త్వరలో కేంద్రం ఏర్పాటు చేస్తుందన్న కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం çపనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల ని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చకు ప్రోత్సహించడం, జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా త్వరలోనే దీనికి సహకరిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున.. కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రజ లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు.
జమి లి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలతోపాటుగా, ప్రాంతీయ సమస్యలపైనా సమానస్థాయిలో చర్చ జరుగుతుందని తెలిపారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి.. ఓటరుశాతం తగ్గటం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనికి జమిలి ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల కారణంగా, దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1% తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పేర్కొందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment