
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజపై దాడి జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరబడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు.
అనంతరం డ్రైవింగ్ సీట్లో ఉన్న పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించి దాడి చేశారు. బలవంతంగా రూ. 75 వేలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని పరారయ్యారు. ఈ ఘటనపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో నామా కొడుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment