Prathinidhi
-
ఓటీటీలో 'ప్రతినిధి 2'.. అధికారిక ప్రకటన
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతినిధి 2’. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సుమారు పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 10న ఈ చిత్రం విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.‘ప్రతినిధి 2’ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించగా.. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు వంటి వారు నటించారు. -
స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న శుభ్ర అయ్యప్ప (ఫోటోలు)
-
'నెపోలియన్' మూవీ రివ్యూ
టైటిల్ : నెపోలియన్ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : ఆనంద్ రవి, రవివర్మ, కోమలి సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని దర్శకత్వం : ఆనంద్ రవి నిర్మాత : భోగేంద్ర గుప్తా ఇటీవల తొలి పోస్టర్, టీజర్ నుంచే ఎంతో ఆసక్తి కలిగించిన సినిమా నెపోలియన్. ఓ వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ లను ఆశ్రయించటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఆనంద్ రవి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా మంచి విజయం సాధించటంతో సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ప్రతినిథి సినిమాకు కథ రచయిత ఈ ఆనంద్ రవి. తానే స్వయంగా డైరెక్టర్ గా, ప్రధాన పాత్రలో తెరకెక్కించిన నెపోలియన్ మరోసారి ప్రతినిథి స్థాయిలో ఆకట్టుకుందా..? దర్శకుడిగా.. నటుడిగా ఆనంద్ రవి విజయం సాధించాడా..? అసలు నీడ పోవటమేంటి..? కథ : సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : మూడు కీలక పాత్రల నేపథ్యంలోనే కథ నడవటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఉన్నవాళ్లలో సీనియర్ నటుడైన రవివర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. తొలిసారిగా నటుడిగా మారిన ఆనంద్ రవి పరవాలేదనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన కోమలి నటన ఆకట్టుకున్నా.. ఆ పాత్రకు పరిచయం ఉన్న నటిని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతినిథి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తానే దర్శకుడిగా నటుడిగా పరిచయం అయ్యే సినిమాతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా.. పోను పోను సినిమా ఓ మామూలు రివేంజ్ డ్రామాల మారింది. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమా మొదలు పెట్టిన విధానం నేపథ్య సంగీతం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ : కీలక పాత్రల నటన స్క్రీన్ ప్లే - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు
యంగ్ జనరేషన్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా ఎదుగుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ మీద కూడా దృష్టి పెట్టిన సందీప్ కిషన్, హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇంట్రస్ట్రింగ్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న సందీప్, తాజాగా మరో సినిమాకు అంగీకరించాడు. 'ఒక అమ్మాయి తప్ప' సినిమాను పూర్తి చేసిన సందీప్ కిషన్, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ 'నేరం' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఫైనల్ చేశాడు. నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిథి సినిమాకు రచయితగా పనిచేసిన ఆనంద్ రవి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. 'సినిమా చూపిస్త మామ' లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి
రిలీజ్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. కమర్షియల్ సినిమాలకు దూరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న రోహిత్, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు రోహిత్ హీరోగా సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్‌తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'తుంటరి', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. ఇన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇప్పుడు మరో సినిమాను అంగీకరించాడు నారా రోహిత్. ప్రస్తుతం రోహిత్ హీరోగా 'జో అచ్యుతానంద' సినిమాను నిర్మిస్తున్న వారాహి చలనచిత్ర సంస్థలోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రదీప్ దర్శకత్వంలో 'రాజా చెయ్యివేస్తే' అనే సినిమాను అంగీకరించాడు. మరి ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన రోహిత్, ఆ సినిమాల రిలీజ్లు ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. -
'తుంటరి'గా రౌడీఫెలో
ప్రతినిథి, రౌడీఫెలో, అసుర లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రోహిత్ గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు తుంటరి అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు చిత్రయూనిట్. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండో ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు నారా రోహిత్. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దసరా సందర్బంగా రిలీజ్ చేశారు. డెస్టినీ వర్సెస్ హార్డ్ వర్క్ అనే స్టేట్మెంట్తో నారారోహిత్ ట్రెండీ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. -
సిక్స్‌ప్యాక్ తో రౌడీఫెలో
సక్సెస్ ల పరంగా ఆకట్టుకోలేకపోయినా స్టోరి సెలక్షన్ లో బెస్ట్ అనిపించుకున్న యంగ్ హీరో నారా రోహిత్. వరుసగా 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాలతో మంచి విజయాలు సాధించిన నారారోహిత్, లుక్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో బాగా బొద్దుగా కనిపించిన రోహిత్ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. తన నెక్ట్స్ సినిమాతో అభిమానులకు అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో సావిత్రి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్లేబాయ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న రోహిత్ అందుకు తగ్గ లుక్ కోసం కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమివ్వనున్నాడు రోహిత్. -
ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?
ఈ తరం యువ కథానాయకులకు ఒక సినిమా చేయడానికి కథ దొరకటమే కష్టంగా ఉంటే నారా రోహిత్ మాత్రం వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకువస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలకు కమిట్ అవుతూ వస్తున్న రోహిత్, ఇప్పుడు మరింత దూకుడుగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఐదు సినిమాలు చేతులో ఉన్నా, తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా తరువాత మాత్రం వరుస సక్సెస్‌లతో మంచి ఫాం చూపిస్తున్నాడు రోహిత్. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' లాంటి సినిమాల సక్సెస్‌లు రోహిత్‌కి మంచి ఇమేజ్ తీసుకురావటంతో పాటు, మార్కెట్ ను కూడా పెంచాయి. దీంతో మినిమమ్ బడ్జెట్‌తో సందేశాత్మక కథలను తెరకెక్కించాలనుకునే నిర్మాతలు నారా రోహిత్ బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే 'శంకర' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా 'పండుగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటికి తోడు సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్‌ను దర్శకుడిగా పరిచేస్తూ తెరకెక్కిస్తున్న మరో సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ సినిమాలన్ని ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి. -
ప్రతినిధి మూవీ ప్రాటీనమ్ డిస్క్
-
ఆలోచింపజేసే ప్రతినిధి
నారా రోహిత్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రతినిధి’. శుభ్ర అయ్యప్ప కథానాయిక. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అందరినీ ఆలోచింపజేసే సినిమా ఇదని, సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని నారా రోహిత్ అన్నారు. సినిమా బాగా వచ్చిందని, జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. చక్కని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని దర్శకుడు అన్నారు. అతిథులుగా విచ్చేసిన పోకూరి బాబూరావు, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్, నాని, భీమినేని శ్రీనివాసరావు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.