సాక్షి, అనంతపురం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. (చదవండి: ‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..)
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడినట్లు సమాచారం. (చదవండి: మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం)
Comments
Please login to add a commentAdd a comment