లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ! | Jagapathi Babu April Fool Movie Platinum Disc Function | Sakshi
Sakshi News home page

లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ!

Published Sun, May 4 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ!

లాయర్, జర్నలిస్ట్ ప్రేమకథ!

సినిమా తీయడం సులువే కానీ.. విడుదల చేయడమే కష్టం అంటున్నారు కె.ఎస్.ఐ. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు, భూమిక, రణధీర్, సష్టి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. సుధా ఎంటర్‌టైన్‌మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఓ లాయర్, ఓ జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాకి జగపతిబాబు, భూమికల నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది.
 
  బంటి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. సెన్సార్ పూర్తయ్యిందని, అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు అన్నారు. పాటల్లానే సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నానని బంటి చెప్పారు. సృష్టి, బలభద్రపాత్రుని రమణి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేశ్ పుప్పాల, స్వామి చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేసి, శుభాకాంక్షలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement