
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోమటికుంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే యామినీబాల పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
టీడీపీ నేతలు, కోమటికుంట్ల గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యామినీబాల, శమంతకమణిలు పోలీసుల రక్షణతో కోమటికుంట్లలో పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment