సాక్షి, కర్నూలు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ పేలుడు ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పేలుడు ఘటనకు సంబంధించి వివరాలను పవన్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. హత్తిబెళగల్ భారీ పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు నాయుడు సమర్థించి తప్పు చేస్తున్నారని తెలిపారు. సొంత నాయకులను కాపాడుకోవడం కోసం సీఎం ప్రజాసమస్యలను విస్మరించకూడదని సూచించారు. నిరు పేద కూలీల మరణాలు చూసైనా రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు యథేచ్ఛగా అక్రమమైనింగ్ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పని చేస్తోందా అని మండిపడ్డారు. మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
జిల్లాలో దాదాపు 1600 క్వారీలకు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇచ్చిందని పవన్ ధ్వజమెత్తారు. వాటిలో సగానికిపైగా అక్రమ క్వారీలు ఉన్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. స్థానికంగా ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తెచ్చారని పవన్ తెలిపారు. వాటిపై సరైన సమయంలో స్పందాస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment