
మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, ఖమ్మం వైరారోడ్: రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా మరోసారి చాటాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ మంగళవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కారు గుర్తుపై ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు.
గత 60 ఏళ్లలో కాని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. అత్య«ధిక ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపించడం ద్వారా తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కార్మిక విభాగం అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కూరపాటి రంగరాజు, ఖాజామియా, బి.కరుణ, పాల్వంచ కృష్ణ, జలగం రామకృష్ణ, మన్మథరావు, డోకుపర్తి సుబ్బారావు, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment