మరో మల్టీ స్టారర్లో యంగ్ హీరో..!
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు సుధీర్ బాబు. తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్లో విలన్గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే భలే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శమంతకమణి అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు సుధీర్ బాబు. నారా రోహిత్, శ్రీ విష్ణులు హీరోలుగా తెరకెక్కుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాలోనూ నటించేందుకు అంగీకరించాడు. ముందుగా ఈ పాత్రకు జ్యోతిలక్ష్మీ ఫేం సత్యను అనుకున్నా.. తరువాత సుధీర్ బాబు చేసేందుకు అంగీకరించాడు. క్రైం థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆర్ ఇంద్రనీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తనకు మల్టీ స్టారర్ సినిమాలు చేయటం ఇష్టం ఉండదన్న సుధీర్ బాబు.. శమంతకమణి, వీరభోగ వసంత రాయలు సినిమాలను మాత్రం వదులుకోలేకపోయానంటూ ట్వీట్ చేశాడు.