ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి | hero nara rohith new movie raja cheyyivesthe | Sakshi
Sakshi News home page

ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి

Published Tue, Oct 27 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి

ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి

రిలీజ్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. కమర్షియల్ సినిమాలకు దూరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న రోహిత్, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు రోహిత్ హీరోగా సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.

'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'తుంటరి', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి.

ఇన్ని సినిమాలు రిలీజ్కు రెడీ అవుతుండగా ఇప్పుడు మరో సినిమాను అంగీకరించాడు నారా రోహిత్. ప్రస్తుతం రోహిత్ హీరోగా 'జో అచ్యుతానంద' సినిమాను నిర్మిస్తున్న వారాహి చలనచిత్ర సంస్థలోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రదీప్ దర్శకత్వంలో 'రాజా చెయ్యివేస్తే' అనే సినిమాను అంగీకరించాడు. మరి ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన రోహిత్, ఆ సినిమాల రిలీజ్లు ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement