ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో రామ్ చరణ్(Ram Charan) ముందు వరుసలో ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరాడు. ఆయన నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినా.. చరణ్‌లో మాత్రం కించిత్తు అహం కూడా పెరగలేదు. ఆయనపై వచ్చిన రూమర్స్ కూడా చాలా తక్కువే. నిర్మాతలతో పాటు అందరితోనూ చాలా అనోన్యంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తోటి నటీనటులు చెబుతుంటారు. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త రామ్ చరణ్‌లో మంచితనం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తుంది. గేమ్ ఛేంజర్ కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.
(చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా?)
పెరిగిన బడ్జెట్
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల అనుకున్నారట. అందులో రామ్ చరణ్ రెమ్యునరేషన్‌నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది. చరణ్ కూడా ముందే అంతే స్థాయిలో తీసుకుంటానని చెప్పారట. కానీ బడ్జెట్ పెరగడంతో రెమ్యునరేషన్ తగ్గించారట. ఈ సినిమాకు మొత్తంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతోనే బడ్జెట్ పెరిగింది.
చరణ్‌తో పాటు శంకర్ కూడా
రామ్ చరణ్‌కు మొదటి నుంచి ఒక అలవాటు ఉందట. సినిమా ఒప్పుకున్న వెంటనే రెమ్యునరేషన్ తీసుకోడట. షూటింగ్ మొత్తం పూర్తయిన చెప్పిన అమౌంట్ తీసుకుంటాడు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. తొలుత రూ. 100 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. కానీ బడ్జెట్ పెరగడంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ చిత్రానికి అది చాలా తక్కువ రెమ్యునరేషనే. శంకర్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించి రూ. 35 కోట్లతో సరిపెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మనసు చాలా మంచిది..తక్కువే తీసుకొని ఉంటాడని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment