నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వీర భోగ వసంత రాయలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న (సోమవారం) రిలీజ్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు వాయిస్ డిఫరెంట్‌గా అనిపించటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మీ వాయిస్ ఏంటి ఇలా ఉంది అంటూ అభిమానులు సుధీర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై స్పంధించిన సుధీర్ బాబు ఆ వాయిస్ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
‘కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్‌లో వివరించడం సాధ్యం కాదు.’ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్‌లో వినిపించిన వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కూడా సుధీర్ వాయిస్ ఇలాగే ఉంటుందా అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.
తన సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకునే సుధీర్ బాబు వీర భోగ వసంత రాయలు ట్రైలర్‌ను షేర్ చేయకపోవటంపై చర్చ మొదలైంది. చిత్రయూనిట్‌తో వివాదాల కారణంగానే సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సోమవారం జరిగిన ట్రైలర్ లాంచ్‌కు కూడా సుధీర్ బాబు హాజరు కాకపోవటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.
For various reasons, which can't be explained in a tweet, wasn't been able to dub for my character in #VeeraBhogaVasanthaRayalu. Yeah, THAT IS NOT MY VOICE
— Sudheer Babu (@isudheerbabu) 16 October 2018
‘వీర భోగ వసంత రాయలు’ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్, సుకుమార్.
Comments
Please login to add a commentAdd a comment