shamanthakamani
-
టీడీపీలో చిచ్చు రేపిన నారా లోకేష్
సాక్షి, అనంతపురం : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. నేతల మధ్య బేధాభిప్రాయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆ పార్టీ ముఖ్యనేత నారాలోకేష్ అనంతపురం పర్యటన టీడీపీలో చిచ్చుపెట్టింది. జేసీ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ అనంత పర్యటనలో భాగంగా జేసీ పవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి లోకేష్ వెంట కారులో వచ్చారు. జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కనుసన్నల్లోనే లోకేష్ పర్యటన అంతా సాగుతోంది. (లోకేష్ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి) దీంతో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంత రాయచౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 దాకా టీడీపీని అణచివేసిన జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ నేతల్లో తీవ్ర చర్చసాగుతోంది. జేసీ ఫ్యామిలీని అందలమెక్కిస్తే పార్టీని వీడేందుకు సిద్ధమంటూ సీనియర్లు గుసగుసలాడుతున్నారు. మరోవైపు బండారు శ్రావణి వర్గం సైతం లోకేష్ తీరుపై గుర్రుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. నారా లోకేష్ రాజకీయ అజ్ఞాని.. టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోకేష్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. రైతుభరోసా పథకం, వైఎస్సార్ జలకళ కింద ఉచిత బోరు బావులు వేస్తున్న సంగతి తెలియదా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సీఎం జగన్ ఆదుకున్న విషయం గుర్తులేదా అని ధ్వజమెత్తారు. నారా లోకేష్ అనంతపురం పర్యటన నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన శామంతకమణి.. ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతని వర్ణించారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభత్వుం సిద్ధంగా ఉందని, ఈ మేరకు చర్యలు సైతం చేపట్టిందని గుర్తుచేశారు. లోకేష్ ఓ రాజకీయ అజ్క్షాని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. -
నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ
శింగనమల: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆయా వర్గాలన్నీ ఆయన వెంటనే నడుస్తున్నాయి. ఈక్రమంలోనే వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ వారి అనుచరులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఏపీ ప్రాథమిక విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ శింగనమల నియోజకవర్గంలో టీడీపీ కనుమరగవుతోంది. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ శమంతకమణి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడున్న టీడీపీ కేడర్ అంతా ఆమె ద్వారా వచ్చినవారే. కానీ ఇప్పుడు శమంతకమణి కుటుంబం ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో... నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వ లోటు ఏర్పడింది. దీంతో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గమంతా వైఎస్సార్సీపీ వైపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండగా... అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఎస్సీ సామాజికవర్గంలో జిల్లాలోనే బలమైన నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ శమంతకమణి వైఎస్సార్సీపీలో చేరడంపై ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారంతా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్దంలో ఉన్నారన్నారు. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశామన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శమంతకమణి, యామినిబాల వైఎస్సార్సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ‘దిశ’, ‘అమ్మఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యామని చెప్పారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులకు చుక్కెదురు
యల్లనూరు : పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణికి చేదు అనుభవం ఎదురైంది. సీనియారిటీ ఉన్నా తమకెందుకు చెక్కులు ఇవ్వడం లేదంటూ మహిళలు చుట్టుముట్టారు. అంతే కాదు తాగునీరు తదితర సమస్యలపైనా నిలదీశారు. యల్లనూరు మండలం నీర్జాంపల్లి, వాసాపురం, యల్లనూరు గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విప్, ఎమ్మెల్సీ హాజరయ్యారు. నీర్జాంపల్లిలో వెంకటేశ్వర డ్వాక్రా సభ్యులు సీనియారిటీ కలిగిన తమ సంఘానికి పసుపు కుంకుమ డబ్బు ఎందుకు మంజూరు కాలేదో చెప్పాలని పట్టుబట్టారు. అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి తన కూతురుకు పెళ్లయ్యి ఆరు నెలలు దాటినా ‘పెళ్లి కానుక’ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే పరిష్కరించాలని పలువురు మహిళలు నిలదీశారు. సమస్యలపై ప్రజలు ప్రశ్నల వర్షంతో విప్, ఎమ్మెల్సీకి ముచ్చెమటలు పట్టించారు. చెరువులు నింపకపోవడం వల్లే నీటి ఎద్దడి పుట్లూరు: పుట్లూరు మండలం కోమటికుంటలో పసుపు కుంకుమ కార్యక్రమానికి వస్తున్న విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిల కాన్వాయ్‌ను చెరువు కట్టపైనే గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబితే ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ మండిపడ్డారు. తమ కష్టాలను స్వయంగా చూడాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో వారు గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. చెరువులను నీటితో ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి, ఎస్ఐ వంశీకృష్ణ, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి నిరసనకారులను సభా ప్రాంగణం నుంచి దూరంగా పంపించేశారు. సమస్యలపై ప్రశ్నించినందుకు దాడియత్నం కళ్యాణదుర్గం: సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన సంఘటన కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పసుపు– కుంకుమ కార్యక్రమం కింద మహిళలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రిస్వామి, లక్ష్మన్న తదితరులు సభ వద్దకు వెళ్లి గ్రామంలోని అంగన్వాడీ భవనం దుస్థితిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అంతలోగా టీడీపీ కార్యకర్తలు సారాయి గోవిందప్ప, ఊరబావి నరసింహులు, ఐదుకల్లు పాతలింగతో పాటు మరికొందరు గుంపుగా వచ్చి అడ్డుకున్నారు. వాగ్వాదం చేస్తూ తోపులాటకు దిగారు. చివరకు దాడికి యత్నించారు. ఈ ఘర్షణను చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కుని దృశ్యాలను తొలగించారు. ఘర్షణ జరుగుతుండటంతో ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. చిత్రం.. ‘వంద’ గోవింద రొళ్ల: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెట్టింపు చేసినందున లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని తీసుకెళ్లాలని తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేశారు. ఫొటోగ్రాఫర్ల ముసుగులో టీడీపీ నాయకులు కొత్త దందాకు తెరలేపారు. రొళ్ల మండలం హొట్టేబెట్ట, రొళ్ల, హులికుంట పంచాయతీ కేంద్రాల్లో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. చంద్రబాబు ఫొటో కోసం పింఛన్ దారుల నుంచి పొటోగ్రాఫర్లు రూ.100 చొప్పున వసూలు చేశారు. ఫొటో తీసుకుంటేనే పింఛన్ ఇస్తామని.. లేకుంటే లేదని ఖరాకండిగా చెప్పారు. చేసేదిలేక పింఛన్‌దారులు వంద సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా రొళ్ల మండలంలో 4,636 మంది పింఛన్‌దారుల నుంచి రూ.4,63,600 వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో చంద్రబాబు ఫొటో పేరిట వంద రూపాయలు బాదుతున్నారు. -
అనంతపురం పసుపు, కుంకుమ కార్యక్రమంలో వాగ్వాదం
-
టీడీపీ మహిళా నేతలకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోమటికుంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే యామినీబాల పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కోమటికుంట్ల గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యామినీబాల, శమంతకమణిలు పోలీసుల రక్షణతో కోమటికుంట్లలో పసుపు, కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యారు. -
మూవీరివ్యూ: శమంతకమణి
మల్టీ స్టారర్ మూవీ అంటే తెలుగు సినీపరిశ్రమ లాంటి చోట సాహసమే. వెంకీ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మల్టీ స్టారర్ చేసి సక్సెస్ అయినా ఆ బాటలో నడిచేందుకు పెద్దగా దర్శకులు ఆసక్తి కనబరచలేదు. అయితే తాజాగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నలుగురు అప్ కమింగ్ హీరోలను తీసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ కథతో చేసిన ప్రయత్నమే శమంతకమణి. టాలీవుడ్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నలుగురు హీరోలతో తెరకెక్కింది ఈ సినిమా. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. వీళ్లకి తోడు నలుగురు హీరోయిన్ల సందడి.. ఇంకోవైపు, రాజేంద్రప్రసాద్, సుమన్. ఇలా.. భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం. నలుగురు యువకుల జీవితాలతో కథ మొదలవుతుంది. కృష్ణ (సుధీర్ బాబు), శివ(సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), సి.ఐ రంజిత్‌గా నారా రోహిత్‌లు ఎవరి జీవితాలు, ఎవరి గోలలో వాళ్లుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ(సుధీర్‌బాబు) ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి పార్కింగ్‌లోకి వచ్చిన కృష్ణకు అక్కడ ఉండాల్సిన ఐదు కోట్ల విలువచేసే తన కారు శమంతకమణి చోరీ అయ్యిందని తెలుస్తుంది. ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును సిఐ రంజిత్‌కుమార్ డీల్ చేయడం మొదలుపెడుతాడు. కేసు విచారణలో భాగంగా కృష్ణ ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిలో అనుమానంగా కనిపించిన శివ, కార్తీక్, రాజేంద్రప్రసాద్‌లను విచారిస్తాడు. అయితే వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ ఉండడంతో ఆ కారు ఎవరు దొంగలించారన్న దానిపై స్పష్టత పోతుంది. అయితే ఆ కారును ఏం చేశారు? దేనికోసం 5కోట్ల విలువచేసే కారును తీసుకెళ్లారు? ఆ కారుకి వీళ్లకి సంబంధం ఏంటి? అసలు రంజిత్ కుమార్‌కు ఆ కారుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ స్టోరీ. నటీనటులు నటుల పరంగా ఎవరిని ఎత్తి చూపడానికి లేదు. ఈ సినిమాకున్న అతి పెద్ద బలం నలుగురు కథానాయకులు. ఎవరికి బలమైన ఇమేజ్ లేకపోవడమే పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ బ్రాండ్ ఒక్కరికి ఉన్నా కూడా తేడాలు కనిపించేవి కాని అందరు ఒకే రేంజ్ కాబట్టి ఆ సమస్య రాలేదు. ఒకపాత్రతో వేరేదానికి పోలిక లేకపోవడం వల్ల ఎవరికి వారు బాగా బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అవకాశం దక్కింది. కానీ వీళ్ల టాలెంట్ ని పూర్తిగా వాడుకోవడంలోనే దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ అందరికి సమానంగా రావాలి అనే ప్రయత్నంలో ట్రాక్ కొద్దిగా తప్పడం సెకండ్ హాఫ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అందరిలోకి ఎవరు బాగా చేసారు అంటే చెప్పటం కష్టమే. సుధీర్ బాబు ఆ పాత్రకు సరిపోయాడు కాని సందీప్ కిషన్, నారా రోహిత్ పాత్రలతో పోలిస్తే అతని స్పాన్ తక్కువే. రాజేంద్ర ప్రసాద్ తన భుజాలపై మోయడానికి మాగ్జిమం ట్రై చేసాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు. హీరొయిన్లు కైరా దత్, అనన్య సోని, చాందిని జస్ట్ గ్లామర్ డోస్ కోసమే కానీ నటనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. సుమన్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో ఆశ్చర్యపరుస్తాడు. ఇతని పాత్రే కీలకం. తనికెళ్ల భరణి, బెనర్జీ, ఇంద్రజ, హేమ, కృష్ణతేజ అవసరమైనప్పుడు వచ్చి అనవసరం అనేది లేకుండా మేనేజ్ చేసారు. సాంకేతికవర్గం నలుగురు యువకులను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి కథను తయారు చేసుకున్నాడు. మొదట్లో ట్రైలర్ లో చూపించినట్టే సినిమా కథ మొత్తం శమంతకమణి కారు చుట్టూనే ఉంటుంది. సినిమా మొదలై ఎండ్ వరకు కారునే ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రైమ్ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ అనుకున్నాడు. అయితే మనకు ట్రైలర్ లో కనిపించిన క్యూరియాసిటీ సినిమాలో కనబడదు. ఒక కారు ఎంతో విలువైంది కాబట్టే దాన్ని దొంగలు కొట్టెయ్యడంం. దాన్ని పోలీస్ లు కనిపెట్టడం వంటిది ఎన్నో సినిమాల్లో వచ్చేసింది. కథ పరంగా కొత్తగా శమంతకమణిలో మనకేం కనబడదు. అసలు కారు చుట్టూ కథను అల్లినపుడు కారు గురించి ప్రేక్షకులకు ఎటువంటి థ్రిల్లింగ్ కలగదు. అసలా కారు స్పెషాలిటీ ఏమిటనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.ఇక మ్యూజిక్ విషయానికొస్తే మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సీన్స్ కి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు విషయంలో కాస్త అసంతృప్తే కనబడుతుంది. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఆ నలుగురి నమ్మకమే ఈ విజయం!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా ట్రై చేద్దామనుకున్నా. కానీ, కెమెరా వెనకాల డైరెక్టర్‌గా ఉండటమే బాగుందనిపించింది. అందుకే ప్రస్తుతానికి డైరెక్టర్‌గానే ఉందామని డిసైడ్ అయ్యా’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శమంతకమణి’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందంటోన్న శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా ‘భలే మంచిరోజు’ కన్నా ముందే ఈ చిత్రకథ రాశా. ఫస్ట్ సినిమాకి నలుగురు హీరోలంటే కష్టం కదా! ‘భలే మంచిరోజు’ తర్వాత నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్‌లను కలిశా. నలుగురికీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఓపెనింగ్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్... ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు నెరేట్ చేశాను. అప్పుడు నలుగురికీ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ నలుగురి నమ్మకమే ఈ రోజు ‘శమంతకమణి’ విజయం. రాజేంద్ర ప్రసాద్‌గారు చేసిన పాత్ర మాకు చాలా ఫ్లస్ పాయింట్. నలుగురు హీరోలను హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ డే భయపడ్డాను. క్లైమాక్స్ సీన్లో నలుగురితో పాటు రాజేంద్రప్రసాద్‌గారు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఆ సీన్ బాగా రావాలని కోరుకున్నాను. సినిమాకు మౌత్ టాక్ బాగుంది. నాకు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఐయామ్ హ్యాపీ. మరో రెండేళ్లపాటు క్రైమ్ కామెడీ సినిమాలు చేయకూడదనుకుంటున్నా’’ అన్నారు. -
కొన్నాళ్ల పాటు మల్టీస్టారర్స్ చేయను!
‘‘ఇప్పటివరకూ నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. కానీ, ఈ సిన్మా తర్వాత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు సందీప్ కిషన్. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ రేపు విడుదలవుతోంది. సందీప్ చెప్పిన సంగతులు... ♦ ఇందులో లవ్‌లో ఫెయిలైన కోటిపల్లి శివ అనే యువకుడి పాత్ర చేశా. ఓ పల్లెటూరిలో థియేటర్ నడిపే శివకు, కారుకు సంబంధం ఏంటనేది తెరపైనే చూడాలి. కొన్నిసార్లు పాత్రలు బాగున్నా... సినిమా అంతా ఉండవు. కానీ, ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. శివ పాత్ర అలాంటిదే. ఇందులో ఊర మాస్ సీనుంది. లుంగీ కట్టుకుంటే సీన్ బాగుంటుందని నేనూ, దర్శకుడు డిస్కస్ చేసుకుని ఈ లుక్ డిజైన్ చేశాం. ♦ శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమా ‘భలే మంచిరోజు’ టేకింగ్ నాకు బాగా నచ్చింది. మనిషిగానూ నచ్చాడు. నలుగురు హీరోలం శ్రీరామ్ ఆదిత్యను కలసినప్పుడు చాలా సింపుల్‌గా కథ చెప్పాడు. అందరికీ ఎగై్జటింగ్‌గా అనిపించి ఓకే చేశాం. ఆదితో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. సుధీర్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో రోహిత్ బాగా క్లోజ్ అయ్యాడు. ఒకరి పాత్రతో మరొకరి పాత్రకు పోలిక ఉండదు. ఇందులో రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు మల్టీస్టారర్స్ చేయకూడదనుకుంటున్నా. ♦ ‘నక్షత్రం’ త్వరలోనే విడుదలవుతుంది. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తెలుగులో కునాల్ కోహ్లీ దర్శకత్వంలో నేను, తమన్నా జంటగా ఓ సినిమా, మంజులగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ రెండూ కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సుసీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ’కు సీక్వెల్‌గా ‘కేరాఫ్ సూర్య’, తమిళ హిట్ ‘డీ–16’ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ‘నరకాసురుడు’ చేస్తున్నా. ♦ నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్. ‘నరకాసురుడు’కి ముందు తననే అడిగారట. తనెందుకు చేయలేదో నాకు తెలీదు. దర్శకుణ్ణి కూడా నేనింతవరకు అడగలేదు. వరుసగా మంచి దర్శకులతో పనిచేసే అవకాశాలు వస్తుండడం హ్యాపీ. వినోదం పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నా. -
మహేశ్ సినిమాలో ఒక్క ఫ్రేములో కనిపించినా చాలు!
‘‘నా కెరీర్ ‘భలే మంచిరోజు, బాఘీ’ సినిమాల తర్వాత పీక్స్‌లో ఉంది. ఈ టైమ్‌లో మల్టీస్టారర్ ఎందుకు? సోలో హీరోగా చేస్తే మంచి రీచ్ ఉంటుందేమో! అని ఆలోచించా. గతంలో విన్న మల్టీస్టారర్ కథలు నచ్చలేదు. అందువల్ల, శ్రీరామ్ ఆదిత్య ఈ కథ చెబుతానంటే అయిష్టంగా వినేసి ‘నో’ చెబుదామనుకున్నా. కానీ, కథ విన్నాక ‘యస్’ అనేశా’’ అన్నారు సుధీర్‌బాబు. ఆయనతో పాటు నారా రోహిత్, సందీప్‌కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘భవ్య’ ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలవుతోంది. సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు.. ∙శ్రీరామ్ ఆదిత్య లైఫ్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన చిత్రమిది. ఇందులో ‘అమ్మ ప్రేమ తెలీకుండా పెరిగిన కుర్రాడి’గా నేను చేసిన పాత్ర మా అమ్మను నాకు పరిచయం చేసింది. రియల్ లైఫ్‌లో మా అమ్మ పుట్టిన వెంటనే అమ్మమ్మ చనిపోయారు. అందువల్ల, తల్లి ప్రేమ లేకుండానే మా అమ్మ పెరిగారు. ఈ పాత్ర చేస్తున్నంత సేపూ ‘తల్లి ప్రేమ తెలీకుండానే అమ్మ నన్నెంత ప్రేమగా పెంచింది’ అని ఆలోచించా. ∙ఇప్పుడు రోహిత్‌తో ‘వీరభోగ వసంతరాయులు’ అనే సినిమా చేస్తున్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్, రాజా దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించా. గోపీచంద్ బయోపిక్ కోసం ఏడెనిమిది కిలోలు బరువు తగ్గాలి. మూడు కిలోలు తగ్గాను. ∙‘మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా చేస్తారా?’ అని అడగ్గా... ‘‘భాఘీ’ తర్వా చాలామంది విలన్ రోల్స్ ఆఫర్ చేసినా, నచ్చక చేయలేదు. మహేశ్ సినిమాలో విలన్‌గా ఏంటి? చిన్న ఫ్రేములో కనిపించినా చాలు’’ అన్నారు. -
కారు... కిరికిరి... కితకితలు!
శమంతకమణి... ఇదేదో పురాణాల్లో కథ కాదు! పాత సినిమాల్లో ఐటమ్ సాంగో లేదంటే అమ్మాయి పేరో అంత కన్నా కాదు. మరేంటి? అంటే... ఓ కారు! సదరు కారుతో నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఏ విధంగా ముడి పడ్డాయనే కథతో రూపొందిన సినిమా ‘శమంతకమణి’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఎవరూ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగుతుందీ సినిమా. జూలై 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్‌గా నారా రోహిత్, కృష్ణగా సుధీర్‌బాబు, కార్తీక్‌గా ఆది, ‘కోటిపల్లి’ శివగా సందీప్ కిషన్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. వీళ్ల మధ్య సంబంధం ఏంటి? ఎలా కలుసుకున్నారు? అనే అంశాలతో పాటు వీళ్ల మధ్య సీన్లు ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటాయి. ఇక, కారు కిరికిరి ఏంటనేది తెరపై చూడాలి’’ అన్నారు. చాందినీ చౌదరి, జెన్నీ, హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
'శమంతక మణి' వర్కింగ్ స్టిల్స్
-
సకుటుంబ సపరివార సమేతంగా..
తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు యువ హీరో సందీప్ కిషన్. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’, మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పై ఉంది. వీటితో పాటు కొన్ని తమిళ చిత్రాలూ లిస్టులో ఉండగా తాజాగా మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సందీప్. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపేష్ డి. గోహిల్ ఈ చిత్రం నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉహేలి’ (బెంగాలి) వంటి చిత్రాలను ఇతర భాగస్వాములతో కలిసి నిర్మించా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన కథ నచ్చింది. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా అవుతుంది. జులై 20న షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: రథన్, కెమెరా: నిజర్ షఫి. -
నలుగురు హీరోలు.. నాలుగు నెలల్లో పూర్తి!
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన చిత్రమిది. క్యారెక్టర్ బాగా నచ్చడంతోనే ఈ సినిమా చేశా. నలుగురు హీరోలను ఒక తాటి మీదకు తీసుకొచ్చారు ఆనంద్ ప్రసాద్‌గారు. ‘బాణం, సోలో’ చిత్రాల తర్వాత మణిశర్మ సంగీతంలో చేశాను’’ అన్నారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉండే కథ ఇది. ఈ చిత్రంలో తల్లిని కోల్పోయిన కొడుకు పాత్ర చేశా. నలుగురు హీరోలతో సినిమా చేయడం ఇబ్బంది అనుకుంటున్న ఈ తరుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘనత ‘శమంతకమణి’ టీమ్‌ది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘కార్తిక్ అనే లవబుల్ పాత్ర చేశా. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదరడంతో నాలుగు నెలల్లోనే పూర్తి చేయగలిగాం’’ అన్నారు ఆది. ‘‘శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ కథతో ఈ సినిమా తీశారు. ఈ మల్టీస్టారర్ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. జూలై 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలూ నాకు చాలా సపోర్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్, సుమన్, తనికెళ్ల భరణి, మణిశర్మ వంటి సీనియర్లతో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్యా సోని, జెన్ని తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ. -
`శమంతక మణి` చిత్రం ప్రారంభమైంది
-
విభజించే హక్కు హిందీ వారికెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిని విభజించే హక్కు హిందీ వారికి ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా బుధవారం శాసనమండలిలో ఆమె మాట్లాడారు. కేంద్రం తెలుగు ప్రజలను మోసగిస్తూ వారి చెవుల్లో పూలు పెడుతోందని, అందుకే తాను చెవిలో పూలు పెట్టుకొని బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బిల్లులో రాయలసీమ జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అందరిదీ అని, మీదెక్కడుందని ప్రశ్నించారు. దీంతో ఎంఐఎం ఎమ్మెల్సీ రజ్వీ కల్పించుకొని అభివృద్ధి ఏ ఒక్కరి కాపీరైట్ కాదన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని, సవరణలు తప్పనిసరిగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను, తెలుగుతల్లిని విడగొట్టవద్దని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్తో పార్టీలు 2004, 2009లో పొత్తు పెట్టుకున్నాయంటే తెలంగాణకు అంగీకరించినట్టేనని, అలాంటిది ఇపుడు ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దని అన్నారు. సోవియేట్ ముక్కలయ్యాక రష్యా పరిస్థితి ఘోరంగా ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. చిన్న రాష్ట్రాలతో దేశ ఐక్యతకు భంగం కలుగుతుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలు నడిపిస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉనికి కోసమే పాల్గొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ అన్నారు. విభజనతో రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ.. ఇలా అడ్డగోలుగా విభజన చేసేటట్టయితే శాసనసభ, శాసనమండలి ఎందుకని ప్రశ్నించారు. మనోభావాల పేరుతో విభజిస్తే చాలా రాష్ట్రాలను విడదీయాల్సి వస్తుందని, అది దేశానికే ప్రమాదకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ అన్నారు. ఉమ్మడి రాజధాని ఐదేళ్లలోపే ఉంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీశ్వరరెడ్డి అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవపున్నయ్య మాట్లాడుతూ రాష్ట్రం విడిపోదని, ఇరు ప్రాంతాలకు చెందిన దేవుళ్లూ సమైక్యాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. కేంద్రం ప్రజాభిప్రాయానికి తావు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రి మాట్లాడుతూ.. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని, విభజిస్తే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. మండలిలో వివిధ అంశాలపై సభ్యులు 1,157 సవరణలు ప్రతిపాదించారు.