చినరాజప్పను బూతులు తిట్టిన కార్యకర్తలు | MLA Yamini Bala Followers Fires On Chinarajappa | Sakshi
Sakshi News home page

చినరాజప్పను బూతులు తిట్టిన కార్యకర్తలు

Published Wed, Jun 20 2018 4:04 PM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

 MLA Yamini Bala Followers Fires On Chinarajappa - Sakshi

చినరాజప్ప, యామినిబాల (పాత ఫొటోలు)

సాక్షి, అనంతపురం: అనంతపురంలో హోంమంత్రి చినరాజప్పకు చేదు అనుభవనం ఎదురైంది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో బుధవారం ఏపీఎస్సీ 14వ బెటాలియన్‌ను నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం తనకి ఆహ్వానం అందలేదని శింగనమల ఎమ్మెల్యే యామినిబాల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

దీంతో యామినిబాల అనుచరులు, పార్టీ కార్యకర్తలు.. ఎందుకు ఆహ్వానించలేదని చినరాజప్పను నిలదీశారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేకు సరైన గుర్తింపు ఇవ్వరా అంటూ నడిరోడ్డుపైన బూతుల పురాణం అందుకున్నారు. హఠాత్తుపరిణామంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను పక్కకు లాక్కెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement