Nama Nageswara Rao
-
బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను, నేతల్ని లొంగదీసుకునే రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న దాడులను ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గత యూపీఏ హయాంలో కంటే ఎక్కువ దాడులు ప్రస్తుత ఎన్డీఏ హయాంలో జరిగాయని ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న పాలసీలో అవినీతి జరిగిందని, ఆధారాల్లేకుండా ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే కవిత అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీ లాంటి ఎన్నో పాలసీలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రవేశపెట్టిందన్నారు. ఎన్డీఏ హయాంలో 2,954 దాడులు టీవీ సీరియల్ మాదిరిగా సాగదీసిన కేసులో ఎన్నికలు వచ్చేసరికి ఈడీ హుటాహుటిన కవితను అరెస్టు చేయడం ఎంత అక్రమమో తెలుస్తోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. యూపీఏ çపదేళ్ల కాలంలో ఈడీ 200 కేసులు నమోదు చేస్తే.. ఎన్డీఏ పాలనలో 2,954 కేసులు బనాయించిందని ఆరోపించారు. ఇలా సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ నేతలను బెదిరింపులకు గురిచేస్తూ లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. లిక్కర్ కేసులో కవిత బాధితురాలే తప్ప.. బాధ్యురాలు, నిందితురాలు కాదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో దాడులు చేయించడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. కవితకు డబ్బు ముట్టినట్లుగా గానీ, ఆమె ఇచ్చిన ట్లుగా గానీ ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఓ పక్క శక్తి అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ మహిళలపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. మోదీ తెలంగాణ, ఢిల్లీపై దాడి చేయిస్తూ ఇటు కవితను, అటు కేజ్రీవాల్‌ను దొంగల్లా అరెస్టు చేయించారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని ఈ వ్యవహారంపై ఎందాకైనా పోరాడతామన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎంపీలు ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్: అసంతృప్తులను చల్లార్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఖమ్మం సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం భేటీ అయ్యారు. గంటకు పైనే ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది అధిష్టానం. దీంతో తుమ్మల అనుచరులు అసమ్మతి గళం లేవనెత్తారు. నిన్నంతా సమావేశమై పార్టీ నుంచి బయటకు రావాలంటూ తుమ్మలకు సూచించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తుమ్మల సైతం టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుమ్మలతో చర్చించాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇవాళ వాళ్ల భేటీ జరిగింది. మరోవైపు తుమ్మల తరహా నేతలు మరికొందరితోనూ చర్చించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారాయన. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు. -
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది: బీఆర్ఎస్ ఎంపీ నామా
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర కక్ష సాధిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకరాం దక్కాల్సినవి కూడా దక్కలేదని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎంపీ ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలన్నింటిని కేంద్రం సమానంగా చూడట్లేదని విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీగానీ, నవోదయ స్కూల్ గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కోటి రూపాయలు ఇచ్చినట్లు చూపితే 9 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి. ఒక్క పైసా ఇచ్చి నట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ. అవిశ్వాసం పై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని చర్చ సందర్భంగా అన్ని వివరాలు చెప్పాము. తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదు. 9 ఏళ్లలో కేసీఆర్ తాగు నీటికి సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరద ద్వారా నీరందించారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షతో ఉన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రం పై ఉంది. తెలంగాణకి ఒక్క మెడికల్ కళాశాల,ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో అన్ని అవిశ్వాసం పై చర్చ సందర్భంగా ప్రస్తావించా. నా మైక్ కట్ చేసి నిషికాంత్ దుబేకి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అవకాశం ఇచ్చారు. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక ఓర్వ లేక ఆ అభివృద్ధికి మేమే నిధులిచ్చాం అంటున్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబే పై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు, క్లియరెన్స్ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేశారు. ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. సిడబ్ల్యుసి డిపిఆర్ ప్రకారం 80 వేల కోట్లు .కానీ 86 వేల కోట్లు ఇచ్చాం అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది..కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టె వారిని ప్రజలు తెలంగాణ దరిదాపులకు రానియవద్దు. తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నది నచ్చక తప్పుడు మాటలు మాట్లాడారు చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. -
ఈడీ కేసుపై హైకోర్టుకు ఎంపీ నామా
సాక్షి, హైదరాబాద్: ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఈడీ కేసును కొట్టివేయాలని నామా నాగేశ్వరరావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఎంపీ నామా కోర్టును కోరారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో నామా పేర్కొన్నారు. 2009లోనే మధుకాన్ గ్రూప్ కంపెనీలకు రాజీనామా చేసినట్లు తెలిపారు.సీబీఐ, ఎఫ్ఐఆర్, చార్జిషీట్లోనూ తన పేరు లేదని పిటిషన్లో నామా పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. -
టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్..
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 28 స్థిరాస్తు లను సోమవారం జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. గత జూలైలోనూ నామాకు, ఆయన కుటుంబానికి సంబంధించి రూ.73.74 కోట్ల విలువ గల 105 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి మధుకాన్ గ్రూపు రూ.361.92 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ నిగ్గుతేల్చింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న నామా నాగేశ్వరరావు బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకునే రుణానికి పూచీకత్తుగా కూడా ఉన్నారని ఈడీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలోని ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీధర్మ శాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనే ఆరు డొల్ల కంపెనీలకు రూ.75.50 కోట్లు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మధుకాన్ ప్రధాన కార్యాలయం, నగరంలోని మరికొన్ని ఆస్తులతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆ సంస్థ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కాంట్రాక్ట్ రద్దు రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ను కలిపే 163 కిలోమీటర్ల నిడివి గల ఎక్స్‌ప్రెస్ వే అయిన నాలుగు లేన్ల ఎన్‌హెచ్ 33కి సంబంధించి కాంట్రాక్టును మధుకాన్ కంపెనీ పొందింది. ఇందుకోసం 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులోంచి రూ.1,029 కోట్లు మధుకాన్ సంస్థ తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పురోగతి లేక, పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ గుర్తించింది. దీంతో కన్సార్షి యం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. జార్ఖండ్ హైకోర్టు సైతం సీబీఐని దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కాంట్రాక్టును జాతీయ రహ దారుల సంస్థ రద్దు చేయడంతోపాటు రూ.73.95 కోట్లను స్వాధీనం చేసుకుంది. చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్ -
ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి.. కత్తితో బెదిరించి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజపై దాడి జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరబడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు. అనంతరం డ్రైవింగ్ సీట్లో ఉన్న పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించి దాడి చేశారు. బలవంతంగా రూ. 75 వేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకొని పరారయ్యారు. ఈ ఘటనపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నామా కొడుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రూ. 96.21 కోట్ల నామా ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు షెల్ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్ల రూపాయలను తన జేబులోకి మళ్లించుకున్న వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. మధుకాన్ సంస్థలకు చెందిన రూ. 96.21 కోట్లను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీని నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది. కానీ నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది. రంగంలోకి దిగిన ఈడీ... ఈ కేసును ఆధారంగా చేసుకొని మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా రోడ్డు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని నామా నాగేశ్వర్రావు, కంపెనీ ప్రమోటర్లు నామా సీతయ్య, కమ్మ శ్రీనివాస్‌రావు, నామా పృథ్వీతేజ కుట్రపూరితంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తమ ఇతర ప్రాజెక్టుల్లోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. రూ. 75 కోట్లకుపైగా నిధులను షెల్ కంపెనీలైన ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మశాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్స్ట్రక్షన్స్లోకి మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ కింద పనులు ఇచ్చినట్లు నకిలీ అలాట్మెంట్ లెటర్లు సృష్టించి నిధులను మళ్లించి మళ్లీ అక్కడ నుంచి నామా నాగేశ్వర్రావు తన జేబులోకి వచ్చేలా చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2021 జూన్‌లో మధుకాన్ కంపెనీ చైర్మన్ నామా నాగేశ్వర్రావు కార్యాలయం, నివాస సముదాయాలు, ఆ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది. నామా ఇంట్లో రూ. 34 లక్షల లెక్కచూపిన సొమ్ముతోపాటు నేరపూరితమైన ఆధారాలను సీజ్ చేసినట్లు వివరించింది. మొత్తంగా ఈ కేసులో రూ. 361.29 కోట్ల రుణం సొమ్మును షెల్ కంపెనీలతోపాటు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు తేల్చింది. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా హైదరాబాద్, పశ్చిమ బెంగాల్లో ఉన్న రూ. 88.85 కోట్ల విలువగల స్థిరాస్తులు, విశా ఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఉన్న రూ.7.36 కోట్ల చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. -
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఎన్ని విధాలుగా మాట్లాడిన ఫలితం లేదు
-
ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రంలో ఒకమాట
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో రెండోరోజూ ఆందోళనను కొనసాగిం చారు. మంగళవారం సభ మొదలవగానే ధాన్యం సేకరణపై కేంద్రం విధానాన్ని తప్పుబడుతూ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, దయాకర్, నేతకాని వెంకటేశ్ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా కోరినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గం.కు ఆయన వాయిదా వేశారు. మరో రెండుసార్లు సభ వాయిదా తర్వాత మొదౖ లెనా ఎంపీల ఆందోళన చేయడంతో మాట్లాడేందుకు నామాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కొనుగోళ్లపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట చెబుతోంది. దీనిపై ప్రకటన చేయాలి’ అని కోరారు. కేంద్రం నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. తర్వాత ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. తెలంగాణభవన్‌లో ఎంపీలు మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల అంశం పై మాట్లాడేందుకు కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే తన చాంబర్లో నిర్వహించిన విపక్ష పార్టీ నేతల భేటీకి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ కూడా హాజరైంది. భేటీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పక్కనే కూర్చొని ఎంపీల సస్పెన్షన్‌పై తన అభిప్రాయం చెప్పారు. సస్పెన్షన్ ఎత్తేసేలా ఒత్తిడి చేయాలన్న కాంగ్రెస్ వినతికి మద్దతిచ్చారు. తర్వాత విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపగా కేకే హాజరయ్యారు. రాజ్యసభ మొదలయ్యాక విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని, కేంద్రంలోని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ తూర్పారపడుతున్న సమయంలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనడం ఢిల్లీలో చర్చనీయాంశమైంది. -
ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా
సాక్షి, హైదరాబాద్: రాంచి ఎక్స్‌ప్రెస్ వే కంపెనీ బ్యాంకుల కన్సార్షియం ద్వారా రూ.1,029.39 కోట్లు రుణం పొంది, ఇందులో నుంచి రూ.264 కోట్ల నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలిచిన విచారణ కు హాజరుకాలేదు. అనివార్య కారణాలతో శుక్రవారం విచారణకు హాజరుకాలేక పోతున్నానని, మరింత సమయం కావాలని కోరుతూ ఈడీ అధికారులకు తన వ్యక్తిగత లాయర్ల ద్వారా ఎంపీ సమాచారం ఇచ్చారు. దీంతో మళ్లీ ఆయనకు ఈడీ సమన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాంచి ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లయిన కె.శ్రీనివాస్‌రావు, సీతయ్య, పృథ్వీతేజ మాత్రం విచారణకు హాజరయ్యారు. వీరిని ఈడీ అధికారులు నిధుల మళ్లింపుపై పలు ప్రశ్నలు వేశారు. నిధులు ఎందుకు వేరే కంపెనీలకు మళ్లించాల్సి వచ్చింది? రోడ్డు పనుల్లో పురోగతి ఎందుకు వెనకబడ్డారు? తదితరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ఎంపీ నామా, రాంచీ కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ 25న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కోవిడ్ భయంతో కూతుర్ని చంపుకుంది! -
నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు. ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. -
నామాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలోనే భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ‘రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్’డైరెక్టర్లను త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించనుంది. ఈ కంపెనీ నుంచి పలు కారణాలు చెప్పి, ఇతర కంపెనీలకు మళ్లించిన రూ.264 కోట్ల విషయంపై ఆరా తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను అందుకే ఖర్చు చేయాల్సింది పోయి వేరే మార్గాల ద్వారా ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న విషయంపై ఈడీ ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు ముగ్గురు డైరెక్టర్లను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. రూ.1,151 కోట్ల విలువైన రాంచీ-రార్‌గావ్- జంషెడ్పూర్ వరకు 163 కి.మీ. మేర ఉన్న ఎన్‌హెచ్–33 4 లేన్ల రహదారి పనుల ప్రాజెక్టును మధుకాన్ కంపెనీ 2011లో దక్కించుకుంది. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా కె.శ్రీనివాస్‌రావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వీతేజ వ్యవహరిస్తున్నారు. ఎలా మళ్లించారంటే? రహదారి ప్రాజెక్టు పనులను చూపించి రూ.1,029.39 కోట్లు బ్యాంకుల కన్సార్షియం నుంచి రాంచీ ఎక్స్‌ప్రెస్ వే రుణం పొందింది. ఈ కన్సార్షియానికి కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరించింది. ఆ తర్వాత మధుకాన్‌పై ఆరోపణలు రావడంతో వాస్తవాలు తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. తీసుకున్న రుణంలో నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టాయని ఎస్ఎఫ్ఐఓ నివేదిక ఇచ్చింది. రౌండ్ ట్రిప్పింగ్ ఎక్సర్సైజ్ కింద రూ.50 కోట్లు, డైవర్షన్ మొబిలైజేషన్, మెటీరియల్ అడ్వాన్స్ కింద రూ.22 కోట్లు, మెయింటెనెన్స్ పేరిట రూ.98 కోట్లు, మెటీరియల్ యుటిలైజేషన్– మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు రూ.94.01 కోట్లు.. ఇలా మొత్తం రూ.264.01 కోట్లు మళ్లించారని ఎస్ఎఫ్ఐఓ నివేదించింది. 2019 మార్చిలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ వ్యవహారంలో వారికి కోటా ఆడిట్ కంపెనీ సాయం చేసిందని గుర్తించింది. మధుకాన్ ప్రైవేట్ లిమిటెడ్, మధుకాన్ ఇన్ఫ్రా లిమిటెడ్, మధుకాన్ టోల్‌హైవే లిమిటెడ్, కోటా ఆడిట్ కంపెనీ, గుర్తు తెలియని బ్యాంకు ఉద్యోగులపై ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు పద్దుల నిర్వహణల ఆరోపణల కింద కేసు నమోదు చేసింది. రుణాలు మంజూరైనా పనుల్లో పెద్దగా పురోగతి లేదని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
సాక్షి, న్కూఢిల్లీ : సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంరతం ఆయన వివరాలను వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు తెలిపారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై కూడా చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. అవకాశం వచ్చినా ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని, ప్రత్యేక హోదా అంశంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. (కేంద్రంతో ఇక బిగ్‌ఫైట్) కరోనా వైరస్ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయని అన్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందన్నారు. విపక్షాలకు అంశాలు లేక తమపై అనవసరమైన నిందలు వేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఎవరు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశాని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం: నామా పెండింగ్ బిల్లులు ఆమోదించుకోవడమే లక్ష్యంగా అజెండా రూపొందించారు. జీఎస్టీ పెండింగ్ నిధులు, కరోనా, వలస కార్మికుల సమస్యలు, నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు, ఆర్థిక ప్రగతిపై కూడా చర్చించాలని కోరాం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతాం. 11 ఆర్డినెన్స్ లు కేంద్రం ప్రవేశ పెట్టబోతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 25 బిల్లులు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రజావ్యతిరేక బిల్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నూతన విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దాన్ని వ్యతిరేకిస్తాం. నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత -
అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు
సాక్షి, వైరా: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమ్శలు చేస్తున్నాయని, అభివృద్ధి పనులు చేస్తున్న వారిని అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయటం సరైంది కాదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రాష్ట్ర పథకాలనే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ దూర దృష్టితో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉందని, తక్కువ సమయంలో ఇంత మందికి పార్టీ సభ్యత్వాలు అందించటం హర్షించదగిన విషయమని అన్నారు. సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలన్నారు. సీఏం కేసీఆర్ ప్రకటించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలను ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. 30 రోజుల ప్రణాళికల ద్వారా గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కరించే అవకాశం ఉంటుందని, సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీ వరకు బాధ్యతను పెంచేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు సాధ్యమైనంత మేర గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా సీఎం ప్రణాళికలు తయారు చేశారని, రానున్న రోజుల్లో తెలంగాణలో కోటి ఎకరాల భూమి సేద్యం కావడం తథ్యమని అన్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే లావూడ్యా రాములు నాయక్ ఎంపీని ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నేత కుమారుడు లండన్‌లో మిస్సింగ్
సాక్షి, ఖమ్మం: లండన్‌లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కొడుకు హర్ష శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యడు. అతనిపై లండన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో ఉదయ్‌ప్రతాప్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. లండన్‌లో శుక్రవారం హర్ష అదృశ్యమయ్యాడని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. అక్కడ పీజీ కోర్సు చదువుతున్న హర్ష కనిపించకుండా పోయాడని హాస్టల్ నిర్వాహకులు అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఖమ్మంలోని అతడి తల్లిదండ్రులకు శుక్రవారం అర్థరాత్రి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్లో ఉదయ్‌ప్రతాప్‌తో మాట్లాడారు. లండన్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి హర్ష ఆచూకీ కనుక్కునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖతో పాటు... లండన్‌లో ఉన్న తెలుగు వాళ్లతో తాను మాట్లాడతాననీ... ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాసి... హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని నామా భరోసా ఇచ్చారు. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలతో ఇదే సమస్య. ఖండాలు దాటి వెళ్లి... అయినవాళ్లకు దూరంగా బతికే వాళ్లు కనిపించకుండాపోతే వారి బాధ మాటలకందనిది. హర్ష క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులతో పాటు, ఖమ్మం వాసులు కోరుకుంటున్నారు. -
'కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు'
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, కాళేశ్వరం జాతీయ హోదా తదితర విషయాలను ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరు చేసిన 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులకు వెంటనే నిధులు ఇవ్వాలని, మంజూరైన రైల్వే లైన్లకు తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హర్–గర్–జల్ కార్యక్రమం రాష్ట్రంలో అవసరం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలని, అన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్రావు, నాయకులు తాళ్లూరి భ్రహ్మయ్య, స్వర్ణకుమారి ఉన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు సోమ వారం లోక్‌సభలో ‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం’పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘తెలం గాణ ఏర్పడి కొద్దికాలమే అయినా రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఆరంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించగలిగారు. దీనికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచీ కోరుతున్నాం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా అనేక నిబంధనలు అమలు కాకుండా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. నదుల అనుసంధానం చేపట్టి తద్వార కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు అందజేయాలి’అని కోరారు. -
‘నేడు తెలంగాణకు పండగ రోజు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిగొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టులున్న అమెరికా, ఈజిప్ట్ సరసన కాళేశ్వరం ప్రాజెక్టుతో భారత్ నిలిచిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ అంకితం చేసిన సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సంబురాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రాజెక్టుగా తాము భావిస్తున్నామని, రీడిజైన్‌తో దీన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత ఆయనదేనని కొనియాడారు. తెలంగాణకు, దేశానికి నేడు పండగ రోజని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరతాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తే బాగుండేదని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకితీసుకెళ్ళడం మామూలు విషయం కాదన్నారు. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి అందనున్నాయని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేకపోయామన్నారు. -
నీ ‘నామ’మే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదవులపరంగా జిల్లాకు మరో అవకాశం లభించింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం లభించినట్లయింది. దీంతో రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నామా నాగేశ్వరరావు మొదటిసారి టీడీపీ ఎంపీగా అడుగిడితే.. రెండోసారి టీఆర్ఎస్ ఎంపీగా కాలుమోపనున్నారు. మొదటి పర్యాయం టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అదే లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించే అవకాశం దక్కింది. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరుగురు లోక్‌సభ సభ్యులు గల టీడీపీకి లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించిన నామా నాగేశ్వరరావు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలం వరకు టీడీపీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఆయన.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఉనికి కోల్పోతున్న దశలో ఆయన లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిందే తడవుగా ఆయనకు టీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఐదేళ్లపాటు టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్.. నామాకు టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చింది. హైదరాబాద్‌లో ఎంపిక.. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నామాను పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా అనుభవం ఉండడంతోపాటు జాతీయ స్థాయి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండడాన్ని, సమస్యలపై అవగాహన ఉండడం, ప్రజల వాణిని వినిపించగల నేర్పు ఉండడం వంటి అంశాలు నామా టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడానికి ఉపకరించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2009లో టీడీపీ నుంచి ఆరుగురు లోక్‌సభకు ఎన్నిక కాగా.. అందులో తెలంగాణ నుంచి నామా నాగేశ్వరరావుతోపాటు ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరే ఎన్నికైనా ఆయనకు జాతీయ నేతలతో గల సంబంధాలు.. అప్పట్లో చంద్రబాబు నాయుడితో గల సాన్నిహిత్యం ఆయనను టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిని చేసింది. ఇప్పుడు సైతం సీఎం కేసీఆర్‌తో గల సాన్నిహిత్యం, గత అనుభవం వంటి అంశాలు ఆయనను లోక్‌సభ టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా అయ్యేలా చేసిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై ఆయనకు గళమెత్తే అవకాశం లభించినట్లయింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, పలు రైల్వే లైన్ల ఏర్పాటు వంటి అంశాలను సభలో ప్రస్తావించి.. పరిష్కరించడానికి మరింత అవకాశం లభించినట్లయిందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు విజయం సాధించడం అనంతరం ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించి మెజార్టీ మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడంతోపాటు ఖమ్మం జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం వ్యక్తమవుతోంది. నామా టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. -
జిల్లా అభివృద్ధికి నిధులు తెస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందన్నారు. పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను ఆశీర్వదించి ఖమ్మం ప్రజలకు అప్పగిస్తే.. వారు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని, ఈ విజయం అపూర్వమైందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తీసుకుంటానన్నారు. తాను కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తినని, నాయకత్వం మాటే తన మాట అని, పార్టీ నిర్దేశించిన పనులు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. గతంలో టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఉన్న అనుభవం ఉన్నందున.. దానిని జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానన్నారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఎవరికి అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధినేత అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, అది వ్యక్తులు నిర్ణయించేది కాదని, పార్టీ తీసుకునే నిర్ణయమని అన్నారు. జిల్లా ప్రజలు తనను ఎంపీగానే చూడాలనుకున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్నారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, తిరుమలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
16 సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటాలి
సాక్షి, ఖమ్మం వైరారోడ్: రాష్ట్రంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా మరోసారి చాటాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ మంగళవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కారు గుర్తుపై ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు. గత 60 ఏళ్లలో కాని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. అత్య«ధిక ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపించడం ద్వారా తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కార్మిక విభాగం అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కూరపాటి రంగరాజు, ఖాజామియా, బి.కరుణ, పాల్వంచ కృష్ణ, జలగం రామకృష్ణ, మన్మథరావు, డోకుపర్తి సుబ్బారావు, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా
సాక్షి, కొత్తగూడెం: సిట్టింగ్ ఎంపీ అయిన తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల కొంచెం బాధగానే ఉన్నప్పటికీ అందరికీ కుటుంబ పెద్దగా భావిస్తున్న కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసా వహించాల్సిందేనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబ పెద్ద అని, ఏ పనిచేసినా ఆలోచించి చేస్తారని, ఈ క్రమంలోనే ఖమ్మం టికెట్ నామాకు ఇచ్చారని చెప్పారు. తనకు సముచిత స్థానం కల్పిస్తానని ఇటీవల ఖమ్మంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని, అభివృద్ధిని కాంక్షించే వారంతా రాష్ట్రంలోని 16 స్థానాలలో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆయన కోరారు. తనకు అధికారం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని అన్నారు. -
టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావాలి
సాక్షి, ఖమ్మంఅర్బన్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి నామా నాగేశ్వరరావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభంలో భాగంగా మండలంలోని కేవీబంజరలోని దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, మండల సర్వతోమాఖాభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. గత ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించిన విధంగానే ఎంపీగా నామా నాగేశ్వరరావుకు ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అజ్మీరా వీరునాయక్, కుర్రా భాస్కర్‌రావు, మందడపు సుధాకర్, గుండా మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. వాకర్స్‌ను ఓట్లు అభ్యర్థించిన టీఆర్ఎస్ నాయకులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓట్లు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతిని«ధులు ఓటర్లను కోరారు. సోమవారం ఉదయం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా రాజకీయాలకు నామా నాగేశ్వరరావు కొత్త కాదని, ఇతర పార్టీల అభ్యర్థులు గజకర్ణ, గోకర్ణ విద్యలతో జనం ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి నేతలను నమ్మవద్దని, టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఆదరించాలని కోరారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఖమ్మం అభివృద్ధి మారిపోయిందని, సాగునీటి రంగంలో ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే యజ్ఞం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కు ఓటు వేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని కోరారు. కార్యక్రమంలో తాత మధు తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ గుర్తుకే ఓటేయండి: నామా నాగేశ్వరరావు
సాక్షి, ఖమ్మం : అయ్యగారు సైకిల్ దిగి కారెక్కినా... ఇంకా పచ్చ వాసనలు వదలలేదు. టీడీపీతో పదిహేనేళ్ల అనుబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేని ఆయన సైకిల్ గుర్తుకే ఓటు వేయండంటూ ఎన్నికల ప్రచారంలో అడ్డంగా బుక్కయ్యారు. విషయానికి వస్తే నామా నాగేశ్వరరావు...మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన... ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి...టీఆర్ఎస్లో చేరడం... ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం చకచకా జరిగిపోయాయి. అంతవరకూ బాగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నామా నాగేశ్వరరావు... కారు గుర్తుకే ఓటేయాలని కోరడానికి బదులు.. సైకిల్ గుర్తుకే.. సైకిల్ గుర్తుకే.. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఒకసారి కాదు ఏకంగా మూడుసార్లు నినాదాలు చేశారు. దీంతో ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకున్న పార్టీ నేతలు.... మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు...టీడీపీలో కాదంటూ నామా నాగేశ్వరరావును అప్రమత్తం చేశారు. దీంతో నాలిక కరుచుకున్న నామా.. తన తప్పును సరిదిద్దుకునేందుకు కవరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి నామా నాగేశ్వరరావు పరాజయం పొందారు. అయితే తెలంగాణ టీడీపీలో ఉంటే తన మనుగడ కష్టమని గ్రహించిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. నామా నాగేశ్వరరావు 2009 ఎన్నికల్లో రేణుకా చౌదరిపై టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు. -
టీఆర్ఎస్లో చేరిన నామా నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజీనామా చేసినఆ పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గురువారం టీఆర్ఎస్లో చేరారు. నామ నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నేతలు బేబి స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, బ్రహ్మయ్య తదితరులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. -
‘నామా’కు బహుమానం!
సాక్షి, అమరావతి: ఒప్పందం ప్రకారం పనులు చేయని కాంట్రాక్టర్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని జరిమానా వసూలు చేయాలి. కానీ పోలవరం ఎడమ కాలువ ఆరో ప్యాకేజీలో పనులు చేయకుండా మొండికేసిన టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరావుకు టీడీపీ సర్కార్ జరిమానాకు బదులుగా భారీ నజరానా ఇచ్చింది. నామా సంస్థ నుంచి రూ.70.29 కోట్ల విలువైన పనులను 60 సీ నిబంధన కింద తొలగించిన సర్కారు వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేయడం గమనార్హం. ఈ పనులను టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో అప్పగించే ఫైలుపై సీఎం చంద్రబాబు గురువారం సంతకం చేశారు. ఆర్థిక, జలవనరుల శాఖల అభ్యంతరాలను తుంగలో తొక్కి దొడ్డిదారిన పనులను అప్పగించడం వెనుక రూ.50 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంతో పోలవరం ఎడమ కాలువలో ఎనిమిది ప్యాకేజీల పనులనూ నామినేషన్ పద్ధతిలో అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లైంది. ధరల సర్దుబాటు కింద అదనంగా చెల్లింపులు.. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న వెంటనే ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నవంబర్ 11 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఆలోగా.. ఆరో ప్యాకేజీ మినహా మిగిలిన ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసిన ప్రభుత్వ పెద్దలు వాటిని కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలోఅప్పగించేశారు. ఆరో ప్యాకేజీ (ఎడమ కాలువ 111 కి.మీ. నుంచి 136.780 కి.మీ. వరకు) పనులను రూ.196.20 కోట్లకు 2005లో దక్కించుకున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్–సినో హైడ్రో సంస్థ ఇప్పటివరకూ రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనంగా సర్కార్ చెల్లించింది. నామా సంస్థ కావడంతో పనులు చేయకున్నా వేటు వేయలేదు. నిబంధనల ప్రకారమైతే ఈ సంస్థపై 61సీ నిబంధన కింద వేటు వేసి.. పనుల్లో జాప్యం వల్ల పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతాన్ని ఆ సంస్థ నుంచి జరిమానాగా సర్కార్ వసూలు చేయాలి. కానీ నామా నాగేశ్వరరావు సంస్థపై 61 సీ నిబంధన కింద సర్కార్ చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతకు నామినేషన్‌పై అప్పగింత..: ఆరో ప్యాకేజీ పనులు చేయకుండా చేతులెత్తేసిన నామా నాగేశ్వరరావు సంస్థపై వేటు వేయకుండా రూ.70.29 కోట్ల విలువైన పనులను 60 సీ నిబంధన కింద తొలగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే నామాకు మిగిలాయి. అనంతరం 60 సీ కింద తొలగించిన పనుల అంచనా వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం 60 సీ కింద కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నా ఐదు శాతం అంటే రూ.7.50 కోట్లను నామా సంస్థ నుంచి జరిమానాగా వసూలు చేయాలి. కానీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో అధికారులు జరిమానా వసూలు చేయలేదు. నామా నుంచి తొలగించి పనులను పెంచిన అంచనా వ్యయంతో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని సీఎం చంద్రబాబు జలవనరుల, ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రూ.పది లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం కలిగిన పనులను టెండర్ల ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసిన అధికారులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో రూ.153.46 కోట్ల విలువైన పనులను బీఎస్సార్‌కు నామినేషన్ పద్ధతిలో అప్పగించే ఫైలుపై సీఎం చంద్రబాబే గురువారం సంతకం చేశారు. ఆ వెంటనే అంటే ఆదివారం రోజు బీఎస్సార్ సంస్థ ఆరో ప్యాకేజీలో తమకు కేటాయించిన పనులను అధీనంలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో రూ.50 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. నామాకు భారీ ప్రయోజనం.. ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.196.20 కోట్లు. ఇందులో నామా సంస్థ రూ.112.48 కోట్ల విలువైన పనులు మాత్రమే చేసింది. దీంతో 60 సీ కింద రూ.70.29 కోట్ల విలువైన పనులు తొలగించారు. అంటే నామా చేతిలో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువను ఏకంగా రూ.399.18 కోట్లకు పెంచేయించారు. ఇందులో 60 సీ కింద తొలగించిన రూ.70.29 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నామా చేతిలో మిగిలిన రూ.13.43 కోట్ల పనుల విలువను రూ.119.81 కోట్లకు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతం (రూ.192.31 కోట్లు) జరిమానాగా వసూలు చేయాల్సిందిపోయి నామాకు రూ.106.38 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. -
ఇదేంటి ‘నామా’?
సాక్షి, ఖమ్మం: టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ ఆరోపించారు. తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరించడంతో గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఈ కేసు గురించి అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలను తహశీల్దార్‌కు ఆమె సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నామా నాగేశ్వరరావు మా ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. చంపుతానని బెదిరించాడు. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేశార’ని ఆమె వాపోయారు. కాగా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
‘పోడు’కు పరిష్కారం చూపుతాం..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులను పట్టిపీడిస్తున్న పోడు భూముల సమస్యకు రానున్న తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిష్కారం చూపిస్తుందని, ఏడాదిలోపు వారి సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సైతం వెనుకాడబోమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాలంటూ 58 ఏళ్లు అవకాశం ఇచ్చినా.. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పైగా మరోసారి అవకాశం ఇస్తే అంత చేస్తాం.. ఇంత చేస్తామని అవాకులు.. చెవాకులు పేలుతున్నారని, ఇప్పటి వరకు ఏం చేశారో ప్రజలకు తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక శక్తిగా మారుతోందని, గత ఎన్నికల్లో మైనస్ ఖమ్మంగా ఉన్న టీఆర్ఎస్.. ఈ ఎన్నికల నాటికి జిల్లా రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుల వల్ల ప్లస్ ఖమ్మంగా మారి.. పది స్థానాలను దక్కించుకునే స్థాయికి ఎదిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ.. వందలాది పథకాలను ప్రవేశపెడుతుంటే.. తమకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని దారిలో పెట్టి.. ప్రజలకు అభివృద్ధి ఫలాలను చూపించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. చైతన్యం కలిగిన జిల్లా ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే అభివృద్ధి చెందుతుందో.. ఈ నాలుగేళ్లలో అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది ఎవరో ఆలోచించి అభివృద్ధి వైపు నిలవాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి స్పష్టత ఉన్న నేతలు తమ పార్టీకి ఉన్నారని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన మనిషి అని.. భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాలకు ఆద్యుడు ఆయనేనని.. ఆయన కోరిక మేరకే తమ ప్రభుత్వం వాటిని మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత తమ పార్టీదేనన్నారు. టీడీపీ ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే కాంగ్రెస్‌తో కలిసి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తోందని, అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే టీడీపీకి ఓటు వేస్తారో.. అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న టీఆర్ఎస్కు అండగా ఉంటారో.. తేల్చుకోవాల్సిన సమయం జిల్లా ప్రజలకు ఆసన్నమైందన్నారు. ఎన్నికలు రాగానే ఆయా రాజకీయ పార్టీలు అనేక విన్యాసాలు చేస్తుంటాయని, కులాలు.. మతాల పేరుతో ఓట్ల రాజకీయం చేయడానికి తాము వ్యతిరేకమని, వాస్తవాల ప్రాతిపదికనే ఓట్లు వేయాలనేది తమ విధానమని ఆయన అన్నారు. జిల్లా ప్రజల చైతన్యం ముందు ఎవరి టక్కుటమార విద్యలు నడవవు అని, డబ్బుకు, ఇతర ప్రలోభాలకు తాము లొంగబోమని స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తోంది గోబెల్స్ ప్రచారమని, ఇళ్ల నిర్మాణం అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. ఆరుమాసాలు ఆలస్యమైనా రెండు దశాబ్దాల వరకు లబ్ధిదారుడు ఇంటి గురించి చింతలేకుండా ఉండేలా నిర్మాణం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుని ప్రజల్లో కాంగ్రెస్, టీడీపీ అభాసుపాలవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. అబద్ధాలు చెప్పినా.. తమ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేసే అధికారం ప్రజలకు ఉందని, అదే అభివృద్ధి జరిగిందని ప్రజలు విశ్వసిస్తే మరోసారి ఆశీర్వదించి పార్టీకి పట్టం కట్టి.. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, తమ ప్రభుత్వ హయాంలో చనిపోయిన 2,546 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున బీమా అందిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనకు అత్యంత ఆప్తులని, మరోసారి తుమ్మలను గెలిపించుకోవడం ద్వారా జిల్లా అభివృద్ధిని పరిపూర్ణం చేసుకోవాలని ఆయన కోరారు. నామా నామాలు.. పువ్వాడ పువ్వులు.. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిస్తే జిల్లా ప్రజలకు నామాలు పెట్టడం ఖాయమని, టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను పువ్వుల్లా చూసుకుంటారని కేసీఆర్ అన్నారు. తన కొడుకు రామ్‌తో అజయ్ సమానమని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కడితే జిల్లా అభివృద్ధిలో మరింత ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు. సభలో మంత్రి, పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, గనుల కార్పొరేషన్ చైర్మన్ సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు బాలసాని లక్ష్మీనారాయణ, గడిపల్లి కవిత, బాణోతు మదన్‌లాల్, కోరం కనకయ్య, తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'మహిళలను వాడుకుని వదిలేయడం 'నామా'కు అలవాటు
-
నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతా..
-
నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతా..
సాక్షి, హైదరాబాద్: ఆయనో మాజీ ఎంపీ.. చాలా ఏళ్లపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. కానీ సభ్య సమాజానికి చెప్పుకోలేని రీతిలో ఓ మహిళను వేధించారు.. మరో మహిళను వేధించిన అంశంపై నిలదీయడంతో దాడికి దిగారు.. అసభ్య పదజాలంతో దూషించారు.. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేశారు.. గతంలో ఆయనపై కర్ణాటకకు చెందిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్సీ వేధింపుల మిగతా కేసు పెట్టడం.. ఇప్పుడా వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన మహిళ వెలుగులోకి తీసుకురావడంతో ఆ మాజీ ఎంపీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఆరోపణల్లోని ప్రజాప్రతినిధి ఖమ్మం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన బాధితురాలు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిలదీయడంతో వేధింపులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వద్ద తన నగ్న చిత్రాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, వాటిని బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మాజీ ఎమ్మెల్సీతో తాను మాట్లాడానని, నామా నాగేశ్వర్రావు పెళ్లి పేరుతో ఆమెతోపాటు చాలా మంది మహిళలను మోసం చేసినట్టుగా ఆమె చెప్పారని వెల్లడించారు. ఆమె నామాపై ఢిల్లీ కోర్టులో వేధింపుల కేసు కూడా పెట్టిందని వివరించారు. దీనిపై ప్రశ్నించడంతో తనను టార్గెట్ చేశారని, తన నగ్నచిత్రాలు బయటపెడతానని, అంతు తేలుస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే, జూలై నెలల్లో నామా నాగేశ్వర్రావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య తన ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, దాడికి దిగారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన రెండున్నర నెలలకు.. నామా బెదిరింపులపై బాధితురాలు ఆగస్టు 10వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ నెల 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నామా తనను దూషించిన సెల్‌ఫోన్ ఆడియో రికార్డులను, ఇంటికి వచ్చి దూర్భాషలాడిన వీడియోను సైతం ఫిర్యాదుకు ఆధారంగా జతపరిచినా.. నామా ఒత్తిడి కారణంగా పోలీసులు ఇంతకాలం కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నామా వేధింపులపై బాధితురాలు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు తెలుస్తోంది. నామా సోదరుడిపైనా.. బాధితురాలిని వేధించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుతోపాటు ఆయన సోదరుడు నామా సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసి రెండు రోజులైనా కేసు విషయం బయటకు పొక్కకుండా పోలీసులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి తుమ్మల పంపాండంటూ ఆరోపణలు! నామా నాగేశ్వర్రావు తన స్నేహితులకు, సంబంధీకులకు తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ చేసేందుకు తనను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంపించాడంటూ నామా ప్రతి ఒక్కరికి చెబుతున్నారని, దానిపై క్షమాపణ చెప్పాలని తాను కోరినా పట్టించుకోలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని స్పష్టం చేశారు. అసలు మంత్రి తుమ్మల తనకు పరిచయమే లేదన్నారు. -
ట్రాన్స్‌కోకు పంగ‘నామా’లు
⇒ నామా నాగేశ్వరరావు విద్యుత్ కంపెనీలకు అడ్డగోలు ప్రయోజనం ⇒ క్విడ్ ప్రో కో కోసం ఏపీ సీఎం నుంచి ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బిచ్చిన వారికి అయాచితంగా ప్రయోజనం చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీఎం బినామీగా చెప్పుకొనే నామా నాగేశ్వరరావుకు చెందిన రెండు విద్యుత్ ప్రాజెక్టులకు రూ. వేల కోట్లు దోచిపెడుతున్నారు. నెల్లూరులో ఉన్న సింహపురి, మీనాక్షి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 12 ఏళ్ల పా టు 600 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకున్నారు. వాస్తవానికి ఈ తతంగం గత నెల రోజులుగా నడుస్తోంది. అయితే, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏపీలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, కొత్తగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఏపీ ట్రా న్స్‌కో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నామా సంస్థల నుంచి విద్యుత్‌ను కొనాల్సిందేన ని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రే ట్రాన్్థకో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనివల్ల డిస్కమ్‌లపై రూ. వేల కోట్ల భారం పడనుంది. ఎక్కువ ధర... దీర్ఘకాలం ఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్‌ను 85 శాతం పీఎల్‌ఎఫ్‌తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్‌కు రూ. 4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31కోట్లు. ఏడాదికి రూ. 1,940 కోట్లు. 12 ఏళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్‌కు రూ. 23,280 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. అంటే, విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలు వస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా ఉంది. ఇప్పటికే ఏపీ డిస్కమ్‌లు రూ. 4 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. క్విడ్ ప్రో కో కోసం నామాకు దొడ్డిదారిన ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఒప్పందాలు జరిగినట్టు తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. జెన్కో ఉత్పత్తి నిలిపేసి... డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగావాట్ల సామర్థ్యంగల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో గత రెండు నెలలుగా ఒక యూనిట్లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీపీలో ప్రతీ రోజు మూడు యూనిట్లను బ్యాకిం గ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్‌ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే... నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2లకే లభిస్తోంది. అవసరమైతే జెన్కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తోంది. -
నామా వల్లే టీడీపీ నాశనం
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సాక్షి, ఖమ్మం : డబ్బు, అహంకారంతో నామా నాగేశ్వరారవు జిల్లాలో టీడీపీ నాశనం చేశాడని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏనాడు టీడీపీ కార్యకర్తల కష్టాలు ఆయన చూడలేదని అందుకే తాము టీఆర్ఎస్లో చేరుతున్న సమయంలో వారు కూడా తమ బాటే పట్టారనని అన్నారు. ఇది గిట్టక తమపై అవాకులు చవాకులు మాట్లాడితే జిల్లా ప్రజలే వారికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీలో శకుననిలా మారి పార్టీని నిర్వీర్యం చేశారనని ఆరోపించారు. జిల్లాలో సామాజిక న్యాయం పాటించకుండా తనకు వచ్చిన టికెట్ కూడా తన అనుచర నేతలకు నామా ఇప్పించుకొని కేడర్‌ను మనస్తాపానికి గురి చేశారని బాలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు.. ఎవరి ఓటమి కోసం పనిచేశారో జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఖమ్మంలో ఎవరి బంధువులు పార్టీ అభ్యర్థి ఓటమి కోసం డబ్బులు పంచారో జగమెరిగిన సత్యమని అన్నారు. ఇలాంటివన్నీ చేయించిన వారు.. జిల్లాలో పార్టీని మోసిన తమపై నిందలు మోపుతారా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు టికెట్ రాలేదని పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిని, పార్టీ అధినేత చిత్రపటాలు చించి అవమానించిన వారిని భుజానకెత్తుకుంది మీరు కాదా..? అని నామాను ప్రశ్నించారు. నీతి, నిజాయితీతో చేసినందునే తమకు జిల్లా ప్రజలు గౌరవం ఇచ్చారని, మాతో ఉన్న టీడీపీ కేడర్ మనస్ఫూర్తిగానే టీఆర్ఎస్లో చేరారని అన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు అవకాశవాదులని.. అర్థరాత్రి ముసుగులో వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గుమ్మం తొక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. ఇలాంటి అవకాశవాదులకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండాబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న వారు ఇవాళ టీడీపీలో నేతలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, మందడపు సుధాకర్, చింతనిప్పు కృష్ణచైతన్య, మదార్ సాహెబ్, జక్కంపుడి కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తుమ్మలన్నా.. ఇక షికారేనా..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో గ్రూపు గొడవలు మొదలైనప్పటి నుంచి తుమ్మల, నామా నాగేశ్వరరావు వర్గాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. అంతకుముందు టీడీపీలో తుమ్మల హవానే సాగగా.. నామా ఎంట్రీతో సీన్ రివర్సయింది. నామాకు పార్టీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం, పలుకుబడి క్రమంగా తుమ్మలను దూరం చేశాయి. పార్టీ అధినాయకునితో కూడా కొన్ని విషయాల్లో స్పర్థలు ఏర్పడ్డాయి. ఈ వివాదం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత ముదిరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల ఓటమికి పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం సర్వశక్తులొడ్డినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తన వర్గీయుడు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పాలేరు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత నామా ఒత్తిడితో అధినేత చంద్రబాబు మాట మార్చడం తుమ్మలను అవమానానికి గురిచేసినట్టయింది. తన ఓటమి, జిల్లా పార్టీలో తన మాటకు విలువలేకుండా పోవడం ఇవన్నీ చూశాక సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తుమ్మల పునరాలోచనలో పడ్డారు. ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారుతారని ఊహాగానాలు వచ్చాయి కానీ జరగలేదు. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా తుమ్మల పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకత్వం తుమ్మలతో చర్చలు జరిపిందని సమాచారం. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో తన సన్నిహితుని ఇంట్లో తుమ్మలతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జిల్లాలో ఆయన అనుచరులకు కొత్త ఊపు వచ్చినట్టయింది. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయని, తమ నాయకుడు టీఆర్ఎస్లోకి వె ళ్లిపోతున్నారన్న సంకేతాలు పార్టీ కేడర్‌కు అందడంతో వారంతా ఎక్కడిక క్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుమ్మలకు బాసటగా నిలుస్తున్నారు. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయన వెంటే... జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం తుమ్మలకు ప్రాధాన్యమిచ్చింది. ఆయన ప్రతిపాదించిన కవితకు చైర్పర్సన్ పీఠాన్ని కట్టబెట్టింది. అయినా, తుమ్మల సంతృప్తి చెందలేదని కేడర్ అంటోంది. తప్పనిసరిగా ఆయన చెప్పిన వ్యక్తికి ఇవ్వాలి కనుక ఇచ్చారే తప్ప అలాంటి పరిస్థితి లేకపోయివుంటే అధినేత నామా వైపే మొగ్గు చూపే వారని తుమ్మల వర్గం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండటం వృథా అనే అభిప్రాయానికి కూడా తుమ్మల అనుచరగణం వచ్చింది. ఆ కోణంలోనే ఇటీవలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కవిత కూడా తాను తుమ్మల వెంటే ఉంటానని బహిరంగ ప్రకటన కూడా చేశారు. వారం రోజుల క్రితం తుమ్మల పార్టీ మార్పుపై సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించగా, ఏకంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల వెంటే తానూ అని ప్రకటించడం చర్చనీయాంశమైంది. మరోవైపు నియోజకవర్గాల వారీగా తుమ్మల వర్గీయులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సోమవారం పాలేరు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లాలోని 10 మంది జడ్పీటీసీలు సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల బాటలోనే పయనిస్తామని తీర్మానించటం గమనార్హం. ముహూర్తం కూడా ఖరారైందా? తుమ్మల టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తుమ్మల త్వరలోనే జిల్లాకు వస్తారని, వెంటనే జిల్లాస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత మరోసారి కేసీఆర్‌తో మాట్లాడి తేదీలు నిర్ణయిస్తారని చెపుతున్నారు. అయితే, వచ్చే నెల 3 లేదా 5 తేదీల్లో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు వెళ్లిపోతారని ప్రచారం. ఆయన ముఖ్య అనుచరులుగా పేరున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం పార్టీ వీడరని తెలుస్తోంది. ఎమ్మెల్సీ బాలసాని మాత్రం తుమ్మల వెంటే ఉంటారని సమాచారం. వెంకటవీరయ్య అంశంపై తర్వాత నిర్ణయం జరుగుతుందని పార్టీ కేడర్ అంటోంది. ఇటీవల హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తుమ్మల చికిత్స పొందుతుండగా పరామర్శకు వచ్చిన చంద్రబాబుకు తాను పార్టీ మారే విషయం తుమ్మల చెప్పారని ప్రచారం. గులాబీ దళంలో ఇమిడేనా? జిల్లాలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో ఇమడగలరా అనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆప్యాయంగా పిలవగలిగిన సాన్నిహిత్యం ఉన్నా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఏమేరకు సహకరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారితే ఆయనకు, అనుచరులకు లభించే ప్రాధాన్యం ఎలా ఉంటుంది? మొదటి నుంచీ టీఆర్ఎస్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పటికే పార్టీ తరఫున గెలిచి ఉన్నఎమ్మెల్యే..తన చిరకాల ప్రత్యర్థితో మసలుకోవటం ఏమాత్రం ఇష్టంలేని తుమ్మల అసలు టీఆర్ఎస్లోనే చేరరు అనే ప్రచారం కూడా జరుగుతోంది. తుమ్మల పార్టీలో చేరిన వెంటనే అమాత్య పదవి ఇస్తారా..? ఎలా సర్దుబాటు చేసుకుంటారనేది కూడా ప్రశ్నగా మారింది. కానీ, టీడీపీలో ఉండడం కన్నా పార్టీ మారడమే మేలనే భావన తుమ్మల అనుచరవర్గంలో బలంగా కనిపిస్తోంది. ఒకవేళ తుమ్మల టీఆర్ఎస్లో చేరితే మాత్రం జిల్లా రాజకీయముఖచిత్రంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయవిశ్లేషకుల అంచనా. -
‘మధుకన్డ్’కావరం
గెడ్డలకు అడ్డంగా గట్లు వేస్తున్నారు. నీటి మార్గాలను మళ్లిస్తున్నారు. చెరువులు నిండకుండా అడ్డుకుంటున్నారు. అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. మధుకాన్ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. పోలవరం కాలువ తవ్వకాల కోసం గెడ్డల్ని కప్పెడుతున్నారు. రైతుల పాలిట సైంధవుల్లా తయారయ్యారు. రెండువేల ఎకరాల్లో ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేశారు. మధుకాన్ సంస్థ అధినేత టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. నక్కపల్లి: మండలంలో పోలవరం కాలువ నిర్మాణం చేపడుతున్న మధుకాన్ కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల జగన్నాథపురం, గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం, రమణయ్యపేట, డొంకాడ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లోకి నీరు చేరక పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల్లోకి వచ్చే నీటి మార్గాలకు కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయడంతో నీరు దిగువ ప్రాంతాలకు రావడం లేదు. ఫలితంగా ఆయకట్టు భూముల్లో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగేళ్లుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ తూర్పు, పడమర దిశగా తవ్వుతున్నారు. నక్కపల్లి మండలంలో ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పంట కాలువలు, కొండ గెడ్డలున్నా యి. కాలువ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఎ న్నో ఏళ్లుగా ఉన్న గెడ్డలకు అడ్డంగా మట్టి పోశా రు. వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లో పడిన నీరు దిగువకు పోయేలా మార్గాలను ఏర్పాటు చేయకపోవడంతో నీరంతా పోలవ రం కాలువలో చే రి నిలిచిపోతోంది. వందలాది ఎకరాలు ఆయకట్టు కలిగిన చెరువుల్లోకి చుక్క నీరు రావడం లేదు. జగన్నాథపురంలో పెద్ద చెరువు కింద 250 ఎకరాలు, నేరెళ్ల చెరువు కింద 120, ఉద్దండపురం పెద్దచెరువు కింద 350, గుల్లిపాడు ఈదుల చెరువు కింద 220, కొత్త చెరువు కింద 250, తిరపతమ్మ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు కురి స్తేనే ఈ చెరువులు నిండి ఆయకట్టు పొలాలు సాగవుతుంటాయి. నాలుగేళ్లుగా మధుకాన్ కాంట్రాక్టర్లు చెరువుల్లోకి నీరు రాకుండా గట్టు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల సగానికి పైగా ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. చెరవుల్లోకి నీరు వెళ్లే మార్గాలను యథావిధిగా పునరుద్ధరించాలని గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం రైతు లు ఇటీవల రెండు పర్యాయాలు మధుకాన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గతంలో పడిన వర్షాలకు చెరువుల్లో నీరు చేరితే నారు పోసేవారమని, విత్తనాలున్నా నీరులేక వేయలేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధుకాన్ కాంట్రాక్టర్లతో మాట్లాడి చెరువుల్లోకి నీరు చేరే మార్గాలను యధావిధిగా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. -
టీడీపీలో ముదిరిన వర్గపోరు
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో సార్వత్రిక ఎన్నికల చిచ్చు ఆరకపోగా మరింత రాజు కుంటోంది. పలు నియోజకవర్గాల్లో ఓటమిపై కారణాలు వెతుక్కుంటూ ఇటు నామా నాగేశ్వరరావు, అటు తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఒకరిపైమరొకరు కత్తులు దూసుకుం టున్నారు. ఖమ్మంలో నామాపై పరోక్షంగా తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలో దుమారం రేపాయి. ఈనేపథ్యంలోనే నామా వర్గం నేత, పాలేరు టీడీపీ అభ్యర్థి బేబి మద్దినేని స్వర్ణకుమారి ఏకంగా ఒకడుగు ముందుకేసి తుమ్మల కుట్రతోనే తాను ఓడిపోయినట్లు ఘాటుగా విమర్శలు సంధించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచే టీడీపీలో రెండు వర్గాలు వీధికెక్కి పరస్పర ఆరోపణలకు దిగాయి. ‘మానాయకుడి ఓటమికి మీరే కారణం’ అంటూ నామా, తుమ్మల వర్గీయులు ఎవరికి వారే బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఈసమయంలోనే ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో తుమ్మల చేసిన వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. తన ఓటమికి తీవ్ర ఆవేదన చెందుతూ ‘రాజకీయ వ్యభిచారం చేయడం నాకు చేతకాదు.., జిల్లాలో కొంతమంది నాయకులు పార్టీని భ్రష్టు పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు’.. అని పరోక్షంగా నామాను ఉద్దేశించి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి నాయకుల మధ్య అగాధం మరింత పెరిగింది. అలాగే భద్రాచలంలో తన ఓటమికి పార్టీ నాయకులే కారణమంటూ అక్కడి పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ చేసిన వ్యాఖ్యలు తుమ్మల ప్రధాన అనుచర నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను ఉద్దేశించినవే అనే చర్చ పార్టీ శ్రేణులలో జరుగుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నా అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఫణీశ్వరమ్మకు షాక్ తగిలింది. ఇది తన వైఫల్యం కాదని పరోక్షంగా పార్టీలోని తన వ్యతిరేక వర్గంపై ఈ నెపం నెట్టడంతో బాలాసాని వర్గం కూడా ఆమెపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో ఇప్పుడు ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓటమికి మీరంటే.. మీరే కారణమంటూ నామా, తుమ్మల అనుచరులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతుండడంతో అసలు జిల్లాలో పార్టీ ఏమవుతుందో అని కేడర్‌లో చర్చ జరుగుతోంది. తుమ్మలను టార్గెట్ చేస్తూ.. పాలేరు నియోజకవర్గంలో తన ఓటమికి పూర్తిగా తుమ్మల కుట్రే కారణమని అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మద్దినేని బేబిస్వర్ణకుమారి విమర్శలు గుప్పించారు. ‘నేను టీడీపీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తే.. మా పార్టీలోని తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు కావాలనే నన్ను కక్షగట్టి ఓడించారు. కనీసం ఆడబిడ్డనని కూడా కనికరించలేదు’ అంటూ సోమవారం కూసుమంచిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోరున విలపించారు. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని తుమ్మల వర్గీయులు తనను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్నారని ఆమె తుమ్మలను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు. కాగా, స్వర్ణకుమారి చేసిన వ్యాఖ్యలపై తుమ్మల వర్గం వెంటనే స్పందించింది. ఖమ్మం రూరల్ మండలంలో విలేకరుల సమావేశంలో ఆమెపై వారు విమర్శలు చేశారు. ‘నామా నాగేశ్వరరావు పార్టీలో చేరాకే పార్టీలో వర్గాలను ప్రోత్సహించారని, నామా చర్యల వల్లే బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని..అదే ఇప్పుడు పార్టీ ఓటమికి కారణమైందని, ఇందులో తుమ్మలను తప్పుపడితే సహించేదని లేదు’అంటూ తుమ్మల వర్గీయులు నామా వర్గాన్ని ఘాటుగా హెచ్చరించారు. ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం.. ఇరువురు నేతల మధ్య పోరు పరాకాష్టకు చేరుతుండడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆపార్టీ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం నెలకొంది. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే వచ్చే జెడ్పీ చైర్మన్, ఎంపీపీల ఎన్నికల్లో పార్టీకి నష్టమేనని వారు భావిస్తున్నారు. తాము విజయం సాధించిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలు దక్కించుకోక పోతే ప్రయోజనం ఉండదన్న ఆందోళన వారిలో నెలకొంది. జెడ్పీ చైర్మన్ పీఠం కోసం రెండు వర్గాల జెడ్పీటీసీ విజేతలు పోటీ పడుతుండడంతో ఈ పరిస్థితుల్లో ఇక ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదరదని ఆపార్టీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా వర్గపోరు పక్వానికి చేరడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ సర్వత్రా నడుస్తోంది. -
టీడీపీ ఓటమికి వారిద్దరే కారణం
ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయానికి ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, పాలేరు అసెంబ్లీ అభ్యర్థి స్వర్ణ కుమారి కారణమని ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు వీరవెల్లి నాగేశ్వరరావు, మద్ది మల్లారెడ్డి, ఆలుదాసు ఆంజనేయులు ఆరోపించారు. తుమ్మల వర్గీయులుగా చలామణవుతున్న వారు ముగ్గురు కలిసి ఖమ్మం బైపాస్ రోడ్డులోగల పీవీఆర్ గార్డెన్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్,పాలేరు అసెంబ్లీలో టీడీపీ ఓటమికి తుమ్మల వర్గీయులే కారణమని స్వర్ణకుమారి చెప్పడం సరికాదని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం తామంతా తుమ్మల నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. ‘‘పార్టీలో నామా నాగేశ్వరరావు చేరిన తరువాతనే వర్గాలు మొదలయ్యాయి. వర్గ రాజకీయాలను నామా ప్రోత్సహించాడు’’ అని ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మండల అధ్యక్షులుగా ఎంపిక చేయడం, పార్టీలోని ఎస్సీ.. ఎస్టీ కార్యకర్తలపై దాడులకు దిగడంతో నష్టం జరిగిందని అన్నారు. అనేకమంది కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ‘నామా’ డబ్బులిచ్చారు.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామా నాగేశ్వరరావు డబ్బులు ఇచ్చారని, తన వెంట తిరిగిన టీడీపీ కార్యకర్తలకు కనీసం ఖర్చులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘ఆయన ఎంపీగా ఉన్న కాలంలో తన కోటా కింద వచ్చిన నిధులను కేవలం తన అనుచరులకే ఇచ్చుకున్నారు. పార్టీకార్యకర్తలను విస్మరించారు’’ అని ధ్వజమెత్తారు. పార్టీ ఆదేశానుసారమే తాము పనిచేశామని, తమపై స్వర్ణకుమారి లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడంతో వారు టీడీపీకి దూరమయ్యారని అన్నారు. ‘‘ఎంపీటీసీ ఎన్నికల్లో ఖమ్మం రూరల్ మండలంలో తుమ్మల వర్గానికి గెలిచే చోట ఒక్క బీ-ఫారం కూడా ఇవ్వలేదు. దీనికి కారణం నామానే కారణం’’ అన్నారు. ‘‘పార్టీ ఓటమికి కారణమైన నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, వారి అనుచరులను అధిష్టానం సస్పెండ్ చేయాలి. లేదంటే.. మా దారి మేము చూసుకుంటాం’’ అని తెగేసి చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు రానేరు యాదగిరి, ఆలస్యం నాగేశ్వరరావు, జడల నగేష్‌గౌడ్, చంద్రారెడ్డి, బాణోత్ పంతులు, సర్పంచులు భారి వీరభద్రం, బాణోత్ శ్రీనివాస్, యల్లయ్య వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
హస్తం జోరు...ఫ్యాను హోరు...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా ఓటరు ఎప్పటిలాగే విభిన్న తీర్పునిచ్చాడు. సార్వత్రిక ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శుక్రవారం వెలువడిన ఈ ఫలితాల్లో వైఎస్సార్సీపీ-సీపీఎం కూటమికి నాలుగు అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్‌కు నాలుగు, టీడీపీ, టీఆర్ఎస్లకు ఒక్కో స్థానం చొప్పున లభించాయి. పినపాక, అశ్వారావుపేట, వైరాల్లో వైఎస్సార్సీపీ, భద్రాచలంలో సీపీఎం విజయఢంకా మోగించగా..., ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కొత్తగూడెంలో టీఆర్ఎస్, సత్తుపల్లిలో టీడీపీ విజయం సాధించాయి. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా, మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ గెలిచింది. జిల్లాలో టీఆర్ఎస్ బోణీ కొట్టగా, సీపీఐ మాత్రం ఒక్క స్థానం కూడా గెలుపొందలేకపోయింది. విజేతలు వీరే... పినపాకలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు మొదటి నుంచీ ఊహించినట్టుగానే మంచిమెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 14వేలకుపైగా ఆధిక్యం లభించింది. ఇక్కడ టీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. అశ్వారావుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందగా, ఆయనకు టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 900 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక వైరాలో కూడా వైఎస్సార్సీపీ సునాయస విజయాన్నే సాధించింది. ఇక్కడి నుంచి పోటీచేసిన బాణోతు మదన్‌లాల్ తన సమీప టీడీపీ అభ్యర్థి బాలాజీనాయక్‌పై 9వేలకుపైగా ఓట్లతో గెలుపొందారు. ఇక వైఎస్సార్సీపీతో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల బరిలో దిగిన సీపీఎంకు జిల్లాలో ఒక స్థానం దక్కింది. భద్రాచలం నుంచి సీపీఎం పక్షాన పోటీచేసిన సున్నం రాజయ్య 1800 ఓట్ల తేడాతో ఫణీశ్వరమ్మ (టీడీపీ)పై గెలిచారు. కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలలో మంచి ఫలితాలే వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలను ఆపార్టీ దక్కించుకుంది. రాంరెడ్డి వెంకటరెడ్డి (పాలేరు), మల్లు భట్టివిక్రమార్క (మధిర)లకు ప్రజలు మరోసారి అవకాశం కల్పించారు. ఇక గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన ఇల్లెందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య కల ఈసారి ఫలించింది. ఈయన తన ప్రత్యర్థి హరిప్రియ (టీడీపీ)పై 11వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు. ఇక, తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (టీడీపీ)పై విజయం సాధించారు. గత ఎన్నికలలో మూడుస్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సత్తుపల్లి నుంచి ఆపార్టీ తరఫున పోటీచేసిన సండ్రవెంకటవీరయ్య గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి మట్టాదయానంద్పై 3వేల మెజార్టీతో గెలుపొందారు. ఇక, టీఆర్ఎస్ జిల్లాలో బోణీ కొట్టింది. ఆ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో గెలుపొందింది. జలగం వెంకట్రావు టీఆర్ఎస్ తరఫున 16వేలకు పైగా ఆధిక్యంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. మన ఎంపీలు వీరే... ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు (టీడీపీ)పై 11,313 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీచేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్. కె.నారాయణ మూడోస్థానంలో నిలిచారు. భద్రాచలం, ఇల్లెందు, పినపాక అసెంబ్లీ స్థానాలు వచ్చే మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ గెలుపొందింది. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. సిట్టింగ్‌లు ఓడారు జిల్లా నుంచి గత శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. సిట్టింగ్‌లుగా ఉన్న వారిలో ముగ్గురికి మాత్రమే మరోసారి అవకాశం ఇచ్చారు ఓటర్లు. రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే మళ్లీ గెలుపొందారు. తుమ్మల నాగేశ్వరరావు, బాణోతు చంద్రావతి, కూనంనేని సాంబశివరావు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, వగ్గెల మిత్రసేన ఈసారి ఓడిపోయారు. పినపాక ఎమ్మెల్యేగా పనిచేసిన రేగాకాంతారావు అసలు ఎన్నికల బరిలోనే లేరు. అయితే, ఈసారి అనూహ్యంగా జిల్లా నుంచి మహిళలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ ఎన్నికలలో వివిధ ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న ఐదుగురు మహిళా అభ్యర్థులూ ఓటమిపాలుకాక తప్పలేదు. వీరూ కొత్తే... వారూ కొత్తే తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభకు ఎన్నికయిన ఎమ్మెల్యేలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందని, జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెపుతున్నారు. అయితే, వీరిలో ఏడుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే. గత అనుభవం ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పాయం వెంకటేశ్వర్లు, సండ్రవెంకటవీరయ్య, జలగం వెంకట్రావు, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లులు మళ్లీ గెలుపొందారు. అయితే, కొత్తగా గెలిచిన వారితో పాటు వీరు కూడా తెలంగాణ అసెంబ్లీకి కొత్తవారే కానున్నారు. ఈసారి ముగ్గురు కొత్తగా అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నారు. వీరిలో వైరా నుంచి మదన్‌లాల్, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య గత ంలో ఎన్నికల బరిలో ఉన్నా ఓటమిపాలయ్యారు. ఈసారి మాత్రం ఓటరుదేవుడి ఆశీర్వాదం లభించడంతో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక, తొలిసారి ప్రత్యక్ష బరిలో ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ తొలిప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
ఖమ్మం ఎంపీ ఎవరు?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కనుంది..? నామాకు మరో చాన్స్ వస్తుందా..? తుమ్మల వర్గం ఆయనకు సహకరించిందా..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తొలిసారి చట్టసభల్లో అడుగుపెడతారా? వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ కావడం ఖాయమా..? జిల్లా ప్రజలు జోరుగా చర్చించుకుంటున్న ఈ ప్రశ్నలకు శుక్రవారం సమాధానం దొరకనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీ పొత్తుతో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. వారిద్దరూ ఆయా పార్టీల పరంగా ఉద్దండులే. సీపీఎం మద్దతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరితో తలపడ్డారు. నామా గత ఐదేళ్లలో కావల్సినంత వ్యతిరేకతను కూడబెట్టుకున్నారని, పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోశారని, అవే ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అధినేత వద్ద పలుకుబడితో తన వర్గం వారికి పార్టీ, ఇతరత్ర పదవులు ఇప్పించుకోవడంతో దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకుని ఉంటున్నవారు నష్టపోయారని తుమ్మల నాగేశ్వరరావు వర్గం పలుమార్లు విమర్శలు చేసింది. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ విషయంలో తుమ్మల ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడం వెనుక నామా హస్తముందనే ఆరోపణలు కూడా ఆయనకు ప్రతికూలంగా పనిచేశాయంటున్నారు. ఈ ఘటన తుమ్మల, నామా వర్గాల మధ్య ఉన్న విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లిందని కూడా చెబుతున్నారు. పార్టీలో నామా మితిమీరిన జోక్యమే ఆయన కొంపముంచుతుందని ఆయన వ్యతిరేక వర్గీయుల వ్యాఖ్య. ఓవైపు రిక్త‘హస్తం’..మరోవైపు స్థానికేతరుడు..అనే ఈ రెండు అంశాలే నారాయణను పుట్టిముంచుతాయనే చర్చ సాగుతోంది. ఒకవేళ నారాయణ విజయం సాధిస్తే తమకు కొరకరాని కొయ్యలా మారుతారనే ఉద్దేశంతోనే పొత్తుపెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆయనకు సహకరించలేదనే వాదన కూడా ఉంది. నామా, నారాయణలపైనున్న వ్యతిరేకతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కలిసివచ్చే అంశమని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నింటికీ మించి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలు నెరపడం వంటి అంశాలు పొంగులేటికి అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, రాష్ట్ర నాయకురాలు షర్మిల ప్రచారం కూడా శీనన్నకు శ్రీరామ రక్షగా మారుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ అంచనాల్లో ఏది నిజమో..ఏది కాదో నేడు తేలనుంది. ఎడతెగని ఉత్కంఠకు తెరపడనుంది. -
హాంఫట్..
సాక్షి, ఖమ్మం: ప్రజలకు ఉపయోగపడాల్సిన కేంద్రప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయి...పనులన్నీ అయినవారికే అప్పగించడంతో వారు నాణ్యతను గాలికి వదిలి ఎంచక్కా నిధులు ఫలహారం చేశారు....తూతూమంత్రంగా సాగిన పనులు నామరూపాలు లేకుండా పోతున్నాయి... ఎంపీ నామా నాగేశ్వరరావు కోటా కింద విడుదలైన నిధులు ఇలా దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ఏటా కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ కింద లోక్‌సభ ప్రజా ప్రతినిధులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తుంది. అవసరమున్న చోట సీసీ, మట్టి రోడ్లు, చేతి పంపులు, అదనపు తరగతి గదులు, బస్ షెల్టర్ల నిర్మాణం కోసం ఎంపీలు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం వీటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఇలా ఒక్కో ఎంపీ కోటా కింద ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఐదేళ్లకు మొత్తం రూ.25 కోట్లు మంజూరు చేస్తుంది. ఖచ్చితంగా ఈపనుల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ నామా నాగేశ్వరరావు తన కోటాకింద మంజూరైన పనులన్నీ తన అనుంగు నేతలకే అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఈ పనులతో చేసిన నిర్మాణాలు ప్రస్తుతం నామరూపాలు కనిపించడంలేదు. నాణ్యత లేని పనులు చేసి నామా అనుచరులు రూ.కోట్లలో నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో నామా కోటా కింద పలుపనులు జరిగాయి. ఈ ఐదేళ్లలో చేసిన మొత్తం 1,267 పనులకు గాను రూ.16.50 కోట్లు విడుదలయ్యాయి. మధిర మండల పరిధిలోని మాటూరు ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులతో ఇటీవల కల్వర్టు నిర్మించారు. అయితే నాణ్యత లేకుండానే ఈ నిర్మాణం జరిగిందనే విమర్శలున్నాయి. అలాగే అశ్వారావుపేటలోని చిన్నంశెట్టిబజార్, పాకలగూడెం, వినాయకపురం కాలనీ, దురదపాడులో గ్రావెల్ రోడ్ల నిర్మాణంలో నామా అనుచర నేతలు అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. పాలేరు, మధిర, కొత్తగూడెం,వైరా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ నిధులతో పనులు మమ అనిపించి నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపాదనలు.. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కోటాగా కేంద్రం విడుదల చేసే రూ.25 కోట్లలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.16.50 కోట్లు నామా మంజూరు చేయించుకున్నారు. ఇంకా రూ.8.50 కోట్లకు హడావుడిగా రెండు నెలల క్రితం ప్రతిపాదనలు పంపించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు పనులను కేంద్రానికి నివేదించారు. ఎన్నికల్లో తనకు సహకరించే అనుచర నేతలకు నజరానాగా ఈ పనులను అప్పగించేందుకు సదరు నేతలకు ఇప్పటికే నామా హామీ ఇచ్చారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చేసిన పనుల్లో నాణ్యత కొరవడగా... మిగిలిన నిధులతో చేసే పనులను కూడా తన అనుచరులకే అప్పగించేలా నామా చక్రం తిప్పారు. నామా నిధుల కింద జిల్లాలో చేతి పంపులు ఏర్పాటు చేయించినా ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. సీసీరోడ్లది కూడా ఇదే పరిస్థితి. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఎంపీగా నామా దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏజెన్సీలో గిరిజనులకు మంచినీటి బాధలు తప్పడం లేదు. -
పాలేరు షుగర్స్‌కు పంగ‘నామా’లు!
సాక్షి, ఖమ్మం: టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీలో కీలక వ్యక్తి అయిన ప్రస్తుత ఖమ్మం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నామానాగేశ్వరరావు జిల్లా రైతాంగానికి బాగానే నామాలు పెట్టారని బాధితులు మండిపడుతున్నారు. బాబు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని అప్పనంగా జిల్లాలోని పాలేరు షుగర్స్‌ను అతి తక్కువ ధరకే కొట్టేశారని.., ప్రజా సంక్షేమం గాలికొదిలి తన కోటరి ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వాన్ని దివాళా తీయించిన బాబు కూడా నాడు నామాకు వెన్నుదన్నుగా నిలవడంతో రైతుల భాగస్వామ్యంతో రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులతో కళకళలాడిన రూ.వందల కోట్ల విలువ చేసే పాలేరు షుగర్స్ కేవలం రూ. 9.50 కోట్లకే నామాకు ధారాదత్తం అయిందని అంటున్నారు. ఈ తతంగంలో నష్టపోయిన బాధితులను ఎవరైనా కదిలిస్తే కన్నీళ్లపర్యంతమవుతూ ఆ చేదు అనుభవాలను వివరిస్తున్నారు. చరిత్ర ఘనం.... జిల్లాలో నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో రైతుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ‘ది పాలేరు కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ ’ ఏర్పాటు చేసింది. 148 ఎకరాలలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి అప్పటి క లెక్టర్ పిఆర్కెవి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం 1984లో క్రషింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీకి 6 పాలకవర్గాలు పని చేశాయి. ఫ్యాక్టరీలో ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 500 మంది కార్మికులు ఉపాధి పొందుతూ సుఖసంతోషాలతో జీవించారు. ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో పరిసర ప్రాంతాల్లో 104 గ్రామాలకు చెందిన 3,600 మంది రైతుల నుంచి ఒక్కొక్కరి వాటాధనం కింద అప్పట్లోనే మొత్తం రూ. 1.20 కోట్లు వరకు వసూలు చేసి నిర్మాణానికి ఉపయోగించారు. చాలా ఏళ్లు ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో పని చేసిన కార్మికులు, ఉద్యోగులు ఆనందంగా గడుపుతూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్నారు. ఫ్యాక్టరీ తమదనే భావనతో కార్మికులు, ఉద్యోగులు కష్టపడిపని చేశారు. లాభాల్లో ఉన్నా.. నష్టాలు చూపుతూ.. ఈ ఫ్యాక్టరీపై చంద్రబాబు కోటరీ కన్ను పడింది. దీన్ని ఎలాగైనా తమపరం చేసుకోవాలనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే నష్టాలను చూపించి ప్రైవేట్‌కు అప్పగించేలా చేయాలనుకున్నారు. అంతే బాబుపాలనలో ఆపనులు చకచకసాగాయి. పాలేరు షుగర్స్ నష్టాలలో లేకున్నా ఓ పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం కాగితాల్లో నష్టాలను చూపించింది. అనవసర ఖర్చులు, దుబారా ఖర్చులు చూపిస్తూ పథకం ప్రకారం నష్టాల బాట పట్టించారని ఇప్పటికీ నాడు ఫ్యాక్టరీలో పని చేసిన కార్మికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు.. నామాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంతో గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీ విక్రయం జరిగింది. రూ. వందల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీని రూ.9.50 కోట్లకే బాబు తాను అనుకున్నట్లు నామాకే అప్పగించారు. ఇది తెలిసి అప్పట్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. వారి ఆందోళనను ప్రభుత్వం అప్పట్లో పెడచెవిన పెట్టింది. రోడ్డున పడ్డ కార్మికులు, ఉద్యోగులు.. 2002లో మధుకాన్ సంస్థ పాలేరు షుగర్స్‌ను టేకోవర్ చేసుకుంది. ఆ సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేయగా అంద రికీ మధుకాన్‌లో ఉద్యోగాలు ఇస్తామని అప్పట్లో కార్మికుల సమక్షంలో సంస్థ అధినేత అయిన నామా నాగేశ్వరరావు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 200 మంది ఉద్యోగులు, మరో 500 మంది ఎన్‌ఎంఆర్‌లుగా అప్పట్లో పాలేరు కో-ఆపరేటివ్ షుగర్స్‌లో పనిచేసేవారు. నామా ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట నీటి మూటే అయింది. ఫ్యాక్టరీ ముందు కార్మికులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. స్థానికులకు కాకుండా అయిన వారికే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతంలోనే అప్పటి కార్మికులు హోటల్ నిర్వహిస్తూ, ఆటోలు నడుపుతూ, వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలేరు షుగర్స్‌ను మధుకాన్ టేకోవర్ చేసుకున్నా నేటికీ కార్మికులకు 3 ఏళ్ల బోనస్ ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెట్టింది. రైతుల నోట్లో మట్టి కొట్టి.. పాలేరు షుగర్స్‌ను చూసి అప్పట్లో రైతులు మురిసిపోయారు. తమ వాటా ధనంతో నిర్మించిన ఫ్యాక్టరీలో లాభాలు వస్తే తమకు అవి దక్కుతాయని ఆశించిన వారి కలలు కల్లలయ్యాయి. చంద్రబాబు నిర్ణయంతో ఈ ఫ్యాక్టరీని నామా కారుచౌకగా కొట్టేసి రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. తమ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మిస్తుండడంతో అప్పట్లో ఈప్రాంతానికి చెందిన 3,600 మంది రైతులు తమ వాటాధనంగా సుమారు రూ.1.20 కోట్లు వాటా ధనంగా చెల్లించారు. అయితే మధుకాన్ సంస్థకు పాలేరు షుగర్స్‌ను కట్టబెట్టినా ఇప్పటి వరకు రైతులకు మాత్రం వారి వాటాధనం తిరిగి ఇవ్వలేదు. కొంతమంది రైతులు అప్పట్లో వాటా కోసం ఆనాడు భూమి పట్టా పుస్తకాలు తనఖా పెట్టి మరీ షేర్లు తీసుకున్నారు. నామా చేసిన నిర్వాకంతో ఓవైపు నాటి కార్మికులు రోడ్డున పడగా.. రైతుల వాటా ధనంపై మాత్రం నోరు విప్పడం లేదు. -
టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న తమ్ముళ్లు
చిన్నకోరుకొండి (కల్లూరు), న్యూస్‌లైన్: చిన్నకోరుకొండి గ్రామ టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పార్టీ పార్లమెంట్-అసెంబ్లీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ఈ గ్రామానికి వచ్చారు. వీరిని పార్టీ స్థానిక నాయకులు సహకరించకపోగా.. అడ్డుకున్నారు. ఈ పరిణామంతో వారిద్దరూ (నామా, సండ్ర) ప్రచారం పూర్తిచేయకుండానే వెనుదిరిగారు. ఈ గ్రామ టీడీపీ నాయకులు యాసా రామకృష్ణ (సర్పంచ్)... నామా వర్గంలో, చావా వెంకటేశ్వరరావు (సొసైటీ అధ్యక్షుడు).. తుమ్మల వర్గంలో ఉన్నారు. సొసైటీ, పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య వర్గ పోరు సాగుతోంది. నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య కలిసి ఎన్నికల ప్రచారం కోసమని ఆదివారం ఇక్కడకు వచ్చారు. వీరి ప్రచార రథం గ్రామంలోకి రాగానే.. దాని పైకి యాసా రామకృష్ణ ఎక్కారు. ఇది చూసిన చావా వెంకటేశ్వరరావు అనుచరులు భగ్గుమన్నారు. ఆయన రథం ఎక్కడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో- యాసా రామకృష్ణ, చావా వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం, ఘర్షణ నెలకొంది. ఈ పరిస్థితిలో, తమ ప్రచారం సవ్యంగా సాగదని భావించిన నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య.. గ్రామంలో ప్రచారం చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తరువాత, సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే పక్కనున్న తెలగవరం గ్రామంలో ప్రచారానికి వెళ్ళారు. -
ఈతీరేంది భాయి.... చెప్పేద్దాం గుడ్‌బై!
రాజీనామా బాటలో తెలుగుతమ్ముళ్లు సాక్షి, ఖమ్మం,జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు రాజీనామా బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలే ఈపరిస్థితులకు దారితీస్తున్నాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఆయన తీరుతో విసుగుచెంది కొంతమంది ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొంత మంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సీటు రాకుండా అడ్డుకున్నారని ఏకంగా ఆపార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో పొత్తుతో మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి. జిల్లా టీడీపీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఏకస్వామ్య పోకడలతో పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టికెట్ వచ్చినా బీ-ఫాం ఇవ్వకుండా నామానే అడ్డుకున్నారని బాలసాని ప్రకటించినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలో నామా పెత్తనంపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని పాల్వంచలో ఆవర్గం నేతలు నామా పర్యటనకు అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తును విభేదిస్తూ మైనారిటీ నేతలు రోజుకొకరు రాజీనామాలు ప్రకటిస్తూనే ఉండడం గమనార్హం. ఈ పొత్తును నిరసిస్తూ ఖమ్మం పట్టణంలో నామా వర్గానికి చెందిన మహబూబ్అలీ, ఫయాజ్, రియాజ్, బడే సాహెబ్‌తో పాటు మరికొంత మంది ఇప్పటికే రాజీ నామా చేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అంటేనే మైనారిటీలు మండిపడుతున్నారు. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తన వర్గం అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన తీరును నిరసిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పాలేరులో సామాజిక వర్గం చిచ్చు.. పాలేరు నియోజకవర్గంలో పార్టీ మండల బాధ్యతలు ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. నాలుగు మండలాల పార్టీ బాధ్యతలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీలో చిచ్చు రేపింది. దీనికి అంతటికి కారణం నామానే అని ఇతర సామాజిక వర్గం నేతల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఈ కీలక సమయంలో నామా తన వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదని కూసుమంచి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన బాటలోనే నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది నేతలు పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండలంలో పార్టీ పరంగా గుర్తింపు ఉన్న మరోనేత రెండు, మూడు రోజుల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. పాలేరు సీటు తన అనుచరురాలికి ఇప్పించుకోవడం, బాలసాని టికెట్ విషయంలో రచ్చ జరిగాక కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ నేతలను పట్టించుకోకపోవడం ఆగ్రహం తెప్పించి వారంతా పార్టీకి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారు. రాజీనామా యోచనలో నామా శిబిరం విద్యావేత్త..? నామా శిబిరం నేతగా ఉన్న ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా అనుచర నేతగా గతంలో ఆయన గెలుపునకు కృషి చేసినా.. తనను పట్టించుకోకుండా ఆయన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న ఆవేదనలో సదరు విద్యావేత్త ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు చివరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. సహకారం లేనట్లేనా...? నామా ఎంత బుజ్జగించినా సహకరించేది లేదని బీసీలతో పాటు ఆయనపై వ్యతిరేకత ఉన్న ఇతర సామాజిక వర్గం నేతలు, మైనారిటీలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే గత ఐదేళ్లలో పార్లమెంటరీ నేతగా తమకు చేసింది ఏమీ లేదని, ఒక సామాజిక వర్గానికే అన్ని చేశారని బీసీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని, అదే జరిగితే విదేశాలకు వెళ్లి ఆయన వ్యాపారాలు చూసుకుంటారని, కేడర్‌ను పట్టించుకోరని ప్రస్తుతం పార్టీలోని ఆయన వ్యతిరేక శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలతో నామా ఏమేరకు గట్టెక్కుతారో అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్రావు
టీడీపీ నేత నాగేశ్వర్రావుపై నారాయణ విసుర్లు కుక్కునూరు,న్యూస్‌లైన్ : ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ప్రజలకు ఇప్పటికే మూడు పంగనామాలు పెట్టాడని, కార్పొరేట్ సంస్థల పేరుతో బ్యాంకులకు రూ.450 కోట్లను ఎగ్గొట్టిన అతను, అదే సంఖ్యలో ప్రజలకు నామాలు పెడతాడని ఖమ్మం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణ కుక్కునూరులో ప్రసంగించారు. సీపీఐ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముంపుప్రాంతాల సమస్యను అసెంబ్లీ, పార్లమెంట్లో వినిపిస్తామని తెలిపారు. పోలవరం ముంపు భూములకు ఎకరాకు రూ.10 లక్షలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద, నిర్వాసిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ, సీపీఎంలు రెండుకళ్ల సిద్ధాంతాలను పాటిస్తున్నాయని నారాయణ విమర్శించారు. -
తుమ్మలకు ''నామా''లు
-
సందడే సందడి...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరిరోజైన బుధవారం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గ కేంద్రాలు పార్టీల ర్యాలీలు, డప్పుచప్పుళ్లు, నినాదాలతో హోరెత్తిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నుంచి టికెట్టు ఆశించి భంగపడిన వారు, పలువురు ఇండిపెండెట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి మదన్‌లాల్, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నుంచి డాక్టర్ రవిబాబు నాయక్, సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్టా దయానంద్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీర్యాలీలు నిర్వహించి సందడి చేశాయి. కాగా, జిల్లా కేంద్రమైన ఖమ్మంలో నామినేషన్ల దాఖలుకు చివరిరోజున అగ్రనాయకులంతా నామినేషన్లు వేశారు. ఖమ్మం పార్లమెంటుకు... సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున పువ్వాడ అజయ్‌కుమార్, టీఆర్ఎస్ నుంచి ఆర్జేసీ కృష్ణ తదితరులు నామినేషన్లు వేయడంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. అయితే, నామినేషన్ల దాఖలు సమయంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన కొరవడినట్టు కనిపించింది. సీపీఐ తరపున ఎంపీ, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయా పార్టీల నేతలనే వెంట తీసుకెళ్లి నామినేషన్లు వేశారు. నారాయణ దాఖలు చేసే సమయంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. టీడీపీ ఎంపీ అభ్యర్థి నామా కూడా తన వర్గం నేతలను మాత్రమే వెంటబెట్టుకువెళ్లి నామినేషన్ వేశారు. తుమ్మల వర్గీయులెవరూ వెళ్లలేదు. అయితే, ఆయన మాత్రం స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి తన చేతుల వీదుగా పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం గమనార్హం. నామినేషన్ల చివరి రోజు హైలైట్స్ తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన నామా నాగేశ్వరరావుపై బాలసాని అనుచరులు ఫైర్ అయ్యారు. మానాయకునికి టికెట్ రాకుండా చేశావంటూ ఆయనను దూషించారు. ఇంటికి వెళ్లినా బాలసాని ఆయనను కలవలేదు. దీంతో చేసేదేమీలేక నామా వెళ్లిపోయారు. ఇల్లెందు టీడీపీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధినేత అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ మారి మళ్లీ బరిలో నిలిచారు. సత్తుపల్లి నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి వెంట జలగం వెంకట్రావు వర్గీయులెవరూ కనిపించలేదు. రవి మాత్రం జలగం వెంగళరావు విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ సమర్పించారు. భద్రాచలంలో టీఆర్ఎస్ అభ్యర్థి మారిపోయారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన జాబితాలో అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థినిగా ఝాన్సీరాణి పేరును ప్రకటించారు. కానీ బీ-ఫాం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన మానె రామకృష్ణకు ఇచ్చారు. దీంతో ఝాన్సీరాణి విలేకరుల ఎదుట తన ఆవేదనను వెళ్లబుచ్చారు. ఇల్లెందులో అత్యధికంగా రెబల్స్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి 8 మంది, టీడీపీ నుంచి ఆరుగురు, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెబల్స్‌గా ఉన్నారు. మధిరలో నామినేషన్లు వేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మల్లుభట్టి విక్రమార్క రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. ఖమ్మం పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్ర అభ్యర్థి చెరుకూరి నాగార్జునరావుపై తెలంగాణవాదులు దాడి చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ తరపున ఎలా నామినేషన్ వేస్తావంటూ ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాలేదు. రేణుక, అజయ్‌లు ర్యాలీలో ఉన్నా నామినేషన్ వేసే సమయంలో లేరు. సొంతపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కూడా నారాయణ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. టీడీపీకి చెందిన మాళోతు రాందాసు నాయక్ వైరా, కొత్తగూడెం రెండు స్థానాల్లో రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. -
టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ
-
టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ
ఖమ్మం జిల్లాలో టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ముందుగా కొత్తగూడెం స్థానానికి తన పేరు ప్రకటించి, ఆఖరి నిమిషంలో తనకు మొండిచేయి చూపడంతో ఆ పార్టీ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో జిల్లాలో అన్ని స్థానాలను దాదాపుగా ఒకే సామాజికవర్గానికి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై విమర్శలు సంధించారు. తనను కాదని కోనేరు సత్యనారాయణకు బీ ఫారం కూడా ఇచ్చేసినట్లు తెలియడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయం తెలిసిన నామా నాగేశ్వరరావు, ఎలాగోలా బాలసానిని బుజ్జగించి తన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తీసుకెళ్లాలని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలసాని వర్గీయులు నామా రాకను అడ్డుకున్నారు. రెండు వర్గాల నాయకులు బాహాబాహీ తలపడ్డారు. దీంతో బాలసాని లక్ష్మీనారాయణ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
‘దేశం’లో పాలేరు తుపాను
సాక్షి, ఖమ్మం: ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే తుమ్మలనాగేశ్వరరావు ఖమ్మం వదిలి పాలేరుకు పయనమవుతున్నారని ఇటీవల తెలుగుదేశం పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖమ్మంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న ఆయన చివరకు పాలేరునే ఎంచుకొని ముందుకు కదిలే విధంగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో ఎవరు ఎటు..? అన్నది ఆపార్టీలో గందరగోళంగా మారింది. కాగా, తుమ్మలను పాలేరుకు రానివ్వకుండా కట్టడి చేసి అక్కడ తన అనుచరురాలైన మద్దినేని బేబిస్వర్ణకుమారి టికెట్ ఇప్పించాలన్న యోచనలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. నామా ఎత్తులకు తుమ్మల పైఎత్తులు వేస్తుండడంతో వర్గపోరు ఆపార్టీలో తార స్థాయికి చేరింది. శనివారం ఖమ్మంలో మీట్ ది ప్రెస్‌లో విలేకరులకు అడిగిన ప్రశ్నకు నామా సమాధానమిస్తూ స్వర్ణకుమారి అభ్యర్థిత్వంపై కుండబద్దలు కొట్టారు. ‘ఆమె క్లాస్ 1 అధికారిణి.. బాబు పిలుపుతో టీడీపీలోకి వచ్చారు. ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఒకప్పుడు పాలేరు నియోజకవర్గంలో టీడీపీ బలంగా లేదు. ఆమెకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాక పార్టీ బలోపేతం అయింది. ఆమె కష్ట పడింది. ఆమెకు అవకాశం ఇవ్వాలి కానీ... అక్కడికి పోవాలని ఎవరైనా అనుకోవడం తప్పు..’ అని ఆయన పరోక్షంగా తుమ్మలను తప్పుబట్టారు. అంతేగాకుండా జిల్లాలో ఉన్న వర్గపోరుపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ‘తమ కుటుంబం అంతా కలిసే ఉంటుందని, తాను వచ్చాకే కొత్తగూడెంలో నేతల మధ్య ఉన్న విభేదాలు సమసి పోయాయని.. తాను కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, ఇతరులకు కూడా ఆ మనస్తత్వం ఉండాలి’ అని పరోక్షంగా తుమ్మలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తుమ్మలను టార్గెట్ చేసుకునే ఆయన మీట్ ది ప్రెస్‌లో పాలేరు సీటు విషయమై తన అనుచరురాలికే ఇవ్వాలన్న వాదాన్ని బహిర్గతం చేసినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. తుమ్మల క్యాంపు కార్యాలయంలో హంగామా.. నామా వ్యాఖ్యలు మీడియాలో ప్రసారం కావడంతో ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలానికి చెందిన తుమ్మల వర్గీయులు మూడు వందలమందికి పైగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ వ్యాఖ్యలపై తీవ్రంగా నిరసన తెలిపారు. తుమ్మల ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నినాదాలు చేశారు. కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకొని తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. బాలసాని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన తుమ్మలపై నామా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది నామా నిర్ణయించడమేంటని మండిపడ్డారు. అంతేగాకుండా ఖమ్మం పార్లమెంటుకు తుమ్మల పోటీ చేయాలని ప్రస్తావించడంతో కార్యకర్తలు కూడా అదే నినాదాన్ని సమావేశంలో ఎత్తుకున్నారు. క్యాంపు కార్యాలయం వేదికగా తుమ్మల వర్గం నామాను తూర్పార బట్టింది. తనకు చంద్రబాబు దగ్గర ఉన్న చనువుతో జిల్లా పార్టీని ఒంటి చేతితో నిలబెట్టిన తుమ్మలను నామా అణగదొక్కుతున్నారని, ఈ పరిస్థితులను సహించమని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించారు. తుమ్మల మాట్లాడుతూ నామా వ్యవహారాన్ని ఏమీ ప్రస్తావించకుండా ఎక్కడ పోటీ చేస్తానన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్లమెంటు రేసులో...అంటూ.... నిన్నటి వరకు పాలేరు వైపే తుమ్మల పయనిస్తారని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నామా తాజావ్యాఖ్యలతో ఎంపీ సీటుకు రేసులో ఉన్నానని తుమ్మల వ్యూహాత్మకంగా తన అనుచరులతో చెప్పించారని పార్టీ నేతలు గుసగుస లాడుతున్నారు. అవసరమైతే ఈ నినాదాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లి.. నామాను ఇరకాటంలో పెట్టాలన్న యోచనలో ఆయన వర్గం ఉన్న సమాచారం. మొత్తంగా ఈ పరిణామాలతో టీడీపీలోని రెండు వర్గాల మధ్య అగాధం మరింతగా పెరిగింది. -
నామాపై బాలసాని ఫైర్
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగు ‘తమ్ముళ్లు’ మరోసారి వీధి పోరాటాలకు దిగారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తుమ్మల వర్గీయులు మరోసారి బహిరంగ విమర్శలకు దిగారు. తుమ్మలకు టికెట్ అడుక్కోవాల్సిన అవసరం లేదని, నిన్నగాక మొన్న వచ్చిన నాయకుల పెత్తనమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంనగరంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయానికి శనివారం 300 మంది కార్యకర్తలు చేరుకున్నారు. తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాత్రేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ స్థాపించిన సమయంలో జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ ఉందని, ఈ 33 సంవత్సరాలుగా పార్టీని నడిపి బలమైన శక్తిగా తయారు చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని అన్నారు. మంత్రిగా పని చేసిన కాలంలో తుమ్మల జిల్లాలోని 46 మండలాల్లో అభివృద్ధి పనులు చేశారని, అందుకు గుర్తుగా ప్రతీ గ్రామంలో శిలాఫలకాలు ఉన్నాయని అన్నారు. తెల్దారుపల్లి, మొద్దులపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలు కట్టింది ఎవరో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ అడుక్కోవాల్సి వస్తే ఇంక విలువేముందని ప్రశ్నించారు. అయన చేసిన అభివృద్ధికి జిల్లాలో ఎక్కడి నుంచి అయిన పోటి చేసే అర్హత ఉందన్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని స్వర్ణకుమారికి అన్యాయం చేస్తున్నాడని ఎంపీ నామా పరోక్షంగా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీలో ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని, స్వర్ణకుమారికి అన్యాయం చేసింది నామానేనని ఆరోపించారు. ఉద్యోగం చేసుకుంటున్న స్వర్ణకుమారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించింది తుమ్మల నాగేశ్వరరావేనని గుర్తు చేశారు. అప్పట్లో రేణుకాచౌదరిపై ఆమె కేవలం 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వర్ణకుమారి స్థానాన్ని నామా నాగేశ్వరరావు లాక్కుని ఆమెకు అన్యాయం చేశారని అన్నారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడలేదని అన్నారు. సీటు కావాలంటే హైదరాబాద్‌లో ఉండి పైరవీలు చేసుకోవచ్చిని, కానీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏజెన్సీలో ప్రచారం చేస్తున్నామని అన్నారు.తుమ్మలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అదే జరిగితే ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు ఏడు నియోజవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాస్తామని అన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తా : తుమ్మల ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయని, కార్యకర్తలు వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు.కానీ దానిని నిర్ణయించే శక్తి తన చేతుల్లో లేదని, పార్టీ అధినేత నిర్ణయించాల్సిందేనని అన్నారు. అధిష్టానం ఆదేశించిన విధంగా తాను ముందుకు పోతానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గాజుల ఉమామహేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వర్లు, మదార్‌సాహెబ్, భీరెడ్డి నాగ చంద్రరెడ్డి, రాయపూడి జయకర్, హన్మంతరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. పాలేరు శాససనభ నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని జిల్లా శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరడాన్ని స్థానిక ఎంపి నామా నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలో తప్పు పట్టారు. పాలేరు టికెట్ ఎప్పటి నుంచో స్వర్ణకుమారి ఆశిస్తున్నారని ఈ సందర్బంగా నామా గుర్తు చేశారు. ఆమెకు పాలేరు టికెట్ ఇవ్వడమే సముచితమన్నారు. అయితే పాలేరు టికెట్ ఆమెకు దక్కకుండా తానే దక్కించుకోవాలని తుమ్మల ఆరాట పడుతున్నారని నామా ఆరోపించారు. తుమ్మల అలా చేస్తే ఓ ఆడబిడ్డకు అన్యాయం చేసినట్లే అవుతుందని నామా నాగేశ్వరరావు విమర్శించారు. -
ఖమ్మం టీడీపీలో ‘డబ్బుల’ లొల్లి
ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. ఇన్నాళ్లూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల వర్గాలుగా విడిపోయి అంతర్గంతగా కుమ్ములాడుకున్న తెలుగు తమ్ముళ్లు అందులోభాగంగానే ఇప్పుడు ‘ఆర్థిక’ పోరాటానికి తెరలేపారు. నామాకే మళ్లీ ఖమ్మం ఎంపీ టికెట్ ఖరారు కానున్న నేపథ్యంలో.. ఆ పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన ఆర్థికసాయం చేయాల్సిందేనని ఎమ్మెల్యే ఆశావాహులు పట్టుపడుతున్నారు. అయితే, దీనికి నామా నాగేశ్వరరావు మాత్రం అంగీకరించడం లేదని పార్టీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆర్థిక సర్దుబాటుపై తుమ్మల, నామా వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. సత్తుపల్లిలో.. ఆర్థిక పొరపొచ్చాలు తాజాగా సత్తుపల్లి నగర పంచాయతీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య ఆర్థిక పొరపొచ్చా లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకటవీరయ్య (తుమ్మల వర్గం) మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వశక్తులు ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. అయితే, ఖమ్మం ఎంపీగా ఉన్న నామా కూడా ఈ ఎన్నికలలో సత్తుపల్లి మున్సిపాలిటీకి ఆర్థిక సాయం చేస్తారని ఎమ్మెల్యేతోపాటు మున్సిపల్ అభ్యర్థులు, స్థానిక నాయకత్వం ఆశించింది. కానీ నామా మాత్రం డబ్బులు పంపలేదని సమాచారం. చివరి నిమిషంలో కొంత డబ్బు పంపినా.. తాము అడిగినంత పంపలేదన్న కారణంతో ఆ డబ్బును తిరిగి పంపించి వేశారని, అప్పటికప్పుడు స్థానిక నాయకత్వం చందాలు వేసుకుని తగినంత సొమ్ము సమకూర్చుకుందని సత్తుపల్లిలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామాపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నగదు పంపిణీలోనూ గ్రూపు రాజకీయం ఖమ్మం జిల్లా టీడీపీలో ఉన్న వర్గపోరు కారణంగా ఈసారి ఆర్థికసాయం కూడా గ్రూపు రాజకీయాలపైనే ఆధారపడి ఉంటుం దని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నామా, తుమ్మల ఇద్దరూ ఒకరి ఓటమి కోసం మరొకరు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని, ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ అనుచరులుగా ఉన్న వారికి ఏ గ్రూపునకు ఆ గ్రూపే ఆర్థిక సాయం చేసుకుంటారని అంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ పరిధిలోనికి వచ్చే ఏడుస్థానాల్లో పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో తుమ్మల వర్గం అభ్యర్థులు బరిలోఉండే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఆ ముగ్గురికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక సాయం చేయకూడదని, చివర్లో మొక్కుబడిగా కొన్నినిధులు పంపితే సరిపోతుందనే భావనలో నామా వర్గీయులున్నట్టు సమాచా రం. దీన్ని తుమ్మల వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం ఎంపీగా గెలవాలంటే అన్ని నియోజకవర్గాల ఓట్లు అవసరమని, అలాంటప్పుడు తమను పక్కన ఎలా పెడతారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీలో మొదలైన ఈ డబ్బుల లొల్లి ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో కీలకం
ఖమ్మం, న్యూస్‌లైన్: హస్తినలో ఖమ్మం స్థానబలం దృఢంగానే ఉంది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎంపీలుగా గెలిచినవారు కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే కేంద్రమంత్రులు..లేదంటే కీలకనేతలుగా వ్యవహరిస్తున్నారు. నాడు లక్ష్మీకాంతమ్మ మొద లు నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీపై ప్రత్యేకమైన చర్చ సాగుతోంది. ఉద్యమాల ఖిల్లా, రాజ కీయ చైతన్యవంతమైనదిగా పేరుతెచ్చుకున్న జిల్లా నుంచి పార్లమెంట్‌కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఏ పార్టీ వారైనా.., ఏ నాయకుడైనా ఖమ్మం ఎంపీ అంటే పార్లమెంట్లో గుర్తింపు పొందిన వారుగా ఉండటం పరిపాటిగా మారింది. ఈ సారి ఎన్నికయ్యే ఎంపీ కూడా ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తారనే చర్చ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులుగా ప్రత్యేక ముద్ర జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా కొనసాగారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచిన రంగయ్యనాయుడుకి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి ఎన్నికైన రేణుకాచౌదరికి కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడం గమనార్హం. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో కొంతభాగం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. దీనికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో పోరిక బలరాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా అనూహ్యంగా కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా ఆయన మన్మోహన్సింగ్ మంత్రి వర్గంలో పనిచేశారు. ఢిల్లీలో ‘కీ’రోల్... ఖమ్మం నుంచి ఎంపీలుగా గెలుపొందిన కొందరు కేంద్రమంత్రులైతే మరికొందరు ఢిల్లీస్థాయిలో కీలకభూమిక పోషిస్తున్నారు. లక్ష్మీకాంతమ్మ, జలగం కొండల్రావు పార్లమెంట్లో తమ వాణిని బలంగా వినిపించారు. సీపీఎం నుంచి ఎన్నికైన తమ్మినేని వీరభద్రం ఆ పార్టీ తరఫున తన మార్కును ప్రదర్శించారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్లమెంటరీ నేతగా కొనసాగడం విశేషం. అదే దారిలో పొంగులేటి శీనన్న..! లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదేబాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున లోక్‌సభ తొలి అభ్యర్థిగా మార్చి 5వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘శీనన్నను కేంద్రమంత్రిని చేస్తాను’ అని ప్రకటించడం దీనికి సూచికగా చెబుతున్నారు. -
నామాపై తమ్ముళ్ల గుస్సా...
పాల్వంచ,న్యూస్‌లైన్: టీడీపీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నోరుమెదపని కోనేరు చిన్ని(సత్యనారాయణ)ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు తుమ్మల, నామా వర్గాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ కోనేరు చిన్ని ఒంటెత్తు పోకడలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు తెలిపారు. శనివారం ఖమ్మం వచ్చిన చంద్రబాబుని చల్లపల్లి గార్డెన్స్‌లో తుమ్మల వర్గానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మేడిద సంతోష్ గౌడ్, పట్టణ కార్యదర్శి కనగాల బాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిసి నామా, చిన్నిల ఒంటెత్తు పోకడలపై వివరించినట్లు వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. కొత్తగూడెం నియోజక వర్గ ఇన్చార్జిగా ఉన్న కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి టిక్కెట్టు ఇవ్వోద్దని కోరినట్లు చెప్పారు. నామా జిల్లాలో తన సొంత వ్యాపారాల కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని ఉపయోగించుకుంటున్నారే తప్ప పార్టీని బలోపేతం చేయాలన్న తపన లేదని అధినేతకు వివరించినట్లు తుమ్మల వర్గీయులు పేర్కొంటున్నారు. కొత్తగూడెం నియోజక వర్గ ఇన్చార్జిగా ఏడాది క్రితం బాధ్యత చేపట్టిన చిన్ని కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నోరు మెదపకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా తీర్పు ఇవ్వడానికి కొత్తశక్తులను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇక్కడ నామా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని వారసత్వ రాజకీయాలకు కొత్తగూడెం నియోజకవర్గ కార్యకర్తలు గులామ్‌గిరి చేయలేరని తేల్చి చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ టికెట్ తుమ్మల వర్గానికి ఇవ్వాలని అధినేతకు వినతిపత్రాలు ఇచ్చినట్లు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. సభ నిర్వహణపై చేతిలేత్తేసిన చిన్ని జిల్లాలోని అన్ని మండలాలకు అందుబాటులో ఉన్న కొత్తగూడెంలో చంద్రబాబు నాయుడు ‘ప్రజా గర్జన’ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అధికారంలేక నైరాశ్యంలో ఉన్న ఇక్కడి నాయకుల్లో, కార్యకర్తల్లో చైతన్యం కలిగేదని జిల్లా పార్టీ ఆలోచించిందని తుమ్మల వర్గం నేతలు తెలిపారు. అయితే కోనేరు చిన్ని అసమర్థత తో సభ నిర్వహించలేమని చేతులు ఎత్తేయడంతోనే ఖమ్మంలో జరిపారని ఫిర్యాదు చేసినట్లు తుమ్మల వర్గం నేతలు తెలిపారు. అలాంటి వ్యక్తికి కొత్తగూడెం టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని, బీసీలకు కేటాయించే పరిస్థితి ఉంటే మేడిద సంతోష్ గౌడ్‌కు, ఓసీలకు ఇవ్వాలను కుంటే కనగాల బాలకృష్ణలకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. పాల్వంచ జెడ్పీటీసీ అభ్యర్థిగా దొంతగాని రవిగౌడ్‌కు అవకాశం ఇవ్వాలని కోరినట్టు వివరించారు. అధినేతను కలిసి వారిలో తుమ్మల వార్గానికి చెందిన నాయకులు కాంపెల్లి కన కేష్, చల్లగుండ్ల వీరభద్రరావు, మదార్, వుండేటి రవికుమార్, దొంతగాని రవి, శీలం భద్రం, కడలి సత్యనారాయణ, రాహుల్, కిర ణ్ తదితరులు ఉన్నారు. -
ఖమ్మం టీడీపీలో సీట్ల లొల్లి
ఖమ్మం: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఖమ్మం జిల్లాలో పార్టీలోని రెండు వర్గాల నేతలతో పాటు.. వారి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో అంతర్గతంగా ఉన్న వైరం ఈ ఎన్నికలతో ఖమ్మం జిల్లాలో బయటపడుతోంది. ఎమ్మెల్యే టికెట్లు మొదలు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో ఎవరికివారు తమ అనుచరులకు హామీలు గుప్పిస్తున్నారు. వరుసగా ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఖమ్మం జిల్లాలో పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదే సమయమని ఇటు ఎంపీ నామా నాగేశ్వరరావు, అటు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తమ వ్యూహాలకు పదును పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని పైకి ప్రకటించి చివరకు రెండువర్గాలు ఒకరిని మరొకరు దెబ్బ తీసేందుకు ఎత్తులు వేయడం అప్పట్లో క్యాడర్లో చర్చనీయాంశమైంది. పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడమే ధ్యేయంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు సహకారం అందించడంలో కూడా వెనుకాడలేదు. డీసీసీబీ ఎన్నికల్లో కూడా ఇరువురు నేతలు తమ అనుచరునికే పీఠం దక్కాలని ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తుమ్మల, ఖమ్మం జిల్లాలో తుమ్మల తనకు కొరకరాని కొయ్యగా మారాడని నామా... ఎవరికి వారు ప్రత్యర్థి వర్గం బలాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఇదే అదునుగా ఇరువర్గాల నేతలు వార్డు సభ్యుని నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ వారు తమ అనుచర నేతలతో మీకే సీట్లు అంటూ హామీలిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి రాకుండా ఎవరికి వారు తమ అనుచర నేతలకు హామీలిస్తుండడంతో అసలు ఎవరికి ఏ స్థానం దక్కుతుందో, ఏది దక్కదో ప్రత్యామ్నాయం చూసుకోవాలా.. వద్దా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేవగా.. ఇరువురి అనుచరులు వార్డుల్లో నామినేషన్ వేయడానికి సై అంటే సై అంటున్నారు. అలాగే వీలైనన్ని ఎక్కువ జెడ్పీటీసీలు తమ వర్గమే దక్కించుకోవాలని, అలా అయితే జెడ్పీ పీఠం తమదేనన్న యోచనలో ఇరువురు నేతలు ఉన్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎంపీటీసీల విషయంలో కూడా మండల స్థాయిలో పట్టుకోసం ఇదే సీన్ నెలకొంది. అంతేకాకుండా ఇక అసలు తమ వర్గం నేతగా చెప్పుకోవడానికి ఇరువురు నేతలు అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు. తుమ్మల పాలేరు పయనమెందుకు..? ఖమ్మం నుంచి తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశమైంది. తాను ఈసారి ఖమ్మం నుంచే పోటీచేస్తానని స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. పాలేరు నియోజకవర్గ నేతలతో కూడా ఆయన రహస్యంగా సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అసలు ఖమ్మం నుంచి ఆయన పాలేరు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు..అక్కడ నామా వర్గం సహకరిస్తుందా..? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్న చర్చ. గతంలో తన అనుచర ప్రధాన నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో.. బాలసాని, ఆ నియోజకవర్గ ఇన్చార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి అనుచరులు ఎవరికివారు తమ నేతలను వెనకేసుకు వస్తూ విమర్శలకు దిగారు. ఇప్పుడు తుమ్మల.. బాలసాని పేరును ఖమ్మంకు ప్రస్తావిస్తుండడం, పాలేరుకు ఆయన పయనమవుతుండడం పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో ఖమ్మంలో తుమ్మల ఓటమి అంచువరకు వెళ్లి బయటపడడం, స్థానికంగా వ్యతిరేకత ఉందా..? అందుకే పాలేరుకు వెళ్తున్నారా..? అనే చర్చ కూడా పార్టీ క్యాడర్లో జరుగుతోంది. తుమ్మల పట్టు.. నామా బెట్టు ఈసారి తుమ్మల ఖమ్మం కాదని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని తన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. తుమ్మల అనుచరునికి ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని నామా ఇటీవల తెరపైకి తెచ్చారు. జిల్లాలో దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల నాగప్రసాద్ నామా హామీతోనే ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్నారని.. ఈయనకు ఖమ్మం నుంచి టికెట్ ఇప్పించేందుకు నామా తీవ్ర ప్రయత్నాల్లో మునిగినట్లు తెలిసింది. తుమ్మలకు చెక్ పెట్టాలని నామా.. నామా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తుమ్మల..ఇలా ఇరువురు నేతలు వ్యూహంలో మునిగారు. బాలసానికే టికెట్ ఇవ్వాలని, నిన్నగాక మొన్న వచ్చిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారు..? అని తుమ్మల,బాలసాని అనుచరులు ఇటీవల రాజధానిలో పార్టీ నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురు నేతలు ఖమ్మం సీటు పైనే బెట్టుగా ఉండడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
మా లేఖల వల్లే తెలంగాణ: నామా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీ తరఫున మొదటి ఓటు వేశామని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో తమ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి,కాంగ్రెస్ ను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు కృషిచేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. కాగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరికృష్ణ మాట్లాడుతూ తాను రాజీనామా చేసినపుడే ఎంపీలందరూ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చి ఉండేది కాదన్నారు. -
విభజనకు మొదటి ఓటు నాదే: నామా
-
'విజయశాంతిని తీసుకొచ్చి దాడి చేశారు'
'నామా నాగేశ్వరరావు నాయకత్వం మాకొద్దు'- ఈ మాట అన్నది ఎవరో కాదు ఆయనతో కలిసి లోక్‌సభలో అడుగుపెట్టిన నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి. నాలుగున్నరేళ్లుగా భుజాలు రాసుకుని తిరిగిన నామాపై మోదుగులకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ పార్లమెంటరీ నాయకుడి పోస్టు నుంచి నామాకు వీడ్కోలు పలకాలని గొంతెత్తారు. నామా నాయకత్వాన్ని అంగీకరించడం లేదని కుండబద్దలు కొట్టారు. పార్లమెంట్ సాక్షిగా తమపై దాడికి పాల్పడిన నామా నాయకత్వంలో ఎలా పనిచేస్తామని మోదుగుల ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు బాహాబాహికి దిగారు. బిల్లును అడ్డుకునేందుకు మోదుగుల వీరంగం సృష్టించారు. ఆయనను సొంత పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకున్నారు. మోదుగులపై దాడికి దిగారు. తమకు నాయకుడిగా ఉన్న వ్యక్తే దాడి చేయడంతో మోదుగుల అవాక్కయ్యారు. నలుగురు మద్దతుతో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న నామా విచక్షణ కోల్పోయి తమపై దాడికి పూనుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం ఎంపీగా ఆ ప్రాంత ప్రయోజనాలు నామాకు ఎంత ముఖ్యమో, నర్సరావుపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష తనకు అంతే ముఖ్యమని మోదుగల స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీలు ఆందోళనను తామెప్పుడూ అడ్డుకోలేదని మోదుగుల గుర్తుచేశారు. తెలంగాణ అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా వ్యతిరేకించలేదని చెప్పారు. సమన్యాయం చేయమని అడుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నామా, రాథోడ్- తమపై దాడి చేశారని వాపోయారు. విజయశాంతిని తీసుకొచ్చి పక్కా ప్రణాళికతో వారిద్దరూ తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతం మాత్రమే బాగుపడాలని, మిగతా వారు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న నామా నాయకత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణనే తమ నాయకుడిగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు రెండు ప్రాంతాల బాగు కోరుతున్నారు కాబట్టే ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామని వివరించారు. విభజన బిల్లు టీడీపీ పార్లమెంట్ సభ్యుల మధ్య చిచ్చు రేపడం అధినేత చంద్రబాబును కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటివవరకు ఇరుప్రాంతాల నేతలతో విభజన నాటకాన్ని రక్తికట్టించిన పచ్చపార్టీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్‌తో కనుకుపట్టడం లేదు. ఇకపై ఆయన ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలను బాబు ఏవిధంగా బుజ్జగిస్తారో చూడాలి. -
ఎంపీలను చంపేందుకు లగడపాటి కుట్ర: రాథోడ్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. సభలో చర్చించకుండా దాడులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామంటూ సూచించారు. పెప్పర్ స్ప్రే చేసి సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీలపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పార్లమెంట్‌ను బజారుస్థాయి ఘర్షణకు వేదికగా కాంగ్రెస్ మార్చిందని నామా విమర్శించారు. ఎంపీలను చంపేందుకు లగడపాటి రాజగోపాల్ కుట్ర పన్నారని మరో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. మిరియాల పొడి స్ప్రే చేయడంతో సభలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
బిల్లు ఆమోదానికి సహకరిస్తాం: నామా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును దయచేసి అడ్డుకోవద్దని సీమాంధ్ర నేతలను టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేరబోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ కట్టుబడివుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం టీడీపీ మూడు లేఖలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ లేఖలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. తమ పార్టీ తరపున తెలంగాణకు మద్దతు ఎంత ఉందో దీని బట్టి తెలుస్తుందన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తామూ పూర్తిగా కూడా సహకరిస్తామని హామీయిచ్చారు. తెలంగాణకు అడ్డుతగలొద్దని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. -
టీ బిల్లు పాసవడం అసాధ్యమే
-
టీ బిల్లు పాసవడం అసాధ్యమే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు సరైన తీరులో లేదని, పార్లమెంటులో అది పాసవడం అసాధ్యమేనన్నారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఆ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల బృందం మంగళవారం పార్లమెంటులో అద్వానీ, రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీలను వేర్వేరుగా కలసి, బిల్లు ఆమోదానికి సహకరించాలని వినతిపత్రాలు అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మంచి ఫలితాలు వస్తాయని నేతలు వివరించారు. దీనికి అద్వానీ స్పందిస్తూ.. తాము తెంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నప్పటికీ, యూపీఏ రూపొందించిన తెలంగాణ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ సభ్యులే సభలను అడ్డుకుంటున్నారని, ఇక బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు. విభజన నిర్ణయానికి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై కాంగ్రెస్‌కు చెందిన ఆ ప్రాంత సభ్యులు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో అదే పార్టీకి చెందిన సీమాంధ్ర సభ్యులు పార్లమెంటును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పార్లమెంటును ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాంగ్రెస్ వారు తప్పులు చేస్తూ బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభలు సక్రమంగా సాగడంలేదని, సమయం కూడా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు పెట్టడం, ఆమోదం పొందడం అసాధ్యమేనని అద్వానీ మాటల్లో స్పష్టమైనట్టు తెలంగాణ టీడీపీ నేతలు తెలిపారు. బిల్లుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని అరుణ్ జైట్లీ వారికి చెప్పారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని ప్రస్తావన లేదని, ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వాలని అద్వానీ, జైట్లీని కోరినట్లు నామా నాగేశ్వరావు చెప్పారు. అద్వానీ, జైట్లీలతో భేటీ అనంతరం నామా, ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. బీఏసీ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మాటలను చూస్తే తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదని తెలుస్తోందని, న్యాయపరమైన అంశాలను అడ్డంపెట్టుకుని తప్పించుకునేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు రెండు ప్రాంతాల్లో నష్టం’ ఇన్ని రోజులు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని వార్తలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇతర కారణాలు చూపుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీ విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు తేవడం లేదనే సంగతి మంగళవారం బీఏసీ సమావేశంలో తేటతెల్లం అయిందన్నారు. చివరి నిమిషంలో ఇలా చేయడంతో సీమాంధ్రలో, తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్నాయకులు భావిస్తున్నారన్నారు. కానీ రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. బాబుకు ఢిల్లీలో ఏం పని?: నాగం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ చేరింది, తెలంగాణను అడ్డుకునేందుకేనని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే తాము ఢిల్లీనుంచి తిరిగి వెళ్తామన్నారు. తెలంగాణపై బీజేపీ నిర్ణయంలో మార్పు లేదని, ఢిల్లీలో మంగళవారం తెలంగాణ టీడీపీ నాయకులకు సైతం అద్వానీ ఇదే స్పష్టత ఇచ్చారని నాగం అన్నారు. అయినా, తెలంగాణ ఏర్పాటుపై తప్పుదోవపట్టించే ప్రకటనలు చేస్తూ, తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.బాబుకి కోల్‌కతా నుంచి నేరుగా ఢిల్లీ రావాల్సిన అవసరమేమిటని నాగం ప్రశ్నించారు. -
మీదేం మర్యాద.. ఏం వైఖరి?
టీడీపీ నేతలను నిలదీసిన సుష్మాస్వరాజ్ అపాయింట్మెంట్ లేకుండా రాజ్‌నాథ్‌ను కలవడం ఏం మర్యాద ‘టీ’పై రెండు వాదాలు చెబుతున్నారంటూ నామాపై మండిపాటు సుష్మా వ్యాఖ్యలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడిన టీడీపీ సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ఓవైపు టీడీపీ నేత చంద్రబాబు ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మాత్రం చంద్రబాబు వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధినేత రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసే విషయంలో చంద్రబాబు అమర్యాదగా వ్యవహరించారని, కనీసం అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి భేటీ కావడమేమిటని ఆమె తీవ్రంగా తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై రెండ్రోజుల కిందట తనను కలవడానికి వచ్చిన తెలంగాణ టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావును ఆమె కడిగిపారేసినట్లుగా తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. రాష్ట్ర విభజన విషయమై చంద్రబాబు ఈ నెల 3న రాజ్‌నాథ్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత మూడు, నాలుగు రోజుల అనంతరం నామా నేతృత్వంలో కొందరు తెలంగాణ టీడీపీ నేతలు సుష్మాస్వరాజ్‌ను పార్లమెంట్‌లోని కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ తీరును సుష్మా ప్రస్తావిస్తూ ‘‘మా అధ్యక్షుడు అనారోగ్యంతో ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఆయన నివాసంలోకి వెళ్లడం ఏం మర్యాద? ఇది సరైన సంప్రదాయమేనా? మీరు ఏం చేసినా చూస్తూ కూర్చోవాలా?’’ అని మండిపడ్డారు. అలాగే విభజన విషయంలో టీడీపీ భిన్న వైఖరులపైనా ఆమె ఘాటుగానే స్పందించారు. ‘‘మొన్న మీరే ఒక బృందంతో వచ్చి సమైక్యాంధ్ర కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి రాష్ట్ర విభజన చేయాలంటున్నారు. అసలు మీ(టీడీపీ) వైఖరేంటీ?’’ అని ప్రశ్నించడంతో నామా సహా నేతలు మిన్నకుండిపోయారు. ‘‘ఆర్టికల్, రాజ్యాంగం అని మీరు బ్లూబుక్ ఇస్తున్నారు. రాజ్యాంగం మా వద్ద లేదా? మాకు ఆర్టికల్స్ తెలియదా?’’ అని సుష్మా నిలదీశారు. దీంతో చేసేదిలేక టీడీపీ నేతలు.. ‘‘బాబు ఎంత ఇరకాటంలో పెట్టారు.. ఆయన వైఖరి మనకు చేటు తెస్తోంది’’ అని అనుకుంటూ నిష్ర్కమించారు. సుష్మా వ్యాఖ్యలను బయటకు పొక్కనీయవద్దని నామా సూచించినప్పటికీ బాబు వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఒకరిద్దరు నేతలు లీక్ చేయడంతో సుష్మా వద్ద పరాభవం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రాష్ట్రానికి పంగ'నామా'లు
తక్కువ ధర ఉన్నప్పుడు రాష్ట్రానికి విద్యుత్ విక్రయం అధిక ధర ఉన్న వేసవిలో కేరళకు విక్రయించేందుకు యత్నం మొదటి తిరస్కార హక్కునూ తోసిరాజంటున్న వైనం టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత నామా సంస్థ తీరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడినా ఫర్వాలేదు.. రైతుల పంటలు ఎండిపోతే నాకేం... నా వ్యాపారం బాగుంటే చాలంటున్నట్లు వ్యవహరిస్తున్నారు టీడీపీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రానికి పంగనామాలు పెట్టయినా సరే అధిక ధరకు విద్యుత్‌ను కేరళకు విక్రయించేందుకు పావులు కదిపారు. మార్కెట్లో విద్యుత్ ధరలు తక్కువ ఉన్న సమయం జూలై నుంచి జనవరి వరకు మాత్రమే రాష్ట్రానికి విక్రయించి... అధిక ధరలు ఉన్న ఫిబ్రవరి నుంచి మే వరకు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒప్పందం మేరకు రాష్ట్రానికి ఉన్న ‘మొదటి తిరస్కార హక్కు’నూ కాదం టూ ముందుకు కదిలారు. రాష్ట్రానికి పంగ‘నామా’లు పెడుతున్న మధుకాన్ సంస్థ వ్యవహరిస్తున్న తీరు ఇదీ! 2013 జూన్ నుంచి 2014 మే వరకు విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు టెండర్లు పిలిచాయి. 2013 జూలై నుంచి 2014 జనవరి వరకు మాత్రమే విద్యుత్‌ను విక్రయిస్తామని మధుకాన్ పేర్కొంది. ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర తక్కువగా ఉంటుంది. 2013 జూన్ నుంచి 2014 మే వరకు విద్యుత్‌ను ఇచ్చే ఇతర ప్రైవేటు సంస్థలతో పాటుగా మధుకాన్ కూడా ఏకంగా యూనిట్‌కు రూ. 5.45 పొందింది. ఫిబ్రవరి నుంచి మే వరకు విద్యుత్‌ను మార్కెట్లో మధుకాన్ విక్రయించాలని భావిస్తే.. మొదటి తిరస్కార హక్కు (ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్) విద్యుత్ సంస్థలకే ఉంటుందని ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఠ ఒప్పందాన్ని తోసిరాజంటూ ఫిబ్రవరి నుంచి మే వరకూ కేరళకు విక్రయించేందుకు వీలుగా ఆ రాష్ట్రం పిలిచిన టెండర్లలో పాల్గొంది. ఎందుకంటే ఈ కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల యూనిట్ ధర అధికంగా ఉంటుంది. ధర తక్కువగా ఉండే కాలంలో రాష్ట్రానికి అమ్మి ఎక్కువ ధరను, ధర ఎక్కువగా ఉండే కాలంలో బయట విక్రయించి అధిక రేటును కొట్టేసేందుకు మధుకాన్ పన్నాగం పన్నింది. మొదటి తిరస్కార హక్కు ద్వారా రాష్ట్రానికే విద్యుత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇంధనశాఖ అధికారులు అంటున్నారు. సకలజనుల సమ్మెలోనూ ఇంతే...! సకల జనుల సమ్మె కాలంలో మధుకాన్ సంస్థ ఇదే తీరు కనబర్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 2012 సెప్టెంబర్‌లో జరిగిన సకల జనుల సమ్మె సందర్భంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయి విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సమయంలో మధుకాన్ సంస్థ బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికే విద్యుత్‌ను ఇవ్వాలని విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఏకంగా మధుకాన్ సంస్థ యజమాని, ఖమ్మం ఎంపీ అయిన నామా నాగేశ్వరరావుకు స్వయంగా ఫోన్ చేసినా ససేమిరా అన్నారు. వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు అని అధికారులకు హితబోధ కూడా చేశారు. ఇప్పుడు కూడా అదీ... మొదటి తిరస్కార హక్కును కాదని కేరళకు విక్రయించేందుకు సిద్ధపడటంపై విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. గతంలో సదరు సంస్థ వ్యవహరించిన తీరును దృష్టిలో పెట్టుకునే మొదటి తిరస్కార హక్కును ఒప్పందంలో చేర్చినట్టు ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. -
హస్తినలోనూ రెండుకళ్ల సిద్ధాంతమే!
బట్టబయలైన టీడీపీ ద్వంద్వ వైఖరి ఆఖరి సమావేశాల్లో బిల్లేమిటి?: బాబు బిల్లు ఆమోదించాలని ప్రధానిని కోరాం: నామా పార్లమెంటు గేటు ఎదుట సీమాంధ్ర ఎమ్మెల్యేల బైఠాయింపు సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సాక్షిగా తెలుగు తమ్ముళ్ల రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి బట్టబయలైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్రావు ఒకే వేదికగా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఓటాన్ అకౌంట్ సమావేశాల్లో బిల్లు పెట్టడాన్ని బాబు తీవ్రంగా వ్యతిరేకించగా... ఎవరు అడ్డొచ్చినా ఈ సమావేశాల్లో బిల్లు పెట్టి తీరాల్సిందేనంటూ నామా డిమాండ్ చేశారు. ఢి ల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం సాయంత్రం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో అక్కడికి వచ్చిన నామా నాగేశ్వర్రావు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పైవిధంగా స్పందించారు. సమన్యాయం చేయని బిల్లును అడ్డుకోవాలంటూ చంద్రబాబు పలువురు జాతీయ నేతలను కలిసి అభ్యర్థిస్తుండగా... సాధ్యమైనంత త్వరగా బిల్లును ఆమోదింపచేయాలంటూ నామా ఆధ్వర్యంలో టీటీడీపీ నేతల బృందం ప్రధాని, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మా స్వరాజ్లను కలిసి వినతిపత్రాలు అందించారు. మరోవైపు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంటు గేటు ఎదుట సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాన్ ముందు టైర్లకు అడ్డంగా పడుకున్నారు. దీన్ని గమనించని డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు కదిలించబోగా గట్టిగా అరిచి వ్యాన్‌ను ఆపారు. తర్వాత ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బైఠాయింపులో పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, బల్లి దుర్గాప్రసాద్, లింగారెడ్డి సహా దాదాపు 15 మంది పాల్గొన్నారు. సమన్యాయం చేశాకే విభజన చేయాలి: చంద్రబాబు మా పొలిట్‌బ్యూరో 2008లో ఇచ్చిన లేఖను మేం వెనక్కు తీసుకోలేదు. అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి. ఇరు ప్రాంతాల స్టేక్ హోల్డర్స్‌ను పిలిపించి చర్చించాలి. ఇద్దరిని ఒప్పించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలి. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా చెప్పాం. ఎమర్జెన్సీ నుంచి ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసేవరకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పలుమార్లు ఉల్లంఘించింది. ఇప్పుడు ఆర్టికల్-3ని దుర్వినియోగం చేస్తుంది. మరి కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికల ముందు చివరి సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బిల్లులు పెడతారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ బిల్లులు పెట్టుకుంటాయి. కానీ కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. అందుకే ఆఖరి సమావేశంలో బిల్లు పెట్టాలనుకుంటోంది. రాష్ట్రంలో విద్వేషాలకు సోనియాగాంధీయే కారణం. ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి: నామా ప్రధాని మన్మోహన్‌ను కలిసి తెలంగాణపై సవివరంగా మాట్లాడాం. చివరి సమావేశాల్లో ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చూడాలని డిమాండ్ చేశాం. విభజన బిల్లు పెడితే తెలంగాణ టీడీపీ ఎంపీలం తప్పకుండా ఓటు వేస్తామని స్పష్టంగా చెప్పాం. సీఎం కిరణ్ ఢిల్లీలో ధర్నా చేయడం ప్రజల్లో అమోమయానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. స్పీకర్ మీరాకుమార్ను కూడా కలిసి తెలంగాణ బిల్లు ఆమోదం అయ్యేలా సహకరించాలని కోరాం. పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ఎవరు అడ్డుకున్నాసరే.. బిల్లు ఆమోదం చేయించాలి. బిల్లు ఆమోదానికి పూర్తి హామీ ఇచ్చిన ప్రధాని మన్మోహన్‌కు ధన్యవాదాలు. -
'సీఎం డ్యాన్స్ చేసినా అభ్యంతరం లేదు'
సిద్దిపేట: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు వాసిగా, సీమాంధ్ర బిడ్డగా దీక్షలు చేసినా, డ్యాన్స్‌లు చేసినా తమకు అభ్యంతరం లేదని, హైదరాబాద్ బిడ్డనని రాజధానికున్న బ్రాండ్ ఇమేజ్ను తన పిచ్చి చేష్టలతో డ్యామేజ్ చేయడం తగదని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ సీఎం పదవి హుందాతనాన్ని మంటగలుపుతూ, విలువలను నాశనం చేస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. బుధవారం తెలంగాణ మంత్రులను, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ వెళ్లడమే కాకుండా వారిపై లాఠీచార్జి చేయించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆహంకారానికి ఇది నిదర్శనమన్నారు. సొంత పార్టీ మంత్రుల పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి కలిసుండాలని కోరే హక్కు లేదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం తెలంగాణలోని పది జిల్లాల్లో టీఆర్ఎస్ పక్షాన నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు తెలంగాణ అంతటా కొనసాగుతాయన్నారు. మంత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సీఎం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ను మంచివాడు కాదని పక్షపాతి అని విమర్శించిన చంద్రబాబు నేడు కిరణ్‌ను నమ్ముతున్నాననడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు అనాధలుగా మిగిలి పోయారన్నారు. తెలంగాణకు తొలి ఒటుగా చెబుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావుది సీమాంధ్ర డీఎన్ఎగా అభివర్ణించారు. -
'ప్రధాని మాటలు... దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది'
ప్రధాని మన్మోహన్ సింగ్‌పై లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అవినీతిని ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు పెంచి పోషించారని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రధాని అవినీతిని నిర్మూలిస్తానని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు సాక్షాత్తు ప్రధాని కార్యాలయంలో మాయమైన సంగతిని ఆయన మరచినట్లున్నారిని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఆ అంశంపై కనీసం ఆయన నోరు కూడా విప్పలేదన్నారు. అలాంటి ఆయన ఎలా అవినీతిని నిర్మూలిస్తారని ప్రశ్నించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల నాశనం చేసిందని విమర్శించారు. అలాంటి పార్టీ మరో నేతను విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎదురవుతుందని నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. విభజన బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని, అలాగే సీమాంధ్రలో సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
టి.బిల్లుకు కాంగ్రెస్ నేతల మద్దతే లేదు: నామా
తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే మద్దతు ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అవినీతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న లోక్‌పాల్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. లోక్‌పాల్ బిల్లు 10 ఏళ్ల క్రితమే చట్టంగా రూపొందాల్సిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలా చేసి ఉంటే కాంగ్రెస్ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన దోపిడికి అడ్డుకట్ట వేసినట్లు అయ్యేదని ఆయన పేర్కొన్నారు. -
టీడీపీలో వర్గపోరు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: ‘వదలమంటే పాముకు కోపం...పట్టమంటే కప్పకు కోపం’ అనే రీతిలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి తయారైంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట, పెనుబల్లి మండలాలలో పర్యటించారు. సత్తుపల్లి, ఖమ్మం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పలువురు పర్యటనకు దూరంగా ఉన్నారు. ‘సత్తుపల్లిలో నామా నాగేశ్వరరావు పర్యటన ఉంది.. జిల్లా పార్టీ నుంచి ఏ సమాచారం లేదు.. నామా పర్యటనకు వెళ్లాలా వద్దా?’ అని సత్తుపల్లికి చెందిన ఓ ముఖ్య నాయకుడు ఖమ్మం ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. దీనిపై ఆయన స్పందిస్తూ ‘నాకు అక్కడ మంట పెడుతుంటే.. మీరు పూలతో స్వాగతం పలుకుతారా..?’అని ఆయన ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకే సత్తుపల్లి మండల నాయకత్వం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనకు దూరంగా ఉందని తెలిసింది. పనిలో పనిగా వెళ్లిన ఒకరిద్దరి సమాచారం కూడా సేకరించేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నామా నాగేశ్వరరావు తన సొంత వర్గాన్ని ఏర్పరుచుకునే పనిలో భాగంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సండ్ర, తుమ్మల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఎంపీ నిధులతో నిర్వహించే పనుల కేటాయింపుల్లో స్థానిక నాయకత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎంపీ నియోజకవర్గాలకు పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా పార్టీ నుంచి గానీ, ఎంపీ కార్యాలయం నుంచి గానీ పార్టీ బాధ్యులకు సమాచారం ఇవ్వరా? అని నిలదీస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి కొందరిని వర్గంగా తయారు చే సుకుంటూ పార్టీ ప్రయోజనాలను మం టగలుపుతున్నారని తుమ్మల వర్గీయు లు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ‘సండ్ర’కు తప్పని తిప్పలు... సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆర్థిక అవసరాల కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు జపం చేస్తూ.. ఎంపీ పర్యటనకు తన వర్గీయులు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారంటూ నామా వర్గీయులు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలానికి రూ.10 లక్షల చొప్పున రూ.50 లక్షలు నామా నాగేశ్వరరావు నుంచి తీసుకొని..గెలిచిన సర్పంచ్‌లను కూడా వెళ్లవద్దంటూ హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబు అని ఎంపీ వర్గీయులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే డబుల్‌గేమ్ వల్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కార్యకర్తలకు పనులు పంచి పెడుతున్నా.. అడ్డు పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వేం సూరు,పెనుబల్లి మండలాల్లో ఎమ్మెల్యే అనుచరులు నామా పర్యటనలో పాల్గొనడాన్ని తుమ్మల వర్గీయులు తప్పుబడుతున్నారు. సోమవారం ఉదయం సత్తుపల్లి రావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎంపీ పర్యటన ఉండటంతో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. తుమ్మల సొంత మండలంలో... తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలమైన దమ్మపేటలో ఆయనకు అత్యంత సన్నిహితులైన దొడ్డాకుల రాజేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్రప్రసాద్, బండి పుల్లారావు, పానుగంటి సత్యం, మెచ్చా నాగేశ్వరరావు ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనలో హుషారుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారిం ది. సత్తుపల్లి మండలంలో తుమ్మల అనుచరులు దూరంగా ఉండి.. ఆయన సొంత మండలంలో పర్యటనకు వెళ్లటంపై ఆరాలు మొదలయ్యాయి. -
విభజన కోసమే చంద్రబాబు దీక్ష: ఎంపి నామా
ఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ ఆపాలన్నది తమ నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లక్ష్యంకాదని ఆ పార్టీ ఎంపి నామా నాగేశ్వర రావు స్పష్టం చేశారు. పద్ధతి ప్రకారం విభజన చేయమని చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రేపు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు దీక్ష ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రాన్ని పద్దతి ప్రకారం విభజించి, సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలనేది చంద్రబాబు దీక్ష లక్ష్యం అని నామా వివరించారు. తెలంగాణ ప్రక్రియ ఆపాలని తాము కోరుకోవడంలేదని చెప్పారు. తెలంగాణ బిల్లు పెడితే మొదటి ఓటు తామే వేస్తామని చెప్పారు. -
చంధ్రబాబు రాకుండా నామాకు బాధ్యతలు