samanthakamani
-
అందుకే టీడీపీని వీడాను : శమంతకమణి
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైఎస్సార్సీపీలో చేరామని చెప్పారు. (చదవండి : ‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ) తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్థంలో ఉన్నారన్నారు. సీఎం జగన్ జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. శింగనమల ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో కలిసి నిజయోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన ‘దిశ’, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యే తాము వైఎస్సార్సీపీలో చేరామని మాజీ ఎమ్మెల్యే యామినిబాల అన్నారు. వైఎస్సార్సీపీలో చేరడం.. తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. -
‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. (చదవండి: ‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..) కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడినట్లు సమాచారం. (చదవండి: మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం) -
సమంత లేటెస్ట్ ఫోటోస్
-
‘జాను’ థ్యాంక్స్ మీట్
-
అమ్మ.. కూతురు.. కొడుకు.. ఓ పీఏ!
ఈనెల 5వ తేదీన తహసీల్దార్ల బదిలీలు చేపట్టారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు తహసీల్దార్ పుల్లన్నను కలెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదే నియోజకవర్గంలోని నార్పల తహసీల్దార్ శ్రీధర్‌బాబును పుట్లూరుకు బదిలీ చేశారు. సుమారు 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ వీరిద్దరూ బదిలీ స్థానాల్లో కాకుండా ఇదివరకున్న మండలాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ అండదండలతోనే వీళ్లు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో రాజకీయ జోక్యానికి ఇదో ఉదాహరణ మాత్రమే.. శింగనమల: ఎమ్మెల్సీ శమంతకమణి.. ఈమె కుమార్తె ఎమ్మెల్యే యామినీబాల.. ఈమెకు తమ్ముడైన అశోక్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త.. ఎమ్మెల్యే పీఏ కిరణ్.. నియోజకవర్గంలో ఈ నలుగురి మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. కుటుం బంలో సఖ్యత లేని కారణంగా పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయారు. ఈ పరిస్థితి సామాన్య కార్యకర్తలతో పాటు నాయకులను గందరగోళంలో పడేస్తోంది. ఇదే సమయంలో పనుల విషయంలో ఎవరి వద్దకు వెళితే ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో చివరి దశలో యామినీబాల నామినేషన్ వేసి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఇన్చార్జి ఎంఈఓగా పని చేశారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే అయినా.. ఎన్నికయ్యాక మూడు సంవత్సరాల వరకు రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయారు. ఆ తర్వాత తమ్మునితో విభేదాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచే వ్యవహారాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌కు తమ్ముడు పోటీలో ఉండడంతో, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ్ముడితో విభేదించే నియోజకవర్గ నాయకులను కలుపుకొని పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. అశోక్ విషయానికొస్తే.. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు, ఎమ్మెల్యే యామినిబాలకు తమ్ముడు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడు సంవత్సరాల పాటు అన్నీ తానై వ్యవహరించారు. అధికారుల బదిలీలు మొదలుకొని, పథకాలు.. ఇతరత్రా వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాడు. అధికారులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కా తమ్ముళ్ల మధ్యభేదాభిప్రాయాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మేల్యే, సొంత ఇంటి నుంచి అశోక్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. పీఏ కిరణ్ చిచ్చు ఎమ్మెల్యే యామినిబాల పీఏ కిరణ్ జోక్యం కూడా నియోజకవర్గంలో అధికంగానే ఉంటోంది. అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో ప్రజాప్రతినిధులకు తెలియకుండా సొంతంగా టిప్పర్లు పెట్టి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఏ తన సామాజిక వర్గానికే ప్రాధన్యత ఇస్తుండడంతో పార్టీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నీరు–చెట్టు పనుల్లోనూ కమీషన్లు నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 2014–18 మధ్య కాలంలో నీరు–చెట్టు పథకం కింద 589 పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రతి పనిలో రూ.లక్షకు 10 శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారు. ఇందులో 5 శాతం వరకు ప్రజాప్రతినిధులకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలా రూ.3 కోట్ల వరకు కమీషన్ల రూపంలో చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. రైతు రథం పథకంలోనూ వసూళ్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు రథం పథకంలో భాగంగా 2017–18 సంవత్సరానికి సంబంధించి పెద్ద ట్రాక్టర్ల మంజూరులో భారీగా అవినీతి చోటు చేసుకుంది. ప్రతి ట్రాక్టర్‌కు సిఫారసు లేఖ ఇచ్చేందుకు ఓ ముఖ్యనేత రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 93 ట్రాక్టర్లు మంజూరు కాగా.. రూ.25లక్షలు ఆ ముఖ్యనేత వెనకేసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనుల్లోనూ పర్సెంటేజీలు నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టినా పర్సెంటేజీలు తప్పనిసరి అయ్యాయి. శింగనమల టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఒకరు 2016లో ఐసీడీఎస్ కార్యాలయం పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నారు. అయితే పనులు మొదలుపెట్టిన తర్వాత.. ఓ ముఖ్య నేత అప్పట్లో పని చేసిన ఎంపీడీఓను పంపించి నిలిపివేయించారు. ముఖ్య నేతతో మాట్లాడిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని చెప్పడంతో రూ.లక్ష ముట్టజెప్పి పనులు ప్రారంభించారు. రోడ్లు, భవనాల నిర్మాణాలతో పాటు ప్రతి పనిలోనూ పర్సెంటేజీ ఇవ్వనిదే పనులు కావట్లేదనే అభిప్రాయం పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తమవుతోంది. అధికారుల బదిలీల్లోనూ.. నియోజకవర్గంలో ఒక అధికారి పోస్ట్‌కు రేట్ పెట్టి వసూలు చేశారు. ఓ అధికారి ఇక్కడకు రావాలంటే నిర్ణయించిన మొత్తం చెల్లించుకోవాల్సిందే. లేదంటే వెనక్కు పంపడం ఇక్కడ పరిపాటి. అప్పటికీ కొనసాగితే.. మానసిక వేధింపులతో వెళ్లిపోయేలా చేస్తున్నట్లు అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని రెండు మండలాల తహసీల్దార్లు ఇటీవల బదిలీ అయ్యారు. అయితే వీరి బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లలేదు. ముఖ్య నేతలతో మాట్లాడుకోవడం వల్లే ఆ ఇద్దరూ ధైర్యంగా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. ఇసుక దందా ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. డిసెంబర్ 18, 2014 న వెలుగు ఆధ్వర్యంలో రీచ్ ప్రారంభించారు. ప్రభుత్వం 32వేల క్యూబిక్ మీటర్లుకు అనుమతివ్వగా.. 47వేల క్యూబిక్ మీటర్లు తరలించారు. రికార్డులలో 27వేలు మాత్రమే చూపించారు. భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి రావడంతో 20 మందికి నోటీసులు ఇచ్చి, 16 మంది వెలుగు సిబ్బందిని తొలగించారు. ఇక రెండవసారి 2015 డిసెంబర్ నెల అఖరులో 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతి లభిస్తే , ఉచితం పేరుతో అక్రమంగా ఇసుక తరలించారు. నిర్వహణ బాధ్యతలు వెలుగు సిబ్బందికి అప్పగించినా.. ఎమ్మెల్సీ తనయుడు ఆశోక్ , ఎమ్మెల్యే పీఏ కిరణ్ కనుసన్నల్లోనే వ్యవహారం సాగింది. ఒక మండల తెలుగు యువత అధ్యక్షుడు, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు ఒక్కో టిప్పుర్‌కు అదనంగా రూ.2 వేలు వసూలు చేశారు. ప్రతి రోజు 30 టిప్పుర్ల చొప్పున రోజుకు రూ.60వేలు దండుకోవడం గమనార్హం. ఈ లెక్కన నెల రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాతో సుమారు రూ.15లక్షలు దోచుకున్నారు. అదేవిధంగా ఇసుక తరలింపులోనూ వీరిద్దరూ రూ.20లక్షల వరకు వేనకేసుకున్నట్లు సమాచారం. -
సైలెంట్ గా మొదలుపెట్టాడు..!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుధీర్ బాబు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న సుధీర్ బాబు నెగెటివ్ రోల్స్ లోనూ నటిస్తున్నాడు. ఇటీవల శమంతకమణి సినిమాతో మల్టీ స్టారర్ సినిమాలోనూ నటించిన యంగ్ హీరో సుధీర్ బాబు త్వరలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ఒకేసారి అరడజను సినిమాలను ప్రకటించిన సుధీర్, ఓ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు బ్యానర్ పేరు ఫైనల్ చేయకపోయినా.. సినిమాను మాత్రం పూర్తి చేసేస్తున్నాడట. రామానాయుడు ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయిందన్న టాక్ వినిపిస్తోంది. తన కెరీర్ లో ఇంతవరకు ఒక్క ఫ్యామిలీ లవ్ స్టోరిలో కూడా నటించని సుధీర్ ఈ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేందుకు రెడీ అవుతున్నాడు. -
అదే డ్రస్‌లో మరోసారి..!
బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నారా రోహిత్ తొలి సినిమాలోనే పోలీస్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత రౌడీఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవారు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించాడు రోహిత్. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న శమంతకమణి సినిమా కోసం ఐదో సారి అదే పాత్ర చేశాడు. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రోహిత్. ఇప్పటికే ఐదు సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో నారా రోహిత్ మరోసారి అదే పాత్రకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మల్టీ స్టారర్ సినిమా వీరభోగవసంత రాయలు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడట. సుధీర్ బాబు, శ్రీవిష్ణులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరభోగవసంత రాయలు తో పాటు పంగలా వచ్చాడు, నీది నాది ప్రేమ సినిమాలు పూర్తి కావచ్చాయి. పవన్ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీద ఉంది. సావిత్ర ఫేం పవన్ సాధినేనితో ఒక సినిమా, బాణం ఫేం చైతన్య దంతులూరితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. -
మరో మల్టీ స్టారర్లో యంగ్ హీరో..!
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు సుధీర్ బాబు. తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే భలే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శమంతకమణి అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు సుధీర్ బాబు. నారా రోహిత్, శ్రీ విష్ణులు హీరోలుగా తెరకెక్కుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాలోనూ నటించేందుకు అంగీకరించాడు. ముందుగా ఈ పాత్రకు జ్యోతిలక్ష్మీ ఫేం సత్యను అనుకున్నా.. తరువాత సుధీర్ బాబు చేసేందుకు అంగీకరించాడు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆర్ ఇంద్రనీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తనకు మల్టీ స్టారర్ సినిమాలు చేయటం ఇష్టం ఉండదన్న సుధీర్ బాబు.. శమంతకమణి, వీరభోగ వసంత రాయలు సినిమాలను మాత్రం వదులుకోలేకపోయానంటూ ట్వీట్ చేశాడు. -
మంత్రిపై ఎమ్మెల్సీ ఫైర్
మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశాల్లో నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. సోమవారం అనంతపురంలోని కమ్మభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు జయనాగేశ్వరరెడ్డి, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఎదుట పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు మీడియాను అనుమతించలేదు. కొందరు నేతలు బయటకు వచ్చాక నేతల తీరును బాహాటంగానే విమర్శించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీరుపై నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట నేతృత్వంలో నేతలు ఆగ్రహించారు. స్టోర్ డీలర్లను తొలగించాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నట్లు జయనాగేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉంటూ ప్రొటోకాల్ పేరిట వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్నారు. ఇక ఎమ్మెల్సీ శమంతకమణి తనదైన శైలిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో.. ఎవరు చేయలేదో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎవరి విషయంలో మాట్లాడుతున్నారని జయనాగేశ్వరరెడ్డి అడగ్గా.. వడ్డెర్ల కార్పొరేషన్ చైర్మన్‌గా మురళీని ఎవరిని అడిగి ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీంతో మంత్రి పల్లె తానే వేయించానని చెప్పారు. ‘నువ్వొక్కడివే ఎలా నిర్ణయం తీసుకుంటావ’ని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి సునీత కూడా తనకు సమాచారం లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మరికొందరు కూడా గళం విప్పారు. ఉక్కిరిబిక్కిరైన మంత్రి పల్లె.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడిగే ఇచ్చామని చెప్పారు. ఇవ్వాలా, వద్దా అని అడిగితే ఇవ్వండని చెప్పినట్లు చౌదరి అంగీకరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు కొన్ని సమావేశాల్లో మాత్రమే కన్పిస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలోనూ మంత్రి పల్లెపై ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రత్యేక వర్గాన్ని పెంచిపోషిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల రగలగా.. నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.