ఈ పేరులోనే ఓ పవర్ ఉంది
‘‘శ్రీకాంత్, తరుణ్ కలిసి నటించిన ‘వేట’ చాలా ఆసక్తికరమైన సినిమాలా అనిపిస్తోంది. ‘వేట’ అనే పేరులోనే ఓ పవర్ ఉంది’’ అని నాని చెప్పారు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మించిన ‘వేట’ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు హీరో నాని డిస్క్‌లు అందజేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనంతంగా ఉంది.
తెలుగు పరిశ్రమకు దొరికిన మరో మంచి కమర్షియల్ దర్శకుడు అశోక్’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ- ‘‘నేను స్వరాలందించిన వంద సినిమాల్లో పదికి పైగా శ్రీకాంత్‌వే ఉన్నాయి. ఈ పాటలు విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాస్మిన్, మధురిమ, సింహ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు.