సాక్షి, హైదరాబాద్: ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఈడీ కేసును కొట్టివేయాలని నామా నాగేశ్వరరావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఎంపీ నామా కోర్టును కోరారు.
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో నామా పేర్కొన్నారు. 2009లోనే మధుకాన్ గ్రూప్ కంపెనీలకు రాజీనామా చేసినట్లు తెలిపారు.సీబీఐ, ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌లోనూ తన పేరు లేదని పిటిషన్‌లో నామా పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment