రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేసింది. శంకర్ శైలీలోనే ఈ సినిమా ట్రైలర్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్‌లోనే చూపించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నందన్, అప్పన్న పాత్రల్లో నటించబోతున్నాడు. ఈ రెండు పాత్రలను ట్రైలర్‌లో పరిచయం చేశారు. అలాగే కియరా అద్వానీ, అంజలి పాత్రలు కూడా ఎలా ఉండబోతున్నాయని ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించారు. తమన్ బీజీఎం బాగుంది. వీటన్నింటికంటే ఎక్కువగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శంకర్ సినిమాల్లో గతంలో ఎప్పుడు చూడలేనన్ని డైలాగ్స్ ఈ చిత్రంలో చూడబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
గేమ్ ఛేంజర్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్న డైలాగ్స్ ఇవే.
→ కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపేడితే.. పెద్దగా దానికి వచ్చే నష్టమేమి లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం.. నేను మీ దగ్గర అడుగుతుంది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే (రామ్ చరణ్)
→ ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ.. ఒప్పుకో(అంజలి)
→ కలెక్టర్‌కి ఆకలేస్తుందట.. ఓ ముద్ద ‘అన్నం’ అడుగుతున్నాడు.
→ నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌వి..నేను చనిపోయే వరకు ఐఏఎస్
→ మా పార్టీ సేవ చేయడానికే కానీ.. సంపాదించడానికి కాదు
→ అర్థం అయింది రా(ఎస్ జే సూర్య).. అయిందా రాసివ్వరా( చరణ్).. ‘రా’నా?(సూర్య).. ‘రా’కి రా.. సర్‌కి సార్(చరణ్)
→ ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’
Comments
Please login to add a commentAdd a comment