నారావారబ్బాయి న్యూ లుక్ | nara rohith six pack in his next | Sakshi
Sakshi News home page

నారావారబ్బాయి న్యూ లుక్

Published Tue, Jul 11 2017 3:54 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నారావారబ్బాయి న్యూ లుక్ - Sakshi

నారావారబ్బాయి న్యూ లుక్

సక్సెస్ల పరంగా ఆకట్టుకోలేకపోయినా స్టోరి సెలక్షన్లో బెస్ట్ అనిపించుకున్న యంగ్ హీరో నారా రోహిత్. వరుసగా 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర', 'జ్యో అచ్యుతానంద', 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలతో మంచి విజయాలు సాధించిన నారారోహిత్, లుక్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో బాగా బొద్దుగా కనిపించిన రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.

తన నెక్ట్స్ సినిమాతో అభిమానులకు అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పవన్ మల్లెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం నారా రోహిత్ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే 21 కిలోల బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయినా రోహిత్ మరో 5 కిలోలు తగ్గటమే తన టార్గెట్ అంటున్నాడు. త్వరలో రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement