కారు... కిరికిరి... కితకితలు! | shamanthakamani movie shooting is completed | Sakshi
Sakshi News home page

కారు... కిరికిరి... కితకితలు!

Published Thu, Jun 22 2017 1:02 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

కారు... కిరికిరి... కితకితలు! - Sakshi

కారు... కిరికిరి... కితకితలు!

శమంతకమణి... ఇదేదో పురాణాల్లో కథ కాదు! పాత సినిమాల్లో ఐటమ్‌ సాంగో లేదంటే అమ్మాయి పేరో అంత కన్నా కాదు. మరేంటి? అంటే... ఓ కారు! సదరు కారుతో నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఏ విధంగా ముడి పడ్డాయనే కథతో రూపొందిన సినిమా ‘శమంతకమణి’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నిర్మాత  మాట్లాడుతూ – ‘‘ఎవరూ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగుతుందీ సినిమా. జూలై 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌గా నారా రోహిత్, కృష్ణగా సుధీర్‌బాబు, కార్తీక్‌గా ఆది, ‘కోటిపల్లి’ శివగా సందీప్‌ కిషన్‌ నటించారు.

రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రధారి. వీళ్ల మధ్య సంబంధం ఏంటి? ఎలా కలుసుకున్నారు? అనే అంశాలతో పాటు వీళ్ల మధ్య సీన్లు ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటాయి. ఇక, కారు కిరికిరి ఏంటనేది తెరపై చూడాలి’’ అన్నారు. చాందినీ చౌదరి, జెన్నీ, హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement