Prudhvi
-
మంచి సందేశంతో ‘అభిలాష’
అమర్ దీప్, అశ్వినీ రెడ్డి హీరో హీరోయిన్లుగా శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిలాష’. సీహెచ్ శిరీష నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు పృథ్వీ ఈ సినిమా సీడీ, ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ‘‘ఓ మంచి పాయింట్‌తో తీసిన ఈ చిత్రం ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘వల్గారిటీ లేకుండా విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శివ ప్రసాద్. ‘‘బలగం’ సినిమా కోవలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత సీహెచ్ శిరీష. -
ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి.. కత్తితో బెదిరించి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజపై దాడి జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరబడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు. అనంతరం డ్రైవింగ్ సీట్లో ఉన్న పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించి దాడి చేశారు. బలవంతంగా రూ. 75 వేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకొని పరారయ్యారు. ఈ ఘటనపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నామా కొడుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మే 26న వివాహం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
కోదాడ: కష్టపడి చదివి.. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ .. వివాహం కోసం స్వదేశం వచ్చిన ఆ యువకుడు పెళ్లి చేసుకొని 16 రోజులు పండుగ జరుపుకోవాలనే సంతోషంలో ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంభాలలో తీరని విషాదం మిగిల్చిన సంఘటన పలువురిని కలిచి వేచింది. గురువారం నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అడపా పృథ్వీ (27) కుటుంబం మొత్తం విషాదంలో కూరుకొని పోయింది. కోదాడకు చెందిన అడపా రాజేందర్ కుమారుడు పృథ్వీ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న విజయవాడ సమీపంలోని కీలేశ్వరపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కావడంతో మే నెలలో ఇండియాకు వచ్చారు..మేనెల 26న వివాహం జరిగింది. గత సంవత్సరం కరోనా సమయంలో యువతి తల్లిదండ్రులు మరణించడంతో మేనమామలు దగ్గరుండి వీరి వివాహం జరిపించారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) ఈనెల 10న పదహారు రోజుల పండుగ జరగాల్సి ఉంది. 11న కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో హలియాలో ఉన్న చిన్ననాటి మిత్రుడిని కలవడానికి తండ్రితో కలిసి వెళ్లాడు. గుగూల్ మ్యాప్ పెట్టుకొని వెళ్లడంతో అది మిర్యాలగూడ మీద నుంచి కాకుండా నకిరేకల్ మీదుగా చూపించడంతో నకిరేకల్ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో నల్లగొండ– నకిరేకల్ మధ్యలో మూల మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. పదహారు రోజుల పండుగ చేసుకుంటామనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు నూతన వధువు పృథ్వీ మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పృథ్వీ అమ్మమ్మ గతంలో కోదాడ పంచాయతీ వార్డు మెంబర్‌గా పని చేసింది. పృథ్వీ తండ్రి కోదాడలో కిరోసిన్ డీలర్ కాగా తల్లి లెనిన్‌కుమారి గృహిణి. ఇతడికి చెల్లెలు ఉంది. శనివారం కోదాడలో పృథ్వీ అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సేవాభాగ్యం దక్కడం అదృష్టం
పంజగుట్ట: తనపై నమ్మకంతో ఎస్వీ భక్తి చానల్ చైర్మన్‌గా నియమించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని, కలలో కూడా శ్రీవారి సేవ చేసే భాగ్యం వస్తుందని అనుకోలేదని వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నటుడు పృథ్విరాజ్ అన్నారు. చైర్మన్‌గా చానల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు విస్తరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజు, గత నెల 28న స్వామి వారి సన్నిధిలో ఎస్వీ భక్తి చానల్ చైర్మన్‌గా ప్ర మాణ స్వీకారం చేసిన మధురక్షణాలు మరవలేనివన్నారు. చానల్లో పనిచేసే ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావించి చైర్మన్ సంప్రదాయాన్ని మారుస్తానన్నారు. చానల్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. తా ను అమరావతికి వస్తే తమ పార్టీని, నాయకుడిని విమర్షించే వారిపై మాటల తూటాలు కొనసాగుతాయన్నారు. అక్కడ స్వామి విధేయుడిగా, ఇక్కడ పార్టీ విధేయుడిగా కొనసాగుతానన్నారు. చానల్లో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు పోసానికి మధ్య విబేధాలు ఉన్నాయన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. -
చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం స్టార్ క్రికెట్
ప్రతీ ఏడాది ఏదో ఒక సామాజిక కార్యక్రమం కోసం సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇబ్బందుల్లో ఉన్నవారికి కాస్తంత చేయూతను అందిస్తుంటుంది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు. ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సారి లానే ఈ సారి కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మంచి కాజ్ కోసమే క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం జరుగుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ గారు యుఎస్ లోని హ్యూస్టెన్‌లో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న సౌత్ ఆఫ్రీకాలో క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆడాము. మరొకసారి బ్లైండ్ ఛారిటీకోసం క్రికెట్ ఆడటం జరిగింది. అలానే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీ కోసం మ్యాచ్ ఆడటం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17న జరగనుంది. అలానే ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజషన్‌తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్‌ను ఆడటానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు హ్యూస్టెన్‌లో, నెక్స్ట్ న్యూ జెర్సీ, ఆతరువాత ఫ్లోరిడా ఇలా ఆల్ ఓవర్ ది యూస్‌లో మ్యాచ్‌లను ఆడనున్నాము. చాలా స్ట్రాంగ్ టీమ్‌తో వెళ్తున్నాము’. అంటూ తెలియచేసారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మంచి కాజ్ కోసం ఆడుతున్నాము.. సీరియస్‌గా గెలవాడానికే ఆడనున్నాము. మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఆడటం డిఫరెన్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది’ అన్నారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో నేను క్రికెట్ టీమ్‌లో భాగం అవ్వాలని ఉంది. అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్, తరుణ్ నన్ను సపోర్ట్ చేశారు. 1992లో రంజీ ట్రోఫీ టీమ్‌లో నేను మెంబర్.. బాగానే ఆడేవాణ్ణి. ఇప్పడు ఈ టాలీవుడ్ క్రికెట్ టీమ్‌లో ఆడటం సంతోషంగా ఉంది’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని సంవత్సరాలుగా టీసీఏ మంచి కాజ్ కోసం ఆడుతూనూనే ఉంది. అదే దిశగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఈవెంట్ చేయడం వారి ఆధ్వర్యంలో టిసిఎ క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. ఆగస్టు 15న యూఎస్ లో ఫ్లాగ్ హ్యస్టింగ్ చేసి 17న మ్యాచ్‌ను ప్రారంభించనున్నాము. అక్కడ ఉన్న బిడ్డింగ్ టీమ్‌ను సెలెక్ట్ చేయనున్నారు. వారు కూడా మాపై గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఇండియన్స్‌తో మేము ఆడటం చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ప్రతి ఒక్క ఇండియన్ ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు. ఎన్నో మంచి కాజ్‌ల కోసం ఆడిన మేము ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు. -
పొలిటికల్ సెటైర్‌గా..!
సమకాలీన రాజకీయాలపై దండయాత్ర చేసే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఇంతకు ముందు అదు వేర ఇదు వేర చిత్రాన్ని నిర్మించిన జీపీజీ ఫిలింస్ అధినేత ఎస్.జయశీలన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఒబామా ఉంగళుక్కాగ. నానీబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు బాలకృష్ణన్ పేరుతో పాస్‌మార్క్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఒబామా ఉంగళుక్కాగ చిత్రంలో పృధ్వీ కథానాయకుడిగా నటిస్తున్నారు. నవ నటి పూర్ణిషా నాయకిగా పరిచయం అవుతోంది. సీనియర్ నటుడు జనకరాజ్ ఇంత వరకూ పోషించనటువంటి విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకులు విక్రమన్, కేఎస్.రవికుమార్, రమేశ్ఖన్నాలు దర్శకులుగానే నటించడం విశేషం. అదే విధంగా నిర్మాత టీ.శివ, నిత్య, రామ్రాజ్, దళపతి దినేశ్, సెంబులి జగన్, కయల్దేవరాజ్, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, శరత్ తదితరలు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది రాజకీయాలపై దండయాత్ర చేసే కథా చిత్రంగా ఉంటుందన్నారు. కథను ఎంతో శోధించి, పలువురు సలహాలను తీసుకుని తెరెక్కించిన చిత్రం ఒబామా ఉంగళుక్కాగ అని తెలిపారు. థామస్ అల్వా ఎడిసన్ టెలిఫోన్‌ను కనిపెట్టింది మాట్లాడుకోవడానికేనని, అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్లో చూడలేనిదీ, సాధించలేనిదీ ఏదీ లేదన్నట్టుగా మారిపోయిందన్నారు. ఈ చిత్రంలో అలాంటి సెల్‌ఫోన్ కూడా ఒక హీరో పాత్రగా ఉంటుందని చెప్పారు. రాజకీయాలను నార తీసి పిండే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ చిత్రం ఉంటుందని చెప్పారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాటలో డాన్స్ చేసి దుమ్మురేపారన్నారు. చిత్రానికి దినేశ్ శ్రీనివాస్ ఛాయాగ్రహణంను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
బాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. మోసం, దగా
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని అస్తమానం చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆం్ర«దప్రదేశ్ ప్రజలు నిలువునా మోసపోయారు. ఆయన అనుభవం మొత్తం మోసం, దగా, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, హత్యలతో నిండిపోయింది. బూటకపు హామీలతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టించుకోలేదు. గట్టిగా బుద్ధి చెప్పడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జనం ఎదురు చూస్తున్నారు’ అని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల వేళ ఆయన తన అభిప్రాయాలను ’సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... బాబు పాలనలో మోసపోయిన ప్రజలు... రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అంగన్వాడీలు, విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది...ఇలా అన్ని వర్గాలు బాబు ఎన్నికల హామీలతో మోసపోయారు. నిరుద్యోగులు చిన్నిచిన్న ఉద్యోగాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక కన్నవాళ్లను, సొంత ఊరిని వదిలి వలస పోతున్న వారు లక్షల్లో ఉన్నారు. దీనికంతటికి చంద్రబాబే కదా కారణం. హామీలు గాలిలో... రైతు రుణమాఫీ అన్నారు. నామమాత్రంగా ఇచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ..రెండు, మూడో తడవ ఇంకా అందలేదు. ఇచ్చింది.. వడ్డీ చెల్లింపులకే సరిపోయింది. నిరుద్యోగ భృతి...దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగున్నరేళ్లు ఊరించి ఎన్నికల వేళ స్వల్పంగా అదికూడా 10 శాతం మందికి కూడా ఇవ్వలేదు. కుల కార్పొరేషన్లకు వేల కోట్లు అన్నారు. అన్నీ గాలికొదిలేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడమే... అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసి చట్టాన్ని, న్యాయాన్నితుంగలో తొక్కేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోరు. తనపై కేసులు పడతాయేమోననే భయంతో సీబీఐనే రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా వాటిపని వాటిని చేసుకోనివ్వరు. ఇన్‌కంటాక్స్ తనిఖీలు వద్దంటాడు. ఎందుకు భయం. పెద్ద దొంగ, చిన్నదొంగలుగా సీఎం, మంత్రులూ ఉన్నారు. నాయకుడి లక్షణాలేవీ బాబులో లేవు. చంద్రబాబు పాదయాత్ర ద్వారా ఏం తెలుసుకున్నారు? సీఎం అయ్యాక వైఎస్, ఎన్టీఆర్‌లా ప్రజలకు పనికొచ్చే పథకం ఒక్కదాన్నైనా చేపట్టారా? ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రజలు అన్నీ మర్చిపోతారనే ధీమా ఆయనది. బీసీలకు 120 హామీలిచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఎమ్మెల్యేలు మహిళా అధికారులను జుట్టుపట్టుకుని కొట్టినా వెనకేసుకొచ్చారంటే ఆయన వైఖరి అర్థంచేసుకోవచ్చు. భజనపరులకే ఆయన లీడరు. జనాలకు కాదు. అబద్దాలు చెప్పడంలో, వ్యవస్థలు మేనేజ్ చేయడంలో, దోచుకోవడంలో లీడర్. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో పరిణతి చెందాడు. ప్రభుత్వ ధనంతో దొంగ పోరాటం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ ధనంతో ధర్మపోరాటాలంటూ దొంగ దీక్షలు చేసి ప్రజలను మభ్యపెట్టారు. మొన్నటి వరకూ ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీలను స్వాగతించిన వ్యక్తి. ప్రత్యేకహోదా అడిగితే కాళ్లు విరగ్గొట్టి స్టేషన్లలో వేయించి, కోర్టుల చుట్టూ తిప్పమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిన ప్రతిపక్షనేత జగన్ దానిలో పాల్గొనడానికి వెళుతుంటే వైజాగ్ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయించి, ఉద్యమాన్ని అణగదొక్కిన వ్యక్తి. చివరకు వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమం తీవ్రం కావడంతో యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో అబద్ధాలు ప్రచారం చేయడం ఆయనకే చెల్లు. ప్రత్యేక హోదా అంశం ఇంకా బతికుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే. సీఎంగా బాబు సాధించిందేముంది... ఓటుకు నోటు కేసులో భయపడి, పాతిక కేసులపై స్టే తీసుకుని కాలం గడుపుతున్న చరిత్ర చంద్రబాబుది. అతను ఆ ఒక్క దాంట్లోనే ముందున్నాడు. రాజ్యాంగ వ్యవస్థలతోపాటు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసి ఎంతో తీవ్రమైన కేసుల దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకుని అడ్డుకున్నాడు. అలా జరగడానికి అమరావతినుంచి ఢిల్లీదాకా సామాజికవర్గం వారినే ముందు చూపుతో నింపుకున్నాడు. ఆ కేసుల్లో దర్యాప్తు జరిగితే ఈ పాటికి సెంట్రల్ జైల్లో ఉండేవాడు. మోదీలాంటి గొప్ప ప్రధానిని ఎప్పుడూ చూడలేదంటాడు. కాంగ్రెస్‌తో జతకట్టి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు. కుళ్లు రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసే సీఎం దేశంలో ఎవరయ్యా అంటే స్కూలుకెళ్లే పిల్లాడుకూడా చంద్రబాబు పేరు చెబుతాడు. దోచుకునేందుకే పోలవరం బదలాయింపు వేల కోట్లు బినామీ పేర్లతో స్వాహా చేసేందుకు పోలవరం ప్రాజెక్టును కేంద్రంనుంచి తీసుకుని తనవాళ్ల పేరుతో చంద్రబాబు కాంట్రాక్టులు చేయిస్తున్నాడు. ఇటీవల ఐటీ దాడులు జరిగినపుడు అన్ని నిజాలు బైటపడ్డాయి. అందుకే చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. కొడుకుతోనూ పెట్టించాడు. తన సామాజిక వర్గానికి చెందిన వారికి వేల కోట్లు దోచి పెట్టడానికే ప్యాకేజీ పేరుతో నిధులు రాబట్టుకున్నాడు. ఘన కార్యం చేసినట్లు రాష్ట్రంలోని జనాన్నంతా తీసుకువచ్చి విహార యాత్రలా చూపించాడు. ఈ ప్రచారంకోసమే కోట్లు ఖర్చుపెట్టాడు. పేదలు పేదలుగానే ఉన్నారు... బాబు పాలనలో పేదలు పేదలుగానే ఉండిపోయారు. ఎన్నికల వచ్చేసరికి తాయిలాలు వేస్తున్నట్లు నటిస్తున్నాడు. పసుకుకుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్నాడు. డ్వాక్రా మహిళలను నిలువుగా ముంచాడు. ఇంతకాలం ఉండి ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో భయపడి తాయిలాలు ప్రకటించాడు. టీడీపీ గొడుకు కింద పవన్, మాజీ జేడీ టీడీపీ గొడుగు కింది పవన్, జేడీ లక్ష్మీనారాయణ సేదతీరుతున్నాడు. ధైర్యంగా చంద్రబాబు పక్కన ఉన్నామని చెప్పుకోలేక ఈ నాటకాలెందుకు. ఏ సందేశమిస్తున్నారు మీరు. ప్రజాసంకల్ప యాత్రతో జనానికి చేరువైన జగన్... పేదవాడి కష్టం నాది అని జగన్ అన్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ వారికోసమే తపించి, వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ఏడాదికి పైగా వారిలో కలిసిపోయాడు. వారి కష్టాలు ఎలా తీర్చాలనే సంకల్పంతో ఉన్నాడు. లీడర్‌గా ఎదిగాడు. ఆయన సంకల్ప బలాన్ని జాతీయ స్థాయి నాయకులు మెచ్చుకుంటున్నారు. పాదయాత్ర చివర్లో జాతీయ మీడియా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఎల్లో మీడియాకు మాత్రం ఇది కనపడదు. పదేళ్లుగా జనం మధ్యే ఉన్నాడు. ప్రజలు ఈయనను నమ్మారు. జగన్ అంటే ఓ నమ్మకం. ఓ భరోసా. ఓ అండ. ఓ ఓదార్పు. విలువలకు, విశ్వసనీయతకే ఓటేయండి... పేదప్రజలు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్‌గారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటేయండి. మాయలు చేసే మోసగాడు చంద్రబాబు బుట్టలో పడొద్దు. ఆయనకు ఓటేస్తే మన జీవితాలు నాశనమవుతాయి. త్వరలోనే నరకాసురుడి చరిత్ర అంతం కాబోతుంది. ఆరోజే దీపావళి. మన జీవితాల్లోవెలుగులు. వాళ్లు రియల్ హీరోస్...వీళ్లు రీల్.... వైఎస్సార్, ఎన్టీయార్ రియల్ హీరోస్. చిరంజీవి, పవన్తదితరులు రీల్ హీరోస్. ప్రజల కష్టనష్టాలను పట్టించుకున్నావారే రియల్ నాయకులు. సినీ పరిశ్రమనుంచి ఎన్టీయార్ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన వారికి అంత ఆదరణ లేదు. స్వలాభం, అధికారం కోసం పార్టీలు పెట్టేవారిని, ఎన్నికలయ్యాక కనిపించని రీల్ హీరోలను ప్రజలు గుర్తించరు. ఓడిస్తారు కూడా. ఏరోజూ ప్రజల సమస్యల గురించి పట్టించుకోని వారు వచ్చి పార్టీలు పెట్టి, సీఎంను చేయండి అని దేబిరిస్తున్నారు. 2009లో పంచెలూడదీసి కొడతామన్నారు. దానికి రిటన్ గిఫ్ట్‌గా ప్రజలు నిజమైన సినిమా చూపించారు. దాంతో 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ప్రశ్నిస్తామన్నారు. వీళ్లు మద్దతిచ్చిన టీడీపీని ప్రజలు చీదరించుకునే సరికి బైటకు వచ్చి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టినట్లు నటిస్తున్నారు. ఇపుడు రంగు మార్చి తాటతీస్తాం అంటున్నారు. మాకు మద్దతిస్తే అండగా ఉంటామని టీడీపీతో చీకటి ఒప్పందం చేసుకుని నాటకాలు ఆడుతున్నారు. ప్రజలకు అర్థమైంది. వారే కర్రుకాల్చి వాతలు పెడతారు. -
పాదయాత్ర సక్సెస్‌కు కారణం అదే: పృథ్వీ
సాక్షి, ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు. చంద్రబాబు విఫలం: కృష్ణుడు టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం ఎంతో చేసిందన్నారు. -
‘పోరాడితే కేసులా.. మరి హోదా సాధించని బాబు సంగతి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీ వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు. ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
‘ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి రాహుల్ గాంధీకి కప్పారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నటుడు పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి చంద్రబాబు రాహుల్ గాంధీకి కప్పారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం నందమూరి సుహాసినిని బాబు బలిపశువుని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గాలి 30 ఏళ్ల పాటు ప్రజలకు అందాలని ఆకాక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘మా అధినేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు జాతి గర్వించే నాయకుడు వైఎస్ జగన్. ఆయనను త్వరలో సీఎంగా చూడబోతున్నాం. వైఎస్ జగన్‌ను రాష్ట్ర భవిష్యత్‌గా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయ’ని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. కృష్ణా జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహబూబ్ షేక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కంటి, షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 47 కిలోల భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయచందర్, గౌతమ్ రెడ్డి, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, అడపా శేషు, ఎంవీఆర్ చౌదరి, తోట శ్రీనివాస్, కాలే పుల్లారావు, వెంకటేశ్వర శర్మ, అవుతు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆసిఫ్ వేడుకల్లో పాల్గొన్నారు. -
సినిమాలో మ్యాటర్ ఉంది
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఖయ్యూమ్‌తో దర్శకుడు గౌతమ్ వైవిధ్యమైన సినిమా చేశాడు. టెక్నికల్‌గా ది బెస్ట్ మూవీ చేశారు. చిరంజీవిగారు మా సినిమా ట్రైలర్ విడుదల చేయటం మాకు చాలా కలిసి వచ్చింది. ఈ సినిమాలో మ్యాటర్ ఉంది. సినిమా చూడండి.. నచ్చితే ఆదరించండి’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఖయ్యూమ్ మాట్లాడుతూ– ‘‘నేను చాలా సినిమాలు చేశా. అయితే రిలీజ్‌కు ముందు నుంచే ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది’’ అన్నారు. ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రియలిస్టిక్‌గా చేసిన చిత్రమిది. అలీగారి వల్లే ఈ సినిమా రిలీజ్ వరకు వచ్చింది’’ అన్నారు గౌతమ్ రాజ్ కుమార్. -
మనోళ్లు ఐదుగురు
దుబాయ్: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటుదక్కింది. కెప్టెన్ పృథ్వీ షాతో పాటు మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, కమలేశ్ నాగర్కోటి, అనుకూల్ రాయ్‌లు ఈ టీమ్‌లో ఉన్నారు. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకే బెర్తు దక్కగా... నాలుగోసారి చాంపియన్ అయిన భారత ఆటగాళ్లే ఐదుగురు ఉండటం విశేషం. ఐసీసీ జట్టు: రేనార్డ్ వాన్ (కెప్టెన్, దక్షిణాఫ్రికా), పృథ్వీ షా, మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, నాగర్కోటి, అనుకుల్ రాయ్ (భారత్), ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), మక్వెటు (వికెట్ కీపర్), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), కైయిస్ అహ్మద్ (అఫ్గానిస్తాన్), షహీన్ ఆఫ్రిది (పాకిస్తాన్), 12వ ఆటగాడుగా అలిక్ అథనాజ్ (వెస్టిండీస్). -
బృందావనంకి ఫోర్ పిల్లర్స్
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఆశీస్సులతో శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.అర్.ఐ ) నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటుల వివరాలను చిత్రబృందం వెల్లడించింది. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘నా కథకి కొత్తవాళ్లతో సినిమా చేయాలని నిర్వహించిన ఆడిషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. నలుగురు ప్రధాన తారాగణం మినహా మిగిలిన పాత్రలకు చాలామంది కొత్తవాళ్లని తీసుకున్నాం. ప్రధాన తారాగణంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు, నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్), థర్టీ ఇయర్స్ పృ«థ్వీ నటిస్తారు. వీరు నలుగురూ నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. జనవరి 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘అదుర్స్’ రఘు, బొడ్డ నారాయణ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: సి. రాంప్రసాద్. -
'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ
టైటిల్ : మీలో ఎవరు కోటీశ్వరుడు జానర్ : సెటైరికల్ కామెడీ తారాగణం : పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, రఘుబాబు సంగీతం : డిజె వసంత్ దర్శకత్వం : ఇ. సత్తిబాబు నిర్మాత : కె కె రాధామోహన్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సెటైరికల్ కామెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు. తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? కథ : ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్‌గా తాగేసి.. కారును డివైడర్‌కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్‌తో ప్రేమలో పడుతుంది ప్రియా. ముందు కాస్త బెట్టు చేసినా ఫైనల్‌గా ప్రశాంత్ కూడా ప్రేమలో పడతాడు. తమ ప్రేమకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా.., మల్టీ మిలియనీర్ అయిన ప్రియా త్రండి మాత్రం ఏబీఆర్(మురళీ శర్మ) అంగీకరించడు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్‌ని అవమానిస్తాడు. ప్రశాంత్ మాత్రం డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్‌లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. జీవితంలో ఒక్క హిట్ కూడా ఇవ్వని దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) డైరెక్టర్‌గా, 30 ఏళ్లుగా జూనియర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయిన వీరబాబు( పృథ్వీ) హీరోగా సలోని హీరోయిన్గా తమలపాకు పేరుతో సినిమా ప్లాన్ చేస్తాడు. చివరకు రోల్డ్ గోల్డ్ రమేష్ తెరకెక్కించిన తమలపాకు సినిమా రిలీజ్ అయ్యిందా..? అనుకున్నట్టుగా ఏబీఆర్ నష్టపోయాడా..? ప్రశాంత్, ప్రియా ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రెండు విభిన్న కథలను ఓకె కథలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇ సత్తిబాబు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండు కథలను కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. ఇప్పటికే తనకు కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న సత్తిబాబు, ఈ సినిమాతో పేరడీ కామెడీని కూడా బాగానే డీల్ చేశాడు. సినీ రంగం మీదే సెటైరికల్‌గా తెరకెక్కించిన కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. డిసె వసంత్ సంగీతం బాగుంది. ఎక్కువగా పాత సినిమా పాటలనే వాడుకున్నా.. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ పృథ్వీ క్యారెక్టర్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఓవరాల్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. కడుపుబ్బా నవ్వించే సెటైరికల్ కామెడీ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నానీకి పోటి వస్తున్నకామెడీ స్టార్లు
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమాతో అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇద్దరు కామెడీ స్టార్లు మాత్రం నాని స్పీడుకు బ్రేకులు వేసేందుకు రెడీ అవుతున్నారు. తొలి సారిగా హీరోలుగా మారుతున్న ఇద్దరు కామెడీ స్టార్లు డిసెంబర్ 23నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్ కమెడియన్‌గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో తెరకెక్కిన మీలో ఎవరు కోటీశ్వరుడుతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాలు డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి. నాని సినిమా కూడా కామెడీ ఎంటర్టైనరే కావటంతో ఈ రెండు సినిమాల ప్రభావం నాని సినిమా మీద పడే అవకాశం ఉంది. ఈ కామెడీ స్టార్ లు నాని స్పీడుకు బ్రేకులేస్తారేమో చూడాలి. -
స్ఫూఫ్ సూపర్ స్టార్ పృధ్వీ తో చిట్‌చాట్
-
బాయిలింగ్ స్టార్ 30 - ఇయర్స్ ఇండస్ట్రీ!
-
వినోదం 100% మూవీ స్టిల్స్
-
సునీల్ బర్త్ డే పన్ క్షన్