సాక్షి, న్యూఢిల్లీ: 10 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందని మండిపడ్డారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, వీటిపై బీఆర్‌ఎస్ సర్కార్ తాత్సారం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెండింగ్‌లో నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం భేటీ అయ్యారు. మోదీతో చర్చించిన అంశాలపై రేవంత్, భట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని భట్టి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే అందించాలని కోరినట్లు చెప్పారు.
‘తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానమంత్రిని కోరాం. ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనికల్ స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తొలిసారి ప్రధానిని కలిశాం. వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరాం’ అని భట్టి వెల్లడించారు.
చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
Comments
Please login to add a commentAdd a comment