
చికిత్స పొందుతున్న శివ
కర్నూలు , నంద్యాలఅర్బన్: టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు తాళలేక సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివ ఆత్మహత్యకు యత్నించాడు. శివ తండ్రి రమణ తెలిపిన వివరాల మేరకు.. టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు ప్రతిరోజూ కార్డెన్ సెర్చ్ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లను సోదాలు చేస్తున్నారు. కత్తులు, మారణాయుధాలు ఉన్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తల బలం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు పోలీసులను పురమాయించి వేధిస్తున్నారు. దీంతో 38వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి రమణ తనయుడు శివ.. తాలూకా పోలీసుల ఎదుటే చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చేయి నుంచి రక్తం ఎక్కువగా కారుతుండటంతో కుటుంబ సభ్యులు శివను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment