ఆలోచింపజేసే ప్రతినిధి | Prathinidhi platinum disc function held | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే ప్రతినిధి

Published Sat, Apr 19 2014 11:54 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

ఆలోచింపజేసే ప్రతినిధి - Sakshi

ఆలోచింపజేసే ప్రతినిధి

నారా రోహిత్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రతినిధి’. శుభ్ర అయ్యప్ప కథానాయిక. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అందరినీ ఆలోచింపజేసే సినిమా ఇదని, సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని నారా రోహిత్ అన్నారు. సినిమా బాగా వచ్చిందని, జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. చక్కని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని దర్శకుడు అన్నారు. అతిథులుగా విచ్చేసిన పోకూరి బాబూరావు, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్, నాని, భీమినేని శ్రీనివాసరావు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement