ప్రతీ ఏడాది ఏదో ఒక సామాజిక కార్యక్రమం కోసం సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇబ్బందుల్లో ఉన్నవారికి కాస్తంత చేయూతను అందిస్తుంటుంది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు.
ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సారి లానే ఈ సారి కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మంచి కాజ్ కోసమే క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం జరుగుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ గారు యుఎస్ లోని
హ్యూస్టెన్‌లో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న సౌత్ ఆఫ్రీకాలో క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆడాము.
మరొకసారి బ్లైండ్ ఛారిటీకోసం క్రికెట్ ఆడటం జరిగింది. అలానే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీ కోసం మ్యాచ్ ఆడటం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17న జరగనుంది. అలానే ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజషన్‌తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్‌ను ఆడటానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు హ్యూస్టెన్‌లో, నెక్స్ట్ న్యూ జెర్సీ, ఆతరువాత ఫ్లోరిడా ఇలా ఆల్ ఓవర్ ది యూస్‌లో మ్యాచ్‌లను ఆడనున్నాము. చాలా స్ట్రాంగ్ టీమ్‌తో వెళ్తున్నాము’. అంటూ తెలియచేసారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మంచి కాజ్ కోసం ఆడుతున్నాము.. సీరియస్‌గా గెలవాడానికే ఆడనున్నాము. మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఆడటం డిఫరెన్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది’ అన్నారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో నేను క్రికెట్ టీమ్‌లో భాగం అవ్వాలని ఉంది. అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్, తరుణ్ నన్ను సపోర్ట్ చేశారు. 1992లో రంజీ ట్రోఫీ టీమ్‌లో నేను మెంబర్.. బాగానే ఆడేవాణ్ణి. ఇప్పడు ఈ టాలీవుడ్ క్రికెట్ టీమ్‌లో ఆడటం సంతోషంగా ఉంది’ అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని సంవత్సరాలుగా టీసీఏ మంచి కాజ్ కోసం ఆడుతూనూనే ఉంది. అదే దిశగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఈవెంట్ చేయడం వారి ఆధ్వర్యంలో టిసిఎ క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. ఆగస్టు 15న యూఎస్ లో ఫ్లాగ్ హ్యస్టింగ్ చేసి 17న మ్యాచ్‌ను ప్రారంభించనున్నాము. అక్కడ ఉన్న బిడ్డింగ్ టీమ్‌ను సెలెక్ట్ చేయనున్నారు. వారు కూడా మాపై గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఇండియన్స్‌తో మేము ఆడటం చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ప్రతి ఒక్క ఇండియన్ ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు. ఎన్నో మంచి కాజ్‌ల కోసం ఆడిన మేము ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment