veera Bhoga vasantharayalu
-
‘వీర భోగ వసంత రాయలు’ మూవీ రివ్యూ
టైటిల్ : వీర భోగ వసంత రాయలు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ఆర్ ఇంద్రసేన నిర్మాత : అప్పారావు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలు. విభిన్న కథలను ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాల మరింత భారీగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు. దీంతో రిలీజ్ సమయానికి సినిమా మీద అంచనాలు పడిపోయాయి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అయి వీర భోగ వసంత రాయలు ఏమేరకు ఆకట్టుకుంది..? కథ ; సినిమా ప్రధానంగా మూడు నేరాలకు సంబంధించిన కథగా సాగుతుంది. క్రికెటర్స్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తాయి. ఇక మూడో కేసులో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. ప్రధానమైన విమాన హైజాక్ కేసును దీపక్ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. మిస్ అయిన ఇంటి కేసును వినయ్ (సుధీర్ బాబు) టేకప్ చేస్తాడు. ఫ్లైట్ హైజాక్ చేసిన వ్యక్తి 300 మంది బంధీలను విడుదల చేసేందుకు అంతే సంఖ్యలో నేరస్తులను చంపేయాలని డిమాండ్ చేస్తాడు. అసలు విమానం హైజాక్ చేసింది ఎవరు..? మిగిలిన రెండు కేసులతో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి..? హైజాకర్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ప్రమోషన్లో శ్రీవిష్ణు పాత్రను హైలెట్ చేసినా సినిమాలో ఎక్కువ సేపు తెర మీద కనిపించింది మాత్రం సుధీర్ బాబు ఒక్కడే. అయితే సుధీర్ బాబుకు మరొకరితో డబ్బింగ్ చెప్పించటం వర్క్ అవుట్ కాలేదు. సుధీర్ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్ తనది కాకపోవటంతో ఆడియన్స్ కనెక్ట్ కావటం కష్టమే. నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. ఇక కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు విలన్ లుక్‌లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో ఉన్నంతలో తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నా అవి సినిమాను ఏమేరకు కాపాడతాయో చూడాలి. ముఖ్యంగా సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. క్వాలిటీ పరంగా సినిమా నిరాశపరుస్తుంది. కథా కథనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో వీర భోగ వసంత రాయలు ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారింది. సినిమాటోగ్రఫి, సంగీతం పరవలేదనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన కథ మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు స్లో నేరేషన్ ఆసక్తికరంగా లేని సన్నివేశాలు -
భయం వేసింది
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని శ్రీవిష్ణు లుక్‌ను విడుదల చేశారు. ‘‘పచ్చబొట్లు వేయించుకున్నాను. కాస్త భయం కలిగింది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా రకాల అనుభూతులకు లోనయ్యాను’’అని పేర్కొన్నారు శ్రీవిష్ణు. ‘‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మిగతా తారల లుక్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించారు. -
ఆ గొంతు నాది కాదు : సుధీర్ బాబు
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వీర భోగ వసంత రాయలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న (సోమవారం) రిలీజ్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్లో సుధీర్ బాబు వాయిస్ డిఫరెంట్‌గా అనిపించటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మీ వాయిస్ ఏంటి ఇలా ఉంది అంటూ అభిమానులు సుధీర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై స్పంధించిన సుధీర్ బాబు ఆ వాయిస్ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ‘కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్లో వివరించడం సాధ్యం కాదు.’ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్లో వినిపించిన వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కూడా సుధీర్ వాయిస్ ఇలాగే ఉంటుందా అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. తన సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకునే సుధీర్ బాబు వీర భోగ వసంత రాయలు ట్రైలర్‌ను షేర్ చేయకపోవటంపై చర్చ మొదలైంది. చిత్రయూనిట్‌తో వివాదాల కారణంగానే సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సోమవారం జరిగిన ట్రైలర్ లాంచ్‌కు కూడా సుధీర్ బాబు హాజరు కాకపోవటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. For various reasons, which can't be explained in a tweet, wasn't been able to dub for my character in #VeeraBhogaVasanthaRayalu. Yeah, THAT IS NOT MY VOICE — Sudheer Babu (@isudheerbabu) 16 October 2018 ‘వీర భోగ వసంత రాయలు’ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్, సుకుమార్. -
‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ లాంచ్
-
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘వీర భోగ వసంత రాయలు’
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన యూనిట్ తరువాత టీజర్‌తో ఆకట్టుకున్నారు. తాజా గా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిడ్నాప్, ఫ్లైట్ హైజాక్ లాంటి సీన్స్ తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రెడీ చేశారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియలు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులుగా కనిపిస్తుండగా శ్రీ విష్ణు డిఫరెంట్ లుక్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. -
ఎవరి కోసం ఎదురు చూపులు?
ఎవరో రావాలని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఎదురుచూపులో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు.. ఇలా నెలలు గడిచిపోయాయి. అప్పుడు దేశం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అసలు అందరూ ఎవరికోసం ఎదరు చూస్తున్నారు? అనే మిస్టరీలు వీడాలంటే ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చూడాల్సిందే. నారా రోహిత్, శ్రియా, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. అప్పారావ్ బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో సాగే భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హీరో హీరోయిన్ల లుక్స్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ గురించి చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్. -
ప్రణయ్‌కి అంకితమిస్తూ పాట!
మిర్యాలగూడ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అయితే ఈ పరువు హత్యపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాల్లోంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌ను ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కు ఈ పాటను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
వసంతరాయలు వస్తున్నాడహో...
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరభోగ వసంత రాయలు’. ఇంద్రసేన ఆర్. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావ్ బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా అప్పారావ్ బెల్లాన మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మా చిత్రం టైటిల్ ఆసక్తిగా ఉందని అంటున్నారు. సినిమాలో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ‘కొత్త మతం పుట్టుకొస్తుంది’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్, నవీన్ యాదవ్. -
‘వీర భోగ వసంత రాయలు’ టీజర్ విడుదల
-
ఆసక్తికరంగా ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్
కెరీర్ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ప్రస్తుతం వీరంతా కలిసి చేస్తున్న సినిమానే ‘వీర భోగ వసంత రాయలు’. ఉత్కంఠ రేపే కథనంతో తెరకెక్కినట్లు కనిపిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నారా రోహిత్ డైలాగ్‌లతో సాగిన ఈ టీజర్లో.. సస్పెన్స్‌ను కంటిన్యూ చేసేలా కట్ చేయడం బాగుంది. చివర్లో గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చేది ఎవరో రివీల్ చేయకుండా.. అసలు కథపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ మూవీలో శ్రియా కీలకపాత్రలో నటిస్తోంది. అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమాకు ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వం వహించారు. -
వైవిధ్యమైన పాత్రలో...
పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు సుధీర్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో శ్రియా శరణ్, నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ఇది. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. అప్పారావు బెల్లన నిర్మించారు. ఇటీవల శ్రియ, నారా రోహిత్, శ్రీవిష్ణు ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన అందరి లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాశ్, నవీన్ నేని తదితరులు నటించిన ఈ సినిమాకు మార్క్ కే. రాబిన్ సంగీతం అందించారు. -
స్టన్నింగ్
‘మెంటల్ మదిలో, ఉన్నది ఒకటే జిందగీ, నీదీ నాదే ఒకే కథ’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియలు కూడా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నారా రోహిత్, శ్రియల లుక్స్‌ని రిలీజ్ చేశారు. శనివారం శ్రీవిష్ణు లుక్‌ని విడుదల చేశారు. చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ లుక్‌ని రిలీజ్ చేయడం విశేషం. ‘‘నారా రోహిత్, శ్రియల లుక్స్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన శ్రీవిష్ణు స్టన్నింగ్ లుక్ బాగుందని అందరూ అంటున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేన్ ఆర్. దర్శకుడు. మార్క్ కే. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేష¯Œ ్స బ్యానర్‌పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, ఎడిటర్: శశాంక్ మాలి. -
వీర భోగ వసంత రాయలు : నారా రోహిత్ లుక్
నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో శ్రియ లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్ రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో అతడి లుక్‌ను రివీల్ చేశారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో రోహిత్ దివ్యాంగుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి రూమర్స్ కు చెక్ పెట్టారు చిత్రయూనిట్. కొత్త పోస్టర్లో రోహిత్ చేతికి కట్టుతో కనిపించాడు. పోస్టర్ లో ‘హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. -
దివ్యాంగుడిగా నారా రోహిత్
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన శ్రియ లుక్కు మంచి రెస్సాన్స్రాగా త్వరలో నారా రోహిత్ లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు కుడిచేయి ఉండదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే లుక్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
లుక్ లుక్.. న్యూ లుక్
ఇక్కడున్న శ్రియ ఫొటోని చూశారా? రఫ్‌గా కనిపిస్తున్నారు కదా. లుక్ చూస్తుంటే ఇప్పటివరకూ చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేశారనిపిస్తోంది. ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలోనే శ్రియ ఇలా కనిపించనున్నారు. నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన ఆర్. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావ్ బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రియ లుక్‌ని నారా రోహిత్ శుక్రవారం విడుదల చేసారు. ఆమె లుక్ చూసి ‘వావ్ .. వాట్ ఎ లుక్’ అంటున్నారు సినీ ప్రేమికులు, శ్రియ అభిమానులు. క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె.రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్. -
ఈ సినిమాలో హీరోలు ఉండరు
‘‘వీరభోగ వసంతరాయలు’ చిత్రంలో హీరోలు అంటూ ఉండరు. ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ప్రయోగాత్మక సినిమా. తెలుగులో కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్ ఇంద్ర ప్రపంచాన్ని తలకిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఉంటుంది’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘వీరభోగ వసంతరాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇంద్రసేన.ఆర్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో రోజూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వినేవాణ్ని. అందులో ‘వీరభోగ వసంతరాయలు’ గురించి విన్నా. అది నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. కథకి తగ్గ టైటిల్ ఇది. పాపాలు పెరిగాయనే అంశం చుట్టూనే కథ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఎవరూ చూడని విధంగా, ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్ ఎంవీకే రెడ్డిగారు. సౌతాఫ్రికా, అమెరికాలో ఉన్న డాక్టర్ మాధవి, డాక్టర్ నిరంజన్‌గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు అప్పారావు బెల్లాన. ‘‘సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమానా? తెలుగు సినిమానా? అనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ ఇంద్ర ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నన్ను టార్చర్ పెట్టాడు. కానీ, అవుట్‌పుట్ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ’’ అన్నారు శ్రీ విష్ణు. -
పోలిక ఉండదు
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అప్పారావు బెల్లాన మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన కథ చెప్పగానే సినిమా ప్రొడ్యూస్ చేద్దామనిపించింది. అంతగా కథ నచ్చింది. మంచి నటీనటులు కుదిరారు. సినిమాలోని నాలుగు ముఖ్య పాత్రలను ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా దర్శకుడు డిజైన్ చేశారు. ఏ పాత్రకు మరో పాత్రతో పోలిక ఉండదు. ఈ సినిమా తెలుగు అండ్ హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసి, మూవీ రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ మూవీ’’అన్నారు ఇంద్రసేన. శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: రాబిన్. -
సుధీర్ సైలెంట్‌గా పూర్తి చేశాడు..!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుధీర్ బాబు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న సుధీర్ బాబు, బాలీవుడ్లో విలన్‌గానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సమ్మోహనం సినిమాతో పాటు మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాల్లో నటిస్తున్న సుధీర్, మరో సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల ఒకేసారి అరడజను సినిమాలను ప్రకటించిన సుధీర్, వాటిలో ఓ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు బ్యానర్ పేరు ఫైనల్ చేయకపోయినా.. సినిమాను మాత్రం పూర్తి చేసేస్తున్నాడట. రామానాయుడు ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రాజశేఖర్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యిందట. త్వరలో హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్లో బ్యానర్ పేరుతో పాటు సినిమా విశేషాలను కూడా వెల్లడించనున్నారు. -
వైవిధ్యమైన పాత్రలో యంగ్‌హీరో
నీదీ నాదీ ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. మొదట్నుంచీ వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సీరియస్ క్యారెక్టర్లోనూ, మెంటల్ మదిలో లాంటి రొమాంటిక్ పాత్రల్లోనూ నటించి తనేంటో నిరూపించుకున్నాడు. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మళ్లీ తనలోని నటుడ్ని పరిచయం చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీవిష్ణు తన రాబోయే సినిమాలో మరొక విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని సమాచారం. ఈ గెటప్ గజని సినిమాలోని సూర్య పాత్రను పోలి ఉంటుందని, గుండు, ఒళ్లంతా టాటూలతో ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిన్నపాటి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు కలిసి నటించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ శ్రియ కీలకపాత్రలో నటించినట్లు సమాచారం. ఈ సినిమాకు ‘వీరభోగ వసంత రాయలు’ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. -
దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ విష్ణు. సహాయనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా విజయాలు సాధిస్తున్న ఈ యువ కథానాయకుడు త్వరలో దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నానన్న శ్రీవిష్ణు, మంచి కథ కుదిరితే తప్పుకుండా దర్శకుడిగా మారతానని చెపుతున్నాడు. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీదీ నాదీ ఒకే కథ సినిమా ఇటీవల విడుదలై విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న శ్రీ విష్ణు... ప్రస్తుతం వీరభోగ వసంత రాయలుతో పాటు ‘తిప్పరా మీసం’ అనే కామెడీ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. -
సాహసం.. నా నేస్తం!
మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనడిగితే... కొందరి పేర్లు చెబుతాం. శ్రియకు కూడా అలా చెప్పడానికి ఓ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ‘సాహసం’ కూడా ఉంటుంది. అవును.. అడ్వెంచర్ నా ఫ్రెండ్ అంటారు శ్రియ. అందుకే వీలు కుదిరినప్పుడల్లా నేస్తానికి దగ్గరగా వెళతారు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. విదేశాల్లో అడ్వంచర్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీకి స్కూబా డైవింగ్ అంటే ఇష్టం. అందుకే స్కూబా డైవింగ్ కోర్స్‌తో పాటు, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కోర్స్‌లను ఆమె కంప్లీట్ చేశారట. విక్రమ్ హీరోగా తెలుగులో వచ్చిన ‘మల్లన్న’ సినిమాలోని ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న..’సాంగ్‌లో ఆమె అండర్‌వాటర్ సీన్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఇండోనేషియాలోని బాలీలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. దానికి సంబంధించిన ఫొటోను శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఫస్ట్ సన్‌రైజ్ నా ఫేస్‌ను టచ్ చేస్తున్నప్పుడు సముద్రంలో బ్యూటిఫుల్ డైవ్ చేస్తున్నాను. సముద్రంలో ఇలా చేయడం ఇట్స్ ఎ మ్యాజికల్’’ అని పేర్కొన్నారు శ్రియ. చూశారుగా... నీటి లోపల ఏమాత్రం భయం లేకుండా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చేయాలంటే ధైర్యం ఉండాలండి బాబు. శ్రియ డేరింగ్ అండ్ డ్యాషింగ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘నరకాసురుడు’, ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో శ్రియ నటిస్తున్నారు. -
మరో మల్టీ స్టారర్లో యంగ్ హీరో..!
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు సుధీర్ బాబు. తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే భలే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శమంతకమణి అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు సుధీర్ బాబు. నారా రోహిత్, శ్రీ విష్ణులు హీరోలుగా తెరకెక్కుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాలోనూ నటించేందుకు అంగీకరించాడు. ముందుగా ఈ పాత్రకు జ్యోతిలక్ష్మీ ఫేం సత్యను అనుకున్నా.. తరువాత సుధీర్ బాబు చేసేందుకు అంగీకరించాడు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆర్ ఇంద్రనీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తనకు మల్టీ స్టారర్ సినిమాలు చేయటం ఇష్టం ఉండదన్న సుధీర్ బాబు.. శమంతకమణి, వీరభోగ వసంత రాయలు సినిమాలను మాత్రం వదులుకోలేకపోయానంటూ ట్వీట్ చేశాడు.