అదంత ఈజీ కాదు!
‘‘ఈ కథ మిస్సయితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపిస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఆ సినిమా ఒప్పేసుకుంటా. స్క్రిప్ట్ ఎగై్జటింగ్‌గా ఉంటే మళ్ళీ మల్టీస్టారర్ చేయడానికి కూడా రెడీయే’’ అన్నారు నారా రోహిత్. సందీప్‌కిషన్, నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శమంతకమణి’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేశారు. వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. నారా రోహిత్ చెప్పిన విశేషాలు.
♦ నలుగురు హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ స్క్రిప్ట్‌లో ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంది. ఇందులో పోలీసాఫీసర్ రంజిత్ కుమార్‌గా చేశా. రంజిత్ ‘క్రాకీ’. ఎప్పుడెలా ఉంటాడో ఎవరికి తెలీదు. జోకులేస్తాడు. నవ్వేలోపు సీరియస్ అవుతాడు.
♦ ‘భలే æమంచిరోజు’ తర్వాత శ్రీరామ్ ఆదిత్య చేసిన సినిమా ఇది. రెండో సినిమానే 37 రోజుల్లో కంప్లీట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. బ్రిలియంట్ స్క్రిప్ట్ రాసుకోవడంతో పాటు పక్కా క్లారిటీగా తీశాడు. సినిమాలో నా కో–స్టార్స్ డామినేట్ చేస్తారని భయపడను. నా రోల్‌కి న్యాయం చేస్తానా? లేదా అని భయపడుతుంటాను. ఒకవేళ భయపడి ఉంటే ‘ప్రతినిధి’ సినిమాలో కోటాగారిలాంటి సీనియర్ యాక్టర్‌తో నటించేవాణ్ణి కాదు.
♦ నిజానికి ఇంకో పాత్రకోసం తగ్గుతుంటే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ 25న నా బర్త్‌డే. ఆ రోజు నా అప్‌కమింగ్ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నాం. టైటిల్ కూడా డిఫరెంట్‌గా, ఎగై్జటింగ్‌గా ఉంటుంది. దీనికి పవన్ మల్లెల డైరెక్టర్. ఈ సినిమా కోసం 21 కిలోలు బరువు తగ్గా. డిఫరెంట్ డైట్ ఫాలో అయ్యా. ప్రస్తుతం 79 కేజీలు బరువు ఉన్నా. ఇంకో 6 కిలోలు తగ్గాలి.
♦ శమంతకమణి తర్వాత ‘కథలో రాజకుమారి’ విడుదల కానుంది. ‘పండగలా వచ్చాడు’ సినిమాలో నాకు కొంచెం గెటప్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ సినిమా చర్చల దశలో ఉంది.
♦ తెలుగులో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచిదే. ‘నిన్ను కోరి’ సినిమా ఒక ఐదేళ్ల క్రితం వస్తే ఎలా ఉండేదో? ‘కథలో రాజకుమారి’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాను. ‘బాణం’ చేయడం వల్ల ‘అసుర, ప్రతినిధి’ లాంటి సినిమాలు వచ్చాయి.
♦ ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షో చేయడం ఆనందంగా ఉంది. నాకు హోస్ట్ చేయాలని లేదు. ప్రజెంట్ కాన్‌సెన్‌ట్రేషన్ అంతా సినిమాలపైనే ఉంది.