Tarun
-
తరుణ్ సంచలనం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్‌లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శ్రియాన్షి మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్‌కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
హత్య చేసి.. ఆపై ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్‌స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్‌రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్‌లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన తేజస్ బెయిల్‌పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్‌లు ప్రగతినగర్‌కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్‌లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్‌గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్‌పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్‌లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్‌కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్‌తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
విజేత తరుణ్ మన్నేపల్లి
కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ టైటిల్ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై 21–15, 21–16తో అనుపమ గెలుపొందింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా రన్నరప్‌గా నిలిచింది. మనీషా – సంజయ్ శ్రీవత్స జోడి ఫైనల్లో 21–9, 7–21, 12–21తో వాంగ్ టిన్ సి – లిమ్ చూ సిన్ (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది. టైటిల్ సాధించే క్రమంలో తరుణ్ సహచరుడు గగన్ బల్యాన్, 2022 వరల్డ్ జూనియర్ చాంపియన్íÙప్ రన్నరప్ శంకర్ ముత్తుసామి, దిమిత్రీ పనరియన్ (కజకిస్తాన్), ఏడో సీడ్ లీ డ్యూక్ (వియత్నాం)లను ఓడించాడు. -
టైటిల్ పోరుకు తరుణ్
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 190వ ర్యాంకర్ తరుణ్ 21–8, 21–7తో ప్రపంచ 78వ ర్యాంకర్ లె డక్ ఫాట్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 76వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా)తో తరుణ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 22–20, 21–14తో దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 15–21, 15–21తో వోంగ్ తియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోగా... సెమీఫైనల్లో మనీషా–సంజయ్ (భారత్) ద్వయం 21–16, 10–21, 21–14తో కొసియెలా–తనీనా (అల్జీరియా) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ ఖరారైంది. ఫైనల్ పోరు ఇద్దరు భారత క్రీడాకారిణులు అనుపమా ఉపాధ్యాయ, ఇషారాణి బారువా మధ్య జరగనుంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు తారలపై నమోదు కేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు తెలిపింది. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కె నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ ఆనవాళ్లు లేవు! ఈ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్ తీసుకున్నారు. కానీ కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది. ఆరు కేసులు కొట్టివేత పైగా డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో అవకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది. చదవండి: 30 ఏళ్లుగా వెండితెరకు దూరం.. మర్చిపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకునేలా చేస్తానంటూ.. -
నలుగురు స్నేహితుల కథ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విక్రమ్ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్’. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
స్నేహితుల కథ
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి. -
WC final 2023: కప్ భారత్‌దే.. రోహిత్ శర్మదే కీలక పాత్ర: వెంకటేశ్,తరుణ్
దేశమంతా క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా మనమంతా టీమిండియా అభిమానులం అన్న చందంగా టీమిండియాకు జై కొడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ మన సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ జాబితాలో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా కప్ కొడుతుందని హీరోలు విక్టరీ వెంకటేశ్, తరుణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే ఈ ఇద్దరు హీరోలు..నేడు జరగనున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్మ్యాచ్ని ప్రత్యక్షంగా తిలకించడం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘అహ్మదాబాద్ వెళ్తున్నా.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చూసిన హిట్టింగ్ ఇంకా మర్చిపోకముందే ఫైనల్ మ్యాచ్ వచ్చేసింది. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను తిలకించడానికి అహ్మదాబాద్ వెళుతున్నాను. ఈసారి కప్ సాధిస్తాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీం అన్ని విభాగాల్లో దూకుడుగా ఉంది. వరల్డ్ కప్ ప్రారంభంలో రోహిత్ శర్మను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాను. వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీని అభినందించే అవకాశం లభించింది’అని అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ఈసారి వరల్డ్ కప్ కచ్చితంగా భారత్‌దే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటుందని అనుకుంటున్నాను. ఈ రోజు ఆటలో రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించనున్నారు. ప్రారంభ ఓవర్లలో తను వేసే పరుగుల పునాది విజయానికి బాటలా నిలుస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంద శాతం విజయానికి చేరువలో ఉన్నాం. క్రికెట్ చరిత్రలో మరోసారి భారత్‌ను సగర్వంగా సువర్ణాక్షరాలతో లిఖించే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. -
రోటి.. కపడా.. కామెడీ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘‘వినోద ప్రధానంగా సాగే ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్.జి. -
ఇదే ఆఖరి మరియు మొదటి సినిమా అవుతుంది అని అనుకోలేదు
-
నాకు ఆ గేమ్ అంటే చాలా ఇష్టం : హీరో తరుణ్
-
మాకు చాలా బిజినెస్ లు ఉన్నాయి : హీరో తరుణ్
-
ఆమె ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా : హీరో తరుణ్
-
తరుణ్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు..?
-
పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!
కొన్నిరోజుల ముందు ఓ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకప్పటి లవర్ బాయ్, హీరో తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ తెగ రూమర్స్ వచ్చాయి. చాలామంది ఇది నిజమే అనుకున్నారు కూడా. ఆ నోట ఈ నోట పడిన ఈ వదంతులు ఇప్పుడు అతడి వరకు చేరుకున్నాయి. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. అసలు నిజాన్ని తరుణ్ బయటపెట్టాడు. పెళ్లి రూమర్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్.. లవర్ బాయ్ ఇమేజ్‌తో తెలుగులో చాలా సినిమాలు చేశాడు. కారణం ఏంటనేది పక్కనబెడితే కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కూడా అలానే తరుణ్ మ్యారేజ్ ఫిక్సయింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) నిజం కాదు దాదాపు మీడియా చాలావరకు ఈ విషయాన్ని రాసింది. దీంతో ఈ విషయమై స్వయంగా తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. 'ఈ ప్రచారం నిజం కాదు. నిజంగా నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు తెలియడం లేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పుకారు ఎలా? తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడుతూ... త్వరలోనే కొడుక్కి పెళ్లి చేస్తామని అన్నారు. అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో పలు పేర్లు వినిపించి, చివరకు మెగాఫ్యామిలీ దగ్గర వచ్చి ఆగాయి. అయితే ఇప్పుడు స్వయంగా తరుణ్ దీనిని ఖండించడంతో ఇవి కేవలం వదంతులు మాత్రమే అని తేలిపోయాయి. View this post on Instagram A post shared by Tharun (@actortarun) (ఇదీ చదవండి: స్టార్ సింగర్ సర్ప్రైజ్.. ఒక్కో డ్రైవర్‌కు రూ.82 లక్షలు) -
త్వరలోనే తరుణ్ పెళ్లి..?, ఆసక్తికర విషయాలు వెల్లడించిన రోజా రమణి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుల్లో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పదికి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక నువ్వేకావాలి చిత్రంతో స్టార్ స్టేటస్‌ని పొందాడు. ఈ మధ్య కాలంలో తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ.. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలంటే తరుణ్ ఉండాల్సిందే. లవర్ బాయ్‌గా ఎంతో మందిని అభిమాలను సంపాదించుకున్నాడు. బిజినెస్‌లో బిజీ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే తరుణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాగే అతని పెళ్లి గురించి కూడా రూమర్స్ వచ్చాయి. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) తాజాగా వీటిపై తరుణ్ తల్లి, నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి స్పందించారు. తరుణ్‌పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. ‘తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక వెబ్ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను. అందరి ఆశిస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను’అని రోజా అన్నారు. (చదవండి: స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..) ఇంకా తరుణ్ గురించి చెబుతూ.. ‘తరుణ్ రోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం అభిమానుల ఆశిస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది ఏది లేదు. అది ఎలాగో అవుతుంది’అని రోజా చెప్పుకొచ్చారు. -
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన తరుణ్
-
క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాదు.. మనది కేడర్ బేస్డ్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘మనది క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్ బూత్ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ భేటీ మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
‘ఓటర్లను ప్రభావితం చేసేందుకు మునుగోడులో ఫోన్ల ట్యాపింగ్’
సాక్షి, న్యూఢిల్లి: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్. ఫోన్ల ట్యాపింగ్ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు తరుణ్‌చుగ్. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి -
దళితులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: తరుణ్ చుగ్
మునుగోడు: ఎనిమిదేళ్లుగా దళితులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నికలో దళితులు బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. శనివారం మునుగోడులో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని, ఆ వర్గాలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి నిలువునా ముంచాడని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అక్కడి దళితులకు దళితబంధు ఇచ్చారని, ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మోసపూరిత హామీలు గుర్తుపెట్టుకుని మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అగౌరవ పరిస్తే.. రాష్ట్రపతి పదవి ఒకమారు దళితుడికి, ఒకమారు గిరిజన మహిళకు కట్టబెట్టిన ఘనత బీజేపీదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 12 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి..: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా అహంకారం ఎక్కువైందని విమర్శించారు. నవంబర్ 6న మునుగోడు ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాష అ«ధ్యక్షతన జరిగిన సభలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ మునుస్వామి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, గంగిడి మనోహర్ రెడ్డి, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ కట్టుకథ : తరుణ్ చుగ్
-
వేదికపై రచ్చ.. అందరూ చూస్తుండగా నటుడికి ముద్దు పెట్టిన శ్రియ!
టాలీవుడ్ హీరో తరుణ్, శ్రియ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'నువ్వే నువ్వే '. ఈ సినిమా విడుదలై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ ,దర్శకుడు త్రివిక్రమ్, నటుడు ప్రకాష్‌రాజ్‌తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రియ మాట్లాడుతూ.. 'ఇంత అందమైన స్టోరీ రాసిన త్రివిక్రమ్ సార్‌కు నా ధన్యవాదాలు. ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీరు తండ్రిలాంటి వారు. మా పేరెంట్స్‌లాగే నాకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా తన కో స్టార్ తరుణ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అమేజింగ్ కో స్టార్ అంటూ ఆకాశానికెత్తేసింది. తరుణ్‌ను పొగుడుతూనే వేదికపైనే అందరూ చూస్తూండగా ముద్దు పెట్టేసింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.' ఈ సినిమా ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సభ్యులంతా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. -
తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకరు. మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన తరుణ్ బాలనటుడిగా మూడు నంది అవార్డులు తీసుకున్నాడు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే సినిమా రిలీజై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో తరుణ్ మాట్లాడుతూ.. 'నువ్వే నువ్వే వచ్చి 20 ఏళ్లు గడిచాయి. నాకు మాత్రం ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు ఉంది. ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్‌లో నా సినిమాలోని కామెడీ సీన్స్ నేనే చూసుకుంటా! త్రివిక్రమ్‌గారి విషయానికి వస్తే నా తొలి సినిమాకు ఆయన డైలాగులు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా చేశాను. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా తనకు నేనే ఫస్ట్ హీరోను. ఇప్పటికీ నాకు బయట ఎవరు కలిసినా నువ్వే నువ్వేలాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతుంటారు. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఎమోషనలయ్యాడు. స్టేజీపైనే తన కన్నీళ్లు తుడుచుకుని నిలబడ్డాడు. చదవండి: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్, హీరో తండ్రి ఏమన్నాడంటే? కంటెంటే రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. -
నువ్వే.. నువ్వే... 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
TRS ను BRS గా మార్చడంతో ఒరిగేదేమి లేదు : తరుణ్ చుగ్
-
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్‌గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
మొక్కుబడి కార్యక్రమాలొద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చే కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించకుండా చిత్తశుద్ధితో పని చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీలను బీజేపీ ఆదేశించింది. పార్టీ సభ, కార్యక్రమం వంటివి ఏమైనా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రచారం కోసం ఫ్లెక్సీలు పెట్టడం వంటివి చేయొద్దని సూచించింది. పార్టీ జెండాలపై కమలం పువ్వు గుర్తు మినహా ఇతర ఫోటోలే ఉండకూడదని, దీనికి భిన్నంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఆదివారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోర్ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. అసెంబ్లీ వారీగా కార్యక్రమాలు చేయాలి : ‘అసెంబ్లీ వారీగా కార్యక్రమాలు చేయాలి. ప్రజల్లో నలుగుతున్న అంశాలపై పోరాటం చేయాలి. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనుల విషయంలో ఉద్యమించాలి. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’బైక్ ర్యాలీలను కొనసాగించాలి. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ సానుకూల గాలి వీస్తోంది. కామారెడ్డి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయి. కార్యకర్తలపై దాడులు, కేసులు పెడుతున్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది..’అని భరోసా ఇచ్చారు. మోదీ 100%..నడ్డా 90%: ‘పార్టీ కార్యాలయాల బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీలు మార్చాలి. ప్రధాని మోదీ ఫొటో 100 శాతం, అధ్యక్షుడు నడ్డా ఫొటో 90 శాతం ఉండాలి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ మేరకు ఫొటోలు ఉండాల్సిందే. వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం’అని సంజయ్ హెచ్చరించారు. మోదీ జన్మదినం సందర్భంగా..: ‘ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే కార్యక్రమాలపై జిల్లాల వారీగా 10 మందితో కమిటీలు వేయాలి. రక్తదాన, వైద్య, క్రీడా శిబిరాలు, మోదీ జీవిత విశేషాలు.. కేంద్ర సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషన్ నిర్వహించాలి. దేశంలో వినూత్నంగా స్ఫూర్తిదాయక కార్యక్రమా లు నిర్వహించే 25 బెస్ట్ మండలాల్లో, 10 మంది జిల్లా అధ్యక్షులను గుర్తించి ఢిల్లీలో సన్మానం చేస్తారు..’అని చెప్పారు. -
ఆ వార్తలో నిజం లేదు : హీరో తరుణ్
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. (చదవండి: గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా!) అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు.ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. -
త్రివిక్రమ్ సినిమాతో హీరో తరుణ్ రీఎంట్రీ!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటాడు. తాజాగా SSMB28 సినిమా కోసం లవర్ బాయ్ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఇక కేసీఆర్ అవినీతి పాలనకు తెర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా ప్రజాసంక్షేమాన్ని మరిచి నిరంకుశత్వంతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు తెరదించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. మునుగోడు సమర భేరిలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ‘మునుగోడు సమర భేరి’బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తరుణ్ ఛుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మునుగోడు సమర భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఛుగ్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విషయంలో నైతిక విజయం సాధించాం.. అమిత్ షా మునుగోడు సభకు భయపడే సీఎం కేసీఆర్ శనివారం మునుగోడులో బహిరంగ సభ నిర్వహించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను భయపెట్టి ఫామ్‌హౌస్ నుంచి బయటకు రప్పించగలగడం బీజేపీ నైతిక విజయమని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టానికి తెరలేపనుందన్నారు. బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని ఛుగ్ వివరించారు. -
Telangana Politics: మిగిలింది మరో 450 రోజులే!
కోరుట్ల/ సాక్షి, హైదరాబాద్: ‘మిగిలింది మరో 450 రోజులు మాత్రమే.. ఆ తర్వాత కేసీఆర్ అహంకార పూరిత కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆలోచనలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బంగారు తెలంగాణ పేరిట ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి బైబై చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్‌తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. బంగారు తెలంగాణ సాకారమవు తుంది..’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలో ‘గల్లీలో బీజేపీ– ఢిల్లీలో బీజేపీ ’ పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువత కలలను కాలరాసిన కేసీఆర్ రాష్ట్ర సాధనతో ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ యువత కలలను కాలరాసిన సీఎం కేసీఆర్, తన కుటుంబంలో అందరికీ రాజకీయ ఉపాధి కల్పించారని తరుణ్ ఛుగ్ ధ్వజమె త్తారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసి న ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యువతలో నైపుణ్యాన్ని వెలికితీయ డానికి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గల్ఫ్ వలస బాధితుల కష్టాలు తొలగించడానికి ఎన్ఆర్ఐ పాలసీ అమల్లోకి తెస్తామన్నారు. ఈ ప్రాంతవాసుల సౌలభ్యం కోసం ముంబైకి రెగ్యులర్‌గా రైలు నడిచే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సురభి నవీన్‌కుమార్ బీజేపీలో చేరారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలి అంతకుముందు హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతిలతో ఛుగ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధికార టీఆర్ఎస్పై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత బండి సంజయ్ పాదయాత్రలో స్పష్టమవుతోందని, దీనిని పార్టీకి అను కూలంగా మలుచుకునేందుకు రాష్ట్రం నలుమూలలా ఏక కాలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమం కింద రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమితు లైన కేంద్ర మంత్రులతో కలిసి ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేయాలన్నారు. కాగా నల్లగొండ పార్లమెంటు పరిధిలో కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి, హైదరాబాద్‌లో జ్యోతిరాదిత్య సింధియా పర్యటనలు పూర్తయ్యాయని, ఈనెల 21నుంచి 23 వరకు ఆదిలాబాద్‌లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పర్యటన ఉంటుందని ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీల గురించి సమావేశంలో చర్చించారు. ఈనెల 21న మునుగోడులో అమిత్‌షా బహిరంగసభను విజయవంతం చేయడంపై, 27న బండి సంజయ్ పాదయాత్ర ముగిసిన తర్వాత నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశాలపై కూడా మాట్లాడారు. -
ఓటమి భయంతోనే కేసీఆర్ దాడులు: తరుణ్ ఛుగ్
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌లో ఓటమి భయం నెలకొందని, అందువల్లే పోలీసుల సాయంతో బీజేపీ నాయకులపై దాడు లుచేయిస్తున్నారని బీజేపీ నేత తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల గురించి ప్రసంగాలు చేసే కేసీఆర్, తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభు త్వానికి గుడ్‌బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఛుగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తన నివా సంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి పాదయాత్ర ఆగదని, త్వరలో నాలుగు, ఐదో విడత యాత్ర చేపడ్తామని, ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. -
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే!
మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతిపథంపై పరుగులెడుతోంది. ఏ అంతర్జాతీయ సంస్థ సర్వే చేసిన సరే... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్న నాయకుడిగా భారత ప్రధాని మోదీనే కితాబందుకుంటున్నారు. ‘బీజేపీ దక్షిణ భారతదేశంలో విస్తరించలేదు’ అన్న వాదనలను తప్పని రుజువు చేస్తూ ఇప్పటికే దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారమైన కర్నాటకలో కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే విజయవంతంగా కొనసాగుతోంది. బలమైన తెలంగాణ ఉద్యమం రాజేసిన సెంటిమెంటును అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన కేసీఆర్... నీళ్లు, నిధులు, నియామకాలు సహా ప్రజల ఆకాంక్షల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. భారతీయ జనతా పార్టీ... ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. దేశంలో నలుదిక్కులకూ విస్తరిస్తూ ఎప్పటికప్పుడు బలాన్నీ, ప్రాబల్యాన్నీ, ప్రభావాన్నీ పెంచుకుంటోంది. ‘బీజేపీ దక్షిణ భారతదేశంలో విస్తరించలేదు’ అన్న వాదనలను తప్పని రుజువు చేస్తూ ఇప్పటికే దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారమైన కర్నాటకలో కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే విజయవంతంగా కొనసాగుతోంది. అందుకే ప్రజలు మోదీ తరహా పాలన కావాలంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని రాజకీయ పండితులు తమ విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నారు. మోదీ నేతృత్వంలో ప్రగతి! ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతిపథంపై పరుగులెడుతోంది. ఏ అంతర్జాతీయ సంస్థ సర్వే చేసిన సరే... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్న నాయకుడిగా భారత ప్రధాని మోదీనే కితాబందుకుంటున్నారు. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’’ (అందరితో, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం) విధానంతో సంస్కరణ పథంలో నడుస్తూ, దేశంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారతీయుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతున్నారు. పేదింట పుట్టి, పేదల కష్టాలను స్వయంగా చవిచూసిన ప్రధాని పేదల జీవితాల్లో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, 2 కోట్ల కుటుంబాలకు పక్కా ఇండ్లను నిర్మించారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5 లక్షల విలువ గల ఉచిత చికిత్స అందిస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఉజ్జ్వల యోజన’ కింద 11 కోట్ల మహిళలకు గ్యాస్ కనెక్షన్లిచ్చారు. ‘ముద్ర యోజన’ కింద స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు. ‘జన్ ధన్ పథకం’ కింద 45 కోట్ల జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు తెరిపించి పేదలనూ, గ్రామీణులనూ సైతం ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చారు. ‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన’తో కరోనా విపత్తులో పేదలెవరూ పస్తులుండకుండా కడుపు నింపారు. స్వచ్ఛ భారత్, స్వనిధి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా... ఇలా చెప్పుకుంటే మోదీ పథకాలెన్నో పేదల కష్టాలకు తెరదించుతూ సులభతర జీవనాన్ని అందించేవే. 2014కు ముందు సామాన్యుడి ఊహకు సైతం అందని అంశాలెన్నో ఇప్పుడు వారి నిత్యజీవితంలో భాగమయ్యాయి. మోదీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సమాజంలో భారతదేశ గౌరవం పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ప్రపంచ దేశాలన్నీ మోదీ నేతృత్వంలోని భారత్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాయి. మోదీ దేశాభివృద్ధిలో కొత్త శకాన్ని ఆవిష్కరించేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నారు. సంస్కరణలు తీసుకురావడమే కాదు... ‘‘రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్’’ నినాదంతో ఆ సంస్కరణ ఫలాలను 140 కోట్ల మంది భారతీయులకు చేరవేస్తున్నారు. 2014 వరకు మందగమనంతో సాగిన ఆర్థిక వృద్ధి నేడు జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. అప్పుడు ఉత్పత్తి తిరోగమనంలో ఉంటే, ఇప్పుడు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో వాటాను గణనీయంగా పెంచుకుంటున్నాయి. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందంటే దానికి కారణం నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలే! ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ బలమైన తెలంగాణ ఉద్యమం రాజేసిన సెంటిమెంటును అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన కేసీఆర్... నీళ్లు, నిధులు, నియామకాలు సహా ప్రజల ఆకాంక్షల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఆశలపై నీళ్లు పోసింది. కనీసం సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి, నిజాం పోకడలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. సకల జనులు, సబ్బండ వర్ణాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం మొత్తం ఒక కుటుంబం చేతిలోనే కేంద్రీకృతం కావడాన్నీ సహించలేకపోతున్నారు. ‘ప్రజల తెలంగాణ అనుకుంటే దొరల తెలంగాణ వచ్చిందా’ అంటూ గొల్లుమంటున్నారు. ప్రధాని∙మోదీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేస్తుంటే... ఇక్కడ కేసీఆర్ మాత్రం కుదిరితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్‌హౌస్ తప్పితే... సచివాలయానికి మచ్చుకైనా రావడం లేదు. ప్రధాని వివిధ మాధ్యమాల ద్వారా నిత్యం ప్రజలతో సంభాషిస్తూ ఉంటే... మంత్రులకు సైతం అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి కేసీఆర్. అవినీతిరహిత, పారదర్శకత పాలనతో మోదీ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పాదుకొల్పితే... అవినీతికి గేట్లెత్తుతూ, పారదర్శకత మచ్చుకైనా లేకుండా అన్నింటా గోప్యత పాటిస్తూ, జవాబుదారీతనానికి నీళ్లొదిలిన ఘనత కేసీఆర్‌దే. అందుకే ప్రజలు మోదీ తరహా పాలన కావాలంటున్నారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ ‘డబుల్ ఇంజన్ పాలన’ రావాలని కోరుకుంటున్నారు. ‘డబుల్ ఇంజన్’ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతిరహిత పారదర్శక పాలన. ‘డబుల్ ఇంజన్’ అంటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పట్టం కట్టే పాలన. ‘డబుల్ ఇంజన్’ అంటే నియంతృత్వానికి తెరదింపి ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే పాలన. ‘డబుల్ ఇంజన్’ అంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడి, ప్రజల గోడు పట్టించుకునే పాలన. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ, ఆ ప్రయోజనాలను అర్హులందరికీ అందించే పాలన. కేంద్రంతో సమన్వయం చేసు కుంటూ మరిన్ని నిధులు రాబట్టే పాలన. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవేవీ సాధ్యం కావడం లేదు కాబట్టే ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్’కు మొగ్గు చూపుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పతనం మొదలైంది. 2018లో 7.1 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఆరు నెలల తిరక్కముందే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లతో 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. అదీ టీఆర్ఎస్ కంచుకోటలుగా చెప్పుకునే కరీంనగర్, స్వయంగా కేసీఆర్ కూతురు పోటీ చేసిన నిజామాబాద్‌తో పాటు ఆదీవాసీలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, హైదరాబాద్ సిటీలో భాగమైన సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయాలు సాధించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారనడానికి ప్రబల నిదర్శనం. తెలంగాణ అసెంబ్లీలో 1 నుంచి 3కు చేరుకున్న బీజేపీ బలం రేపు జరిగే ఎన్నికల్లో 103కు చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పప్పులుడకవు. తెలంగాణ సెంటిమెంటు, అలవికాని హామీలు, అరచేతిలో వైకుంఠం చూపించే మోసపు మాటలు... వీటినేవీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే తాను ముక్కయిన కాంగ్రెస్ ఎప్పుడో ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, వారు హస్తానికి చెయ్యిచ్చి, కారెక్కుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ ప్రజల విశ్వసనీయత చూరగొంటూ, రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ఫోకస్ పెంచింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భాగ్యనగరంలో నిర్వహించడం తెలంగాణకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందనడానికి నిదర్శనం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుస్నాబాద్ వరకు సాగిన మొదటి విడత అయినా... జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి తుక్కుగూడ వరకు సాగిన రెండో విడత అయినా... ఏ జిల్లా వెళ్లినా, ఏ నియోజకవర్గం వెళ్లినా ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘ఈ టీఆర్ఎస్ పాలన మాకొద్దు, మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ పాలన కావాలని! ఆగస్టు 2న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానుంది. అవినీతిమయమైన టీఆర్ఎస్ పాలనలో తామెదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టేందుకు యాదాద్రి నుంచి వరంగల్ భద్రకాళి ఆలయం వరకు సాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘‘ప్రజా గోస – బిజెపి భరోసా’’ పేరిట వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకుల పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వసనీయతే ప్రామాణికంగా జరిగే రానున్న ఎన్నికల్లో ఆశలను వమ్ము చేసిన టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పారదర్శక పాలనతో దేశాన్ని విశ్వగురుగా నిలపాలన్న ధ్యేయంతో అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీకి పట్టం కట్టడమూ ఖాయం. తరుణ్ ఛుగ్ వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ -
దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ సవాల్ చేశారు. ఎన్నికలపై కేసీఆర్ చేసిన సవాల్‌ను స్వాగతిస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మంచి పనులేవైనా త్వరగా జరగాలని, అందుకే కేసీఆర్ అసెంబ్లీని త్వరగా రద్దు చేయాలన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తానన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని.. ప్రజలు 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు ఈ విషయాన్ని గుర్తు చేస్తారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో వణుకు తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, పరేడ్ గ్రౌండ్స్ సభలో లక్షల మంది ప్రజలు మోదీ.. మోదీ.. అని చేసిన నినాదాలను చూసి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం వణికిపోతోందని తరుణ్ ఛుగ్ అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి చేసిన అవినీతి పాపాలుగా మారి కేసీఆర్‌ను భయపెడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశిస్తూ వాడిన అసభ్య పదజాలం సరికాదన్నారు. తెలంగాణలో ‘బీజేపీ డబుల్ ఇంజన్’ సర్కారు ఖాయం ‘‘ప్రధాని మోదీ భారతదేశాన్ని విశ్వ గురువు గా మార్చాలనుకుంటే కేసీఆర్‌కు ఉన్న సమ స్య ఏంటిæ? కేసీఆర్ దేశ ప్రగతికి ఎందుకు వ్యతిరేకం?’’అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. ప్రజలపై భారం పడొద్దని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోల్ ధరలను తగ్గిస్తే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరలను ఏమా త్రం తగ్గించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డా యని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఫామ్‌హౌజ్‌లో విలాస జీవితం గడిపే సీఎంకు దేశ ప్రజల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ అంటే కేసీఆర్‌కు తెలుసా? దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తరుణ్ ఛుగ్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీ పరిస్థితులుంటే ఆదివారం రాత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారా? అని నిలదీశారు. కొన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ అని సీఎం కేసీఆర్‌తో ఏకీభవిస్తున్నానని.. బాలలపై నేరాల్లో, మిగులు రాష్ట్రాల జాబితా నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయిన జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేంద్రం, బీజేపీపై అనవసర విమర్శలు మాని.. తెలంగాణలో వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవడంపై కేసీఆర్ దృష్టి సారించాలని హితవు పలికారు. -
కౌంట్‌డౌన్ 520 రోజులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కు కౌంట్ డౌన్ 520 రోజులేనని బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పార్టీ నాయకులతో కలిసి విమానాశ్రయానికి వచ్చిన తరుణ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ అగ్రనేతలంతా వస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఈ సమావేశాల్లో, విజయ సంకల్ప్ సభలో బీజేపీ ప్రణాళికను వెల్లడిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 71 రోజుల పాటు నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తంచేశారు. బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మూడు రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారని, వారి మద్దతు కోరుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పాల్గొనే బీజేపీ సభను భారీ ఎత్తున జయప్రదం చేసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారని తరుణ్ చుగ్ తెలిపారు. -
కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి.. సుపరిపాలన నెలకొల్పడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే పుంజుకుందని.. మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసే దిశగా హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1 నుంచి 3వ తేదీ వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తరుణ్ చుగ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ్య ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు తరుణ్ చుగ్ మాటల్లోనే.. కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత చిన్నరాష్ట్రాల ఏర్పాటు ద్వారా వేగంగా అభివృద్ధి, సంక్షేమం, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది బీజేపీ నమ్మకం. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది. కానీ సీఎం కేసీఆర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తన కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారు. ఈ కుటుంబ, అవినీతి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి.. సుపరిపాలన నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ముందుకొచ్చినా తెలంగాణలోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. మరింత ఊతమిచ్చేందుకు.. నిజానికి కేవలం కార్యవర్గ భేటీ నిర్వహణతోనే ఇక్కడ సాధించేదేమీ లేదు. అయితే రాష్ట్రంలో దుష్టపాలన, మహిళలు, బలహీనవర్గాలపై దాడులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు వంటి అంశాల్లో బండి సం జయ్ నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీలో గణనీయ స్థానాలు సాధించడం ద్వారా పార్టీ బాగా పుంజుకుంది. దీన్ని మరింత విస్తృతపర్చుకుని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేలా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తాం. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ అత్యున్నత కార్యవర్గం చర్చించి.. ప్రాధాన్యతల పరంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మోదీ నామస్మరణ ఒక్కటి చాలు ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం రాష్ట్ర పార్టీ తన వంతు కృషి చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రధాని మోదీ పేరొక్కటి చాలు. దేశ ప్రజలకు ఆయన పేరే ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక మంత్రంగా మారింది. అదే బీజేపీకి శ్రీరామరక్ష. మోదీ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. సభ దిగ్విజయం అవుతుంది. కేసీఆర్, టీఆర్ఎస్ల చెవులు చిల్లులు పడేలా స్పష్టమైన సందేశాన్ని వినిపిస్తుంది. మా అంచనాలు మాకున్నాయి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనడానికి మా అంచనాలు మాకున్నాయి. పార్టీపరంగా ఉన్న వ్యవస్థతో ప్రజల మూడ్‌ను గమనించగలుగుతున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదన, టీఆర్ఎస్ వైఫల్యాలను చూస్తే.. ‘గోడ మీద రాత’ మాదిరిగా టీఆర్ఎస్ ఓటమి నిర్ణయమై పోయింది. బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదనేది ఒక అపోహ మాత్రమే. బూత్ స్థాయి నుంచీ మాకు పార్టీ యంత్రాంగం ఉంది. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం. ప్రజాకర్షక నాయకులు లేకున్నా మోదీ పేరు ప్రతిష్టలు, దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ప్రగతే ఓట్లు తెచ్చి పెడుతుంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మేం ఒకసారి గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు. అయినా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన పెద్దనేతలెవరూ మాకు అవసరం లేదు. వారిలో అధికశాతం అవినీతిపరులు, మరకలున్నవారే. కొందరు మంచి నేతలు కాలక్రమంలో బీజేపీలో చేరుతారు. పార్టీలో కుమ్ములాటలేవీ లేవు మాది క్రమశిక్షణ గల పార్టీ. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలేవీ లేవు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఆయా విషయాలపై అందరూ సర్దుకుంటారు. కాంగ్రెస్ అంతర్ధానమై పోయినట్టే.. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని మేం అనుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ కుచించుకుపోయి అంతర్ధానమయ్యే స్థితికి చేరింది. అది టీఆర్ఎస్ వర్గాల ప్రచారమే.. బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఎలాంటి దోస్తీ లేదు. టీఆర్ఎస్ వర్గాలే ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. బీజేపీ సొంతంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. -
మోదీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు: తరుణ్‌ఛుగ్
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమార్పులకు బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ నాంది కానుందని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్ అన్నారు. 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగసభ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమలుపుగా నిలవబోతుందని, దీని ద్వారా తెలంగాణలో భారీమార్పులు చోటుచేసుకో బోతున్నాయని చెప్పారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ మయూక్, జాతీయ సమావేశాల మీడియా సమన్వయకర్త ఎన్.రామచంద్రరావు లతో కలసి తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సభలో మోదీ ప్రసంగంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ‘మేధోమథన శిబిరం’లో మొత్తం 340 మంది ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఖరారు చేస్తారన్నారు. దేశవర్తమాన రాజకీయాలు, 8 ఏళ్ల మోదీ పాలనా విజయాలు, ప్రతినిధులు నిర్ణయించే అంశాలపై పలు తీర్మానాలు ఉంటాయన్నారు. దేశాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలను నిర్ణయిస్తారన్నారు. జూలై 1న పార్టీ ప్రధానకార్యదర్శులు ఎజెండాపై చర్చిస్తారని, 2న ఉదయం 138 మంది పదాధికారుల భేటీ ఉంటుందని, రెండో తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు కార్యవర్గ భేటీ, ఆపై పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ ఉంటుందని వివరించారు. కేసీఆర్‌కు బైబై చెప్పే టైమొచ్చింది.. ‘సీఎం కేసీఆర్‌కు ఇక బైబై చెప్పే టైమొచ్చింది. మునిగిపోతున్న తమ పడవను కాపాడుకునేందుకు ఆయన ఏం చేసినా ప్రయోజనం ఉండదు. భారత్‌లోనే నంబర్ వన్ అబద్ధపు హామీల సర్కార్ కేసీఆర్‌దే. అవినీతికి పరాకాష్టగా నిలిచింది’అని తరుణ్‌ఛుగ్ ధ్వజమెత్తారు. ‘ప్రజలకు బంగారు తెలంగాణ స్వప్నం చూపించి కేసీఆర్ పరివారం బంగారు కుటుంబం కలను నెరవేర్చుకుంది. టీఆర్ ఎస్ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు, ఉద్యమకారులకు ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారంతా తమ కు తీరని ద్రోహం, మోసం జరిగిందని వాపోతున్నా రు’అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు... ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. 8 ఏళ్ల మోదీ పాలనపై సంజయ్‌తో కేసీఆర్ బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. -
కరోనా ఎఫెక్ట్: డిమాండ్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే!
కోవిడ్–19తో జీవిత బీమా పరిశ్రమ వ్యాపార వ్యూహాల్లో పలు మార్పులు వచ్చాయని తెలిపారు ప్రైవేట్ రంగ బీమా సంస్థ బజాజ్ అలయంజ్ ఎండీ తరుణ్ చుగ్. కరోనా పరిస్థితుల టర్మ్ పాలసీలకు ఆదరణ వచ్చిందని, ఇది ఇకపైనా కొనసాగగలదని ఆయన పేర్కొన్నారు. సులభతర పాలసీలకు డిమాండ్ పెరుగుతోందని సాక్షి బిజినెస్ బ్యూరోకి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. బీమా రంగానికి కోవిడ్–19 పాఠాలు.. ప్రతి కంపెనీ తన వ్యాపార ప్రణాళికలను, కస్టమరుకు చేరువయ్యేందుకు అనుసరించే వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా కోవిడ్–19 చేసింది. పరిశ్రమ కూడా కొత్త రిస్కులకు వేగంగా అలవాటు పడింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వీసులు, ఉత్పత్తులు, ప్రక్రియలను రూపొందించుకుంది. కస్టమర్లు డిజిటల్ విధానానికి అలవాటు పడటంతో సర్వీసులు అందించడానికి కంపెనీలకు కొత్త మార్గం దొరికింది. అలాగే కోవిడ్ సంక్షోభంతో జీవిత బీమా పాలసీలు అందించే ప్రయోజనాలు కూడా కొంత పెరిగాయి. బీమాపై అవగాహన స్థాయి పెరగడంతో, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. పాలసీదారులు, సంబంధిత వర్గాలందరికీ సరళమైన, స్పష్టమైన విధంగా వివరాలను అందజేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. పాలసీలకు సంబంధించి కొత్త పరిణామాలు, ప్రీమియంలు ఎలా చెల్లించాలి, పత్రాలు ఎలా సమర్పించాలి లాంటి అంశాలన్నింటి గురించి పాలసీదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. కోవిడ్ క్లెయిముల పరిస్థితి .. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిష్పత్తి 98.48 శాతంగా ఉండగా, దాదాపు రూ. 1,374 కోట్ల మేర డెత్ క్లెయిమ్స్ చెల్లించాము. కోవిడ్ క్లెయిముల విషయానికొస్తే.. దాదాపు రూ. 74 కోట్లతో 1,300 క్లెయిములు సెటిల్ చేశాం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది అంచనా వేయాలంటే ముందుగా దాని తీవ్రత అర్థం కావాలి. అంతవరకూ వేచి చూడాల్సి ఉంటుంది. ప్రీమియంల పెంపు.. భారతదేశంలో టర్మ్ ప్లాన్ల ప్రీమియంలు.. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అయితే, కోవిడ్ క్లెయిములు పెరుగుతున్న నేపథ్యంలో ప్రీమియంలను కూడా సవరించడం తార్కికంగా సహేతుకమైనదిగానే భావించక తప్పదు. పైగా రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ రేట్లు పెంచేశాయి. దీనితో జీవిత బీమా కంపెనీలు దానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో ప్రీమియంలలో కొంత సవరణలకు అవకాశం ఉన్నప్పటికీ .. మరీ ఎక్కువ భారం మోపకుండా, ఒక మోస్తరు స్థాయిలోనే ఉండగలవు. డిమాండ్ ఉన్న పథకాలు.. జీవిత బీమా పాలసీలను ఇప్పటిదాకా మేము ప్రత్యేకంగా విక్రయించాల్సి వచ్చేది. అయితే, మహమ్మారి నేపథ్యంలో పాలసీదారులు ఇప్పుడు వాటిని అడిగి మరీ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ తొలి నాళ్లలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఇదే ధోరణి మరికొన్నాళ్ల పాటు కొనసాగగలదని భావిస్తున్నాము. అలాగే యాన్యుటీ, గ్యారంటీ రిటర్న్ ప్లాన్లకు కూడా డిమాండ్ ఉంటోంది. కస్టమర్లు పూర్తి అవగాహనతో తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడగలిగేలా ఉండే సరళతరమైన, సులభంగా అర్థం చేసుకోగలిగే సాధనాలు, సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఉదాహరణకు వేగవంతమైన ప్రాసెసింగ్, అత్యంత సులభంగా అర్థం చేసుకోగలిగేదిగాను, వైద్య పరీక్షలు అవసరం లేకుండా ఉండేలా మేము ప్రవేశపెట్టిన గ్యారంటీడ్ పెన్షన్ గోల్ (జీపీజీ)కి కస్టమర్ల నుంచి చాలా చక్కని స్పందన వస్తోంది. కొత్త పాలసీలు .. ఇటీవలే బజాజ్ అలయంజ్ లైఫ్ అష్యూర్డ్ వెల్త్ గోల్ పేరిట కొత్త ప్లాన్ ఆవిష్కరించాం. పాలసీదారులు దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించడంలో తోడ్పడేలా 100 శాతం గ్యారంటీతో, 30 ఏళ్ల వరకూ పన్ను రహిత ఆదాయాన్ని అందించేలా దీన్ని రూపొందించాం. అందుకునే ఆదాయం మధ్య మధ్యలో కొంత కొంతగా పెరిగే విధంగా ఇందులో స్టెప్–అప్ ఫీచర్ కూడా ఉంది. ఈ వేరియంట్లో ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత పర్తీ అయిదేళ్లకోసారి ఆదాయం 10 శాతం మేర పెరుగుతుంది. ఆదాయం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత, కస్టమరు చెల్లించిన ప్రీమియంలన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తుంది. పెరిగిపోతున్న వ్యయాలతో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి ఆర్థిక పోర్ట్‌ఫోలియోలో ఒక్కటైనా గ్యారంటీ ఆదాయం అందించే సాధనం ఉండటం ఎంతో శ్రేయస్కరం. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన సినీ ప్రముఖుల విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ తారలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ బుధవారం (సెప్టెంబర్ 22న) ముగిసింది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు, చివరగా నటుడు తరుణ్‌ని ఈడీ కార్యాలయంలో విచారించారు. దీంతో అభియోగాలు ఉన్న 12 మంది విచారణ పూర్తయ్యింది. తరుణ్‌ని దాదాపు 8 గంటల పాటు అధికారులు విచారణ చేశారు. తండ్రి, చార్టర్డ్ అకౌంటెంట్‌తోపాటు హాజరైన తరుణ్ బ్యాంకు స్టేట్ మెంట్ ఇతర పత్రాలు వెంట తీసుకొచ్చారు. అయితే ఈ విచారణకు సినీ సెలబ్రిటీలందరూ తమ బ్యాంక్ ఖాతాల వివరాలతో హాజరయ్యారు. ఆగస్ట్ 31వ తేదీన సినీ ప్రముఖుల విచారణను ఈడీ మొదలుపెట్టింది. మొదటగా పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. అనంతరం వరుసగా ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానాను సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వరుసగా ఈడీ విచారించింది. ఈ సమయంలోనే డ్రగ్ డీలర్ కెల్విన్, అతడి స్నేహితుడు జీషాన్ ఇళ్లలో సోదాలు చేశారు. వారిని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. సెప్టెంబర్ 9న రవితేజతో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను 6 గంటల పాటు, సెప్టెంబర్ 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను 9 గంటల పాటు ఈడీ విచారించింది. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్‌ను దాదాపు 7 గంటల పాటు ఈడీ విచారించింది. చివరిగా సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరయ్యాడు. కేసులో బలమైన ఆధారాలు లేవని, సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. -
మనీలాండరింగ్‌పై తరుణ్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ
-
Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు తరుణ్
-
హీరో తరుణ్‌తో ‘పుష్ప’ మూవీ టీం చర్చలు!
ఒకప్పుడు టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు హీరో తరుణ్. స్టార్ హీరోగా రాణిస్తున్న క్రమంలోనే దివంగత నటి ఆర్తీ అగర్వాల్‌తో ప్రేమవ్యవహరం వివాదంతో తరుణ్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన తరుణ్ ఆ తర్వాత ఆడపదడపా చిత్రాల్లో నటించినప్పటికి అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణ్‌ను తాజాగా ‘పుష్ప’ మూవీ టీం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఏ కీ రోల్ కోసమో అనుకుంటే మీరు పొరపాటు పడ్డంటే. అవును.. తమ సినిమాకు వాయిస్ అందించాలని మేకర్స్ తరుణ్ కోరినట్లు వినికిడి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఫహద్ ఫాసిల్‌కు తరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలని, ఇందుకు సంబందించిన విషయమై మేకర్స్ తరుణ్‌తో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ అంతా ఒకే అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఇక మొత్తానికి చాలా కాలం తర్వాత తరుణ్ ఇలా ప్రేక్షకులను పలుకరించడానికి రావడం ఆయన అభిమానులు ఆనందించే విషయమే. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
పల్నాటి పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక..
ఒక వైపు పల్నాటి వీరారాధనోత్సవాల ఏర్పాట్లు.. మరో వైపు అనారోగ్యానికి గురైన తల్లి.. అడుగడుగునా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు.. ఇదీ పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ పరిస్థితి. పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక, వైద్య ఖర్చులకు నగదు అందుబాటులో లేక తల్లడిల్లుతున్నారు. పల్నాటి వీరుల ఆత్మశాంతి కోసం తపించే అతని కుటుంబానికి ప్రస్తుతం మనశ్శాంతి కరవైంది. సాక్షి, కారంపూడి(మాచర్ల): పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ మాతృమూర్తి సరస్వతికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు భర్త, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చారు. అయితే ఆ కిడ్నీతో జరిగిన ఆపరేషన్ విఫలమైంది. దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తోంది. కిడ్నీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌కుమార్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. పల్నాటి వీరారాధనోత్సవాల నిర్వహణకు కోవిడ్ వల్ల ఇబ్బందులు రావడం దీనికి మరింత తోడైంది. పీఠాధిపతి తల్లయినా.. విజయ్‌కుమార్, సరస్వతి దంపతులకు ముగ్గురు సంతానం. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తొలి సంతానం. ఆయన డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. పెద్ద కుమార్తె తులసీ ప్రియాంక బీటెక్, చిన్న కుమార్తె కావ్య ఇంటర్ చదువుతున్నారు. కుటుంబ పోషణ కోసం సరస్వతి కూడా కారంపూడిలో సేవా సంస్థ నడుపుతున్న స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటికొచ్చిన ఆచారవంతులను సరస్వతి చాలా బాగా చూసుకునేవారు. ఆచారవంతుల్లో పేదలుంటే వారందరికీ తనే భోజనం చేయించి ఉత్సవాలలో వడ్డించేవారు. ఇబ్బందులతో ఉమ్మడి కుటుంబం నడక.. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవది ఉమ్మడి కుటుంబం. తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారి ఇంటి కింది భాగంలో మూడు షాపులపై ఏడాదికి వచ్చే రూ.1.20 లక్షలే వారికి జీవనాధారం. ఉత్సవాలప్పుడు వీరాచారవంతులు ఇచ్చే కానుకలు కొంత ఆదుకుంటున్నాయి. అద్దెలు, కానుకలు చాలక విజయ్‌కుమార్ సోదరి విష్ణు, సరస్వతి ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్నారు. పాత ఇల్లు పడేసి, షాపులతో కూడిన ఇల్లు నిర్మించకముందు ఉత్సవాల నిర్వహణకు పీఠాధిపతి పిడుగు ఆంజనేయశివప్రసాద్ ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు చేయడానికి ఉన్నత చదువు చదువుకున్న ఆయనకు ఇతరులను సాయం అడగడానికి ప్రాణం ఒప్పలేదు. అప్పట్లో ఆయన మిత్రులుగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ఒక జర్నలిస్టుతో కలసి పులిహోర చేయించి దానితోనే సంప్రదాయాన్ని నెరవేర్చారు. ఆంజనేయశివప్రసాద్కు సంతానం లేకపోవడంతో అప్పట్లో తరుణ్చెన్నకేశవను దత్తత తీసుకున్నారు. ఆయన గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఏడేళ్ల వయస్సు నుంచి తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతిగా ఉత్సవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గురువారం పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
ఉదయ్ మృతికి నారాయణ యాజమాన్యానిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ కళాశాల విద్యార్థుల కుటుంబసభ్యులు... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరంతా మాదాపూర్‌లో నారాయణ క్యాంపస్‌లో మెడిసిన్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. అయితే ఫ్రెండ్ బర్త్‌డేకి పర్మిషన్ తీసుకోకుండానే గోడ దూకి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నుంచి తిరిగి వస్తుండగా ఆరంఘర్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్, ఉదయ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇక గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. చదవండి: విషాదం: ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి... మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరుణ్, ఉదయ్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న ఉదయ్ కుటుంబసభ్యులు ఉస్మానియాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన సోదరుడి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ మృతుడి సోదరుడు కాలేజీ ఉద్యోగిని నిలదీశాడు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళుతుంటే యాజమాన్యం నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే విద్యార్థులు కుటుంబసభ్యులకు సమాధానం చెప్పలేక నారాయణ కాలేజీ ఉద్యోగి అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడు ఉదయ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్. ఇక తరుణ్ స్వస్థలం బెంగళూరు కాగా, కుటుంబం బోయినపల్లిలో నివాసం ఉంటోంది. కాలేజీ యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను చేరిస్తే వారికి బాధ్యత ఉండదా అని ఉదయ్ మేనత్త మండిపడ్డారు. ఉదయ్ మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాగా తొమ్మిది మంది హాస్టల్ విద్యార్థులు అదృశ్యం అయ్యారంటూ నారాయణ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి బాల్కనీ దూకి..
సాక్షి, అత్తాపూర్ : వేగంగా దూసుకొచ్చిన సఫారీ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కారులో పది మంది ప్రయాణిస్తుండగా మిగతా ఏడుగురు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. అయ్యప్ప సొసైటీ నారాయణ క్యాంపస్‌లో కోచింగ్ తీసుకునే హనుమదీశ్వర్(19), గణేష్(19), తరుణ్(19), శషాంక్గౌడ్(19), భాను(19), అభివరణ్(19), భాస్కర్(19) వరుణ్(19)లు స్నేహితులు. గురువారం రాత్రి అందరూ కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కొంపల్లిలో ఉండే గణేష్ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ బాబాయ్ కారు సఫారీని తీసుకొని రాత్రి 12:30 గంటలకు శంషాబాద్ వైపు వచ్చారు. తరువాత ఇంటికి బయలు దేరారు. హనుమదీశ్వర్ కారును వేగంగా నడిపాడు. కారు పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 221 వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారులో ముందు కూర్చున ఉదయ్, తరుణ్‌లకు బలమెన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి శషాంక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరగగానే మిగతా విద్యార్థులు అందరూ పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఉదయ్‌ది మహబూబ్‌నగర్ మద్దూర్ మండలం, తరుణ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అని పోలీసులు తెలిపారు. కారు తీసుకెళ్లారిలా.. గణేష్ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కొంపల్లిలో ఉండే తన చెల్లెలు గాయత్రికి ఫోన్‌చేశాడు. తాను గంటలోపు వస్తానని సఫారి కారు తాళం కావాలని అడిగాడు. ఇంటి ముందు ఉన్న పూల చెట్టు తొట్టిలో కారు తాళం వేయాలని చెప్పాడు. దీంతో గాయత్రి పూలతొట్టిలో తాళం వేసి ఉంచింది. గణేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కారు తీసుకువెళ్ళినట్లు గణేష్ బాబాయి కృష్ణ విలేకరులకు తెలిపాడు. అసలు విషయం అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు బర్త్ డేకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఐదుగురు వార్డెన్లు నిద్రపోగానే 9 మంది విద్యార్థులు బాల్కనీ నుంచి కిటికి గోడ పైకి వచ్చి కిందికి దిగారు. కారులో శంషాబాద్‌కు బర్త్ డే కోసం వెళ్లారు. తెల్లవారు జామున వారు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్లోని వర్మ క్యాంపస్‌లో మెడిసన్ లాంగ్ టర్మ్ విద్యార్థి గణేష్ కుత్బుల్లాపూర్‌లోని ఇంటికి వెళతానని తల్లిదండ్రులతో మాట్లాడించి అనుమతి తీసుకొని వెళ్లాడు. అర్థరాత్రి బర్త్ డేకు వెళ్లేందుకు ఇంట్లోని సఫారీ కారును తీసుకొని వచ్చి అయ్యప్ప సొసైటీలో వేచి ఉన్నాడు. రూమ్‌లలో ఉన్న విద్యార్థులు యశ్వంత్, తరుణ్, శంకర్ గౌడ్, భాను, భాస్కర్, వరుణ్‌లు మొదటి అంతస్తులోని బాల్కానీలో బీమ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికి పైకి వెళ్ళారు. పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన నెట్‌ను తొలగించి కిందికి దిగారు. గురువారం అర్థరాత్రి 12.40 గంటలకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. గణేష్ తప్ప మిగతా విద్యార్థులంతా గురువారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు స్టడీ అవర్‌లో ఉన్నారు. 11.30 గంటలకు వార్డెన్ రాములు అటెండెన్స్ తీసుకున్నాడు. 11.45 గంటలకు లైట్లు ఆపి అంతా పడుకున్నారు. వర్మ క్యాంపస్‌లో రాత్రి సమయంలోను ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, వార్డెన్ రాములుతో పాటు జూనియర్ లెక్చరర్లు కరీం, యోగీష్, మురళీ తదితరులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున చేవెళ్ల ఎస్ఐ వెంకటేష్ ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో మీ విద్యార్థులు ఇద్దరు చనిపోయారని చెప్పడంతో విషయం తెలిసిందని నారాయణ కాలేజ్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించేమా పూర్య విద్యార్థి ఫోన్ చేసి ఇద్దరు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని చెప్పినట్లు తెలిపారు. హస్టల్ ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడం, డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కనీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేదికాదు. హాస్టల్లో రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. -
చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం స్టార్ క్రికెట్
ప్రతీ ఏడాది ఏదో ఒక సామాజిక కార్యక్రమం కోసం సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇబ్బందుల్లో ఉన్నవారికి కాస్తంత చేయూతను అందిస్తుంటుంది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు. ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సారి లానే ఈ సారి కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మంచి కాజ్ కోసమే క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం జరుగుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ గారు యుఎస్ లోని హ్యూస్టెన్‌లో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న సౌత్ ఆఫ్రీకాలో క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆడాము. మరొకసారి బ్లైండ్ ఛారిటీకోసం క్రికెట్ ఆడటం జరిగింది. అలానే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీ కోసం మ్యాచ్ ఆడటం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17న జరగనుంది. అలానే ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజషన్‌తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్‌ను ఆడటానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు హ్యూస్టెన్‌లో, నెక్స్ట్ న్యూ జెర్సీ, ఆతరువాత ఫ్లోరిడా ఇలా ఆల్ ఓవర్ ది యూస్‌లో మ్యాచ్‌లను ఆడనున్నాము. చాలా స్ట్రాంగ్ టీమ్‌తో వెళ్తున్నాము’. అంటూ తెలియచేసారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మంచి కాజ్ కోసం ఆడుతున్నాము.. సీరియస్‌గా గెలవాడానికే ఆడనున్నాము. మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఆడటం డిఫరెన్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది’ అన్నారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో నేను క్రికెట్ టీమ్‌లో భాగం అవ్వాలని ఉంది. అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్, తరుణ్ నన్ను సపోర్ట్ చేశారు. 1992లో రంజీ ట్రోఫీ టీమ్‌లో నేను మెంబర్.. బాగానే ఆడేవాణ్ణి. ఇప్పడు ఈ టాలీవుడ్ క్రికెట్ టీమ్‌లో ఆడటం సంతోషంగా ఉంది’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని సంవత్సరాలుగా టీసీఏ మంచి కాజ్ కోసం ఆడుతూనూనే ఉంది. అదే దిశగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఈవెంట్ చేయడం వారి ఆధ్వర్యంలో టిసిఎ క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. ఆగస్టు 15న యూఎస్ లో ఫ్లాగ్ హ్యస్టింగ్ చేసి 17న మ్యాచ్‌ను ప్రారంభించనున్నాము. అక్కడ ఉన్న బిడ్డింగ్ టీమ్‌ను సెలెక్ట్ చేయనున్నారు. వారు కూడా మాపై గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఇండియన్స్‌తో మేము ఆడటం చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ప్రతి ఒక్క ఇండియన్ ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు. ఎన్నో మంచి కాజ్‌ల కోసం ఆడిన మేము ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు. -
క్యాన్సర్ ఎవేర్నెస్ కోసం టాలీవుడ్ స్టార్ క్రికెట్
హైదరాబాద్ తల్వార్స్, టిసిఎ(తెలుగు సినిమా అకాడమీ) టీమ్‌లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో క్రికెట్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో మన తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి ఆడబోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే17,18న మ్యాచ్‌లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. అక్కడి ప్రజల్లో క్యాన్సర్ ఎవేర్నెస్ కలిగించటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చిన నిధులను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్‌కు అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో చైర్మెన్ రమేష్ మాట్లాడుతూ...ఇంత మంచి పని కోసం ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. క్యాన్సర్ నుంచి బ్రతికిద్దాం అన్న ఆలోచనే ఈ క్రికెట్ టాలీవుడ్ అసోసియేషన్ యొక్కముఖ్య ఉద్దేశం. బిజీ షెడ్యూల్‌ని కూడా పక్కన పెట్టి రావడం గ్రేట్. ఇప్పటి వరకు ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. మొట్ట మొదటి సారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వచ్చి మన సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళ సంస్కృతి గురించి మనం తెలుసుకోవడం కోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం లో హాజరు కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...నేను ఒక్కడినే కెప్టెన్ కాదు నాతోపాటు ఇక్కడున్న వారందరూ కెప్టెన్సే. మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడటం అంటే అసలు జరుగుద్దో లేదో అనుకున్నా. కాని వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి ముందుకు వెళుతున్నాం. క్రికెట్ ఆడటం ముందు స్టార్ట్ చేసిందే మా టాలీవుడ్ హీరోలు. చిరంజీవి, నాగార్జున వాళ్ళందరూ ముందు మొదలు పెట్టారు. ఇది కమర్షియల్‌గా ఆడే ఆట కాదు. ఒక మంచి పని కోసం ఈ కార్యక్రమానికి మేమందరం గ్రూప్ అయ్యాం. మే 16-17 దర్బార్‌లో దిగుతాం. 18న గేమ్ ఉంటుంది. 19న ఒక కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. మీరందరూ మాకు తప్పకుండా సపోర్ట్ చెయ్యాలన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ... మొత్తం టీమ్ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఇది మొదలు పెట్టి 3 ఏళ్ళు అయింది. ప్రతి ఆట ఒక మంచి పని కోసం ఆడతాం. సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి ఆడుతున్నాం. టిసిఎ, తల్వార్స్ కలిసి ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాని కూడా మనం గెలిచివద్దాం అన్నారు. ఈ ఈవెంట్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్‌లు ఆడాం కాని ఈ మ్యాచ్‌లో విశేషం ఏమిటంటే నేను సునీల్ ఓపెన్సర్స్గా ఆడుతున్నాం. మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. రమేష్‌గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. సునీల్ మాట్లాడుతూ... ఇండో ఆఫ్రికా నిర్వహిస్తున్న ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటాను. టిసిఎ, తల్వార్స్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అదే విధంగా ఆఫ్రికాలో ఏదైనా మూవీస్‌లో అవకాశం వస్తే నేను అక్కడే ఉంటాను అంటూ చమత్కారంగా మాట్లాడుతూ ముగించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ... ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టిసిఎకి నా ప్రత్యేక అభినందనలు. ఈ సంస్థ 16 ఏళ్ళనుంచి ఉంది. ఇది ఎంతో మంచి సాంస్కృతిక కార్యక్రమం. ఈ కార్యక్రమం లైవ్ కూడా ఉంటుంది. మీరందరూ చూసి ఆదరించగలరని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్స్, భూపాల్, శ్రీనివాస్ , కిషోర్ , సింగర్ కౌశల్య తదితరులు పాల్గొన్నారు. -
బిగ్‌బాస్‌లో నేను లేను : హీరో ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలపై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్‌బాస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అసలు షోలో తనకు పార్టిసిపేట్ చేసే ఉద్దేశంగానీ, ఆసక్తి కానీ లేదని వెల్లడించారు. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్లో 16 మంది పార్టిసిపెంట్స్ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే! సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల, యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా, చాందిని చౌదరి, శ్రీరెడ్డి, వరుణ్ సందేశ్, తనీష్, వైవా హర్ష, కమెడియన్ వేణు, ఆర్యన్ రాజేష్ -
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
ప్రేమ అంటూ పట్టుకున్నదంటే పుట్టే లక్షణాల్లో ఒకటి, నిద్ర లేకపోవడం. ఎన్ని పాటల్లో ఎందరు నాయికానాయకులు దాన్ని పాడుకునివుంటారు! ‘ప్రియమైన నీకు’ చిత్రంలో స్నేహ కూడా అలాగే పాడుతుంది, కాకపోతే మరింత అందంగా, మరింత కవిత్వంగా. ‘నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో’ అంటుంది. ఈ గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. పల్లవి వెంటనే గుర్తురాకపోతే గనక అది ఇలా సాగుతుంది. అందులోనూ నాయకుడిని చూడగానే నాయిక పడే తడబాటు. ‘మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ’. దీనికి సంగీతం శివ శంకర్. పాడినవారు చిత్ర. 2001లో వచ్చిన ఈ తెలుగు– తమిళ ద్విభాషా చిత్రానికి దర్శకుడు బాలశేఖరన్. తరుణ్ నటించారు. -
తరుణ్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జమైకా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోన తరుణ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో... తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) జంట 21–17, 21–17తో గారెత్ హెన్రీ–రికెట్స్ (జమైకా) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో ఈ జోడీ 21–5, 21–8తో టాప్ సీడ్ జోస్ గ్యురెవా–డానిల్లె టొర్రె (పెరూ) జంటపై విజయం సాధించింది. -
తరుణ్‌తో సరదాగా కాసేపు
-
‘ఇది నా లవ్ స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇది నా లవ్ స్టోరి జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : తరుణ్, ఓవియా సంగీతం : శ్రీనాథ్ విజయ్ దర్శకత్వం : రమేష్, గోపి నిర్మాత : ఎస్వీ ప్రకాష్ ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో కష్టాల్లో పడ్డాడు. దాదాపుగా ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడనుకుంటున్న సమయంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో ఘనవిజయం సాధించిన సింపుల్లాగ్ ఒంద్ లవ్ స్టోరి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రమేష్ గోపిలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన ఇమేజ్‌కు తగ్గట్టుగా లవర్ బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తరుణ్. మరి లాంగ్ గ్యాప్ తరువాత తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? ఇది నా లవ్ స్టోరి అయినా తరుణ్‌ను హిట్ ట్రాక్‌లోకి తీసుకువచ్చిందా..? కథ : అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తల్లిదండ్రులు లేని అభిరామ్‌కు చెల్లెలంటే ప్రాణం. అందుకే చెల్లి ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అభిరామ్ చెల్లి.. తనకు కాబోయే మరదలిని తన అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది. చెల్లెలి మాట కాదనలేక అభిరామ్.. డాక్టర్ శృతిని చూసేందుకు ఒప్పుకుంటాడు. వెళ్లేదారిలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తీరా తనే శృతి (ఓవియా) అని తెలిసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్లారని రావడానికి చాలా సమయం పడుతుందని శృతి చెప్పటంతో ఈ లోగా ఒకరి ఇష్టాఇష్టాలను ఇంకొకరు తెలుసుకోవచ్చిన గతం గురించి మాట్లాడుకోవటం మొదలపెడతారు. ఇద్దరు తమ తొలి ప్రేమకథలను పంచుకుంటారు. అదే సమయంలో శృతి కూడా అభిరామ్‌తో ప్రేమలో పడుతుంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయిట్ ఇచ్చినందుకే తనని అరెస్ట్ చేశారని తెలిసి షాక్ అవుతాడు అభిరామ్. అసలు శృతి అలా ఎందుకు కంప్లయింట్ ఇచ్చింది..? ఆమె నిజంగా శృతినేనా..? చివరకు అభిరామ్‌కు తను ప్రేమించిన అమ్మాయి దక్కిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : చాలా కాలం తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తరుణ్, లవర్ బాయ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. కథా కథనాల పరంగా పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో తరుణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్గా నటించిన ఓవియా పరవాలేదనిపించింది. బిగ్‌బాస్ వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ గ్లామర్‌తో ఆకట్టుకున్నా.. నటన పరంగా నిరాశపరిచింది. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడే హీరో చెల్లెలి పాత్ర తప్ప సినిమాలో మరే క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్లేదు. విశ్లేషణ : కన్నడలో విజయం సాధించిన రొమాంటిక్ కామెడీని తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించటంలో దర్శకులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కథలో మంచి ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అలాంటి వాటిమీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రెండు గంటల సినిమాలో ఒక్క సీన్‌ను కూడా ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ డైలాగ్స్. అవసరం లేకపోయినా ఇరికించిన పంచ్ డైలాగ్, ఏ మాత్రం పేలకపోగా చాలా సందర్భాల్లో విసుగుతెప్పిస్తాయి. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రీ క్లైమాక్స్‌లో తరుణ్ నటన నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : కథా కథనం డైలాగ్స్ సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఇది నా లవ్ స్టోరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అతిథి పాత్రలో మంచు హీరో
ఒకప్పుడు లవర్ బాయ్‌గా సత్తా చాటిన యంగ్ హీరో తరుణ్, లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇది నా లవ్ స్టోరి’. సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణ్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు. రమేష్, గోపిలు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తరుణ్ సరసన బిగ్‌బాస్ ఫేం ఓవియా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు వారబ్బాయి మనోజ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తరుణ్ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి. -
పోరుగల్లు నుంచి పోర్చుగల్
స్టార్టప్ వీసా మీద పోర్చుగల్ దేశంలో తొలిసారిగా వ్యాపారం చేసే అవకాశాన్ని వరంగల్ యువకుడు దక్కించుకున్నాడు. భారత్ నుంచి అనేక కంపెనీలు పోటీ పడగా వరంగల్‌కు చెందిన ఎల్ల్లబోయిన తరుణ్ రూపొందించిన డైన్ స్మార్ట్ అనే స్టార్టప్ కంపెనీ చివరి వరకు పోటీలో నిలిచి విజేతగా నిలిచింది. - సాక్షి ప్రతినిధి, వరంగల్ మూడేళ్లలో... హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన సుధాకర్, అనురాధ దంపతుల రెండో కుమారుడు ఎల్లబోయిన తరుణ్. కంప్యూటర్స్‌లో బీటెక్ పూర్తి చేసిన వెంటనే 2015లో ఇండియాలో డైన్‌స్మార్ట్ పేరుతో స్టార్టప్ కంపెనీని స్థాపించారు. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీప్లెక్స్, హోటళ్లలో ఉండే ప్రేక్షకులకు ఫుడ్, బేవరేజెస్ డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. ప్లేస్టోర్ ద్వారా డైన్ స్మార్ట్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని.. తద్వారా కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వవచ్చు. వరంగల్ నగరంలో ఏషియన్ శ్రీదేవీ మాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి డైన్ స్మార్ట్ను విస్తరించారు. ఇక్కడ తరుణ్‌కు మౌనిక, ప్రణవ్, ఉమాశంకర్, వేణు జతయ్యారు. వీరు డైన్ స్మార్ట్ను మరింతగా విస్తరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్, ఫోరమ్ సుజనా మాల్, మినర్వాగ్రాండ్, అలంకృత రిసార్ట్స్, లాస్ వెగాస్ డ్రైవ్ ఇన్ వంటి పేరెన్నికగల సంస్థల్లో డైన్‌స్మార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో సినీ పోలీస్‌లో సేవలు ప్రారంభించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. అంతర్జాతీయ దిశగా... 2017 నవంబర్‌లో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో వెబ్ సమ్మిట్ పేరుతో జరిగిన టెక్ కాన్ఫరెన్స్‌కి రావాల్సిందిగా డైన్ స్మార్ట్ బృందానికి ఆహ్వానం అందింది. ఇండియా పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 15 మంది సభ్యుల బృందాన్ని స్టార్టప్ ఇండియా పేరుతో భారత ప్రభుత్వం పంపింది. డైన్‌స్మార్ట్ పనితీరు భారత అధికారులను ఆకట్టుకుంది. దీంతో భారత ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పోర్చుగల్‌లో ఉన్న భారత రాయబారి నందిని సింగ్లా డైన్‌స్మార్ట్ పనితీరు గురించి పోర్చుగల్ అధికారులకు వివరించారు. భవిష్యత్‌లో డైన్‌స్మార్ట్ స్టార్టప్‌కు ఉన్న మార్కెట్‌ను గుర్తించిన పోర్చుగల్ ప్రభుత్వం తమ ఇంక్యుబేషన్ సెంటర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోర్చుగల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు డైన్‌స్మార్ట్ బృంద సభ్యులు ఫిబ్రవరి 20న వెళ్లనున్నారు. ఆనందంగా ఉంది డైన్ స్మార్ట్ స్థాపించినప్పుడు ఇండియాలో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకోగలం అని అనుకున్నాం. కానీ.. గ్లోబల్ మార్కెట్లో విస్తరిస్తామని అనుకోలేదు. ఇంత త్వరగా ఈ అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. – ఎల్లబోయిన తరుణ్, డైన్ స్మార్ట్ ఎండీ -
ఇది నా లవ్ స్టోరి మూవీ స్టిల్స్
-
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా తన మార్క్ చూపించిన నటుడు తరుణ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్నా.. తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అయ్యాడు తరుణ్. దీంతో సినిమాలు తగ్గించేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టాడు. ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న తరుణ్, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట. తల్లి కోరిక మేరకు పెళ్లి అంగీకరించిన తరుణ్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో కోలీవుడ్ నటి ఓవియా తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. -
తరుణ్–సౌరభ్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోనా తరుణ్‌కు టైటిల్ దక్కింది. ప్రిటోరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 21–9, 21–15తో టాప్ సీడ్ ఆతిష్ లూబా–జూలియన్ పాల్ (మారిషస్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 21–12, 21–10తో కొపోలో పాల్–థబారి మాథె (జింబాబ్వే) జంటపై... క్వార్టర్ ఫైనల్లో 21–16, 21–14తో బహాదీన్ అహ్మద్–నాసిర్ (జోర్డాన్) ద్వయం, సెమీఫైనల్లో 15–21, 21–14, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్) జోడీపై గెలిచాయి. -
ఆ మూవీలో చాన్స్ అనేసరికి ఎగిరి గంతేశా: తరుణ్
కెమెరాకు ఎప్పుడూ భయపడలేదు. సినీఫీల్డ్‌లో అవకాశాలు రావడం నా అదృష్టం. వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. చిరంజీవి, రజనీకాంత్ మాదిరిగా సినిమాలు చేయలేను. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడే విజయం సాధిస్తారని సినీనటుడు తరుణ్ అన్నారు. అమరావతి ఫిలిమ్ ఫెస్టివల్ –2017 రెండోరోజు సినీనటుడు తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి తాను నటించిన అంజలి సినిమా చూశారు. హాయ్.. చెబుతూ విద్యార్థుల మధ్యకు వెళ్లి అల్లరి చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. విద్యార్థి : అంజలి సినిమా చేసినప్పుడు మీ వయసు ఎంత? చాన్స్ ఎలా వచ్చింది? తరుణ్ : అప్పుడు నా వయసు ఏడేళ్లు. కో–డైరెక్టర్ పాణి తాత అంజలిలో నటిస్తావా అని అడిగారు. మణిరత్నం నా అభిమాన డైరెక్టర్. ఆయన్ను కలిస్తే చాలు అనుకునేవాడ్ని. ఆయన మూవీలో చాన్స్ అనే సరికి ఎగిరి గంతేశా. విద్యార్థి : ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు? తరుణ్ : సమ్మర్ హాలిడేస్‌లో రెండు నెలలు షూటింగ్ చేశారు. పిల్లలందరినీ ఒకచోట ఆడుకోమనే వారు. షాట్ అనగానే పరుగెత్తుకెళ్లే వాళ్లం. షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. విద్యార్థి : కెమెరాను చూసి ఎప్పుడైనా భయపడ్డారా? తరుణ్ : అస్సలు భయపడలేదు. ఫస్ట్ షాట్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ తరువాత మామూలే. విద్యార్థి : మీ ఫెవరేట్ మూవీ? ఈ జనరేషన్లో ఏ హీరో అంటే ఇష్టం? తరుణ్ : ‘నువ్వేనువ్వే’ అంటే నాకు చాలా ఇష్టం. రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్ స్టార్స్ విద్యార్థి : చైల్డ్ ఆర్టిస్ట్, హీరో ఈ రెండింటిలో ఏది బాగుంది? తరుణ్ : చైల్డ్ ఆర్టిస్టుగా అంటే స్కూల్ మానేసి షూటింగ్‌కు వెళ్లడం సరదాగా ఉండేది. హీరో అంటే బాధ్యతగా పనిచేయాలి. రెండూ బాగున్నాయి. విద్యార్థి : చాలా గ్యాప్ తీసుకున్నారు? మీ కొత్త సినిమా విశేషాలు చెప్పండి? తరుణ్ : నా సినిమా వచ్చి ఏడాది అయింది. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశా. ‘ఇది నా లవ్’ మూవీ పూర్తయింది. డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ చేస్తున్నాం. విద్యార్థి : మీరు ఎలాంటి సినిమాల్లో నటించేందుకు ఇష్టపడతారు? తరుణ్ : నాకు సరిపోయే కథలనే ఎంచుకుంటా. రజనీకాంత్, చిరంజీవి లాంటి సినిమాలు నేను చేయలేను. విద్యార్థి : మీకు క్రికెట్ అంటే ఇష్టం కదా? యాక్టింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు? తరుణ్ : నాకు క్రికెట్ అంటే ఇష్టమే. సినీ అవకాశాలు అతికొద్దిమందికి మాత్రమే వస్తాయి. అందుకే యాక్టింగ్‌ను ఎంచుకున్నా. విద్యార్థి : మీ రోల్ మోడల్ ఎవరు? తరుణ్ : సచిన్ టెండూల్కర్ విద్యార్థి : సినీనటుడిగా మీ అమ్మగారి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? తరుణ్ : అమ్మ, నేను ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టుల నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. సినిమాల విషయంలో ఎప్పుడూ అమ్మ జోక్యం చేసుకోలేదు. మంచి సినిమాలు చేయమని చెబుతుంది అంతే. -
సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం
-
సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్డేడియంలో మ్యాచ్ ఆడేందుకు సినీతారలు రావడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. శ్రీకాంత్, తరుణ్, అల్లరి నరేశ్, ఆదర్శ్, సంపూర్ణేశ్ బాబు సహా తదితర సెలబ్రిటీలను చూసేందుకు స్థానికులు రావడంతో స్డేడియంలో ఉత్సాహం ఉప్పొంగింది. అర్చన, ప్రణీతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సినీతారలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 2011 నుంచి అనంతపురం వేదికగా సినీతారల క్రికెట్ కప్‌ను సీసీసీ చైర్మన్ షకీల్ షఫీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి టోర్నీని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి కాల్వ శ్రీనివాసులు వచ్చారు. టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. సినీతారలే ప్రధాన ఆటగాళ్లుగా తలపడనున్న మ్యాచ్‌లోని ఓ జట్టుకు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ కెప్టెన్ కాగా, మరో జట్టుకు కెప్టెన్‌గా హీరో తరుణ్ వ్యవహరించారు. 36 మంది సినీ తారలతో పాటు ఎంఎల్ఎన్ అకాడమీకి చెందిన సింగర్స్ హాజరై క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిట్ విచారణకు హాజరైన హీరో నవదీప్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరో నవదీప్ సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు. అలాగే సిట్ అధికారులు పబ్‌ల నిర్వహణపై నవదీన్ను విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ వాడకం, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాల్ నవదీప్ ఫోన్ నంబర్ ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. పబ్‌ల మాటున డ్రగ్స్ దందా చేసినట్లు నవదీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ నటుడుగానే కాక ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా చలామణీ అవుతున్నారు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తానే చేసేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలను ఆయన నుంచి రాబట్టవచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్ అధికారులు నవదీప్ కోసం సిద్ధం చేశారు. సిట్ చేతిలో నవదీప్ కాల్‌డేటా, వాట్సాప్ మెసేజ్‌లు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.కాగా గత ఏడాది మార్చిలో నవదీప్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమంగా వినియోగిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నవదీప్ పట్టుబడ్డారు. -
సిట్ విచారణకు హాజరైన నవదీప్
-
ఏ పబ్బులోనూ భాగస్వామిని కాను: తరుణ్
సాక్షి,హైదరాబాద్: తనకు ఏ పబ్బులోనూ భాగస్వామ్యం అసలు లేదని సినీ నటుడు తరుణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేను వారానికి ఒకరోజు గోవాకు వెళ్తానని తప్పుడు ప్రచారం జరుగుతోంది ఇది తప్పు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి వార్తల వల్ల మా కుటుంబం అమ్మ, నాన్న, మా సిస్టర్ చాలా బాధ పడ్డారు. దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. మీడియా అంటే నాకు చాలా గౌరవం. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీడియానే.. నాకు చాలా సపోర్ట్ చేసింది. డగ్స్ కేసులో సిట్ ముందు హజరయ్యాను. అకున్ సబర్వాల్, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి’ అని తరుణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం కామనే..
-
తండ్రితో కలిసి విచారణకు వచ్చిన తరుణ్
-
తండ్రితో కలిసి విచారణకు వచ్చిన తరుణ్
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న తరుణ్ విచారణకు హాజరయ్యారు. తండ్రి చక్రపాణితో కలిసి ఆయన ఉదయమే సిట్ కార్యాలయానికి బయల్దేరి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. నేడు (శనివారం) తరుణ్ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తరుణ్ బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోగల తన ఇంటి నుంచి తండ్రితో కలిసి ఓ గుడికి వెళ్లి అక్కడి నుంచి విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్ అధికారులు తరుణ్ కోసం సిద్ధం చేశారు. గతంలో పబ్ నిర్వహించిన తరుణ్ ప్రస్తుతం దానిని కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఉదయం 10గంటల తర్వాత తరుణ్ విచారణ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. -
హృదయాలను హత్తుకునే ప్రేమ
లవర్‌బోయ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఓవియా కథానాయిక. రమేష్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ఎస్వీ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తరుణ్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా రమేష్ గోపి చక్కగా తెరకెక్కించారు. శ్రీనాథ్ విజయ్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం ఎక్స్ట్రార్డినరీగా కుదిరింది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. తరుణ్గారి నటన సూపర్బ్. ఈ సినిమాలో ఆయన నటనలోని మరో కోణాన్ని చూస్తారు. మేకింగ్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రమేష్ గోపి. ‘‘ఒక మంచి ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు శ్రీనాథ్ విజయ్. ఈ చిత్రానికి సమర్పణ: అభిరామ్. -
తరుణ్ లుక్ అందరికీ నచ్చుతుంది – నాగార్జున
‘‘ఇది నా లవ్‌స్టోరి టైటిల్ బాగుంది. టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. తరుణ్ లుక్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి తనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్‌కి నా అభినందనలు’’ అని నాగార్జున అన్నారు. అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరి’. తరుణ్, ఓవియా జంటగా నటించారు. ప్రస్తుతం పోస్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. ‘‘నాగార్జునగారి ప్రోత్సాహం మా అందరిలో కొత్త ఉత్సాహన్ని నింపింది. కన్నడంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరి’గా రిమేక్ చేశాం. ఒక అమ్మాయిని ఎంతకాలం ప్రేమించామన్నది కాదు, ఎంతగా ప్రేమించామన్నదే ముఖ్యం అన్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తరుణ్, ఓవియా అద్భుతంగా నటించారు. సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు ఎస్వీ ప్రకాష్. -
నాగ్ సాయం నిలబెడుతుందా..?
ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన యంగ్ హీరో తరుణ్, తరువాత వరుస ఫ్లాప్‌లతో ఫేడ్ అవుట్ అయిపోయాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉండిపోయిన తరుణ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ప్రేమకథను 'ఇది నా లవ్ స్టోరి' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కన్నడ మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న ఓవియా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా టీజర్‌ను మన్మథుడు నాగార్జున రిలీజ్ చేయనున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీనియర్ హీరో నాగ్ రిలీజ్ చేస్తే తరుణ్ సినిమాకు హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చిన ఈ సినిమాను మే చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
బాలాజీ, తరుణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: విజయానంద్ సీసీ బ్యాట్స్‌మెన్ బాలాజీ రెడ్డి (108), తరుణ్ సాయి (103) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సఫిల్‌గూడ సీసీతో జరిగిన మ్యాచ్‌లో విజయానంద్ 263 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విజయానంద్ సీసీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు చేసింది. బాలాజీ రెడ్డి, తరుణ్ సాయిలతో పాటు అభిషేక్ (72) ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్ష్ 4, రుత్విక్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ జట్టు... తేజ (5/8), అభిషేక్ (5/6) ధాటికి 21.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 202/7 (ఆకాశ్ 50, లక్ష్మణ్ 54; రితేశ్ 5/25), హెచ్‌పీఎస్: 203/7 (సారుురెడ్డి 37 నాటౌట్; చిరంజీవ్ 5/30). గోల్కొండ సీసీ: 257 (ఎజాజ్ 86, చిరంజీవి 53; రంగస్వామి 5/48), హైదరాబాద్ డిస్ట్రిక్ట్: 253 (సౌభిక్ 113; చిరంజీవి 4/48). రుషిరాజ్ సీసీ: 177 (రాజేశ్ 55, జీయ 38; జితేందర్ 5/20), అంబర్పేట్ సీసీ: 179 (రామకృష్ణ 50, భరత్ 50; తహ్సీన్ 4/30). పికెట్ సీసీ: 318/6 (ప్రద్యుమ్న 75, శాశ్వత్ 81; సారుుకృష్ణ 4/85), లక్కీ ఎలెవన్: 124 (అశ్విత్ 68 నాటౌట్; సందీప్ గౌడ్ 3/18, నితీశ్ 3/37). సత్య సీసీ: 224 (ప్రజ్వల్82, సారుు హర్ష 52; తేజస్ 3/67, అబ్దుల్ హఫీజ్ 3/61), టైమ్ సీసీ: 36 (అక్షయ్ 4/14, రిత్విక్ 5/10). నటరాజ్ సీసీ: 205/7 (వరుణ్ 52 నాటౌట్; ఫైజాన్ 3/20), సన్‌షైన్ సీసీ: 206/8 (అక్షయ్ 37, సారుు తేజ 4/55, అచ్యుత్ 3/49). సూపర్ స్టార్: 213/9 (రోహిత్ 90, విక్రవర్ధన్ 43), విజయ్ సీసీ: 75 (యశ్వంత్ 3/32, రోషన్ 3/18). ఎంపీ బ్లూస్: 311/6 (రాజు 118, యేసుదాస్ 76, స్వామి 40), అను సీసీ: 236 (నవల్ 51, నకుల్ 40; సిద్ధాంత్ 3/36). హైదరాబాద్ వాండరర్స్:219 (పటేల్ 74; కౌస్తుబ్ 3/49), రిలయన్స సీసీ: 168 (అఖిల్ 54; అనికేత్ 4/36, జితేందర్ 3/47) -
వాగులో పడి 8 ఏళ్ల బాలుడి మృతి
నూజెండ్ల మండలం భూమాయపాలెంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల తరుణ్(8) అనే బాలుడు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తరుణ్, సంజనలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ టోర్నమెంట్లో తరుణ్, సంజన విజేతలుగా నిలిచారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో సోమవారం జరిగిన అండర్-16 బాలుర ఫైనల్లో తరుణ్ కర్ర (డీఎఫ్) 5-4 (7/3), 4-1తో సాహిల్‌పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో సంజన (డీఎఫ్) 4-2, 5-3తో సుజనను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో తరుణ్- సుహిత్ ద్వయం 7-0, 2-4 (10/3)తో ఆదిత్య-యశోధన్పై విజయం సాధించగా... బాలికల విభాగంలో అమూల్య- తనూజ జోడి 7-7 (8-6)తో ఆర్ని రెడ్డి- వేద ప్రపూర్ణ జంటపై నెగ్గి విజేతలుగా నిలిచారు. -
ఇది నా ప్రేమకథ!
లవర్‌బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఓవియా కథానాయిక. అభిరామ్ సమర్పణలో రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్వీ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘మూడు పాత్రల్లో తరుణ్ కనిపిస్తారు. నటనపరంగా ఈ మూడు పాత్రలకు తరుణ్ వ్యత్యాసం చూపించడం హైలైట్‌గా నిలుస్తుంది. లడక్, కులుమనాలిలో తీసిన పాటలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఏఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్‌ని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్వాలిటీ, ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. సెప్టెంబరులో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం!
లవర్‌బోయ్ ఇమేజ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ చాలా కాలం విరామం తర్వాత ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేశ్-గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఎస్.వి.ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘తక్కువ బడ్జెట్లో రూపొంది, భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ఇది’’ అని చెప్పారు. ‘‘ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు, ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం. అదే ఈ సినిమాలో చెబుతున్నాం’’ అని దర్శకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఓవియా, నిర్మాత ఎస్.వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్క దాడిలో తెగిపోయిన చెంప
నల్లకుంట: వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలుడి చెంప ఐదు అంగుళాల మేర తెగిపోయింది. వివరాలు... మెదక్ జిల్లా చేకుంటకు చెందిన మోహన్ కుమారుడు తరుణ్(3) గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుడగా.. వీధికుక్క దాడి చేసి కుడి వైపు చెంప, కడుపుపై కరిచింది. చెంప దాదాపు ఐదు అంగుళాల మేర తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు వెంటనే తరుణ్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేసి, టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాధిత బాలుడిని శుక్రవారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు రాగా.. వైద్యులు గాయాలను శుభ్రపర్చి రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
కాలేజ్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కుర్ర తుఫాన్’. తేజ, తరుణ్, మాస్టర్ శ్రీరామ్ కాంబినేషన్లో కృష్ణమోహన్ దర్శకత్వంలో సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని కృష్ణమోహన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: టి.పి. భరద్వాజ్, కెమెరా: గోపాల్ సామరాజు. -
మూసీలో బాలుడు గల్లంతు
-
మూసీలో బాలుడు గల్లంతు
హైదరాబాద్: మలక్ పేట శంకర్ నగర్ లో విషాదం నెలకొంది. మూసీ నదిలో తరుణ్(7) అనే ఓ బాలుడు గల్లంతయ్యాడు. శంకర్ నగర్ బస్తీ మూసి నదికి పక్కనే ఉండటంతో అక్కడే తన ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లిన తరుణ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఉదయం నుంచి ఎంత వెతికినా బాబు ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా స్ధానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించి ఆలస్యం చేశారు. ఉదయం నుంచి స్పందించని అధికారులు సాయంత్రంపూట మాత్రం బోటుతో వచ్చి మూసీలో గాలింపులు మొదలుపెట్టారు. బంతికోసం వెళ్లిన బాలుడు దానిని తీసే క్రమంలో కాలు జారీ అందులో పడి కొట్టుకుపోయాడని అతడి తల్లి వాపోయింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బంధువుల రోధనలు మిన్నంటాయి. -
ఫ్లేవర్స్ ఆఫ్ చైనా
చైనీస్ ఫుడ్ అనగానే నాన్‌వెజ్ స్పైసీ ఐటెమ్స్ గుర్తుకు వస్తాయి. కానీ... ఇందుకు భిన్నంగా పూర్తి స్థాయి వెజ్ వెరైటీలతో ఫిలింనగర్ మయూరా హౌస్ ఎక్స్‌క్లూజివ్‌గా చైనీస్‌లో వెజ్ వంటకాలనే అందిస్తోంది. పన్నీర్, స్వీట్ కార్న్, సీజనల్ ఫ్రూట్స్, రేర్ డ్రైఫ్రూట్స్, చెరకు, పుట్టగొడుగులు, బేబీ కార్న్, బేబీ పొటాటోస్ వంటి ఐటెమ్స్‌తో ముప్ఫై రకాల పూర్తిస్థాయి శాకాహార రుచులను అందిస్తున్నారు శనివారం ప్రారంభమైన ‘ఫ్లేవర్స్ ఆఫ్ చైనా’లో. ఈ నెల 28 వరకు ఈ రుచులను ఆస్వాదించవచ్చు. -
శ్రీ మిత్ర వెంచర్లో భూమిపూజ
ఇబ్రహీంపట్నం రూరల్ : స్థానిక కేతనకొండలో శ్రీమిత్ర వెంచర్స్ వారి ‘ఇంద్రప్రస్థ’ భూమిపూజ ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా సినీనటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా పాల్గొన్నారు. ముందుగా కొబ్బరికాయకొట్టి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ చౌదరి మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో సకల సౌకర్యాలతో ఇంద్రప్రస్థ విల్లాలను నిర్మిస్తామని తెలిపారు. శ్రీకాంత్, తరణ్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు సాయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించి మ్యాచ్ నిర్వహిస్తామని, వచ్చే ఆదాయాన్ని తుపాను బాధితులకు అందజేస్తామని తెలిపారు. శివాజీరాజా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. డెరైక్టర్లు ఎం.తేజనివాస్, తేజాగోవింద్, శ్రీనివాస్‌పాల్గొన్నారు. -
ఆస్పత్రి నుంచి అభినంద్, శివకుమార్ డిశ్చార్జ్
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను వైద్యలు బుధవారం డిశ్చార్జ్ చేశారు. విద్యార్థులు అభినంద్, శివకుమార్‌ల ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. మరోవైపు వరుణ్ గౌడ్, ప్రశాంత్, శరత్‌ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్ మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై యశోదా ఆస్పత్రి వైద్యులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అభినంద్, శివకుమార్‌లు కోలుకున్నారని, వారిని ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఇక ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. తరుణ్ మృతదేహాన్ని గుండ్రెడ్డిపల్లికి, వైష్ణవి మృతదేహాన్ని ఇస్లాంపూర్‌కు తరలించారు. విద్యార్థులు కుటుంబ సభ్యులు...కన్నీటితో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
-
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో వైష్ణవి (11) అనే విద్యార్థిని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ గతరాత్రి మృతి చెందాడు. యశోద ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6), వరుణ్‌గౌడ్ (7)) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. -
రాలిన మరో కుసుమం
తూప్రాన్: గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న తరుణ్(9) చివరికి సోమవారం తనువు చాలించాడు. దీంతో మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. ఈ నెల 24న తూప్రాన్ పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌కు చెందిన బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 14 మంది చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందగా మరో 20 మంది చిన్నారులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెల్దుర్తి మండలం గుండ్రెడ్డిపల్లికి చెందిన తరుణ్‌ను అదే రోజు యశోద ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుండ్రెడ్డిపల్లిలో విషాదం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం, బాలమణి దంపతులకు తరుణ్, స్వాతి సంతానం. కుమారుడిని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనుకున్న తల్లిదండ్రులు తూప్రాన్‌లోని కాకతీయ హైస్కూల్లో చేర్పించారు. ఈ క్రమంలోనే పాఠశాల బస్సును రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తరుణ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తమ బిడ్డలను ప్రాణాలతోనే చూస్తామని ఇన్నాళ్లూ ఆశించిన తరుణ్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తరుణ్ మృతితో గుండ్రెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. తరుణ్ మృతదేహాన్ని యశోద నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్యులు మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. -
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
-
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సికింద్రాబాద్ లోని యశోద హస్పిటల్లో ఐదురోజులుగా చికిత్సపొందుతున్న తరుణ్ అనే విద్యార్థి మృతి సోమవారం సాయంత్రం మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంగతిత తెలిసిందే. -
రేపు హైదరాబాద్‌కు తరుణ్ మృతదేహం
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థులలో ఈరోజు ఒక విద్యార్థి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వెంకట దుర్గా తరుణ్దిగా గుర్తించారు. పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వాటిలో ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్దిగా కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. తరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. తరుణ్ మృతదేహం రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఈ నెల 8వ తేది ఆదివారం 24 మంది విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇంతకు ముందు 8 మృతదేహాలు దొరికాయి. ఈ రోజు దొరికి మృతదేహంతో మొత్తం 9 దొరికాయి. ఇంకా 15 మృతదేహాలు లభ్యం కావలసి ఉంది. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తునే ఉన్నారు. గల్లంతయినవారు: 1.దాసరి శ్రీనిధి 2.కాసర్ల రిషిత రెడ్డి 3. గంపల ఐశ్యర్య 4. లక్ష్మీగాయత్రి 5.ఆకుల విజేత 6. రిథిమ పాపాని 7.కల్లూరి శ్రీహర్ష 8. దేవాశిష్ బోస్ 9. బైరినేని రిత్విక్ 10. ఆషిష్ మంత 11.సందీప్ బస్వరాజ్ 12.అరవింద్ 13.పరమేష్ 14. జగదీష్ ముదిరాజ్ 15. అఖిల్-మిట్టపల్లి 16. ఉపేందర్ 17.అఖిల్-మాచర్ల 18.భానోతు రాంబాబు 19. శివప్రకాష్ వర్మ 20. ఎం.విష్ణువర్ధన్ 21.సాయిరాజ్ 22.సాబేర్ హుస్సేన్ 23. కిరణ్ కుమార్ 24. పి.వెంకట దుర్గ తరుణ్ దొరికిన మృతదేహాలు : 1. గంపల ఐశ్యర్య 2. ఆకుల విజేత 3 భానోతు రాంబాబు 4.లక్ష్మీగాయత్రి 5. దేవాశిష్ బోస్ 6. షాబేర్ హుస్సేన్ 7. టి.ఉపేందర్ 8.అరవింద్ కుమార్ 9.పి.వెంకట దుర్గ తరుణ్ -
ముగ్గురిని బలిగొన్న క్షణికావేశం
భార్యా, భర్తల మధ్య తలెత్తిన చిన్న పాటి వివాదం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. మాటామాటా అనుకోవడంతో క్షణికావేశానికి లోనైన ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో సహా తానూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కుమారుడికి, భర్తకు తీరని శోకం మిగిల్చిన ఈ సంఘటన గురువారం వనపర్తి మండల పరిధిలోని ఖాశీంనగర్‌లో చోటు చేసుకుంది. - న్యూస్‌లైన్, ఖాశీంనగర్(వనపర్తిరూరల్) క్షణికావేశంలో ఇద్దరు కూతుళ్లతో సహా బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఖాశీంనగర్ గ్రామం దుఖసాగరంలో మునిగిపోరుుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కుల రాములు, బాలకిష్టమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ పిల్లలను చదివిస్తూ ఉన్నంతలో బాగా బతికేవారు. కాగా నెల రోజుల క్రితం భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తారుు. ఈ క్రమంలో బుధవారం కూతుళ్లు రాజేశ్వరి, మహేశ్వరిలకు జ్వరం వచ్చింది. వీరిని తీసుకొని వనపర్తికి వెళ్లి ఆస్పత్రికి చూపించమని భార్యకు చెప్పి భర్త పొలానికి వెళ్లాడు. సాయంత్రం రాములు ఇంటికి రాగా భార్య కనిపించలేదు. ఏడు గంటలు దాటినా ఇంటికి రాక పోవటంతో వనపర్తిలో, బంధువుల ఇళ్లలో వెదికాడు. బాలకిష్టమ్మ తల్లి తండ్రులకూ ఫోన్ చేసినా అక్కడికీ రాలేదని చెప్పటంతో ఆందోళన చెంది గ్రామంలో విచారించగా దవాజిపల్లికి వెళ్లే దారి గుండా ఇద్దరు ఆడపిల్లలతో వెళ్లినట్లు తెలుసుకొని ఆ దారి వెంట వెదికారు. గ్రామానికి సమీపంలోని కాల్ల చిన్నయ్య బావి వద్ద చిన్నపాప దుస్తులు, బాలకిష్టమ్మ చెప్పులు ఉండటంతో బావిలో వెదికి బాలకిష్టమ్మ (35), రాజేశ్వరి(10), మహేశ్వరి(8) మృత దేహాలను బయటకు తీశారు. చిన్న పాటి గొడవకు ఇంత పని చేసుకుంటుందని అనుకోలేదని భర్త జక్కుల రాములు రోదించిన తీరు కలచివేసింది. కాగా మృతురాలు బాలకిష్టమ్మ తల్లి బక్కమ్మ తన కూతురిని అల్లుడు రాములు మానసికంగా, శారీరకంగా వేధించటం వల్లనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారన చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ రాంబాబు తెలిపారు. అమ్మ ఎప్పుడు లేస్తుంది ఐదేళ్ల తరుణ్ తల్లి, అక్కల మృతదేహాలను చూసి ఎప్పుడు లేస్తారు అంటూ ఆలోచిస్తూ పక్కనె దిగాలుగా కూర్చోవటం, తన తల్లిని, అక్కలను మింగేసిన బావిని చూస్తూ అమ్మ చచ్చిపోయిందా అంటూ బంధువులను, గ్రామస్తులను ప్రశ్నించటం అక్కడి వారి హృదయాలను కలచి వేసింది. -
కడుపు కోత
కేసముద్రం, న్యూస్‌లైన్ : సరదాగా ఈత పండ్ల కోసమని వెళ్లిన ముగ్గురు చిన్నారులు కొద్ది గంటల్లోనే విగతజీవులయ్యూరు. ఈత కొట్టేందు కు చెరువులో దిగి మృత్యు ఒడికి చేరారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని రంగాపురం గ్రామశివారు రాజీవ్ నగర్ తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రాజీవ్‌నగర్‌తండాకు చెందిన లకావత్ బావుసింగ్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మికి కుమార్తెలు శాంతి, కావేరి, సంధ్య(13) ఉండగా, చిన్నభార్య సాల్కికి కుమారులు సురేష్, తరుణ్(10) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా ఇదే తండాకు చెందిన దేవోజీ, చిలుకమ్మ దంపతుల కుమార్తె నీలకు ఇదే మండలం మహముద్‌పట్నం తండాకు చెందిన హరితో వివాహమైంది. ఆ దంపతులకు కుమార్తె శారద, కుమారులు సురేష్, నరేష్(9) ఉన్నారు. తన తల్లిదండ్రులు తిరుపతికి వెళుతుండడంతో వారిని సాగనంపేందుకు నీల శనివారం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బావుసింగ్ కుమార్తె సంధ్య, కుమారుడు తరుణ్ , నీల కుమారుడు నరేష్‌తోపాటు ఇదే తండాకు చెందిన భద్రు కుమారుడు రమేష్, కుమార్తె మౌనిక, గుగులోతు నంద కుమార్తె శిరీష కలిసి ఈత పండ్ల కోసం సమీపంలోని ఎదళ్ల చెరువు కట్ట మీదకు వెళ్లారు. అందరు కలిసి ఒక కవర్లో ఈత పండ్లను ఏరుకున్నారు. తిరిగి ఇంటికొస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెరువులో ఈత కొడదామంటూ నీళ్లలోకి దిగా రు. ముందుగా తరుణ్, సంధ్య, నరేష్, శిరీష లోపలికి వెళ్లగా గుంత ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. కొంతదూరం వెళ్లిన రమేష్, మౌనిక మునుగుతున్న మిత్రులను చూసి కేకలు పెట్టారు. ఇంతలో అటుగా బహిర్భూమికి వెళ్లిన దారావత్ వీరన్న వారిని గమనించి పరుగుపరుగున చెరువులో దూకాడు. అప్పటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న శిరీషను ఒడ్డుకు చేర్చాడు. అలాగే రమేష్, మౌనికను ఒడ్డుకు తీసుకొచ్చాడు. చెరువులో మునిగిపోయిన వారిని గాలించి బయటకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే తరుణ్, సంధ్య, నరేష్ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు సంధ్య కేసముద్రంవిలేజ్లోని కస్తూర్భా పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేయగా, తరుణ్ ధన్నసరి గ్రామంలోని సెయింట్‌జాన్స్ స్కూల్లో 2వ తరగతి చదివాడు. నరేష్ మహముద్‌పట్నం తండాలోని మూడో తరగతి పూర్తి చేశాడు. తాత దగ్గరకుపోతనని వత్తివి కదరా.. మీ తాతను చూత్తానికి పోతనని గార్బం చేసి వత్తివి కదరా కొడుకా.. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సూడ్రా కొడుకా.. మమ్మల్ని వదిలిపెట్టి పోదానికే వచ్చినవారా కొడుకా.. అంటూ నరేష్ తండ్రి హరి కొడుకును ముద్దాడుతూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నా కొడుకుకు ఎండగొడతాందంటూ తల్లి తన చీరకొంగును కొడుకు శవం పై కప్పుతూ రోదించడం స్థానికులను కలచివేసింది. నాకెమయిందో తెల్వలే : శిరీష చెరువులో అందరితో కలిసి దిగిన.. ఒక్కసారే పెద్ద బొంద వచ్చింది. అందరం మునిగినం. ఏడుసుకుంటూ అరిసిన ం. నీళ్లన్ని మింగినంక నాకు ఏమైందో తెల్వలే. వీరన్న నన్ను బయటకు తీసి నా పొట్టమీద గట్టిగా వత్తిండు. మెలకువ వచ్చింది. నా దోస్తులు చచ్చిపోయిండ్రని తెల్వంగనే నాకు భయమైంది. మృతులంతా బంధువులే.. సంధ్య, తరుణ్ తండ్రి అయిన బావుసింగ్‌కు నరేష్ అమ్మమ్మ చిలుకమ్మ స్వయూన సోదరి. మృతుల కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం ఉండటంతో వారి బంధువుల ఇళ్లల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై రాంజీనాయక్ చేరుకుని కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహన్ని తరలించే క్రమంలో అతడి తండ్రి తన కొడుకుకు పోస్టుమార్టం వద్దని వాదించాడు. తన తండాకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ముందుగా వచ్చుంటే అందర్ని కాపాడేటోన్ని పిల్లలు మునిగినంక కొద్దిసేపటి వరకు కేకలు వినపడలేదు. తీరా చెరువు దగ్గరకు వచ్చినంక వారిని చూసి ఒక్కసారిగా చెరువులోకి దూకిన. అప్పటికే ఒడ్డుకున్న ఇద్దరితోపాటు, స్పృహ కోల్పోయిన శిరీషను కాపాడిన. ఇంకా ముందు వచ్చి ఉంటే ఆ ముగ్గుర్ని కాపాడేటోన్ని. అమ్మమ్మ, తాతను తిరుపతికి సాగనంపడానికి వచ్చి... మహముద్‌పట్నం గ్రామశివారు తండా కు చెందిన గుగులోతు నీల తన తల్లిదండ్రులు దేవోజీ, చిలుకమ్మ తిరుపతికి వెళ్తుండటంతో శనివారం తన కొడు కు నరేష్‌తో కలిసి రాజీవ్‌నగర్ తండాకు వచ్చింది. రోజంతా తాతతో సరదాగా గడిపిన నరేష్ ఆదివారం తాత, అమ్మమ్మకు టాటా చెప్పి పంపాడు. ఆ తర్వా త ఉన్నంటుండి బయటకు వెళ్లిన నరేష్ చెరువులో మునిగి ప్రాణాలొదిలాడు. అయితే కేసముద్రంకు చేరుకున్న దేవోజీ, చిలుకమ్మ రైలు రావడంలో ఆలస్యం కావడంతో రైల్వేస్టేషన్లోనే ఉండిపోయారు. ఇంతలో మనవడి మరణవార్త తెలియడంతో వారు బోరున విలపిస్తూ తిరిగొచ్చారు. -
చెస్ చాంపియన్ తరుణ్
జింఖానా, న్యూస్‌లైన్: రాయల్ చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ అండర్-15 విభాగంలో తరుణ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తరుణ్ (4 పాయింట్లు) మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని గౌతమ్ (4) దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో సుకన్య టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర అండర్-13 విభాగంలో మేఘాన్ష్రామ్ (5) ప్రథమ స్థానంలో నిలవగా... కుమార్ (4) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో అనీషా ఘోష్ (3.5) టైటిల్‌ను సాధించింది. అమూల్య రెండో స్థానంలో నిలిచింది. బాలుర అండర్-11 విభాగంలో శశాంక్ రాజ్ మొదటి స్థానంలో, విశ్వాస్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సాహిత్య (4), ద్వితీయ స్థానాన్ని ఝాన్సి దక్కించుకున్నారు. బాలుర అండర్-9 విభాగంలో శ్రీరామ్ విజేతగా నిలవగా... రుత్విక్ (4) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగ ంలో త్రిష (3.5), రచిత (3) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్-7 విభాగంలో కృష్ణ సిద్ధాంత్ (3) టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానాన్ని సాయి మనో సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో సుసేన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా... ప్రణీత ప్రియ రెండో స్థానంలో నిలిచింది. ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎస్.ఖాన్ టైటిల్ సాధించాడు. వరుసగా రెండు, మూడు స్థానాలను మూర్తి, షేక్ ఫయాజ్ సొంతం చేసుకున్నారు. -
ఈ పేరులోనే ఓ పవర్ ఉంది
‘‘శ్రీకాంత్, తరుణ్ కలిసి నటించిన ‘వేట’ చాలా ఆసక్తికరమైన సినిమాలా అనిపిస్తోంది. ‘వేట’ అనే పేరులోనే ఓ పవర్ ఉంది’’ అని నాని చెప్పారు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మించిన ‘వేట’ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు హీరో నాని డిస్క్‌లు అందజేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనంతంగా ఉంది. తెలుగు పరిశ్రమకు దొరికిన మరో మంచి కమర్షియల్ దర్శకుడు అశోక్’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ- ‘‘నేను స్వరాలందించిన వంద సినిమాల్లో పదికి పైగా శ్రీకాంత్వే ఉన్నాయి. ఈ పాటలు విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాస్మిన్, మధురిమ, సింహ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు. -
వేటకు రెడీ అయిన శ్రీకాంత్, తరుణ్
శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వేట’. అశోక్ పల్లె దర్శకుడు. పి.శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్లో వచ్చే మాస్ సన్నివేశాలు అలరిస్తాయి. చక్రి సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అని సమర్పకుడు సి.కల్యాణ్ చెప్పారు. నిజజీవితంలో స్నేహానికి విలువిచ్చే తాను ఇప్పటివరకూ స్నేహంపై ఒక్క పాటను కూడా స్వరపరచలేదని, ఆ అవకాశం ఈ సినిమా ద్వారా లభించిందని చక్రి ఆనందం వెలిబుచ్చారు. వాణిజ్యవిలువల సమ్మిళితం ఈ సినిమా అని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని తరుణ్ చెప్పారు. -
యుద్ధం సిద్ధం!
తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.కల్యాణ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని జిట్టా సురేంద్రరెడ్డికి అందించారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నామని నట్టికుమార్ చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని తరుణ్ నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందని, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
ఒకరు సచిన్‌లా... ఒకరు ధోనీలా...
సినిమా... క్రికెట్ ... వీటిలో దేనిపై ఎక్కువ మక్కువ? వెంటనే సమాధానం చెప్పడం కష్టం. క్రికెటర్లు తెరపై కనిపించడం చాలా తక్కువ. కానీ, నటులు క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి చాన్నాళ్లయింది. సరదా కోసమో, నిధుల సేకరణ నిమిత్తమో సినీ తారలు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చిన సందర్భాలు 1950ల నాటి నుంచి ఉన్నాయి. ఇక, ఇటీవలి కాలంలో స్టార్ క్రికెటర్లు ఏటా ఏదో ఒక సందర్భంలో క్రికెట్ స్టేడియంలో దాదాపు ప్రొఫెషనల్స్‌లా తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ఒకరు సచిన్‌లా... మరొకరు ధోనీలా మైదానంలో చెలరేగుతున్నారు. అటు సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కేరింతల మధ్య సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ అభిమానాన్ని బౌండరీలు దాటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్, మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లను పలకరిస్తే వారు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. సేవ పేరుతో మొదలైన స్టార్ క్రికెట్ ఆటలు ఇప్పుడు కప్‌లు గెలుచుకునేవరకూ వెళ్లాయి. మూడేళ్లుగా పరభాషా నటులతో కలిసి మన స్టార్లు ఆడుతున్న మ్యాచ్‌లను చూస్తుంటే సినిమా అభిమానులకు, క్రికెట్ అభిమానులకు కన్నుల పండువలా ఉంది. ఇలా క్రికెటర్ల అవతారమెత్తి స్టేడియంలో దర్శనమివ్వడం హీరోలకు కూడా కొత్తగా, గర్వంగా ఉంటోంది. క్రికెటర్ల హోదాలో అందుకుంటున్న ఆతిథ్యం దగ్గర నుంచి కొట్టే సిక్స్, పట్టే క్యాచ్ వరకూ అన్నీ వారికి అపురూపమైన జ్ఞాపకాలే. ఇంత గొప్ప వేడుక వెనుక వారు చేస్తున్న కసరత్తు విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. మూడు వారాల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఔటర్రింగ్రోడ్డుకి సమీపంలోని ఓ గ్రౌండ్లో మన ‘తెలుగు వారియర్స్’ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. రోజుకి ఐదు గంటల చొప్పున వారానికి నాలుగురోజులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మన హీరోల సాధన అనుభవాలు వింటే మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. సాధనే గెలుపు మంత్రం: వెంకటేష్ ఏ ఆటకైనా సాధన ఉండాలి. అదే గెలుపునకు దారి చూపెడుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అవసరం. సిసిఎల్4 (సెల బ్రెటీ క్రికెట్ లీగ్4) స్టార్ క్రికెటర్స్‌కి ఇది చాలా అవసరం. పైగా ఇది మన ఊళ్లో మనవాళ్లతో ఆడుతున్న ఆటకాదు. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీమ్‌లు బరిలోకి దిగాయి. అన్నీ కూడా నువ్వా...నేనా అన్నట్టు ఉన్నాయి. అలాగని ఇది పూర్తిగా ఒత్తిడిని ఎదుర్కొనే గేమ్ కాదు. చాలా ఆరోగ్యకరమైన పోటీ. మన దేశంలోని సినిమా రంగం ఆటపేరుతో ఏర్పాటు చేసుకున్న అందమైన వేదిక. మా తెలుగు వారియర్స్ జట్టు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. నేను కూడా ఇక్కడికి రోజూ వస్తున్నాను. ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఇక్కడ ఆట నన్ను మరింత ఫిట్‌గా ఉంచుతోంది. ఈ మధ్యనే కాలికి గాయం అవ్వడం వల్ల కొన్నిసార్లు బ్యాటింగ్ నుంచి తప్పుకుంటున్నాను. వైస్ కెప్టెన్ అఖిల్ దగ్గర నుంచి నిఖిల్ వరకూ అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి పవర్‌ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) హీరోలు మాత్రమే ఆడాలి. సిసిఎల్ పేరుతో ఏడాదిలో నెల రోజులు మరో ప్రొఫెషన్లో బిజీగా గడపడాన్ని స్టార్ క్రికెటర్లందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కోరిక తీరింది: అఖిల్ చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ను అవ్వాలన్న కోరిక ఇప్పుడు తీరిపోయింది. క్రికెట్ అంటే ఇష్టం ఉండని అబ్బాయి ఎవరుంటారు చెప్పండి. తెలుగు వారియర్స్‌కి వైస్ కెప్టెన్‌గా ఆడుతున్నాను. క్రికెట్‌పై నాకున్న ఆసక్తి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం క్రికెట్ ఆడాల్సిందే. రెండే రెండు కారణాలు మాత్రం నా ఆదివారం ఆటను ఆపగలవు. ఒకటి వర్షం, రెండోది నేను ఊళ్లో లేకపోవడం. నేను ఆస్ట్రేలియాలో చదువుకున్న రోజుల్లో కూడా క్రికెట్టే నా ప్రపంచం. ప్రతి వీకెండ్‌కి అక్కడ స్పెషల్ మ్యాచ్‌లు ఆడేవాడిని. అందులో భాగంగా కొంత శిక్షణ కూడా తీసుకున్నాను. ఇక ఇక్కడ ప్రాక్టీస్ అంటారా...ఒక్కరోజు ఎగ్గొట్టినా లోపల భయం మొదలవుతుంది. పైగా వైస్ కెప్టెన్ కావడంవల్ల టీం ప్రాక్టీస్‌ని సీరియస్‌గా గమనించే బాధ్యత కూడా నేను చూసుకోవాలి. వెంకీ అంకుల్ అందిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ముప్పై, నలభై వేలమంది ప్రజల మధ్య బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగడాన్ని గర్వంగానే కాదు పెద్ద బాధ్యతగా కూడా ఫీలవుతున్నాం. అంతా క్రికెట్ పుణ్యమే: నిఖిల్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడినపుడు సచిన్ వాడిన డ్రసింగ్ రూమే మాకూ ఇచ్చారు. ఆ సమయంలో నేనెంత గర్వపడ్డానంటే....కేవలం స్టార్ క్రికెటర్స్ మ్యాచ్‌ల పుణ్యమే ఇదంతా అనిపించింది. సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరో మాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆల్‌దిబెస్ట్ చెప్పిన సంఘటన వెనకున్న కారణం కూడా క్రికెట్టే. అందుకే దీన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. రోజూ ఇక్కడ ఐదు గంటల ప్రాక్టీస్ ఉంటుంది. ఒకపక్క షూటింగ్‌లు... మరో పక్క క్రికెట్ ప్రాక్టీస్. రెండింటికీ న్యాయం చేయడంలో కొంత ఇబ్బంది పడ్డా... ఏడాదిలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోలేం కదా! మా ఫిజియో వెంకట్ కూడా మాకు బాగా సాయపడుతున్నారు. ప్రతి ప్రాక్టీస్గేమ్కి ముందు ఆయన మా బాడీ ఫిటెనెస్ పరీక్ష చేసి ఎక్కడైనా నొప్పి ఉన్నా...ఒత్తిడిగా ఫీలయినా మసాజ్‌తో సరిచేస్తారు. ఆ తర్వాత వార్మప్ అయ్యాక మా బాడీ ఆటకు రెడీ అవుతుందన్నమాట. కప్ గ్యారెంటీ: తరుణ్ సినిమాల్లోకి రాకపోతే నేను తప్పనిసరిగా క్రికెటర్‌నే అయ్యేవాడిని. అందులో సందేహం లేదు. ఆ లోటును తీర్చడానికే సిసిఎల్ వచ్చిందనిపిస్తోంది. అదే క్రికెట్ గ్రౌండ్...అదే జనం...అవే వసతులు..అవే మర్యాదలు...వీటి మధ్య బ్యాట్ పట్టుకుని ఒకరు సచిన్‌లా ఫీలైతే ఒకరు ధోనీలా ఫీలవుతూ కొట్టే షాట్లు, పట్టే క్యాచ్‌లు...నిజంగా మేం చాలా అదృష్టం చేసుకున్నాం. వీకెండ్ ఉండే మ్యాచ్ రాత్రిపూట ఉంటే ఇక్కడ రాత్రివేళలో ప్రాక్టీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కూడా మధ్యాహ్నమే ఆడుతున్నాం. ఆడబోయే సమయానికి అప్పుడున్న వాతావరణానికి అలవాటు పడడానికి రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈసారి కప్పు కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నాను. ఇక ఆ పొరపాటు జరగదు: సచిన్ మా తెలుగు వారియర్స్ జట్టు తప్పకుండా కప్ గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్మ్యాచ్లే నిదర్శనం. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పెద్దగా లేకపోవడం వల్లనో ఏమో గత ఏడాది చాలామంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. ఈసారి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజూ ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టుకున్నాం. చాముండేశ్వరీనాథ్గారు కూడా మాలోని లోపాల్ని గమనించి వాటిని అధిగమించేలా శిక్షణనిస్తున్నారు. కేవలం పండ్లు, ప్రొటీన్ షేక్స్: రఘు ఈ ప్రాక్టీస్ వల్ల అనుభవం రావడమే కాక ప్రతి ఒక్కరు నాలుగేసి కిలోల బరువు కూడా తగ్గిపోయారు. ఎన్ని రకాల జిమ్‌లకు వెళ్లినా రాని ఫిట్నెస్ వస్తోందిక్కడ. ఇక మానసిక ఉల్లాసమంటారా...ఇక్కడ తోటినటులతో సాన్నిహిత్యంతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నటులతో పరిచయాలు... స్నేహాలు అన్నీ మా పాలిట వరాలే. సిసిఎల్ లేకుండా భోజ్‌పురిలో పాపులర్ నటుడి గురించి మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. బెంగాలీలో ఉన్న నటులతో స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి. అలాగని వారితో కలిసి ఆడే అవకాశంగా భావించి ఊరుకుంటే సరిపోదు. ఈసారి కప్ తేకుంటే తెలుగు వారియర్స్‌ని తెలుగు ప్రేక్షకులు క్షమించరు జుట్టును. (నవ్వుతూ) ఒక పక్క కర్ణాటక, మరో పక్క బాలీవుడ్ ఎడాపెడా వాయించేస్తున్నాయి. మేం కూడా వారికి దీటుగా ఆడడానికే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ నెలరోజులు ఆరోగ్య విషయంలో, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లామర్ తగ్గకుండా జాగ్రత్తలు: సామ్రాట్ చిన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్లో ఆడిన జ్ఞాపకాలన్నీ మా కళ్లముందు కదలాడే క్షణాలివి. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటని ఎవరిని అడిగినా ప్రశ్న పూర్తవ్వకుండా చెప్పే సమాధానం క్రికెట్. ఒకపక్క తెరపై గ్లామర్‌గా కనిపించాలి. మరోపక్క ఇక్కడ ఇలా ఎండలో ప్రాక్టీస్ చేయాలి. రెండూ ముఖ్యమైనవే కాబట్టి రిస్క్ తీసుకోవడం తప్పడం లేదు. ప్రొఫెషనల్ క్రికెటర్స్కే గ్రౌండ్లోకి వెళ్లగానే ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి! అందుకే ఈ తిప్పలన్నీ. మా వెంకీసార్ చెప్పినట్టు సాధనొక్కటే అలాంటి ఆందోళన నుంచి బయటపడేస్తుంది. అందుకే అన్ని పనులూ పక్కన పెట్టి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ వాలిపోతున్నాం. లోపాల్ని అధిగమించడానికి నేను ఎక్కువగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కొత్త స్నేహితులు దొరికారు: సుధీర్‌బాబు నేను ఆల్‌రౌండర్‌ని. మోహన్‌బాబుగారి అబ్బాయి విష్ణు, నేను చిన్నప్పుడు క్లాస్‌మేట్స్‌మి. మా ఇద్దరికీ స్కూల్ జ్ఞాపకాలకంటే క్రికెట్ గ్రౌండ్ జ్ఞాపకాలే ఎక్కువ. ప్రస్తుతం నా ఆటను చూసి సలహాలిస్తుంటాడు. అతనొక్కడే కాదు..చాలామంది చిన్ననాటి స్నేహితులు నన్ను గ్రౌండ్లో చూసి సంతోషపడుతున్నారు. స్టార్ క్రికెట్ వల్ల పరభాషానటులతో పరిచయాలు, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది మాకు. ఎనిమిది టీమ్‌ల నటుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చాలావరకూ మా ఫేస్‌బుక్‌లోకి వచ్చేశారనుకోండి. అలాగే నిజమైన క్రికెటర్ల స్థానంలో ఉండి ఆడుతున్నాం అనే ఫీలింగ్ మమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతోంది. - భువనేశ్వరి టీంవర్క్ని నమ్మారు... గుడ్ టీం. తెలుగు వారియర్స్ ఈసారి చాలా పట్టుదలగా ఉన్నారు. ‘షూటింగ్‌లు...ముఖ్యమైన పనులు అన్నీ ప్రాక్టీస్ తర్వాతే’ అంటున్నారు. వీరి ఉత్సాహం, ప్రాక్టీస్ చేసే విధానం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్‌గారి కెప్టెన్సీలో యువహీరోలంతా చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి టీంవర్క్పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. - చాముండేశ్వరీనాథ్, ‘తెలుగు వారియర్స్’ జట్టు మెంటర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లే కోచింగ్ క్యాంపులు! మన తెలుగు హీరోలు చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెన్నై, కర్ణాటక టీమ్‌లు వీకెండ్‌కి ముందు ప్రత్యేకంగా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దానికి భిన్నంగా మన తెలుగు స్టార్స్ ప్రతి రోజు ఐదుగంటలపాటు ఇక్కడ లోకల్ ఆటగాళ్లతో పోటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అవే వాళ్లకు పెద్ద కోచింగ్ క్యాంపులు. వాళ్ల సీరియస్‌నెస్ చూస్తుంటే వారిలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ కనిపిస్తున్నారు. - విష్ణు ఇందూరి, సిసిఎల్ ఫౌండర్ -
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది
ఆత్మహత్య బాధాకరం: హీరో తరుణ్ దివంగత హీరో ఉదయ్‌కిరణ్ తనకు మంచి మిత్రుడని, అతని మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో తరుణ్ ఆవేదన చెందారు. శ్రీకాంత్ కలసి ఇక్కడికి వచ్చిన ఆయన తన మనస్సులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదుకాని ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మంచి నటుడ్ని తె లుగు సినీ పరిశ్రమ పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయన్న టాక్‌పై విలేకరులు ప్రస్తావించగా అలాంటిదేమి ఉండదన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరన్నారు. మన సినిమా బాగుంటే అదే ఆడుతుందన్నారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు బాగున్నా ఆడడం లేదన్న విషయంలో కూడా నిజం లేదన్నారు. ఎన్ని చిన్న సినిమాలు బాగా ఆడడం లేదంటూ... ఇటీవల విడుదలై విజ యం సాధించిన కొన్ని చిన్న సినిమాల పేర్లను ఉదహరించారు. చిన్నవి, పెద్దవి అని కాదని లో బడ్జెట్, హై బడ్జెట్ అనేదే చూడాలన్నారు. ఎన్నో లో బడ్జెట్ సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. సినిమా బాగుం టే ప్రేక్షులు వద్దన్నా వెళ్లతారన్నారు. వారినెవరూ ఆపలేరని చెప్పారు. ప్రస్తుతం వేట, యుద్ధం సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. -
గెలుపు కోసమే ఈ యుద్ధం
‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. గెలుపు కోసమే ఇన్ని రోజులు యుద్ధం చేశాం. విజయం సిద్ధిస్తుందని మా నమ్మకం’’ అని తరుణ్ అన్నారు. ఆయన కథానాయకునిగా, స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘యుద్ధం’. భారతీగణేశ్ దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ- ‘‘దర్శకుడు భారతీగణేశ్ మంచి మాస్ పల్స్ ఉన్న దర్శకుడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా నా కెరీర్లో ఓ మంచి సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ సందర్భంలో శ్రీహరి లేకపోవడం బాధాకరమని, ఈ చిత్రం తరుణ్‌కి పెద్ద హిట్ కావాలని శ్రీకాంత్ అభిలషించారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేసి, సంక్రాంతి కానుకగా ఈ నెల 16న సినిమా విడుదల చేస్తామని నట్టికుమార్ తెలిపారు. మాస్ లీడర్కీ, యూత్ లీడర్కీ మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా అని దర్శకుడు చెప్పారు. ఇంకా సాధక్ కుమార్, ఘటికాచలం, నట్టి క్రాంతి, జిట్టా సురేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. -
టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ...
ప్లస్ పాయింట్స్ క్రమశిక్షణ వృత్తిపట్ల విపరీతమైన డెడికేషన్ అందాల ప్రదర్శనతో పాటు అభినయానికి పాధాన్యమివ్వడం మైనస్ పాయింట్స్ తెలుగులో అగ్రతారగా ఎదిగినా కూడా అస్సలు తెలుగు భాష నేర్చుకునే ప్రయత్నం చేయకపోవడం సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడం టాప్ 5 మూవీస్ వర్షం నువ్వొస్తానంటే నేనొద్దొంటానా అతడు ఆడవారి మాటలకు అర్థాలు వేరులే కృష్ణ ‘జోడి’ సినిమాలో కథానాయిక సిమ్రాన్ స్నేహితురాలిగా ఓ బక్క పలుచటి అమ్మాయి చేసింది. పేరు త్రిష. గొప్ప అందగత్తె కాదు కానీ, కళ్లల్లో... ముఖ్యంగా నవ్వులో ఏదో గ్రేస్. నటనలో ఈజ్. కట్ చేస్తే... ‘మౌనమ్ పేసియాదె’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఆఫర్. ఆ తర్వాత నాలుగైదు తమిళ సినిమాల్లో అవకాశాలు. 2003... త్రిష జీవితాన్ని మలుపు తప్పింది. ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం పెద్దకొడుకు ఏయమ్ జ్యోతికృష్ణ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ‘నీ మనసు నాకు తెలుసు’ మొదలుపెట్టాడు. తరుణ్ హీరో. ఇద్దరు హీరోయిన్లు కావాలి. శ్రీయ ఓకే. ఇంకొకరు ఎవరు? ఎవరెవర్నో అనుకుని ఫైనల్‌గా త్రిష దగ్గరకొచ్చారు. అదే త్రిష తొలి తెలుగు సినిమా. 2003 డిసెంబర్ 6న రిలీజైంది. పదేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీని ఏలతానని త్రిష ఆ రోజు అనుకుని ఉండదు. నిర్మాత ఎమ్మెస్ రాజు, ప్రభాస్ హీరోగా ‘వర్షం’ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ పాత్ర చాలా ఇంపార్టెంట్. గ్లామర్ కన్నా పెర్ఫార్మెన్స్కి స్కోప్. రకరకాల ఆప్షన్లు. ఎవ్వరూ నచ్చడం లేదు. ప్రభాస్‌లాంటి పొడవాటి హీరో పక్కన కొంచెం ఆనాలి కదా. అయితే పొట్టి, లేకపోతే లావు. స్లిమ్‌గా తెలుగింటి అమ్మాయిలా కనపడాలి. ఇదీ ఎమ్మెస్ రాజు ఆప్షన్స్. ఓ సినిమా మేగజైన్లో త్రిష ఫొటో చూసీ చూడగానే తనే హీరోయిన్ అని ఎమ్మెస్ రాజు ఫిక్సయిపోయారు. చెన్నై కబురెళ్లింది. అప్పటికే త్రిష రెండు, మూడు తమిళ సినిమాలు కమిట్ అయ్యింది. కొంచెం బిజీనే. కానీ ‘వర్షం’ ప్రాజెక్ట్ ఎట్రాక్టివ్‌గా అనిపించింది. వెంటనే ఓకే అనేసింది. అదే ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. ‘వర్షం’ లేకపోతే త్రిషకు ఇంత స్టార్డమ్ వచ్చేదా? ఏమో... వచ్చేది కాదేమో. ఆ తర్వాత వెంట వెంటనే సూపర్హిట్లు. సూపర్ స్టార్డమ్. బ్లాంక్ చెక్‌లు. భారీ ఆఫర్లు. ఉత్తమనటిగా అవార్డులు. చిరంజీవి నుంచి నితిన్ వరకూ అందరికీ త్రిష బెస్ట్ చాయిస్ అయిపోయింది. ఒక్క బాలకృష్ణ తప్ప, తెలుగులో దాదాపుగా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. తమిళంలోనూ అదే హవా. అక్కడ కూడా అగ్రతాంబూలమే. ఓ దశలో త్రిషే నంబర్‌వన్ హీరోయిన్. నయనతార, ఇలియానా, శ్రీయ, చార్మి... ఇలా ఎంతమంది హీరోయిన్లు పోటీకొచ్చినా త్రిష ప్లేసు మారలేదు. దాదాపుగా ఇప్పుడున్న హీరోయిన్లంతా అర్బన్ కేరక్టర్స్‌కే సెట్ అవుతారు. రూరల్ కేరెక్టర్స్కి కరెక్ట్‌గా ఫిట్ కారు. త్రిషతో ఆ సమస్య రాలేదు. ‘వర్షం’లో కానివ్వండి, ‘నువ్వొస్తానంటే నేనొద్దొంటానా’ కానివ్వండి, ‘అతడు’ కానివ్వండి... ఆ పల్లెటూరి అమాయకత్వాన్ని, సోయగాన్ని లంగా ఓణీల్లో అందంగా ఆవిష్కరించగలిగిందామె. కొన్ని చిలిపి పాత్రలూ అల్లరి పాత్రలకూ త్రిష టైలర్మేడ్లాగా అనిపిస్తుంది. అలాగని మెట్రో తరహా పాత్రలకు తనేమీ అన్యాయం చేయలేదు. టూ పీస్ బికినీ అయితే వేయలేదు కానీ, చిన్న చిన్న గ్లామర్ డ్రెస్‌లకు అభ్యంతరం చెప్పలేదు.అయితే ఆమె బ్యాడ్‌లక్ ఏంటంటే - తను ఇంతవరకూ అనుష్కలాగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేయలేకపోయింది. కమర్షియల్ సినిమాల మూసలోనే ఒదిగిపోయింది. కొంచెం ఆ బౌండరీలు దాటి వచ్చి ఉంటే, తనలోని నటికి ఇంకా మంచి అవకాశాలు దక్కేవి.కొత్తనీరు రాగానే పాతనీరు వెళ్లిపోవడం సహజమే. అసలు ఇప్పుడు హీరోయిన్ల కెరీర్ లైఫ్ నాలుగైదేళ్లకు మించి ఉండటం లేదు. అలాంటిది త్రిష పదేళ్లు ఉండగలిగింది. నిజం చెప్పాలంటే - త్రిషకు ఇది లాస్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. మునుపటి క్రేజ్ లేదు. తెలుగులో అయితే ఒక్క ఛాన్సూ లేదు. ఆమధ్య ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘రమ్’ సినిమా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. తమిళంలో మాత్రం మూడు ఆఫర్లున్నాయి. అదేం చిత్రమో కానీ, త్రిష మొదట్నుంచీ మీడియాకు దూరమే. అయినా మీడియాలో ఎక్కువ నలుగుతుంటారు. ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గాసిప్ ఏంటంటే - త్రిష ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతున్నారట. అది కూడా ఓ తెలుగు యువనటునితో. వచ్చే ఏడాది త్రిష సినిమాలకు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని కొన్ని వెబ్సైట్లలో వార్తలొస్తున్నాయి. ఇలాంటి వాటిని త్రిష ఏనాడూ ఖండించలేదు.అదే ఆమె ప్లస్సూ!... మైనస్సూ కూడా! -
వేట దేనికోసం?
నమ్మిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని ఓ అనుచరుడికీ, ఓ కాలేజీ విద్యార్థికి మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వేట’. శ్రీకాంత్, తరుణ్ ముఖ్య పాత్రధారులు. జాస్మిన్, అజాజ్‌ఖాన్, మధురిమ కథానాయికలు. అశోక్ అల్లె దర్శకుడు. సి.వి.రావు, పి.శ్వేతలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. దేనికోసం ఈ ‘వేట’ అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. ఇటీవలే తరుణ్, జాస్మిన్లపై దుబాయ్‌లో రెండు పాటల్ని చిత్రీకరించాం’’ అని తెలిపారు. కృష్ణభగవాన్, డా.శివప్రసాద్, దీప్తి వాజ్‌పేయ్, శివారెడ్డి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సమర్పణ: సి.కల్యాణ్.