platinum disc function
-
రైతు బతుకుపోరే ఈ చిత్రం
‘‘సమస్యల కోసం పోరాడే ప్రజల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. నా ప్రతి విజయంలోనూ ప్రజా కవుల సహకారం ఉంది. 1995 నుంచి 2018 వరకు 3 లక్షల 25వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలని నా వంతుగా చేసిన ప్రయత్నమే ‘అన్నదాత సుఖీభవ’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని జూలై 7న పునః విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు బతుకుపోరే ఈ సినిమా. పాలకులు రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి. జయతి ఘోష్, రాధాకృష్ణన్ కమిషన్, స్వామినాథన్ కమిషన్లను ప్రభుత్వం ఆ ప్రయత్నంలో భాగంగానే నియమించింది. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. రైతులకు, పంటలకు బీమా కల్పించాలి’’ అన్నారు. ‘‘నా దృష్టిలో జగపతిబాబు, రాఘవ, రామోజీరావు, రాఘవేంద్రరావువంటి కొందరు గొప్పవాళ్లున్నారు. వాళ్లందరిలోని లక్షణాలు నాకు ఆర్. నారాయణమూర్తిగారిలో కనిపిస్తాయి. ప్రపంచం గురించి విపరీతమైన జ్ఞానం ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తి సినిమాల్లో చేసింది చాలు అని భావించి, క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూరుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న తరుణమిది. ఇండియాలో 20–35 ఏళ్లున్న యువతను మరో వైపు ఈ దండయాత్ర తీసుకెళ్తోంది. రైతంటే ఎవరని ప్రశ్నించే పాలకులకు సమాధానమే ‘అన్నదాత సుఖీభవ’’ అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఈ కార్యక్రమంలో అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, రాజేంద్రకుమార్, సుద్దాల అశోక్ తేజ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా
- మంచు మనోజ్ ‘‘ఇటీవల విడుదలైన మా చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల విజయం సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. కొత్తవాడైనా వేద మంచి పాటలు ఇచ్చాడు. త్వరలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం. బ్యాక్ గౌండ్ స్కోర్ కూడా బాగా చేశాడు. దశరథ్ స్టోరీ చెప్పినప్పుడు ఒకే సిట్టింగ్‌లో ఓకే చెప్పేశా’’ అని హీరో మంచు మనోజ్ తెలిపారు. మనోజ్, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మించిన ‘శౌర్య’ ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘శివకుమార్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం నిర్మించారు. పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమా కొన్నారు. అందరికీ లాభాలు రావాలని ఆశిస్తున్నా’’ అని నిర్మాత పేర్కొన్నారు. వరికుప్పల యాదగిరి, వేద, ప్రభాస్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
63 మంది కొత్తవాళ్లతో...
‘‘ఎవరో కొంతమంది మినహా మొత్తం 63 మంది కొత్తవారు మా చిత్రంలో నటించారు. హారర్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని దర్శకుడు ఎం.వి. సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ పతాకంపై కెల్లం కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాల ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి చిత్ర బృందానికి డిస్క్‌లు అందించారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత అన్నారు. రుషిక, రఘు బాబు, శివన్నారాయణ తదిత రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పీ.ఆర్, కెమెరా: కె.యం. కృష్ణ. -
'డీ అంటే డీ' ప్లాటినం డిస్క్ వేడుక
-
‘రేయ్’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి
అప్పట్లో ‘లేడీస్ టైలర్’ పెద్ద హిట్టయింది. దానికీ మేమంతా ఓ టీమ్‌లా కలసి మెలసి పనిచేశాం. ‘సూర్య వెర్సస్ సూర్య’ టీమ్‌తో వర్క్ చేస్తుంటే నాకా రోజులు గుర్తొచ్చాయి’’ అని తనికెళ్ల భరణి అన్నారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా పదకొండు రోజులకు పదకొండు కోట్లు వసూలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. విభిన్న నేపథ్యంలో చేసిన మా ప్రయత్నం ఇంత ఘన విజయం సాధించడానికి ప్రేక్షకులు కారణమని నిర్మాతలు చెప్పారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత చందు మొండేటి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘యమలీల-2’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
ఎర్రజెండా ఉన్నంతవరకూ నారాయణమూర్తి గుర్తుంటాడు : కె. రాఘవేంద్రరావు
‘‘మేం ఏసీ గదుల్లో కూర్చుని కథలు రెడీ చేస్తుంటే, నారాయణమూర్తి ఎర్రటి ఎండలో రోడ్ల మీద నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు కథలు అల్లుకుంటాడు. ఎర్రజెండా ఉన్నంతకాలం అతను గుర్తుంటాడు’’ అని సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ఆర్. నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించి, నాలుగు పాత్రలు పోషించిన చిత్రం ‘రాజ్యాధికారం’. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ,‘‘1980లో నేను దర్శకత్వం వహించిన ‘మోసగాడు’లో స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పాటలోని ఒక్క లైన్‌కి జాతీయ జెండా పట్టుకుని నారాయణమూర్తి చాలా ఆవేశంగా నటించాడు’’ అంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. రచయిత, దర్శకుడు జేకే భారవి, ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా కవులు జయరాజు, గిద్దె రామనర్సయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ -‘‘సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం గొప్ప విషయం. గత ముప్ఫై ఏళ్లుగా నారాయణమూర్తి ఈ దిశగానే సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రమని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
‘ఐస్‌క్రీమ్ 2 ’ మూవీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
‘జోరు’మూవీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
‘రోమియో’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికి 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో చేశారు. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని గణేశ్ అన్నారు. పాటలు ఘనవిజయం సాధించడానికి స్వరాలతో పాటు సాహిత్యం కారణమని, మంచి ఫీల్ ఉన్న చిత్రమనీ సచిన్ తెలిపారు. ఈ సినిమా తనకు ప్రత్యేకమని నజియా అన్నారు. -
గాలిపటం మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
ప్రతిభకు వేదిక ఇది
‘‘నేను చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. గేయ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాను. సంగీత దర్శకునిగా మాత్రం అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయాను. నాలాగా స్ట్రగుల్ అవుతోన్న ప్రతిభావంతులకు వేదికగా ఈ సినిమా చేశాం’’ అని చిన్ని చరణ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అదీ లెక్క’ ఈ నెల 9న విడుదల కానుంది. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి అన్విల్ ముఖ్య తారలుగా మల్లేష్ కొండేటి సమర్పణలో చిన్ని చరణ్, రమ్య ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తన ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సినిమాతో చక్కటి అవకాశం దొరికిందని మనోజ్ నందం చెప్పారు. ఈ వేడుకలో సాయికార్తీక్, మహి, ప్రియాంక, వినాయకరావు, సురేష్ కొండి పాల్గొన్నారు. -
లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ!
సినిమా తీయడం సులువే కానీ.. విడుదల చేయడమే కష్టం అంటున్నారు కె.ఎస్.ఐ. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు, భూమిక, రణధీర్, సష్టి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. సుధా ఎంటర్టైన్మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఓ లాయర్, ఓ జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాకి జగపతిబాబు, భూమికల నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది. బంటి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. సెన్సార్ పూర్తయ్యిందని, అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు అన్నారు. పాటల్లానే సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నానని బంటి చెప్పారు. సృష్టి, బలభద్రపాత్రుని రమణి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేశ్ పుప్పాల, స్వామి చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేసి, శుభాకాంక్షలు అందజేశారు. -
సిన్సియర్ లవర్ కథ
‘‘చాలా సిన్సియర్‌గా ప్రేమించే కుర్రాడి కథ ఇది. తానొక వేళ ప్రేమలో ఫెయిలైనా హార్ట్ బ్రేక్ చేసుకోడు. ఆత్మహత్యకు సిద్ధపడడు. ఇందులో నాది అలాంటి పాత్ర’’ అని హీరో ఆది చెప్పాడు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘ప్యార్ మే పడిపోయానె’ ప్లాటినమ్ డిస్క్ వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘టెన్షన్ కామెడీతో సినిమా నడుస్తుంది. ప్రేక్షకుల ఊహకు భిన్నంగా సన్నివేశాలు ఉంటాయి’’ అన్నారు. అనూప్ స్వరాలందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
ఆలోచింపజేసే ప్రతినిధి
నారా రోహిత్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రతినిధి’. శుభ్ర అయ్యప్ప కథానాయిక. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అందరినీ ఆలోచింపజేసే సినిమా ఇదని, సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని నారా రోహిత్ అన్నారు. సినిమా బాగా వచ్చిందని, జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. చక్కని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని దర్శకుడు అన్నారు. అతిథులుగా విచ్చేసిన పోకూరి బాబూరావు, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్, నాని, భీమినేని శ్రీనివాసరావు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
ఈ పేరులోనే ఓ పవర్ ఉంది
‘‘శ్రీకాంత్, తరుణ్ కలిసి నటించిన ‘వేట’ చాలా ఆసక్తికరమైన సినిమాలా అనిపిస్తోంది. ‘వేట’ అనే పేరులోనే ఓ పవర్ ఉంది’’ అని నాని చెప్పారు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మించిన ‘వేట’ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు హీరో నాని డిస్క్‌లు అందజేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనంతంగా ఉంది. తెలుగు పరిశ్రమకు దొరికిన మరో మంచి కమర్షియల్ దర్శకుడు అశోక్’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ- ‘‘నేను స్వరాలందించిన వంద సినిమాల్లో పదికి పైగా శ్రీకాంత్వే ఉన్నాయి. ఈ పాటలు విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాస్మిన్, మధురిమ, సింహ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు. -
సందడి సందడిగా...
‘నలుగురు లేనివాడు అనాథ కాదు. ఎవరికీ ఏమీ కానివాడే అనాథ’. ‘బ్యాండ్‌బాజా’చిత్రంలో హీరో తనీష్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌కి అనుగుణంగానే ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని చెబుతున్నారు ఈ చిత్రం దర్శకుడు నగేశ్ నారదాసి. నయీమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రూపల్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేనేమీ భారతదేశానికి బామ్మర్దినని మెళ్లో బోర్డేసుకొని తిరగట్లా... అంటాడు ఇందులో ఓ సన్నివేశంలో తనీష్. కచ్చితంగా ఆయన క్యారెక్టరైజేషన్‌కి అద్దం పట్టే డైలాగ్ ఇది. నేటి యువతరానికి ప్రతీక లాంటి పాత్ర ఇందులో ఆయనది. టైటిల్‌కి తగ్గట్టు సినిమా కూడా సందడిగా ఉంటుంది. ప్రతి సీన్లో నలభై, యాభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపి, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.