సోనియా సూచన మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
ఆయన నియామక పత్రంపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే సంతకం చేశారన్న పార్టీ వర్గాలు.. ఏ క్షణమైనా ఏఐసీసీ అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సారథితోపాటు పశి్చమ బెంగాల్‌కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత పత్రంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండు నెలలుగా కసరత్తు..
ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్ష నియామకంపై గడిచిన రెండు నెలలుగా కసరత్తు జరుగుతుండగా, వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పది రోజుల కిందటే మరో దఫాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గ నేతకే పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.
బీసీల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మహేశ్‌గౌడ్‌తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ల అభ్యర్థిత్వాలపై చర్చించారు. వారి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియా గాం«దీకి కట్టబెట్టారు. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పారీ్టకి సేవలందిస్తూ రాష్ట్ర నేతలందరితో సన్నిహిత సంబంధాలుగల మహేశ్ గౌడ్ వైపు ఏఐసీసీ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏ క్షణమైనా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment