సకుటుంబ సపరివార సమేతంగా.. | hero Sandeep Kishan will start next movie shooting on July 20th | Sakshi
Sakshi News home page

సకుటుంబ సపరివార సమేతంగా..

Published Fri, Jun 16 2017 11:49 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

సకుటుంబ సపరివార సమేతంగా.. - Sakshi

సకుటుంబ సపరివార సమేతంగా..

తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు యువ హీరో సందీప్‌ కిషన్‌. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’, మల్టీస్టారర్‌ మూవీ ‘శమంతకమణి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పై ఉంది. వీటితో పాటు కొన్ని తమిళ చిత్రాలూ లిస్టులో ఉండగా తాజాగా మరో తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సందీప్‌. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేమ్‌ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపేష్‌ డి. గోహిల్‌ ఈ  చిత్రం నిర్మించనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ – ‘‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉహేలి’ (బెంగాలి) వంటి చిత్రాలను ఇతర భాగస్వాములతో కలిసి నిర్మించా. రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ చెప్పిన కథ నచ్చింది. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా అవుతుంది. జులై 20న షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:  ప్రసన్న కుమార్‌ బెజవాడ, సంగీతం: రథన్,  కెమెరా: నిజర్‌ షఫి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement