yamini bala
-
వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్దంలో ఉన్నారన్నారు. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశామన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శమంతకమణి, యామినిబాల వైఎస్సార్సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ‘దిశ’, ‘అమ్మఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యామని చెప్పారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
అందుకే టీడీపీని వీడాను : శమంతకమణి
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైఎస్సార్సీపీలో చేరామని చెప్పారు. (చదవండి : ‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ) తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్థంలో ఉన్నారన్నారు. సీఎం జగన్ జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. శింగనమల ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో కలిసి నిజయోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన ‘దిశ’, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యే తాము వైఎస్సార్సీపీలో చేరామని మాజీ ఎమ్మెల్యే యామినిబాల అన్నారు. వైఎస్సార్సీపీలో చేరడం.. తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. -
‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. (చదవండి: ‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..) కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడినట్లు సమాచారం. (చదవండి: మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం) -
తల్లి, తమ్ముడి కనుసన్నల్లో యథేచ్ఛగా దోపిడీ
సాక్షి టాస్క్‌ఫోర్స్, అనంతపురం :మెరుగైన సమాజం ఉపాధ్యాయులతోనే నిర్మితమవుతుందనేది అక్షర సత్యం. మరి అంతటి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం అభివృద్ధి ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే శింగనమల నియోజకవర్గం విషయంలో ఇది తారుమారైంది. ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల ఆశలు ఆడియాసలు చేస్తూ.. ఎవరేమైపోతే నాకేంటి అనే ధోరణితో అడ్డగోలు దోపిడీకి తెరలేపారు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి. ఐదేళ్ల పదవీ కాలంలో వీరిద్దరి పదవులను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ తనయుడు అశోక్ సాగించిన అక్రమాలు లెక్కకు మించే ఉన్నాయి. ఉద్యోగుల బదిలీల్లో లంచాలు, నీరు–చెట్టు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు, ఇసుక దోపిడీ, బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల కబ్జా.. ఇలా ఒకటేమిటీ.. అన్ని విషయాల్లోనూ తల్లి, సోదరి అండతో అశోక్ చక్రం తిప్పాడు. అంచనాలకు మించి రూ. కోట్లకు పడగలెత్తారు. అప్పు చేసి.. ఎన్నికల్లో పోటీ చేసి తల్లి శమంతకమణి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో యామిని బాల నామినేషన్ వేశారు. అంతకు ముందు ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా.. మండల విద్యాధికారిగా ఆమె పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆ కాలంలో ఆమెకొచ్చే జీతం అంతంతమాత్రమే. ఎన్నికల్లో ఖర్చుల కోసం హైదరాబాద్‌లో తన పేరున ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకున్నారు. అ దృష్టం కలిసొచ్చి ఒకే ఇంటిలో కుమార్తెకు ఎమ్మెల్యే, తల్లికు ఎమ్మెల్సీ పదవులు వరించాయి. ఎన్నికైన తర్వాత సేవ అనే పదానికి వీరు అర్థం మార్చేశారు. రాజకీయాలను అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రజలు అప్పగించిన లైసెన్స్‌గా భావించినట్లున్నారు. తమ్ముడు అశోక్‌ను అన్నింటా కీలకంగా మార్చేశారు. ఏ పనిచేయాలన్నా అశోక్‌ను ముందుగా కలవాలి అనే నిబంధనతో ఎన్నికైనప్పటి నుంచి దోపిడీకి తెరలేపారు. ఈ ఐదేళ్లలోపు ఎమ్మెల్యే యామిని రూ. కోటితో అనంతపురంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టగా.. తమ్ముడు ఆరు అంతస్తుల కాంప్లెక్స్‌ను నిర్మించుకుంటున్నాడు. సొంత పార్టీ వారైనా సరే.. శింగనమల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా.. అందులో ఐదు శాతం కమీషన్ ఎమ్మెల్యేకు కట్టి తీరాలి. లేకపోతే ఆ పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. చివరకు సొంత పార్టీ వారైనా సరే ఎమ్మెల్యేకు ఐదు శాతం కమీషన్ చెల్లించి తీరాలి. శింగనమలలో ఐసీడీఎస్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఓ టీడీపీ నాయకుడు దక్కించుకున్నాడు. ఎమ్మెల్యేకు కమీషన్ చెల్లించకుండా అతను పనులు మొదలు పెట్టడం ఎమ్మెల్యే, ఆమె సోదరుడు అశోక్‌కు నచ్చలేదు. దీంతో పనులు జరుగుతున్న ప్రాంతానికి మండల స్థాయి అధికారిని పంపి ఆగమేఘాలపై నిర్మాణ పనులు అడ్డుకున్నారు. చివరకు ఎమ్మెల్యేను ఆ టీడీపీ నేత కలిసి ఐదు శాతం కమీషన్ ముట్టజెప్పిన తర్వాత పనులు మొదలు పెట్టించారు. శింగనమల మండలంలో అక్రమాలు ఇలా.. ⇔ నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో నీరు–చెట్టు పథకం కింద దాదాపు రూ.70 కోట్లు పనులు చేపట్టారు. ఈ పనుల్లో 5 శాతం చొప్పున రూ. 3.50 కోట్ల కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నారు. ⇔ శింగనమల, సలకంచెరువు గ్రామాల్లోని చెరువులలో దాదాపు రూ.3 కోట్లతో నీరు–చెట్టు కింద పనులు చేశారు. ఈ పనులను బినామీలతో ఎమ్మెల్యే తమ్ముడు అశోక్ చేయించాడు. ⇔ రూ. 4 కోట్ల నాబార్డు నిధులతో శింగనమల చెరువులో చేపట్టిన పనుల్లోనూ ఐదు శాతం కమీషన్ ఎమ్మెల్యేకు ముట్టినట్లు టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ⇔ రైతు రథం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని లబ్ధిదారులకు అందజేశారు. ⇔ శింగనమల మండలం రాచేపల్లి గ్రామం నుంచి ఆనందరావుపేట వరకు తారురోడ్డు వేసేందుకు రూ. 90 లక్షలు మంజూరు కాగా, ముందస్తుగానే రూ. 4.50 లక్షలు కమీషన్ తీసుకుని పనులకు అనుమతులిచ్చారు. మొక్కల పెంపకం పేరుతో రూ.1.16 కోట్లు స్వాహా ⇔ నియోజకవర్గంలోని 116 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకానికి జాతీయ ఉపాధీ హమీ పథకం కింద రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి. ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించకపోయినా.. నిధులు మాత్రం స్వాహా చేసేశారు. తమ్ముళ్లకు ఆన్లైన్లో భూములు ⇔ శింగనమల మండలంలో భూపంపిణీ జరగలేదు. అయితే రెవెన్యూ అధికారులను బెదిరించి ఆన్లైన్లో దాదాపు 400 ఎకరాలకు టీడీపీ తమ్ముళ్ల పేర్లతో రికార్డులు సృష్టించారు. ఈ ఆన్లైన్ భూములను బ్యాంకుల్ తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలంలో... ⇔ బుక్కరాయసముద్రంలోని గాంధీ నగర్ కాలనీలో నార్పల రహదారి పక్కన 3 సెంట్ల స్థలాన్ని బినామీ పేరున పట్టా చేయించుకుని, రూ. 4 లక్షలకు అమ్ముకున్నారు. ⇔ అనంతపురం, తాడిపత్రి ఫోర్‌లైన్ రోడ్డు పనుల్లో భాగంగా బీకేయస్లోని నార్పల క్రాసింగ్ నుంచి అనంతపురం చెరువు కట్ట వరకూ రూ.13 కోట్లతో చేసిన పనుల్లో రూ. 26 లక్షల కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నట్లు సమాచారం. ⇔ జంతలూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మించారు. ఇందులోనూ ఎమ్మెల్యేకు రూ. 54 లక్షల మేర ముడుపులు అందాయి. ⇔ గోవిందపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని రేగడి కొత్తూరు గ్రామానికి వెళ్లే దారి పక్కన సర్వే నంబరు 14–1లో 2.31 ఎకరాలు, 14–2లో 2.31 ఎకరాలు కలిపి 4.62 ఎకరాల భూమిని బినామీ పేర్లుతో ఎమ్మెల్యే తమ్ముడు అశోక్ చేయించుకున్నాడు. ఈ పొలాలను కొట్టాలపల్లికి చెందిన దూదేకుల వన్నూరప్ప గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. పుట్లూరు మండలంలో ఇలా.. ⇔ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూ పంపిణీ జరుగలేదు. అయితే పుట్టూరు మండలంలో 800 ఎకరాలకు పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డదారుల్లో పట్టాలు పొందారు. ⇔ మండలంలోని గాలిమరల వద్ద చాలవేముల, గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల గ్రామాలకు చెందిన నిరుపేద రైతులు 35 మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వీరి ఏర్పాటు విషయంగా ఏజెన్సీని బినామీల సాయంతో ఎమ్మెల్యే యామినీబాల తమ్ముడు అశోక్ నడుపుతున్నాడు. ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సంబంధించి రూ. 8 వేలను ఏజెన్సీ నిర్వాహకులకు కంపెనీ యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. అందులో రూ.3,800 పట్టుకుని రూ. 4,200 మాత్రమే గార్డులకు ఏజెన్సీ నిర్వాహకులు అందజేస్తున్నారు. ఈ లెక్కన సెక్యూరిటీ గార్డులను మోసం చేస్తూ నెలకు రూ.1.33 లక్షలు వెనకేసుకున్నారు. ఈ 48 నెలల్లో రూ. 63 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. ⇔ మడుగుపల్లి వద్ద గాలిమరల ఏర్పాటకు కంపెనీ నుంచి అప్పట్లో రూ.2 కోట్లు ముడుపులను ఎమ్మెల్యే యామినీ బాల దండుకున్నారు. ⇔ ఈ విషయంలో ఎమ్మెల్యే సోదరుడికి ముందస్తుగానే రూ.50లక్షలు కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు. అయితే తనకు కాకుండా సోదరుడికి డబ్బు ఇవ్వడంపై– ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు రూ.2 కోట్లను కంపెనీ ప్రతినిధులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ⇔ పుట్లూరు మండలంలో రూ.13.75కోట్లతో చేపట్టిన నీరు – చెట్టు పనుల్లో ఐదు శాతం చొప్పున రూ. 80 లక్షల కమీషన్‌ను ఎమ్మెల్యే యామినీ బాల తీసుకున్నారు. ⇔ ఏటా రబీలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ ఏజెన్సీ కేటాయింపు విషయంలో రూ.2లక్షలు చొప్పున ముడుపులు దండుకున్నారు. నాలుగేళ్లకు రూ. 8 లక్షలు అక్రమంగా వెనకేసుకున్నారు. గార్లదిన్నె మండలంలో.. ⇔ 43వ ప్యాకేజీ కింద రూ.450 కోట్లతో చేపట్టిన మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ లైనింగ్ పనుల్లో రూ. 2 కోట్ల వరకు ముడుపులను ఎమ్మెల్యే యామినీబాల, స్థానిక టీడీపీ నేతలు దండుకున్నారు. ⇔ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మిడ్ పెన్నార్ డ్యాం నుంచి రూ. 40 కోట్ల వ్యయంతో పైప్‌లైన్ పనులు చేపట్టారు. ఈ పనుల్లో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే రూ. కోటి వరకు కమీషన్ల రూపంలో తీసుకున్నారు. ⇔ కొప్పలకొండ, ముంటిమడుగు, ఇల్లూరు, కల్లూరు గ్రామాల పరిధిలోని పెన్నానది పరివాహాక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలించి రూ. కోట్లు కొల్లగొట్టారు. ⇔ రామదాసుపేట వద్ద నల్లగుట్ట ప్రాంతం అంతా బినామీ పేరు మీద ఎమ్మెల్యేకు రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు. ⇔ రామదాసుపేట గ్రామంలో నల్లగుట్ట వద్ద తక్కువ ధరతో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జెడ్పీటీసీ విశాలాక్షి కొనుగోలు చేశారు. ⇔ రామదాసుపేట గ్రామ సమీపంలో ఎకరా రూ.2లక్షల చొప్పున 27 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ ప్రాతంలో ఎకరా రూ. 10 లక్షలకు పైగా అమ్ముడు పోతోంది. కొనుగోలు చేసిన విస్తీర్ణం కంటే ఎక్కవగా కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ⇔ ముంటిమడుగు వద్ద పెన్నానది సమీపంలో రిజిస్టర్ భూమిని టీడీపీ నాయకులు కొనుగోలు చేసి, పెన్నానదిలో పెద్ద బోరు వేసి అక్కడ నుంచి పైపు లైన్ ద్వారా సప్తగిరి కర్పూరం ఫ్యాక్టరీకి నీటిని అమ్ముకుంటున్నారు. ⇔ మండలంలో జియో కేబుల్ వర్క్ పనుల్లో రూ.5లక్షలు ముడుపులు దండుకున్నారు. ⇔ గార్లదిన్నెకు చెందిన టీడీపీ నాయకుడు జంబులదిన్నె చెరువులో మట్టి, తుమ్మ చెట్లు అమ్ముకొని రూ. లక్షలు వెనకేసుకున్నాడు. ఇసుక రీచ్‌లో రూ. 3 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 డిసెంబ రు 18న ఉల్లికల్లు ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. వె లుగు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఇసుక రీచ్ నుంచి 32 వేల క్యూబిక్ మీటర్ల వరకూ ఇసుక తరలింపున కు అనుమతులు ఉన్నాయి. అయితే నిబంధనలు తుంగలో తొక్కి 47 క్యూబిక్ మీటర్ల వరకూ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. రికార్డుల్లో మాత్రం 27 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే చూపించారు. అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణ చేపట్టి 16 మంది వెలుగు సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. తిరిగి 2015 డిసెంబర్ నెలాఖరులో మరోసారి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తరలింపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ రెండు విడతల్లోనూ ఉచితం పేరుతో ఇసుక తర లిస్తూ.. అందిన కాడికి టీడీపీ నేతలు దోచేశారు. ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే యామనీబాల సోదరుడు అశోక్, పీఏ కిరణ్ కనుసన్నల్లోనే జరిగాయి. రోజుకు 30 టిప్పర్లు చొప్పున ప్రతి టిప్పర్‌కు రూ. 2వేలకు పైగా అదనంగా డబ్బు వసూలు చేశారు. రోజుకు రూ. 60వేలకు పైగా దోచుకున్నారు. నెలకు రూ.18 లక్షలు వరకు కూడబెట్టుకున్నారు. ఈ సమయంలోనే అక్రమాలపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో ఇసుకరీచ్‌ను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అ య్యాయి. అయినా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కు అంటూ అనుమతులు లేకున్నా ఇసుకను తరలి స్తూ వచ్చారు. ఈ లెక్కన దాదాపు రూ. 3 కోట్ల వర కూ ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిపోయింది. నార్పల మండలంలో... ⇔ నార్పలలోని కూతలేరు వంకలో రూ. 48 లక్షల ఉపాధి హామీ నిధులతో మట్టి తీసే పనిని స్థానిక టీడీపీ నేత ఆలం రమణ చేశారు. అయితే పనులు పూర్తి స్థాయిలో చేయలేదు. ఈ పనిలో ఎమ్మెల్యేకు రూ. 5 లక్షలు, మరో టీడీపీ నేతకు రూ. 2 లక్షలు చొప్పున కమీషన్లు ముట్టజెప్పినట్లు సమాచారం. ⇔ రూ. 8 కోట్లతో నాయనపల్లి క్రాస్ నుంచి ఏకనాదంపల్లి వరకు, రూ. 12 కోట్లతో ముచ్చుకుంటపల్లి, గూగూడుకు చేసిన తారు రోడ్డు పనుల్లో ఐదు శాతం కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నారు. ⇔ గూగూడు చెరువులో నీరు–చెట్టు కింద రూ.2 కోట్లతో పూడిక తీత పనులను టీడీపీ నాయకులు చేశారు. పనులు అరకొరగా చేసి పూర్తి స్థాయిలో బిల్లులు చేసుకున్నారు. యల్లనూరు మండలంలో.. ⇔ యల్లనూరు మండలంలో 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు రూ.8.84 కోట్ల మేరకు 156 పనులను టీడీపీ నేతలు నీరు–చెట్టు కార్యక్రమం కింద చేశారు. 57 చెక్‌డ్యాంలు, మరో 99 పూడిక తీత పనులు చేశారు. ఈ పనులన్నీ నాసిరకంగా పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ⇔ కోడుముర్తి గ్రామ సమీపంలోని ఇసుక రీచ్‌ను టీడీపీ మండల నాయకులు చేజిక్కించుకుని దోపిడీకి తెరలేపారు. అనుమతులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా చిత్రావతి నది నుంచి ఇసుకను భారీ యంత్రాలను ఏర్పాటు చేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. రోజూ 700 క్యూబిక్ మీటర్ల చొప్పున నాలుగు నెలల పాటు తరలించారు. ఇసుక దందాలో లెక్కకు మించి ఆదాయాన్ని గడించినట్లు టీడీపీ నాయకులే పేర్కొంటున్నారు. -
అనంతపురం పసుపు, కుంకుమ కార్యక్రమంలో వాగ్వాదం
-
టీడీపీ మహిళా నేతలకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోమటికుంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే యామినీబాల పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కోమటికుంట్ల గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యామినీబాల, శమంతకమణిలు పోలీసుల రక్షణతో కోమటికుంట్లలో పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యారు. -
సవాల్ చేసి రాలేకపోయిన ఎమ్మెల్యే యామినీబాల
శింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి – చోటు చేసుకున్న అవినీతి అక్రమాలుపై చర్చకు సిద్దమని చెప్పిన ఎమ్మెల్యే యామినీబాల అడుగు వెనక్కేశారు. వారు చర్చలకు రాకపోగా... వచ్చిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని పోలీసుల చేత బలవంతంగా అరెస్ట్ చేయించారు. పోలీసుల ఏకపక్ష వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. అనంతపురం, శింగనమల : ఎమ్మెల్యే యామినీబాల, వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిల బహిరంగ చర్చను పోలీసులు భగ్నం చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల – నియోజకవర్గంలో నీరు, చెట్టు కింద చేపట్టిన పనుల్లో నిధుల దోపిడీ, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టు పనుల్లో తీసుకున్న కమీషన్లతోపాటు ప్రజా సమస్యలు, పలు అంశాలపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే వారం రోజులపాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నార్పలలోని గాంధీ విగ్రహం వద్ద ఈ నెల రెండో తేదీన చర్చించేందుకు వేదికను నిర్ణయించారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ జాతిపితకు పూలమాల వేసి నివాళులర్పించేందుకు ప్రయత్నించగా డీఎస్పీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గార్లదిన్నె ఎస్ఐ రాంప్రసాద్, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. గాంధీకి పూలమాల వేయడానికి, బహిరంగ చర్చలకు అనుమతించాలని కోరినా ససేమిరా అన్నారు. బలవంతంగా సమన్వయకర్తను అరెస్ట్ చేసి గార్లదిన్నెకు తరలించారు. మహిళా పోలీసులు లేకుండానే.. మహిళా పోలీసులు లేకుండానే మగ పోలీసులే సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని అరెస్టు చేసి బలవంతగా పోలీస్ జీపులోకి ఎక్కించారు. గార్లదిన్నె ఎస్ఐ రాంప్రసాద్ డ్రైవ్ చేస్తుండగా.. నార్పల కానిస్టేబుల్ దివాకర్ జీప్ ఎడమ వైపు ఫుట్‌బోర్డుపై నిల్చున్నాడు. జీపు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి కిందపడబోతూ.. లోపల ముందుసీటులో కడ్డీ పట్టుకుని కూర్చుని ఉన్న సమన్వయకర్త చేతిని ఆసరా కోసం పట్టుకున్నాడు. వాహనం కొద్దిసేపు అలానే ముం దుకు వెళ్లడంతో పద్మావతి చేయిభుజం వద్ద బెణికింది. ఆమే గనుక ఆసరాగా లేకపోయి ఉంటే కానిస్టేబుల్ జీపు కిందపడి ప్రమాదానికి గురయ్యేవాడు. నొప్పితో విలవిలలాడినా కనికరం లేకపాయె.. భుజం బెణికి నొప్పితో విలవిలలాడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. నొప్పి భరించలేకపోతున్నానని ఆమే స్వయంగా చెప్పినా ఎస్ఐ రాంప్రసాద్ స్పందించలేదు. డీఎస్పీ వస్తున్నారని పది నిమిషాలు ఆగండని చెప్పి అరగంటయినా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సమన్వయకర్తను వైఎస్సార్సీపీ నాయకులు పైలా నరసింహయ్య పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు సీఐ ప్రసాాద్రావు వచ్చాక ఆమెను అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ఆలూరి సాంబశివారెడ్డి హౌస్ ఆరెస్ట్ వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిలు బహిరంగ చర్చ కోసం నార్పలకు వెళతారని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలోని వారి ఇంటివద్దకు వెళ్లారు. అయితే అప్పటికే పద్మావతి నార్పలకు వెళ్లిపోవడంతో.. ఆలూరి సాంబశివారెడ్డిని ఒకరినే హౌస్ అరెస్ట్‌చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రాచమర్యాదలు వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతిని అరెస్టు చేసి గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన గంట తరువాత అనంతపురం నుంచి ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలను పోలీసు బెటాలియన్ రాచమర్యాదలతో నార్పలకు తీసుకొచ్చారు. అరగంట పాటు నార్పల క్రాస్‌లో ప్రజాప్రతినిధులు తమ వాహనాలను ఆపి ఇతర మండలాల నాయకులను అక్కడికి పిలిపించుకొని నార్పలలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు దగ్గరుండి వారిచేత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయించారు. అనంతరం అక్కడి నుంచి శింగనమలలో జరిగే ‘యువనేస్తం’ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. చర్చ జరిగితే తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఎమ్మెల్యే భయపడి పోలీసుల చేత అరెస్ట్ చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నారాయణరెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనంతపురం పార్లమెంటు మహిళా అ«ధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, బోయ కొండమ్మ, బండి లలిత కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
రైతు గోడు పట్టాదా?
అనంతపురం సిటీ: అధికార పార్టీకి చెందిన వారైనా సరే..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాల్సి వచ్చింది. జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తున్నా..ప్రభుత్వం 44 మండలాలనే కరువు జాబితాలో చేర్చడంతో సందిగ్ధంలో పడిన అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గురువారం జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. సమావేశంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి పాల్గొనగా...వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్యుత్, పశుసంవర్థకశాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమయం లేకపోవడంతో విద్య, వైద్యం, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ, అటవీశాఖలపై చర్చ జరలేదు. రైతుల జీవితాలతో ఆడుకుంటారా..? తీవ్ర వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ బీళ్లుగా మారాయని....అక్కడక్కడా విత్తనాలు వేసినా..అవి మొలకెత్తలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 44 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చడంపై సభ్యులు మండిపడ్డారు. ఇలా నివేదికలు ఎలా పంపారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిలు వ్యవసాయశాఖ జేడీపై మండిపడ్డారు. గతేడాది రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నేటికీ రైతులకు అందలేదనీ... తక్షణం వారికి ఈ డబ్బు చేతికందితే కొంత భరోసా ఉంటుందన్నారు. స్పందించిన జేడీ మాట్లాడుతూ, జూన్‌లో కొంతమేర వర్షాలు కురవడంతో నివేదిక ఇలా పంపామనీ, ప్రస్తుతం 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నివేదిక సిద్ధం చేశామన్నారు. విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి వందశాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని సభ్యులు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. వాతావరణ బీమా ‘అనంత’ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కాలువ స్పందిస్తూ.. ఈ పథకంపై సీఎంకు అవగాహన ఉందనీ, త్వరలోనే ఆయన వాతావరణ బీమాలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే యోచనలో ఉన్నారన్నారు. ఇక పశుక్రాంతి పథకం ద్వారా ఈ వాతావరణానికి అలవాటు లేని పశువులను అధికారులు తీసుకువస్తున్నారనీ, దీంతో అవి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతోందని సభ్యులు అన్నారు. అలా కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పశువులను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. స్పందించిన మంత్రి కాలవ..సభ్యుల కోరిక మేరకు తప్పకుండా మార్పు చేస్తామన్నారు. కల్తీ జరుగుతున్నా..కట్టడి చేయలేకపోతున్నారు మార్కెట్లో పాలు, నెయ్యి, చివరికి నీరు కూడా కల్తీ చేస్తున్నా...అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని సభ్యులు ధ్వజమెత్తారు. తక్షణం కల్తీలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ డిల్లీ రావు.. ..ఆహారకల్తీ విభాగానికి ఒకే అధికారి ఉన్న కారణంగా కేసులు ఎక్కువగా నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇకపై కల్తీలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్లు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపాజిట్లు చేస్తేనే రుణాలిస్తారా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు రుణాల మంజూరులో పలు బ్యాంకుల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తేనే రుణాలిస్తామంటూ మొండిగా వాదిస్తున్నారన్నారు. స్పందించిన జాయింట్ కలెక్టర్...వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే అనంతపురం శివారుల్లో జాతీయ రహదారి నిర్మాణంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ అన్నారు. స్పందించిన జేసీ..తానే స్వయంగా గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పార్థసార థి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయ చౌదరి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. కరుణానిధి మృతికి నివాళి సమావేశం ప్రారంభం కాగానే అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తీర్మానాలివీ... ♦ జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి. ♦ జిల్లాలోని 1,468 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఆయా పాఠశాలల్లో మొక్కలు పెంచి..సంరక్షణ అటవీశాఖ చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాలోని అన్ని చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేయాలి. ♦ అనంతపురం, గుత్తి, రాయదుర్గంలోని జెడ్పీ స్థలాల్లో రూ.61 లక్షలతో గదులు నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వాలి. ♦ రాయదుర్గం మండలం, వీరాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా విభజించాలని తీర్మాణాలు చేశారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - యామిని బాల , వాసుపల్లి గణేష్ కుమార్
-
చినరాజప్పను బూతులు తిట్టిన కార్యకర్తలు
సాక్షి, అనంతపురం: అనంతపురంలో హోంమంత్రి చినరాజప్పకు చేదు అనుభవనం ఎదురైంది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో బుధవారం ఏపీఎస్సీ 14వ బెటాలియన్‌ను నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం తనకి ఆహ్వానం అందలేదని శింగనమల ఎమ్మెల్యే యామినిబాల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో యామినిబాల అనుచరులు, పార్టీ కార్యకర్తలు.. ఎందుకు ఆహ్వానించలేదని చినరాజప్పను నిలదీశారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేకు సరైన గుర్తింపు ఇవ్వరా అంటూ నడిరోడ్డుపైన బూతుల పురాణం అందుకున్నారు. హఠాత్తుపరిణామంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను పక్కకు లాక్కెళ్లారు. -
'యామిని బాల నామినేషన్‌పై అభ్యంతరం'
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. యామిని బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపణలు చేశారు. కాగా ఆర్వో రామ్మోహన్ ఆమె నామినేషన్ ఆమోదించటంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకట రమణ నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. టీడీపీ నేతల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు.