అదే డ్రస్లో మరోసారి..! | Another Police character by Nara Rohit | Sakshi
Sakshi News home page

అదే డ్రస్లో మరోసారి..!

Published Wed, Jul 12 2017 2:01 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

అదే డ్రస్లో మరోసారి..! - Sakshi

అదే డ్రస్లో మరోసారి..!

బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నారా రోహిత్ తొలి సినిమాలోనే పోలీస్ క్యారెక్టర్తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత రౌడీఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవారు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించాడు రోహిత్. ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న శమంతకమణి సినిమా కోసం ఐదో సారి అదే పాత్ర చేశాడు. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రోహిత్.

ఇప్పటికే ఐదు సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో నారా రోహిత్ మరోసారి అదే పాత్రకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మల్టీ స్టారర్ సినిమా వీరభోగవసంత రాయలు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడట. సుధీర్ బాబు, శ్రీవిష్ణులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

వీరభోగవసంత రాయలు తో పాటు పంగలా వచ్చాడు, నీది నాది ప్రేమ సినిమాలు పూర్తి కావచ్చాయి. పవన్ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీద ఉంది. సావిత్ర ఫేం పవన్ సాధినేనితో ఒక సినిమా, బాణం ఫేం చైతన్య దంతులూరితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement