
సాక్షి, కొత్తగూడెం: సిట్టింగ్ ఎంపీ అయిన తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల కొంచెం బాధగానే ఉన్నప్పటికీ అందరికీ కుటుంబ పెద్దగా భావిస్తున్న కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసా వహించాల్సిందేనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ పెద్ద అని, ఏ పనిచేసినా ఆలోచించి చేస్తారని, ఈ క్రమంలోనే ఖమ్మం టికెట్ నామాకు ఇచ్చారని చెప్పారు. తనకు సముచిత స్థానం కల్పిస్తానని ఇటీవల ఖమ్మంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని, అభివృద్ధిని కాంక్షించే వారంతా రాష్ట్రంలోని 16 స్థానాలలో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ఆయన కోరారు. తనకు అధికారం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment