
సాక్షి, కర్నూలు : బనగానపల్లె పాత బస్టాండ్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌ర రెడ్డి అనుచరులతో కలిసి దాడి చేశారు. రాడ్లు, పైపులతో దుర్గాప్రసాద్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. అతడ్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.