శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది’అన్నారు నటుడు శ్రీకాంత్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ ‘గేమ్ ఛేంజర్’లో నా గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా నాన్నగారి గెటప్ చూసే నాకు ఈ పాత్ర ఇచ్చారు. ఓ సారి ఆ గెటప్ వేసుకొని ఇంటికి వెళ్తే.. నన్ను చూసి మా అమ్మ షాకయ్యింది. అప్పుడే నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అర్థమైంది.
→ నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమాకు ముఖ్యమైన క్యారెక్టర్ నాది. ఇంత మంది అవకాశం రావడం నా అదృష్టం.
→ శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.
→ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి పని చేశాడు. అప్పుడు రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు.
→ ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.
→ అందరి డేట్లు సెట్ అవ్వకపోవడం వల్లే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్‌లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.
→ ప్రస్తుతం రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment