‌లు చీకటి మిత్రులేనన్నది నిజమని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తించాలని కోరారు.
చదవండి: ఈసీ అసహనం.. దర్యాప్తు సంస్థలపై సీరియస్!
బిహార్ తరహాలో బీసీల కులగణన చేపట్టండి
బిహార్ తరహాలో వెంటనే తెలంగాణలో నూ బీసీల కులగణన చేపట్టాలని మంగళవారం సీ ఎం కేసీఆర్‌కు రాసిన బహి రంగలేఖలో రేవంత్‌రెడ్డి కోరారు. ప్రభుత్వాలు అరు దైన పక్షి, జంతుజాతుల లెక్కలు తీస్తున్నాయేకానీ, బీసీల జనగణన చేపట్టడంలేదని పేర్కొన్నారు. ఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను బయట పెట్టాలని లేఖలో కోరారు.
రెండేళ్లుగా మేమూ అదే చెప్తున్నాం
ప్రధాని ‘పొత్తు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తో కేసీఆర్ పొత్తు పెట్టు కోవాలని ప్రయత్నిస్తు న్నారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లు రెండేళ్లుగా చెబుతూనే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ అన్నారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసి ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించారని నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా మాణిక్యం ఠాగూర్ స్పందించారు.
నిజామాబాద్ సభ ద్వారా రెండు అంశాలు నిరూపితమయ్యాయని.. మోదీతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నించడం మొదటిది కాగా.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకోవడం రెండో అంశమని అని పేర్కొన్నా రు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ అనేందుకు సమయం ఆసన్నమైందని మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment