singanamala constituency
-
అనంతపురం జిల్లాపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఫోకస్
-
అనంత టీడీపీలో రచ్చకెక్కిన గ్రూపు రాజకీయాలు
-
అందుకే టీడీపీని వీడాను : శమంతకమణి
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైఎస్సార్సీపీలో చేరామని చెప్పారు. (చదవండి : ‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ) తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్థంలో ఉన్నారన్నారు. సీఎం జగన్ జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. శింగనమల ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో కలిసి నిజయోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన ‘దిశ’, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యే తాము వైఎస్సార్సీపీలో చేరామని మాజీ ఎమ్మెల్యే యామినిబాల అన్నారు. వైఎస్సార్సీపీలో చేరడం.. తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. -
‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. (చదవండి: ‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..) కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడినట్లు సమాచారం. (చదవండి: మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం) -
శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!
శింగనమల నియోజకవర్గానికి దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్ట్ పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. నిత్య చైతన్యశీలురైన ఈ నియోజకవర్గ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిస్తూ వస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇది వాస్తవ మనే తేలుతోంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. చివరకు వారు రాజకీయాల నుంచే తప్పుకునేందుకు రణమవుతుంటారు. శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978లో ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వుడు అయింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగింది. పార్టీలు మారిన వారిని ఓడించారు 1985లో కాంగ్రెస్ పార్టీలోకి పామిడి శమంతకమణి చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989లో ఆదే పార్టీ నుంచి పామిడి శమంతకమణి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 1994లో కాంగ్రెస్ తరఫున శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో శమంతకమణి టీడీపీలో చేరిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేసిన శమంతకమణిని ఓటర్లు ఓడించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాకపోవడంతో కె.జయరాం పీఆర్పీలోకి మారారు. ఆ ఎన్నికల్లో జయరాంకు డిపాజిట్ కూడ దక్కలేదు. ప్రధాన సమస్యలు శింగనమల చెరువు లోకలైజేషన్ హమీగానే నిలిచిపోయింది. ఇంతవరకు నీటి కేటాయింపులు చేయలేదు. దీంతో శింగనమల మండలంలో దాదాపు 15 గ్రామాల రైతులు, ప్రజలు తిండి గింజలు, తాగునీటికి ఇబ్బం దులు పడుతున్నారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల వద్ద బైపాస్ కెనాల్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టలేకపోయారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదు. మిడ్ పెన్నార్ డ్యాం కింద ఆయకట్టు 60 వేలు ఎకరాలు వరకూ నీరు పారక రైతులు అగచాట్లు పడుతున్నారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వైఫల్యాలకు నిదర్శనంగా సాగు, తాగునీటితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ చేయూత .. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలోని ఆన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు పంపిణీ విరివిగా చేపట్టారు. ఎర్రగుంట్ల నుంచి ముంటిముడుగు వరకూ 6 కిలోమీటర్లు బైపాస్ కాలువ ఏర్పాటు చేయాలని 43 ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయించారు. గార్లదిన్నెలో కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. హెచ్చెల్సీ చివరి అయుకట్టు వరకూ నీరు వచ్చాయి. బుక్కరాయసముద్రం మండలంలో కేజీబీవీ, నార్పలకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించారు. శింగనమలలో కేజీబీవీ ఏర్పాటు చేశారు. శింగనమల చెరువుకు నాలుగేళ్లపాటు పంట కోసం హెచ్చెల్సీ నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకున్నారు. శింగనమల చెరువును లోకలైజేషన్ చేస్తానని, నార్పలలో జరిగిన ఎన్నికల సభలో హమీ ఇచ్చారు. కాని అయన మరణాంతరం చెరువుకు నీరు విడిపించేవారు లేకుండా పోయారు. నార్పల మండలంలో గూగూడు రోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ గృహాలు, కేజీబీవీ ఏర్పాటు చేశారు. పుట్లూరు మండలంలో రూ.4.50 కోట్లతో రోడ్లు, కేజీవీ, ఆదర్శ పాఠశాలలు మంజూరు చేశారు. గండికోట నుంచి పార్నపల్లి వరకూ కృష్ణా జలాలను తరలించడం కోసం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అధికార పార్టీపై పెరిగిన వ్యతిరేకత నియోజవకర్గ ఎమ్మెల్యే యామినిబాల వ్యక్తిగత సంపాదనే ధ్యేయంగా పని చేయడంతో ఆమెపై వ్యతిరేకత బలపడింది. సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆమెను వ్యతిరేకిస్తూ వస్తు న్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన అంతర్గత సర్వేలలో సైతం యామినిబాలకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లాయి. దీంతో ఆ పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. ఇప్పటికే బండారు శ్రావణితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. జేసీ వర్గీయులు తప్ప మిగిలిన నాయకులందరూ బండారు శ్రావణిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓడిపోయే పార్టీలోకి తాను రాలేనంటూ శైలజనాథ్ తెగేసి చెప్పినట్లు సమాచారం. కాగా, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి దూసుకెళుతోంది. నిరంతరం ఏవో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ వచ్చారు. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాలతో పాటు, నవరత్నాలు పథకాలను వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలతో అనేక ప్రజా సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు పోరాటాలు చేశారు. దీంతో ప్రజలు కూడా వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారు. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేలు సంవత్సరం గెలిచిన అభ్యర్థి సమీప ప్రత్యర్థి పార్టీ పార్టీ మెజారిటీ 1967 చిన్న రంగయ్య శెట్టి కాంగ్రెస్ కుమ్మెత రంగారెడ్డి సీపీఎం 1851 1972 తరిమెల రంగారెడ్డి స్వంతంత్ర తిమ్మారెడ్డి కాంగ్రెస్ 5355 1978 బి.రుక్మీణీదేవి జనత కె.ఆనందరావు కాంగ్రెస్ 3627 1983 గురుమూర్తి టీడీపీ కె.ఆనందరావు కాంగ్రెస్ 18,903 1985 కె.జయరాం టీడీపీ పామిడి శమంతకమణి కాంగ్రెస్ 14212 1989 పామిడి శమంతకమణి కాంగ్రెస్ బీ.సీ.గోవిందప్ప టీడీపీ 7079 1994 కె.జయరాం టీడీపీ పామిడి శమంతకమణి కాంగ్రెస్ 47,198 1999 కె.జయరాం టీడీపీ సాయిరాం కాంగ్రెస్ 4290 2004 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పామిడి శమంతకమణి టీడీపీ 8586 2009 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పామిడి శమంతకమణి టీడీపీ 3176 2014 యామినిబాల టీడీపీ జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్సీపీ 4584 -
టీడీపీలో చేరేందుకు శైలజానాథ్ యత్నం
అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఝలక్ ఇవ్వనున్నారా? ఆదిలో టీడీపీలో చేరేందుకు తన సన్నిహితుడు ద్వారా జేసీ బ్రదర్స్‌తో నెరపిన రాయబారం విఫలమైందా? ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్ ద్వారా శైలజానాథ్ బేరసారాలు సాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు టీడీపీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శింగనమలలో ఆదివారం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శమంతకమణి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ఇదే విషయంపై మండిపడ్డాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. శాసనసభలో అడుగుపెట్టిన శైలజానాథ్.. 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం శైలజానాథ్‌కు అనూహ్యంగా స్థానం దక్కింది. జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అంతరంగికుడిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. సీఎంగా కిరణ్ ఉన్న కాలంలో ఆయన దన్నుతో శైలజానాథ్ భారీ ఎత్తున అక్రమార్జన సాగించారనే ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. కిరణ్‌తో కలిసి సమైక్యరాగం ఆలపిస్తూ ఆయన వెన్నంటే నడిచారు. ఇందుకు ప్రతిఫలంగానే కిరణ్.. శైలజానాథ్‌ను సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాగా, కిరణ్.. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే శైలజానాథ్ పక్క చూపులు చూశారు. వైఎస్సార్సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే తన సన్నిహితుడు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని జేసీ బ్రదర్స్ వద్దకు రాయబారం పంపారు. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్న శైలజానాథ్ ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ అంగీకరించలేదు. ఆ సీటును తమ అనుచరుడు కంబగిరి రాముడుకు ఇప్పించుకుంటామని జేసీ బ్రదర్స్ తెగేసి చెప్పడంతోనే విధిలేని పరిస్థితుల్లో శైలజానాథ్.. కిరణ్ వెంట నడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిరణ్ ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీకి భవిత లేదనే భావనకు వచ్చిన శైలజానాథ్.. మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్‌తో ఆయన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పిస్తే.. పార్టీ ఫండ్ రూపంలో భారీ ఎత్తున ముట్టజెపుతానని శైలజానాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ బంపర్ ఆఫర్‌ను చంద్రబాబు దృష్టికి సీఎం రమేష్ తీసుకె ళ్లగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించాలని ఎమ్మెల్సీ శమంతకమణిని ఆయన కోరినట్లు తెలిసింది. శింగనమల నుంచి తన కుమారుడిని గానీ.. కుమార్తెను గానీ టీడీపీ తరఫున బరిలోకి దింపాలని శమంతకమణి భావించారు. కానీ.. ఇటీవల ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎందుకు వెనక్కి తగ్గారన్నది శైలజానాథ్‌కే ఎరుకని టీడీపీ నేతలు చలోక్తులు విసురుతున్నారు. శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సీఎం రమేష్ సమావేశం ఏర్పాటు చేయమనగానే శమంతకమణి కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కానీ.. సమావేశంలో కార్యకర్తలు శైలజానాథ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అదే జరిగితే పార్టీని వీడుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ‘భారీ ప్యాకేజ్’ ద్వారా శైలజానాథ్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.