సాక్షి, అనంతపురం: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్‌ను పటిష్ఠం చేయాలి. మా ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నామని అనిత అన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి’’ అని చెప్పారాయన
ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
Comments
Please login to add a commentAdd a comment